Friday, 2 August 2013

                                       విష్ణుసహస్రనామం:
                                         (ద్వితీయ భాగం)
శ్లో)36:స్కందః స్కందధరో ధుర్యోవరదో వాయువాహనః|
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురన్దరః||
తా:దేవసేనాని, ధర్మమును ధరించువాడు, కోరినవరములిచ్చువాడు, త్రిపురధ్వంసకారి, సర్వజీవుల భారము వహించుచు, ప్రాణవాయు రూపమున జీవులలో ప్రవహించువాడు ఆయనే. సర్వ వ్యాప్తిగా ఉన్న్వాడు, బ్రహ్మాందమును సృష్టించిన ఆది దేవుడు సూర్యాది జ్యోతిర్వర్గములకు కాంతినొసగువాడు ఆ పరమాత్ముడే.
శ్లో)37:అశోక స్తారణ స్తారః శూరశ్శౌరి ర్జనేశ్వరః|
అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః||
తా:శొకరహితుడు,సంసారమునుండి తరింపజేయువాడు, గర్భము, జననము, మరణము అను త్రివిధ భయములనునండి రక్షణ నిచ్చువాడు, సర్వులకు ఆత్మరూపమున అనుకూలుడు ఆ పరమాత్ముడే. పద్మము హస్తమునగలవాడు, కమలాక్షుడు, వందలపర్యాయము ధర్మ సంస్థాపనకై అవతరించినవాడు, శ్రీకృష్ణుడు, శూరుడు, ప్రజాపాలకుడు.. అయనయే.  
శ్లో)38:పద్మనాభోరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్|
మహర్థి ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః||
తా:నాభియందు కమలము గలవాడు, వికసించిన కన్నులు గలవాడు, హృదయకమలమున నివసించ్చు అన్న రూపమున దేహమును పోషించువాడు ఆయనయే. ప్రపంచరూపమున వృద్ధినొందుచు, సర్వమును దర్శించు నేత్రములు గలవాడు, పరిపక్వ ఆత్మస్వభావము గలిగినవాడు, వామనుడు, జెండాపై గరుత్మంతుడు గలవాడు ఆ పురుషోత్తముడే.
శ్లో)39:అతులశ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః|
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః||
తా:తనతో సమనమైనది లేనివాడు, శరీరమున జీవరూపమున నుండువాడు, త్రికాలజ్ఞుడై సర్వలక్షణములు గలిగిన  జ్ఞానముచే సూచింపబడువాడు, సర్వ భూతములకు భయంకరుడై వానిని ఆజ్ఞావర్తులు చేయువాడు, యుద్ధమున జయము పొందువాడు, హృదయమున లక్ష్మిని ధరించినవాడు, యజ్ఞములలో హవిస్సులను ఆరగించువాడు ఆ మహనీయుడే.  
శ్లో)40:విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర స్సహః|
మహీధరో మహాభాగో వేగవానమితాసనః||
తా:నాశము లేనివాడు, ప్రపంచమునకు కారణభూతుడు, భూమిని ధరించువాడు, ప్రళయకాలమున అమితముగ భక్షించువాడు, ఎర్రని మత్స్యరూపము ధరించినవాడు ఆ మహాపురుషుడు. ముక్తికి మార్గమైనవాడు, శ్రీకృష్ణుడు, సహించువాడు, భక్తులను వేగముగ ఆదుకొనువాడు, హవిస్సులలో సింహ భాగముపొందువాడు ఆయనయే..
శ్లో)41:ఉద్భవ క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః|
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః||
తా:విశ్వోత్పత్తికి మూలకారకుడై, విశ్వ సంబంధమైన కర్మలు చేయువాడు,క్షోభింప జేయువాడు ఆయనయే. నిజస్వరూపమును దాచుటవలన అర్ధము చేసికొనలేని శక్తి సామర్థ్యములు, ఆకారము గలవాడు, భక్తుల కర్మబంధములను తెంచువాడు, దివ్య గర్భము గలిగి, దేవతలచే ఆరాధింపబడు లోకపాలకుడు ఆ పరంధాముదు ఆయనయే.
శ్లో)42:వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః||
పరర్థిః పరమస్పష్టః తుష్టః పుష్టశ్శుభేక్షణః||
తా:గొప్ప కర్మయోగి, జీవులకు కర్మలను నిర్దేశించి వారి కర్మానుసారముగ తగిన స్థానమిచ్చువాడు. పరమ స్పష్టమైన జ్ఞానము గలిగి, పరమైశ్వర్యములతో స్థిరముగ నిలుచువాడు, జీవులకు పరమపద స్థానమైనవాడు, సదా పరిపూర్ణుడై సంతృప్తుడై, శుభప్రదమైన దృష్టి గలవాడు ఆయనయే.
శ్లో)43:రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః||
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః|
తా:పరమానందము కలిగించు రామనామము గలిగిన వాడు, బంధనాతీతుడు, జీవులకు ముక్తి మార్గమును చూపి విశ్రాంతి నిచ్చువాడు, ఆ పరమాత్మయే. తన మార్గము స్పష్టముగ తెలిసిన గొప్ప నాయకుడు, ధర్మ స్వరూపుడు, ధర్మము తెలిసినవారిలో ఉత్తముడు, అత్యంత పరాక్రమవంతుడు, గొప్ప సక్తిసంపన్నుడు ఆ పరమాత్ముడే.
శ్లో)44:వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః||
తా:ప్రాణస్వరూపుడై ప్రాణమునిచ్చి, శరీరములో నివసించువాడు, వైకుంఠ వాసి, వ్యాపించువాడు, భూమ్యాకాశములను స్పృశించు విరాట్ పురుషుడు, బ్రహ్మాండము గర్భమున గలవాడు, ప్రనవ స్వరూపుడు, శత్రునాసకుడు, విస్వముగ వ్యాపించువాడు ఆయనయే.
శ్లో)45: ఋతుస్సుదర్శనః కాలఃపరమేష్ఠీ పరిగ్రహః|
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః||
తా:ఋతుచక్రమును తిప్పు కాలస్వరూపుడై, యముదై, మహాశక్తి స్వరూపుడై, సుదర్శన చక్రధారియై, పంచ్భూతములకు భయము గొల్పుచు, విశ్వసంబంధిత కర్మలను సమర్ధముగ చేయువాడు ఆయనయే. హృదయాకాశములో నెలకోని భక్తులొసగు పత్ర పుష్పాదులను ప్రీతితో పరిగ్రహించి, మోక్షమునిచ్చువాడు ఆ మహాపురుషుడే..
శ్లో)46:విస్తారః స్ధావర స్ధాణుః ప్రమాణం బీజమవ్యయం|
అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః||
తా:సృష్టికి నాసరహితమైన బీజ స్వరూపుదై,స్థిరుడై, గొప్ప స్వరూపము గలిగి లోకమున విస్తరించి యుండువాడు ఆయన. చిదానందస్వరూపుడై, మహాజ్ఞానస్వరూపుడై, సమస్తమునకు మూల ప్రమాణమై నిలిచి, సర్వులచే అర్ధింపబడువాడు ఆ పూజనీయ రూపుడే..
శ్లో)47:అనిర్విణ్ణః స్థవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః|
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః||
తా:సంతృప్తుడు, సమస్త ధర్మములకు మూలస్తంభమై నిలిచిన వాడు, సత్కర్మస్వరూపుడు, చంద్రునివలె చల్లనివాడు, సహనశీలి, భక్తులశ్రేయోభిలాషి, పుట్టుక లేనివాడు, విశ్వాకారుడు, నక్షత్రమండలమును తిప్పువాడు, ప్రలయకాలమున సర్వనాశకుడు ఆ పరమాత్ముడే.
శ్లో)48:యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః|
సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం||
తా:యజ్ఞపురుషుడు, మిక్కిలిపూజనీయుడు, క్రతువులలో చేయు కర్మల స్వరూపుడు ఆయన. సజ్జనులను రక్షించ్చు, వారికి ఆశ్రయమైనవాడు,సర్వమును వీక్షించ్చు, బంధరహితుడై, బ్రహ్మజ్ఞానియై నిలిచిన వాడు ఆ పరంధాముడే.
శ్లో)49:సువ్రతస్సుముఖసూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్|
మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః||
తా:ధర్మ రక్షణయను గొప్ప వ్రతము గలిగి జితక్రోధుడై గొప్ప బాహువులతో దుష్టశిక్షణ చేయువాడు, ప్రసన్న వదనముతో భక్తుల మనస్సులను హరించ్చు, వారికి సుఖము నిచ్చువాడు, వారి శ్రేయోభిలాషి, సూక్ష్మరూపి, గొప్ప స్వరముతో వేదములను చెప్పిన వాడు ఆయనయే.
శ్లో)50:స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్|
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశరః||
తా:సర్వ స్వతంత్రుడై, సర్వవ్యాప్తుడై, అనేకవేల రూపములలో అలరారుచు, సమస్తమును తన మాయతో కప్పువాడు ఆ పరమాత్మయే! ఒకేసారి అనేక కర్మములనొనర్చువాడు, భక్తవత్సలుడు, సర్వప్రాణి కోటిని తన సంతానముగా ప్రేమించువాడు, సమస్త ప్రపంచమును తనలొ ఉంచుకొన్నవాడు, సముద్రుడు, కుబేరుడు కూడ ఆపరమాత్మయే.
శ్లో)51:ధర్మకృబ్ధర్మకృద్ధర్మీ సదసక్షర మక్షరం|
అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః||
తా: ఆ పరమ్మత్మ ధర్మమూ రక్షించుచు, ధర్మకర్మలను చేయుచు,ధర్మమును ధరించియుండును.ఆయన సత్యస్వరూపుడు, నాశరహితుడు,శాశ్వత చైతన్యమే స్వభావముగ గలవాడు. తన తత్వమును అజ్ఞానులకు తెలియనివ్వని మాయాస్వరూపుడు.సహస్రకిరణములు గలిగిన సూర్యస్వరూపుదై జీవులకు కర్మలను విధించువాడు.
శ్లో)52:గభస్తినేమిస్సత్వస్ధః సింహో భూతమహేశ్వరః|
ఆదిదేవో మహాదేవో దేవోశో దేవభృద్గురుః||
తా: గభస్తి చక్రమును నక్షత్రకూటమికి మధ్యలోసూర్య రూపమున నున్నవాడు, సత్వగుణ స్వరూపుడు, సింహమువలే శ్రేష్టుడు, సర్వభూతములకు అధిపతి,ఆదిదేవుడు,మహాదేవుడు, దేవతలకు ప్రభువు, దేవతలకు గురువూ ఆయనే.
శ్లో)53:ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః
శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః||
తా: తరింపజేయువాడు, గోపాలుడు, సర్వజీవులను రక్షించువాడు,జ్ఞానమార్గముచేత పొందబడువాడు, శ్రీకృష్ణుడు ఆయన. సృష్టికిపూర్వమే యున్నవాడు, సమస్తప్రపంచమును అనుభవించువాడు,శరీర సృష్టికి కారణమైన పంచభూతములను భరించువాడు, ఆయనయే. శ్రీరామచంద్రుడు, ఆదివరాహమూర్తి, భక్తజనులకు వరములనిచ్చువాడు ఆ పరమాత్ముడే.
శ్లో)54:సోమపో మృతపస్సోమః పురుజిత్పురుసత్తమః|
వినయోజయస్సత్ససన్ధో  దాశార్హ స్సాత్వతాం పతిః||
తా:యజ్ఞకర్తయై సోమరసపానము చేయువాడు, మోహినీరూపమున అమృతమును దేవతలకిచ్చి, దేవతారూపమున అమృతము పానము చేసినవాడు, సాత్వికులకు ప్రభువై వారి యోగక్షేమములు చూచువాడు, రాక్షసులను దుష్టులను జయించి వారిని విధేయులు చేయువాడు,సత్యవ్రతముగలిగి సర్వోత్తముదై అర్హుడై, పార్వతీ పరమేశ్వర స్వరూపునిగ భక్తులననుగ్రహించువాడు ఆ పరంధాముడే.
శ్లో)55:జీవో వినయితా సాక్షీ ముకున్దోమిత విక్రమః|
అమ్భోనిధి రనన్తాత్మా మహోదధిశయో న్తకః||
తా: ప్రాణసక్తిస్వరూపుడు, త్రివిక్రముడమూడుపాదములతో సర్వమును జయించినవాడు, అనంతాత్ముడు, జీవులకు మార్గదర్శకుడై ముక్తినిచ్చువాడు, సాగరస్వరూపుదై దేవ, దానవ, మానవులను ఉద్భవింపజేసినవాడు, సముద్రమున శయనించి యుండువాడు ఆపరమాత్ముడే. 

No comments:

Post a Comment