Tuesday, 13 August 2013

         ఏమిటీ గందరగోళం..పరిష్కారమెప్పుడు?

అసెంబ్లీ సజావుగా జరిగి నాలుగేళ్ళయింది. మంత్రివర్గ సమావేశాలు షెద్యూల్ ప్రకారం జరిగి మూడేళ్ళవుతున్నది. మంట్రులకు ముఖ్యమంత్రిపట్ల గౌరవం, లేదు. మంత్రులంతే ముఖ్యమంత్రికి విశ్వాసమే లేదు. ఎమ్మెల్యేలకు మంత్రులకు శతృత్వం. ముఖ్యమంత్రికి ఎంపీలకు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గు మంటుండి. ఇద్దరు మంత్రులను బర్త్‌రఫ్ చేసిన ప్రభుత్వం ఇది. మంత్రులు జైలుకెళ్ళిన ఘనత గల ప్రభుత్వమిది. సీమాంధ్ర మంత్రులు, తెలంగాణాను పట్టించుకోరు. తెలంగాణ మంత్రులు సీమాంధ్రను చీమను చూసినట్లు చులకన భావం. 


శాసన సభ్యులు అసెంబ్లీకి రారు. బీఎసి ప్రకారం సభ నడవదు. శాసన మండలి సభ్యులకు పనేమీ ఉండదు వారెప్పుడూ ఆరో వేలే! సీమ ఎంపీలు తెలంగాణ ఎంప్పెలపై కస్సుబుస్సు. తెలంగాణ ఎంపీలకు సీమాంధ్ర ఎంపీలంటె ద్వేషం. పిసిసిని మంత్రివర్గం పట్టించుకోదు. మంత్రివర్గాన్ని పిసిసి లెక్క చేయదు. ప్రజా సమస్యలపైనే కాదు కనీసం వార్షిక బడ్జెట్ అన్నా పూర్తి నిర్లక్ష్యం. ఏడాదిలో 50 రోజుల సభా సమావేశాలు జరగడం నాలుగేళ్ళలో ఎప్పుడూ లేదు. ప్రభుత్వానికి అసలు ఉనికే లేదు. ప్రతిపక్షానికి పూర్తిగా పక్షవాతమే. సర్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రజా ప్రతినిధులు, పాత్రికేయులు, ఉన్నతాధికారులు.. చంచలగూడ జైల్‌ల్లో తిష్ఠ వేసుక్కూచున్నారు. ముఖ్య మంత్రి, ఉపముఖ్య మంత్రి,పిసిసి అధ్యక్షుడు పరస్పరం విద్వేషపూరితంగా వ్యవహరిస్తుంటారు. అధిష్టానం వద్ద పితురీలు, ప్రభుత్వంపై అధికార పక్షం దుమ్మెతిపోస్తుంది.

ఏఐసిసి కి రాష్ట్ర కాంగ్రెస్ పై పట్టు లేదు. పిసిసికి అధిష్ఠానమంటే ప్రాంతాల వారీగా చీలి క్రమశిక్షణ ఉల్లంఘించి రోడ్డెక్కి తిట్ల పురాణం. వర్కింగ్ కమిటీ, ఏ ఐ సి సి ల్లో వాగ్వివాదాలు. ఎవ్వరిపై ఎవరూ చర్య తీసుకోరు. ఒక ఎమ్మెల్యే పిసిస్ అధ్యక్షుని తిట్టినా, ముఖ్యమంత్రిని తూర్పారబట్టినా ఏ చర్యలుండవు. కౌన్సిలర్ స్థాయి వ్యక్తి పైకూడా మౌనమే. ఎమ్మెల్యేలు. ఎంపీలు పార్టీ ఫిరాయిస్తున్నా దిక్కులు చూడడం మినహా చలనమే లేదు. పాలన గాడితప్పింది. తన జి ఓలను తానే అమలుచేయలేని దుస్థితి. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు పనిచేయరు. ఆర్టీసీ బస్సులు నడవవు.. నిత్యావసర వస్తువులకు కరవు. ఆకాశంలో ధరలు. ప్రభుత్వోద్యోగులు ప్రాంతాల వారీగా సమ్మెలు. స్కూళ్ళు కాలేజీలు, దుకాణాలు.. బంద్‌లు. 

అయినా సరే కేంద్రం కన్నెత్తి చూడదు. పన్నెత్తి మాటాడదు. పత్రికలన్నీ విషపుత్రికలు, ప్రసారమాధ్యమాలు మద్య ప్రవాహాలు. అయినా సరే. తెలంగాణ, సమైక్యాంధ్ర ఆందోళనళ్ల్లో అందరూ ఒకే బాట. అందరూ అసెంబ్లీకి వెళ్ళకున్నా కలసికట్టుగా డిల్లీ వెళ్ళీ అక్కడ చీలిపోయి కేంద్రం పై, పార్టీ అధిష్ఠానంపై నిరసనలు. ప్రదర్శనలు. డిల్లీలో కళ్ళు, చెవులు, నోరు స్థంభించిన నిర్జీవ యంత్రాంగం. పన్నుల మోత, పోలీసుల చలాన్ల వాతకు అదుపులేదు. ఈ రాష్ట్రాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు.

No comments:

Post a Comment