Monday 19 August 2013

      ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు ఒక చారిత్రాత్మక తప్పిదం: 
                             ప్రొ||ఎన్ జి రంగా

                                తెలుగు చలనచిత్ర రంగం జైఆంధ్ర కు మద్దతు 


1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు ఒక చారిత్రాత్మక తప్పిదమని ఉత్తమోత్తమ పార్లమెంటేరియన్  ఆచార్య ఎన్ జి రంగా ఆనాడే చెప్పారు. ఇప్పుడు సీమాంధ్ర మొత్తం సమైక్య రాష్ట్రం కోరుకుంటున్నారనడం ఓ ట్రాష్. ఆంధ్ర రాష్త్ర సాధనకోసం ఉద్యమించే వారూ ఉన్నారు. రుజువు కావాలా!

సరే ఈనెల 24 వతేదీశనివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాసం జిల్లా పర్చూరు రోటరీ కల్యాన మంటపానికి వెళ్ళండి. ప్రొఫెసర్ రంగా ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బండ్లమూడి సుబ్బారావు అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్ర సాధన" సభ జరుగుతున్నది. అందులో శ్రీయుతులు వసంత నాగేశ్వరరావు,  పిళ్ళా వేంకటేశ్వరరావు, సుంకర కృష్ణమూర్తి, పెళ్లకూరు సురేంద్రరెడ్డి, దేవిరెడ్ది రవీంద్రరెడ్డి, కర్నాటి రామమోహనఋఆవు, చిగులూరి కృష్ణారావు, యల్లాప్రగడ సుబ్బారావు,  పిసి మూర్తి, ఆవుల వీరశేఖరయాదవ్, సయ్యద్ అహ్మద్ పాషా, ఊటుకూరి సతీష్‌కుమార్,  వంకినేని అన్జేఎకుమార్ తదితరులు ప్రసంగిస్తారు.
 
1972 లో సర్దార్ గౌతు లచ్చన్న, బి వి సుబ్బారెడ్డి, కాకాని వెంకట రత్నం, వెంకయ్య నాయుడు వారు జై ఆంధ్ర ఉద్యమాన్ని నడిపి తెలంగాణాతో కలసి ఉండలేమని కరాఖండిగా చెప్పి తెగతెంపులు చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇప్పటి మాదిరి నాటి ఉద్యమం "వ్యూహ రచన" కాదు. ఉద్యమ అణచివేత చర్యలో భాగంగా జరిపిన పోలీసు కాల్పుల్లో ఎనిమిది మంది ఉద్యమకారులు ప్రాణాలు కోల్పోగా, ఆ సమాచారం తెలుసుకున్న కాకాని వెంకటరత్నం గుండె ఆగి మరణించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కూడా వందలమంది ప్రాణాలు పణంగా పెట్టారు.

ఆది నుంచి మద్రాసులో పుట్టి పెరిగిన తెలుగు చలనచిత్ర రంగం కూడా ఆంధ్రప్రదేశ్ కు తరలైరావడానికి ఇష్తపడలేదు. తెలనంఘాణ పొడ గిట్టని తెలుగు సినిమారంగం  జై ఆంధ్ర ఉద్యమాన్ని ముక్త కంఠంతో బలపరచింది. నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు సైతం "జై ఆంధ్ర " అని నినదించారు.

ఎన్‌టిరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్‌విరంగారావు, గుమ్మడి, జగ్గయ్య, రామకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, చలం, వాణిశ్రీ, అంజలి, జమున, శారద, చాయాదేవి ఇత్యాది అగ్రశ్రేని కళాకారులు జైఆంధ్ర కు మద్దతు పలికారు. జైఆంధ్రకు మద్దతుగా మద్రాసు నగరంలో 1973 ఫిబ్రవరి 18 న నిరాహార దీక్ష శిబిరం ప్రారంభించారు. రాష్ట్రపతి వివి గిరి సైతం రాష్ట్రంలో ఆనాడు అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు.      

వర్తమానంలో మాదిరి ఆత్మహత్యలకు పాల్పడలేదు. స్పాన్సర్డ్ ఉద్యమాలు చూస్తున్న వారు, చేస్తున్న చాలా మంది అప్పటికి  పుట్టలేదు. రాజకీయ ప్రవేశపు అర్హతకూడా సంపాదించలేదు. ఇంతమంది "ఆత్మహత్యలు"  చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతున్నా ఒక్క వయోధిక సీనియర్ నాయకునికి ఎందుకు హృదయం ద్రవించలేదో, ఆగలేదో అర్ధం కాని విషయం. ఆనాడు పివి నరసింహారావు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బివి సుబ్బారెడ్డి పదవికి రాజీనామ చేసి మరీ ఉద్యమంలో  పాల్గొన్నారు.  ఇప్పటిమాదిరి తెరచాటు రాజకీయం నడపలేదు. ఉద్యమధాటికి పివి రాజీనామ చేయ వలసి వచ్చింది. రాష్ట్రపతి పాలన వచ్చింది. జై ఆంధ్ర, అంతకు ముందు విశాఖ ఉక్కు ఉద్యమాలు రాష్ట్రానికి నైతిక, సైద్ధాంతిక విలువలతో కూడిన యువనాయకత్వాన్ని ప్రసాదించాయి. వసూల్ రాజాలను కాదు.  

No comments:

Post a Comment