Friday, 23 August 2013

                             నారాయణసూక్తం

సామాన్యంగా నారాయణ సూక్తాన్ని పురుష సూక్తంతో కలిపి పారాయణ చేస్తారు. ఈ సూక్తం ధ్యాన పద్ధతిని వివరిస్తుంది. ధ్యానానికి ముందుగా ఈ సూక్తం పారాయణ చేసి భావాన్ని చింతన చేస్తుండడం ప్రగాడ ధ్యానానికి దోహదం చేస్తుంది.
---------------------------------------------------------------------------------------------
ఓం సహ నావవతు! సహ నౌ భునక్తు! సహ వీర్యం కరవావహై! తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై!!
ఓం శాంతిః శాంతిః శాంతిః!!శ్లో(1): ఓం!! సహస్ర శీర్‌షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం!
          విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్!!
తా: వేయితలలు గలవాడు, ప్రకాశిస్తున్నవాడు, సమస్తాన్ని చూస్తున్నవాడు, యావత్‌ప్రపంచానికి మనగళకరుడు, నాశం లేనివాడు, అత్యున్నత స్థితి అయినవాడు అయిన నారాయణుడనే దైవాన్ని ధ్యానిస్తాను.
శ్లో(2):విశ్వతఃపరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిమ్
       విశ్వమేవేదం పురుష స్తదిశ్వ ముపజీవిత!!
తా:ఈ విశ్వం కనా ఉన్నతుడు, నిత్యుడు, ఈ విశ్వమై ఉంతున్నవాడు, భక్తులకష్టాలను బాపువాడు అయిన నారాయణుని ధ్యానిస్తాను.
శ్లో(3): పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శివమచ్యుతమ్!
       నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్!!
తా: విశ్వానికి నాఠుడూ,జీవులకు ఈశ్వరుడూ,శాశ్వతుడూ, మంగళరూపుడూ, వినాశం లేనివాడూ, విశిష్టqంగాతెలుసుకోవలసినవాడూ, సమస్తానికీ ఆత్మయై ఉన్నవాడూ, శరణుపొందదగిన ఉత్కృష్టుడూ అయిన నారాయణుని ధ్యానిస్తాను.
శ్లో(4):నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణః పరః|
     నారాయణం ప్రంబ్రహ్మ తత్వం నారాయణః పరః|
     నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః||
తా:నారాయణుడే పరం జ్యోతి, నారాయణుడే పరమాత్మ, నారాయణుడే పరబ్రహ్మం, నారాయణుడే పరతత్వం, ధ్యానించే వారిలో శ్రేష్ఠుడు నారాయణుడే, నారాయణుడే ఉత్కృష్టమైన ధ్యానం.
శ్లో(5):యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా|
        అంతర్బహిశ్చ  తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః||
తా: ఈ ప్రపంచం అంతటా కనిపిస్తూ ఉన్నది ఏదైనా, వినిపిస్తూ ఉన్నది ఏదైనా వాటన్నిటా లోపలా వెలుపలా పరివ్యాపించి నారాయణుడే నెలకొనిఉంటున్నాడు.
శ్లో(6): అనంతమవ్యయం కవిగ్ం సముద్రేంతం విశ్వశంభు|
         వమ్ పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖమ్||
తా: అనంతుడూ, అవినాశుడూ, సర్వజ్ఞుడూ, సంసార సాగర అంతాన ఉండేవాడూ, యావత్ప్రపంచానికి మంగళకరుడూ, అయిన నారాయణుని అధోముఖమైన తామర మొగ్గలా ఉన్న హృదయంలో ధ్యానిస్తాను.
శ్లో(7):అధో నిష్ట్వా వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్ఠతి|
       జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్||
తా: కంఠం వద్ద కిందగా, నాభికి ఉపరితలంగా జానెడు పైన ఉన్నది భౌతిక హృదయం. రెండవది దానికి మధ్యలో ఉన్నది ఆధ్యాత్మిక హృదయం. ఇక మూడవది దీపశిఖల వరుసతో ఆవ్ర్తమై ఉంది.ఈ హృదయం దేదీప్యమానమైంది.
శ్లో(8): సంతతగ్ంశిలాభిస్తు లంబత్యాకోససన్నిభమ్|
         తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్||
తా:తామరమొగ్గవంటి హృదయం నలువంకల నాడులతో ఆవృతమై వ్రేలాడుచున్నది. దాని లోపల సూక్ష్మాకాశం ఉన్నది. అంతా దానిలో నెలకొని ఉంది.
శ్లో(9):తస్య మధ్యే మహానగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖః|
        సోగ్రభుగ్విభజంతిష్ఠన్నాహారమజరః కవిః||
తా: సర్వత్రా ప్రకాసిస్తూ, అన్ని దిశల వ్యాపిస్తున్న మహోన్నతమైన అగ్ని ఆ ఆకాశానికి నడుమ ఉంది. ప్రాణం అయిన ఆ అగ్ని మొట్టమొదట భుజించేదిగాను, అహారాన్ని విభజించి ఇచ్చేదిగాను, దృఢమైనదిగాను,  పాతపడనిదిగాను, అన్నింటినీ చూసేదిగాను ఉన్నది.
శ్లో(10):తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయస్తస్య సంతత!
         సంతాపయతి స్వం దేహ మాపాద తలమస్తకః|
తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః||
తా:ఆ ప్రానం యొక్క కిరణాలు అడ్డదిడ్డంగా, ఊర్ధ్వంగా, అధోముఖంగా ప్రసరిస్తూ, సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. పాదం నుండి తన శరీరాన్ని,వెచ్చ్గా ఉండేట్లు చేస్తుంది. దీని మధ్య అణుప్రమాణమైన అగ్నిజ్వాలఊర్ధ్వముఖంగా అమరి ఉంది.
శ్లో(11):నీలతోయదమధ్యస్ఠా ద్విద్యుల్లేఖేవ భాస్వరా!
        నీవారశూకవత్తన్వీ పీతాభస్వత్యణూపమా||
తా: కారుమేఘం మధ్యనుంచి వెలుగును విరజిమ్మే మెరుపు తీగల, వరిమొలకలా సన్నమైనదిగా, బంగారు ఛాయగా, అణువులా సూక్ష్మమైనదిగా ఆ ఆత్మ ప్రకాశిస్తూ ఉంటుంది.
శ్లో(12): తస్యాః శిఖాయా  మధ్యే పరమాత్మా వ్యవస్థితి|
           స బ్రహ్మ స శివః స హరిః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్!!
తా: ఆగ్నిశికహ మధ్యన పరమాత్మ సుప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఆయనే బ్రహ్మ,  ఆయ్నే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనే ఇంద్రుడు, ఆయన అవినాశి, స్వప్రకాశమానుడు, ఆయ్నకంటే అధికుడు ఎవరూ లేనివాడు.  
శ్లో(13): ఋతగ్ం సత్యం, పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగలమ్|
          ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః||
తా: కానవచ్చే వస్తు జాతాన్ని అందంగాను, దృశ్యానికి ఆధారంగాను ఉన్న భగవంతుని, ప్రతి శరీరం అంతటా నిండివున్నవాణ్ణి, నల్లని మేని విష్ణువు, తెల్లని మేని శివుడు ఒకరుగా మిశ్రితమైన రూపాన్ని, పూర్ణ పవిత్రుని, త్రినేత్రుని సమస్తాన్ని తనస్వరూపం పరిగ్రహించిన వాణ్ణి పదే పదే నమస్కరిస్తాను.

(ఈ విధంగా మనలను అంతర్ముఖం చేసి భగవంతుని సన్నిధానానికి చేరుస్తుంది ఈ నారాయణసూక్తం. ఆ పైన అవిచ్ఛిన్న ప్రేమతో  ఆయన సాన్నిధ్యంలో గడపడమే నిజమైన ధ్యానం. నారాయణ సూకం అనంతరం విష్ణుగాయత్రి ని పారాయణం చయడం పరిపాటి)
----------
శ్లో: ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి|
    తన్నో విష్ణుః ప్రచోదయాత్||
తా: నారాయణుని తెలుసుకుందా, అందుకోసం ఆ వాసుదేవుని ధ్యానిద్దాం. ఆ విష్ణువు మనలను ఈ ధ్యాన ప్రయత్నంలో ప్రేరేపించు గాక.  

No comments:

Post a Comment