Friday, 23 August 2013

15-8-13 నుంచి 22-8-13  రాజకీయ టుమ్రీలు 

                         రాజకీయ నిఘంటువు  

                                          ప్రతిపదార్ధానికి కొత్తఅర్ధం(వ్యర్ధం)      

---------------------------------------
*డాలరు - ఎస్కలేటర్ : రూపాయి - జావ కారిపోయి.
*సచివాలయం సి బ్లాక్ - తెలంగాణ, సీమాంధ్ర కబడి గ్రౌండ్.
*ఉద్యమం - ఇం'ధనం'పై ఆధారపడిన ఇంజను.
*సెంటిమెంట్ - అదో విచిత్ర పదం.
*పదవులు తృణప్రాయం - గడ్డి చాలా ఖరీదైంది.
*ప్రాణాలైనా అర్పిస్తాం - ఇదో లేటెస్ట్ నినాదం.
*మన రాజధాని - ఎప్పటికైనా డిల్లీ బెటర్!
*ఏపి భవన్ - ఇండియా గేట్ సమీపంలో  తెలుగు(తెలివి)రాజకీయ విడిది.
*హాట్‌లైన్ - హస్తిన - భాగ్యనగర్ నాన్ స్టాప్ ఎయిర్ సర్వీస్.
*వారాలబ్బాయిలు - తెలుగు టీవీల్లో విశ్లేషకులు.
*వెంగళప్పలు - టీవీ వీక్షకులు, పత్రిక పాఠకులు.
*నడిరోడ్లు - వంటలకు గాడిపొయ్యిలు.
రాజకీయ టుమ్రీలు
*భారతదేశాన్ని చీల్చింది(ఇండియా-పాకిస్థాన్) మహత్మా గాంధి. పాకిస్థాన్‌ను చీల్చింది(బంగ్లాదేశ్) ఇందిరా గాంధి. ఆంధ్రప్రదేశ్‌ను చీల్చింది(తెలంగాన-సీమాంధ్ర)సోనియా గాంధి. పరజలందరినీ వారు కలసిమెలసి ఉండమంటారు. జై జై గాంధీలు.
*రాజకీయం-పాత్రికేయం రాష్ట్రాన్ని ప్రాంతాలుగా మనుషులను, మనసులను చీల్చాయి.    
*తెలంగాణ ఆత్మగౌరవం, సమైక్య ఆత్మ గౌరవం: ఇవి ఇరువురి అహంభావం.
*నేలను చీలుస్తారు, సంపదను పీలుస్తారు. జనాలను ముంచుతారు. వాళ్ళు మాత్రం పెళ్ళిళ్లలో కౌగలింతలు.
*ప్రజలు దిక్కులేని చావు చస్తుంటేపట్టదు గాని, పెళ్ళిళ్లకు  పట్టు వస్త్రాలతో హాజరవుతారు గవర్నర్లు.నాకేమీ అర్ధం కాలేదు. మీకేమైనా అయిందా?

------------------------------------------------------
*ఈ వ్యవహారాలు, వ్యాఖ్యలు, విశేషాలన్నీ అన్ని ఉద్యమాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని పార్టీలకు అన్ని వేళలా వర్తిస్తుంది.  పెద్దల పదవులు భద్రం. పిచ్చివాళ్ల బతుకులే చిద్రం..  ప్రజలార మేలుకోండి...
*ప్రజా ధిక్కారం, ప్రభుత్వ ధిక్కారం, న్యాయస్థాన ధిక్కారం, వెరసి రాజ్యాంగ ధిక్కారం. వారినే ముద్దుగా గవర్నమెంటు  ఉద్యోగులని పిలుచుకుంటాం. వీరికి జీతాలు- భత్యాలు కాకుండా.. అదనంగా శక్తి కొలది "గీతాలు" కూడా... రాజ"కీ" (యా)లన్నీ వారి చేతల్లోనే, చేతుల్లోనే. దేనికైనా సమ్మె చేయడం వారి జన్మ హక్కు. సామాన్యులకే లేదు ఏ దిక్కు.
*ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. దుకాణాలు లేవు, బళ్ళు లేవు, హోటళ్ళు లేవు, బస్సులు లేవు, లారీలు లేవు, ఆటొలూ లేవు.  ప్రయాణాలు లేవు, గుళ్ళు కూడా లేవు. ప్రజా జీవనం స్తంభించిది. మరి పేదింటి పొయ్యిలో పిల్లి రోజూ ఎలా లేస్తున్నది.
*యాత్రలకు, ప్రదర్శనలకు, శిబిరాలకు,  ఫ్లెక్సీలకు, బ్యానర్లకు, మైకులకు, లౌడ్‌స్పీకర్లకు, షామియానాలకు, వేదికలకు, జెండాలకు, టోపీలకు, కాగడాలకు, కొవ్వొత్తులకు, నడిరోడ్డుపై నవకాయ రుచులతో భారీ వంటకాలకు,  వాహనాలలో ఇంధనానికి ఇంత ధనం ఎలా వస్తున్నది? ఎవరిస్తున్నారు?
*ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయవలసిన ఉద్యోగ నాయకుల రాష్ట్ర పర్యటనలు, సభలు, సమావేశాలు ఏమిటి? ఎలా అంగీకరిస్తున్నాయి నిబంధనలు. రాజకీయ నాయకులతో మంతనాలేమిటి? డిల్లీ ప్రయాణాలేమిటి? రైలు, విమాన, వసతి ఖర్చులెలా గడచిపోతున్నాయి!
*సమ్మె వల్ల ప్రభుత్వ రాబడికి గండి, ఆర్టీసి కి నష్టాలు, సాక్షాత్తు పాలనాపీఠం సచివాలయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వవ్యతిరేక నినాదాల హోరు, సమ్మె జోరు. మంత్రుల రాజీనామాకై ఉద్యోగుల డిమాండ్.. ఏమిటీ వింత!! మరి బార్లు-సినిమాహాళ్ళు మాత్రం ఒక్క రోజు మూతపడకుండా రెట్టింపు వ్యాపారం.. ఫుల్ ఆదాయం.
*మరో గమ్మత్తేమిటంటే.. గుర్తుల్లేకుండా జరిగిన ఎన్నికల్లో గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళేనన్నట్లు, ప్రతి రోజూ రాష్ట్ర వ్య్యాప్తంగా చచ్చే చావులన్నీ(శవాలన్నీ) "ఉద్యమం" ఖాతాలోకి పోతున్నాయి. అందరూ రాష్ట్రం కోసం చస్తున్నారట!
*అంకింత భావంతో ఉద్యమిస్తున్న(?) కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు,ఎమ్మ్నెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, చొటమోట ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది ఎవ్వరికీ కనీసం అనారోగ్యం కూడా కలగడం లేదు. చావుకు కూడా వారంటే చచ్చే భయం..నాయకుల గుండెల బండరాళ్ళు, చలించవు. అమాయకుల ప్రాణాలే బలి.

*సమైక్య ఉద్యమంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సమ్మె. అంటే ఉద్యోగులు పనులు చేయడం లేదు. మరి అలాంటప్పుడు శ్రీకాకుళం, నెల్లూరు పట్టణాల్లో 50 వేల రూపాయలు చొప్పున లంచం తీసుకుంటూ ఇద్దరు ఉన్నతోద్యోగులు ఏసిబి వలలో చిక్కారు. ఇదెలా స్సాధ్యం. అంటే విధులకు హాజరు కాకుండా లంచాలేమిటి? ఆ సొమ్ము ఫైనాన్స్ కోసం కాదు కదా?

*కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం..  తెలంగాణ  ఇస్తే అక్కడ ఖతం. ఇవ్వకుంటే ఇక్కడ ఖతం..ఉప ఎన్నికల్లో రెండూ రుచి చూసిందిగా ఆ మహా నాయకి. మొత్తానికి కాంగ్రెస్ మటాష్!

*పిచ్చి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నాడట. అలా ఉంది. సమైక్యవాద ఉద్యమం ఉధృతమైందని చెప్పేందుకు "వేర్పాటు వద్దంటూ చిత్తూరు రోడ్లపై మహిళలు వర్షంలో తడుస్తూ కూడా శ్రావణమాసం వరలక్ష్మి పూజలు" అంటూ పత్రికల్లో వార్తలు. రాజకీయాలకు ముడివేసి పత్రికలు దేవుణ్ణి రోడ్డెక్కించాయి.

*సమైక్య ఉద్యమంలో భాగంగా అనెక పట్టణాల్లో నడిరోడ్లపై వంటలు-వడ్డింపులు. యాచకునికి చెయ్యి విదలచని వారు, పిల్లికి బిచ్చం వేయని వారూ గంగాళాలు, డేగిసాలతో వేలమందికి అన్న సంతర్పణ. ఎంత ప్రేమ సమైక్య రాష్ట్రమంటే! ఎవరు బాబూ అంత మహాదాతలు.

*12వ తేదీనుంచి సర్వజన సమ్మె లో భాగంగా 13 జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు బంద్. రవాణాలేక ప్రజల ఇక్కట్లు. ప్రభుత్వం ప్రైవేట్ ఆపరేటర్లకు వంద రూపాయలు చొప్పున రోడ్లన్నీ రాసిచ్చేసింది దోచుకోమని. నాయకుల ప్రయాణాలకుమాత్రం ఎక్కడా అవరోధాలు లేవు. ప్రభుత్వ ప్రతిపాదిత బంద్ కాబట్టే ప్రైవేట్ ఆపరేటర్లకు పండగే పండగ. ఆపరటర్లందరూ రాజకీయ నాయకులే. పార్టీలకు అతీతంగా దోచుకోవడంలో  సమైక్యం.

*బస్సులు బంద్, స్కూళ్ళు బంద్, కాలేజీలు క్లొజ్. యూనివర్సిటీలు మూత, పరీక్షలు వాయిదా, కౌన్సిలింగుకు మంగళం, ప్రభుత్వ కార్యాలయాలు బంద్, బ్యాంకులు బంద్, ఏటిఎం లు ఖాళీ. ప్రభుత్వాస్పత్రులు ఖాళీ. ఆస్పత్రులు కానీ బార్లు, వైన్ షాపులు మాత్రం ఫుల్ జోష్. రష్షే రష్. చిన్నహోటళ్ళు నడవవు, స్టార్ హోటళ్ళకు మంచి బిజినెస్, కార్పొరేట్ కాలేజీలు నాగా లేకుండా వారంలో ఏడురోజులూ నడుస్తాయి.

*నాయకులు, పత్రికాధిపతులు, సినిమా ఘనుల ఇళ్ళలో పెళ్ళిళ్ళు ఘనాతి ఘనం. వేలమంది హాజరు. అక్కద మాత్రం ప్రత్యేక-వేర్పాటు వాదం వినబడదు. అందరూ భుజాలపై చేతులు వేసుకుని ఖుషీ. మధ్య, పేద తరగతి ప్రజల ఇళ్లలో పెళ్ళిళ్లకు అనీ అవరోధాలే.  ప్రజలు మాతమ్మే చీలి శత్రువులవుతారు. మీడియా పెద్దోళ్ళింట పెళ్ళిళ్ళను  ప్రపంచ అవసరాలుగా గుర్తించి లైవ్ ప్రసారాలు. ప్రతిఫలం బాగా ముడుతుందిగా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పోలీసు ఉన్నతాధిపతులు క్యూలు కడతారు.. అక్కడ పోలీసులతో పకడ్బందీ కాపలా.

*1972-73 జై ఆంధ్ర ఉద్యమమప్పుడు తెలుగు చిత్ర సీమ ప్రముఖులు(నటులు, నటీమణులు, నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు), మద్రాసులో నిరాహార దీక్షలు కూడా చేశారు. అప్పుడు ఇప్పుడు..అంతా ఆర్ధిక రాజకీయమండి.

*During my four-day visit to Visaakha and two-day visit to Guntur, I too observed that electronic media was magnifying the incidents. Their reports were mere exaggeration. Life in Visakha and Guntur were normal except buses and schools. Movement is not media managed, but media is being managed.

*ప్రపంచం లో ఎవరు ఎక్కడికి వెళ్ళినా బతకడానికే... కూలి పని కోసం గల్ఫ్ కు వెళ్ళినా .. itఉద్యోగిగా అమెరికా వెళ్ళినా ఆ ప్రయాణం అంతా బతుకు తెరువు వేటనే .. ఆఫ్రికా నుంచి ఒబామా కుటుంబం అమెరికా వెళ్ళినా , ఉత్తరాంధ్ర నుంచి అప్పడు శ్రీలంక వెళ్ళినా బతుకు తెరువు కోసమే ... అదేమ చిత్రమో ఒక్క హైదరాబాద్ కు మాత్రం అభివృద్ధి చేసేందుకు వస్తారు ( కొందరు )ప్రపంచం లో ఏ నగరం చేసుకొని ఇలాంటి అదృష్టం హైదరాబాద్ నగరం చేసుకుంది . (పాత్రికేయుడు బుద్ధా మురళి వ్యాఖ్య)కు
- (నా ప్రతి వ్యాఖ్య ) ఈ సమాజాన్ని తెలుగు పత్రికలు, చానళ్ళు, సంపాదకులు, పాత్రికేయులు ఉద్ధరించినట్లే.. హైదరాబాద్‌ను అందరూ కలసి అభివృద్ధి చేసారు..

*ఉమ్మడి రాష్ట్ర నూతన రాజధానిని డిల్లీకి తరలించడం వల్ల ఉభయ రాష్ట్రాల ప్రజలకు లభించే మరొక అదనపు బోనస్ ఏమిటంటే.. హైదరాబాద్, తిరుపతి, విశాఖనుంచి డిల్లీ వెళ్ళే విమాన ప్రయాణికులకు రాజకీయనాయకుల తొడతొక్కిడి ఉండదు.  ఈక్యూల్లో కూడా రద్దీ అపారంగా తగ్గుతుంది.

*ఖజానాకు ప్రజాప్రతినిధుల ప్రయాణ భత్యాల ఖర్చు తగ్గుతుంది. శాసనసభ, శాశనమండలి, సచివాలయం, ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రుల నివాస గృహాలను అద్దెలకిచ్చి ఆదాయం పెంచుకోవచ్చు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్, ఇందిరాపార్కు  సందర్శకులకు పోలీసు  నిషేదపుటుత్తర్వులనుంచి, అసెంబ్లీ భవనానికి, ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు పహరా, ఇనుప కంచెల నుండి విముక్తి కూడా!!        
 
*తెలుగు పత్రికలు, చానళ్ళ ప్రధాన కార్యాలయాలు, "సంపాద"కులు, విశ్లేషకులు కూడా డిల్లీకి మారవచ్చు (నాయకులకు  అందుబాటులో ఉండాలికదా!!). అప్పుడు వారి స్థాయి, స్థోమతలు డిల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయికి పెరుగుతుంది. ఓబి వ్యాన్‌లు, కాన్వాయ్‌ల రణగొణ ధ్వనులు లేకుండా, ట్రాఫిక్ జామ్‌లు లేకుండా..రోడ్లు విశాలంగా ఉంటాయి.  
 
*కానీ రాజ్‌భవన్, డిజిపి కార్యాలయాలను ఇక్కడే  ఉంచుకుందాం. ఎందుకంటే పాపం వారికి ఎప్పుడూ ప్రజలతో  సంబంధాలుండవుగా!! అప్పుడప్పుడూ వారి కుటుంబాల షాపింగ్ హడావిడులతొ సందడిగా ఉంటుంది నగరం.
----------
*ఒక గొప్ప నగ్న సత్యం ఏమిటంటే, "నో వర్క్-నో పే" నిబంధన మొట్టమొదట వర్తింపజేయవలసింది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు. వారికి విధులంటూ లేకపోయినా నిధులు మాత్రం పుష్కలం. అసెంబ్లీకి వెళ్ళరు, కార్యాలయాల్లో ఉండరు, ప్రజలు వారి చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు మాత్రం పదవుల చుట్టూ ప్రదక్షిణలు.

*నేనెప్పుడో చెప్పాను తెలంగాణ, సీమాంధ్ర ప్రదేశ్ కొత్త రాష్ట్రాలకు ఉమ్మడి శాశ్వత రాజధానిగా హస్తినను నిర్ణయిస్తే మంచిది. దేశరాజధాని మరో రెండు రాష్ట్రాలకు రాజధాని కావడం ఎంత విశేషం. ప్రపంచంలో ఇదొక రికార్డు. కొత్త కార్యాలయాలు, భవనాల నిర్మాణం అవసరం ఉండదు. కేంద్ర సచివాలయం నుంచే పాలన నిక్షేపంగా సాగించవచ్చు.

* ప్యాకేజీలు, పర్సెంటేజీలు ఎలాగు ఉంటాయి. హస్త సాముద్రికురాలు జనపథంలో ఉంటున్నందున, అమ్మ కనుసన్నలలో మెలగుతూ పార్లమెంటు లేనప్పుడు అందరూ కలసి అసెంబ్లీ సమావేశాలు అక్కడే నిర్వహించుకోవచ్చు. అధినేతనే అసలు మనకు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు. ముఠాలు వర్గాలు ఉండవు.

*మరో వెసులుబాటుకూడా ఉంది. పార్టీ పరంగా ఏఐసిసి అధినేత్రి స్వయంగా రెండురాష్టాల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షురాలిగా ఉండడం ఎంత అదృష్టం. ఇక ఏ చికాకులు ఉండవు. రాష్ట్రానికి రాజకీయ కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు.

*రాహుల్ పట్టాభిషేకానికి కాలం కూడా కలిసొస్తుంది. దేశానికే కాదు, రాష్ట్రానికి కూడా నెహ్రూ కుటుంబ వారసత్వపు నాయకత్వం. సి.ఎం నుంచి అక్కడే పి.ఎం కు ప్రమోషన్!! ఇది మీడియా మేథావులందరూ కూడా ఆలోచించవలసిన ముఖ్యాంశం.

*కొన్నాళ్ళు భగత్ సింగ్, వీరసావర్కర్, ఇంకొన్నాళ్ళు అల్లూరి సీతారామరాజు, మరికొన్నాళ్ళు వివేకానంద...
అలాగే ఇప్పటి పాపులర్ ఫిగర్.. పొట్టి శ్రీరాములు..,

*దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటారు. 1953 నవంబరు 1 ముందు- ఆతరువాత. 1956 నవంబరు1 ముందు-ఆతరువాత, అంటే విశాలాంధ్ర ఏర్పాటు, ఆంధ్రప్రదెష్ అవతరణ-అ సంఘటనల్లో కూదా లబ్దిపొందింది వ్యాపార రాజకీయ నాయకులే.ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారులు,
ఆంధ్ర రాష్ట్రావతరణ అనంతరం గుత్తాధిపతులు, ప్రత్యేకాంధ్ర ఉద్యమ సృష్టికర్తలు ఒకరే. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగ, పాలనా పరంగా,(అధికార)పదవులపరంగా, ఎప్పుడు లబ్దిపొందినా ఈ రాష్ట్రంలో బాగుపడ్డది రెందు సామాజిక వర్గాలే. స్వతంత్రం వచ్చిననాటి నుంచి 1983 లొ తెలెఉగుదేశం ఆవిర్భావమ వరకు రాష్ట్రాన్ని ఒక చెతుల్లో బంధించగా, ఆ తరువాత 2004 వరకు మరో సామాజిక వర్గం పెత్తనం సాగించింది. వర్గ పోరులో మిగిలిన వర్గాలను తమ ఆర్ధిక బలంతో కీలుబొమ్మలు చేశాయి. తెలంగాణ ఉద్యమమైనా, ప్రత్యేకాంధ్ర పోరాటమైనా మళ్ళీ 2000 సంవత్సరం నుండి తెరపైకి వచ్చిన తెలంగాణ వాదమైనా సామాజిక పోరులో భాగమే కాని సార్వజనీనం కాదు. పెత్తనం చెలాయించడం ఇంకానా ఇక పై చెల్లదన్న వాదనతో కొత్త రాజకీయ శక్తుల పునరేకీకరణ సామాజివవర్గ రూపం దాల్చింది. వ్యక్తుల పదవులేకాని సమాజ శ్రేయస్సు కాదన్నది ప్రజలకు తెలిసిన వాస్తవం. నెల్లూరు చిత్తూరు జిల్లాలు మద్రాసుతొ 55 సంవస్తరాలుగా ఇప్పటికీ వ్యాపార బంధాలు కొనసాగిస్తుండగా అనంతపూర్, కదపజిల్లాల వర్గాలు కర్ణాటకతో ముడివేసుకు పోయారు. కర్నూలు మాత్రం హైదరాబాద్ కు చేరువై మమేకమైంది. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల రెండు సామాజిక వర్గాలైతే 50 యేళ్ళకు పైగా తెలణ్గాణలో తిష్ఠ వేసుకుని ఆధిపత్యం చేస్తున్నారు. ఈ బానిస బతుకు మాకొద్దని తెలంగాణ జనం అడగడాన్ని వక్రీకరిస్తున్నాయ్ రెండు సామాజిక వర్గాలు. వ్యక్తుల ప్రాబల్యమే కాని ప్రజల బాగోగులనేవి కంచుకాగాడా పెట్టినా కనిపించని విషయాలయ్యాయి.

*రాష్ట్ర విభజన ప్రతిపాదనను విరమించుకోకపోతే సమైక్యాంధ్ర కాంగ్రెస్ పేరుతో సీమాంధ్రలో కొత్త పార్టీ రావొచ్చని రాజమండ్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు చెప్పారు.[---]
--బహుశః అది వైఎస్సార్ సి పి కి అనునబంధమవుతుండేమో..వైఎస్సార్ అభిమానులందరూ ఏదో ఒక మిషతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అందులో రౌతు అంటే వేరే చెప్పాలా..., ఆయన గురువు ఉండవల్లి అడుగుజాడే ఆయనది.. వారి వెనుక అదృశ్య శక్తులు సర్వులకు విదితులే..

*కాంగ్రెస్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పుకునే నాయకుడి పార్టీ పేరులో కాంగ్రెస్ ఎందుకో ?(---)
--అది కాం"గ్రీసు".. ఆ జిడ్డు అంత త్వరగా వదలదు

*జర్నలిస్టు యూనియన్‌లో సైద్ధాంతికంగా చీలికలు ఎప్పుడో వచ్చాయి. తాజాగా ప్రాంతీయంగా, వ్యక్తులుగా జర్నలిస్టులు చీలిపోయారు. చీలికలు పేలికలు రాజకీయలకే పరిమితం కాదు.. ప్రాథమికంగా మనుషులకు, మనసుల్లో తేడాలు..
*అప్పుడు చీలికను రాద్ధాంతిక మనడానికి నాకు అభ్యంతరం లేదు పతకమూరు గారు! అన్నిటికి అర్ధం, పరమార్ధం ఆర్థికమే!!

*రాజకీయ నాయకులు అరమరికలు లేకుండా చర్చించుకుని భూములు, గనులు, పదవులు, కాంట్రాక్టులు, సంపదను పంచుకుంటారు. ప్రజలు ఆవేశపరులై అందోళనలు చేసి పోలీసు కేసులు, లాఠీ దెబ్బలు, కష్టాలు, పన్నుల భారం  పెంచుకుంటారు. ఈ యజ్ఞానికి ప్రసార మాధ్యమాలు అగ్గి రాజేసి  ఆజ్యంపోసి  హవిస్సు(వాటా) అందుకుంటాయి. 

No comments:

Post a Comment