Thursday 22 August 2013


ఆంధ్రకేసరి జయంతి 

------------------------
                   మనకున్న తెగువ గల తెలుగు వీరులు....

                      ఇద్దరే ఇద్దరు..వారు.. ఇద్దరూ ఇద్దరే.. 




విప్లవజ్యోతి అల్లూరి..
ఆంధ్రకేసరి టంగుటూరి..

--------------------------




*"గాలితోనైనా పోట్లాడే స్వభావం కలవాడు ప్రకాశం" _అయ్యదేవర కాళేశ్వరరావు


*"ప్రమాదములున్నచోటే ప్రకాశంగారుంటారు" _భోగరాజు పట్టాభి సీతారామయ్య


నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు,
మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి పేరు పొందినవాడు.
1904 లో ఇంగ్లాండు వెళ్ళాడు. వెళ్ళే ముందు మధ్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించాడు. దీక్షగా చదివి బారిస్టరు అయ్యాడు.
లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో విడుదలయిన స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టాడు. లా టైమ్స్ అనే న్యాయవాద పత్రిక కు కూడా సంపాదకత్వం వహించేవాడు.
1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా ఎన్నికైనాడు. అక్కడ విఠ్ఠల్‌భాయి పటేల్, మదన్ మోహన్ మాలవ్యా, జిన్నా, జి.డి.బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు.
ప్రకాశం శాసనసభ్యునిగా కూడా రాజీనామా చేసి మద్రాసులో స్వయంగా ముందుండి ఉప్పు సత్యాగ్రహం నడిపించాడు.
1946 ఏప్రిల్ 30న ప్రకాశం మద్రాసుముఖ్యమంత్రిగా ఎన్నికైనాడు. ఈయనతో పాటు తమిళ నాయకుడైన కె.కామరాజ్, జాతీయ నాయకులైన గాంధీ, నెహ్రూల అభ్యర్ధి అయిన రాజాజీ... ప్రకాశం ముఖ్యమంత్రి అవటాన్ని వ్యతిరేకించారు.
పార్టీలోని వివిధ వర్గాల విభిన్న అభిమతాలకు అనుగుణంగా పనిచేయలేక ప్రకాశం రాజీనామా చేయడంతో ప్రభుత్వం కేవలం 11 నెలలే మనగలిగింది.
అందుకే..ప్రకాశం పంతులు ధీరోదాత్తుడు,
కానీ ఇప్పుడెవ్వరికీ అంతటి మహనీయుని స్మరించుకునే సమయమూ లేదు, అవసరంలేదు..

No comments:

Post a Comment