Sunday, 23 March 2014

వేడెక్కుతున్న వాతావరణం..ఎన్నికల "రణం"..  

23-3-14

*పన్నెండు రోజులకే కిరణాలు అస్తమిస్తున్నాయ్. మఖలో పుట్టి పుబ్బ వరకు కూడా నిలవని ఏకైక పార్టీగా తెలుగునాట చరిత్రకెక్కనున్న "జై సమైక్యాంధ్ర". మిగిలిన "ఆ నలుగురూ".. జై వైకాపా అనాల్సిందే! లీనం.. విలీనం..అంతా వాయులీనం. అందరూ "ఆత్మ ప్రదక్షిణలో" ఉన్నరటగా?
*అంతా పెయిడ్ న్యూస్.. పెయిడ్ వ్యూస్.. అంతా పెయిడ్ పాలిటిక్సే. అదే రుచికరమైన ఒక జ్యూస్!
*అంధ్రా కొలనులో కమలకులం విచ్చుకుంటున్నది..కొస్తా కమనీయమని చెప్పానుగా.. టిడిపి, కాంగ్రెస్, బిజెపి, సి.పి.ఐ, సి.పి.ఎం. ఎల్.ఎస్ అన్నీ ఒకటే కులం..నీతి ఏ రాజకీయ జాతికున్నది? కావూరి, లగడపాటి, రాయపాటి... ఎవరైతేనేం? అధికారానికి అంటకాగడం నేటి నీతి. సి పి ఐ అంటే ఏమిటో తెలుసా? ఇందిరా గాంధి ఎమర్జెన్సీ రోజుల్లోనే ఆ పేరు సార్ధకత చేకూరింది. సి పి ఐ అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఇండియా!!
*అసలు ఎన్టీ రామారావుకు రాజకీయాలకొత్తలో సుందరయ్య గారు కూడా ఎవరో తెలీదు. ఇక కమ్యూనిస్టులేంటి. 1982లో మొదటి సారి విజయవాడలో కొందరు ఆయనకు "వీరు పుచ్చలపల్లి సుందరయ్య గారు" అని పరిచయం చేశారు. హీరో స్టైల్లో ఒక సారి పైకి కిందికి తేరిపార చూసి " .. వీరేం చేస్తుంటారు?" అని ప్రశ్నించారు. అంతే అక్కడ ఉన్నవాళ్ళంతా... ఢాం! తరువాత కాలంలో "కమ్యూనిస్టులు మా బా వమరుదులు" అని అన్నారు. నక్సలైట్లకు ఏకంగా లాల్ సలాం చేశారు..

22-3-14
*ఇవన్నీ సరే నండీ.. ఎం జె అక్బర్ కూడా బిజెపిలో చేరారు. ఏం? ఆయన్ను కూడా తిడతారా? భాషరాని వాళ్ళు, భావాలు లేని వాళ్ళు ఇక ? ఏదీ మన ఇష్టం వచ్చినట్లు జరగదు..
*మరో సారి చెబుతున్నా. నా అభిప్రాయాలు నచ్చని వాళ్ళు వైదొలగి పోవచ్చు. అనుభవ రాహిత్యం, అభిప్రాయం పంచుకోవడం తెలియని వాళ్ళతో మిత్రత్వం వేస్ట్. నేనెవ్వరిని ఇలా ఎందుకు కాదూ?? అని నిలదీయను. ఎవరి ప్రశ్నలకు జవాబులు చెప్పవలసిన అవసరం నాకు లేదు.. ఫ్రెండ్ షిప్ అభ్యర్ధనలు పంపింది వాళ్ళే కాని నేను కాదు.. అభిప్రాయాన్ని సున్నితంగా స్వీకరించడం చేతకాని వాళ్ళు నా వ్యాఖ్యలకు స్పందించవలసిన అవసరం లేదు. నేను చిన్న, పెద్దా...స్త్రీ. పురుషులు.. అందరినీ గౌరవిస్తా. నన్ను గౌరవించలేక పోయినా, అర్ధం చేసుకోలేని వాళ్లతో పనిలేదు..
*పాస్ పోర్ట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆధార్ కార్డ్ ఉంది, రేషన్ కార్డు ఉంది, పాన్ నెంబరుంది, ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, ఐ అండ్ పి ఆర్ అక్రెడిటేషనుంది.. అసెంబ్లీ పాసుంది..డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది., మరొ అరడజను పైగా పనికొచ్చేవీ, పనికిరానివీ ఐ డి కార్డులున్నాయి... ఇన్ని ఉన్నైకదా ఆ ఒక్కటి ఎందుకులే అని ఓటర్ కార్డు ఇవ్వలేదేమో!! రెండు సార్లు నమోదు చేయించుకున్నా..మొన్న 9న పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్ళి ఓటర్ లిస్ట్ చూస్తే నా పేరు మాత్రం లేదు
*రాజకీయనాయకుడు రంగు మార్చుకుంటే, కొత్త జెండాలు ఎత్తుకుంటే, కొత్త కండువాలు కప్పుకుంటే, అభిమానులు భుజాన వేసుకోవచ్చునేమో! కాని, ఓటర్లు ఎప్పటికప్పుడు రంగు మార్చుకోరు. ఓటరు వేరు, జనం వేరు, అభిమానులు వేరు, కార్యకర్తలు వేరు.. మా ఇష్టం వచ్చినట్లు పొత్తులు పెట్టుకుంటాం మీరు ఓట్లు వెయ్యండంటే తలలూపడానికి మంది మంద గొర్రెలు కారు. ఈ పాట్లన్నీ పదవులకోసమే. అనుమానం లేదు. అందరివీ శ్రీరంగనీతులే... అన్నీ కుటుంబ పార్టీలే.. అన్నీ సొంత కుంపట్లే..
*నాకు తెలిసిందే కాని. ఒక పెద్దాయన ప్రత్యక్ష అనుభవం..
-----------------------------------------------------------------
నిన్న మా సోదరుని(ఆ మాట కంటే అప్త స్నేహితుడంటాను) కుమార్తె వివాహానికి వెళ్ళాను. అవె బంధు మిత్రులు.. కాలక్షేపం కబుర్లు.. తప్పలేదు రాజకీయాలూ ప్రవేశించాయి. ఒక 65 సంవత్సరాల సాంప్రదాయ పౌరోహిత బంధువొకాయాన మాట్లాడుతూ తన అనుభవం చెప్పాడు అందరూ షాక్. నేను సాదా సీదాగా ఉన్నాను. అందరూ అదేమిటి మీకేమి అనిపించడం లేదా అని అడిగారు. ఇది సింపుల్. అందరికీ తెలుసు. కాకుంటే నాకు కొంత ముందు తెలుసు..
ఆ పురోహితుని మాటల్లో..
"ఈ మధ్య ఒక రాజకీయ నాయకుడు సుడిగాలి పర్యటనలు చేస్తూ పశ్చిమకు ఊరూరు వెళ్ళాడు. అందరినీ ఆత్మీయంగా పలకరించాడు. బంధుత్వాలు కలిపాడు (పిలవడం వరకే..) కష్టాలు విని కరిగి పోయాడు. నేనొస్తున్నా మీ బతుకులిక 100 వాట్ బల్బులే! అడిగినా, అడగకున్నా వరాలు.. మీ భవిష్యంతా నాకొదిలేయండి. నాకు చాలా భవిష్యత్తుంది. అప్యాయంగా భుజాలు నిమిరాడు. కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. నాకనిపించింది ఎంత మహాను భావుడు.. జనాల్ ఎందుకింత ద్వేషిస్తారు ఈయన్ను, అని. అందరితో షేక్ హాండ్... వరుసలో ఉన్నారు. నా వంతు వచ్చింది. ఏం ఎలా ఉన్నారు. మీకు మంచి జరుగుతుంది.. మృదువుగా చెయ్యి కలిపాడు. ఆయన జరిగి వెళ్ళి పోయాడు. అంతలో నా అరచేతిలో ఏదో గరుకుగా తగిలింది. జనం ఒత్తిడిలోనే గుప్పిట విప్పి చూశాను. ఆశ్చర్యం వెయ్యి రూపాయలనోటు. నోరు పెగల్లే.. కొద్దిగా జనం బయటకు వచ్చాను. నా లాంటి వాళ్ళు మరో పదిమంది.. ముసిముసిగా నవ్వుకుంటూ..
ఆ షేక్ హాండ్ విలువ వెయ్యి. నాయకులు కొందరు తమతో కలసి భొజనం చేస్తే, టిఫిన్ చేస్తే..డబ్బు వసూలు చేస్తున్నారు. కాని ఆ మహాను భావుడు మనకు షేక్ హాండ్ ఇచ్చి ఎదురు వెయ్యి.. అహా మా అదృష్టం..
రోజూ షేక్ హాండ్లు..రాజకీయమా వర్ధిల్లు..
*ఎవరి డబ్బా వారిది. డబ్బుండాలికాని డబ్బాలదేముంది. దబ్బిస్తే వాయించడానికి ఎక్కడైనా డప్పుగాళ్ళు సిద్ధమేగా! రోజూ స్మశానాలవద్ద వింటునే ఉంటాం.. ఒక జగన్, ఒక బాబు, ఒక కెసీఅర్, ఒక కిరణ్, ఇప్పుడొక ఒక పవన్.. అయితే ఏకకాలంలో రెండు డప్పులూ వాయించే మొనగాళ్ళూ ఉన్నారు. ఎవరి డప్పు వారికి ఇంపు..
*జెండాలు మోయడమేమిటి పాపం..ఆత్మాహుతులూ చేసుకున్నారు. వారి కుటుంబాలకు ఇప్పుడు అదే ప్రశ్న వెయ్యాలేమో! ఆత్మహత్యలతో ఉద్యమాలు నడవవు. అయినా ఎవడు చేసుకోమన్నాడు? నన్నడిగి చేసుకున్నారా?

21-3-14
*ఇవాళ మరోసారి తెలిసింది. నిరుపేదలు, మధ్య తరగతి సామాన్యులంటే వీళ్ళందరికీ ఎందుకు అమితమైన ప్రేమో..దయో..పాపం వాళ్ళ కడు బీదవారు.
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు దేశంలో కెల్లా అత్యంత(కటిక దరిద్రులు..) భాగ్యవంతులైన ఎంపీలు 11 మంది అని తేల్చారు. వారిలో ఆరుగురు మనవాళ్లే.. మన అవిభక్త ఆంధ్రప్రదేశీయులే.. మనకెంత గర్వం!!
1)జయ బచన్....494 కోట్లు
2)వై జగన్మోహన్ రెడ్డి ....446 కోట్లు
3)టి సుబ్బరామిరెడ్డి...239.6 కోట్లు
4)అని ఎ హద్...175 కోట్లు
5)నామా నాగేశ్వరరావు...174 కోట్లు
6)నవీన్ జిందాల్...132 కోట్లు
7)లగడపాటి రాజగోపల్...123 కోట్లు
8)కపిల్ సిబాల్....114 కోట్లు
9)కొణిదెల చిరంజీవి...89 కోట్లు
10)ప్రఫుల్ మనోహర్‌భాయ్ పటెల్...84 కోట్లు
11)గడ్డం వివెకానంద్....73 కోట్లు..
ఈ పేదలకు నిరుపేదలంటే అమిత ప్రేమ మరి.. మనం ఎంత అదృష్టవంతులమో కదా!!

*మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధి. చక్రవర్తుల రాజగోపాలాచారి మనుమడు. దేవదాస్ గాంధి కుమారుడు ఈ రాజ్‌మోహన్ గాంధి అకస్మాత్తుగా ఆకాశం నుండి రాజకీయాల్లోకి ఊడిపడుతుంటారు. మేధావుల వర్గీయుడేకాని ప్రజల మనిషి కాదు తాత గారి మాదిరి. జీవితం అంతా అత్యున్నత స్థాయిలో అనుభవించి, ఎనిమిది పదుల వయసులో ఆప్ కార్యకర్తగా మారి అవినీతిపై యుద్ధానికి సిద్ధుడవుతున్నారు. 1989లో రాజీవ గాంధిపై అమేధి నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి దిగ్విజయంగా పరాజయం పాలయ్యరు. డిల్లి సైంట్ స్టెఫెన్సన్ కాలేజి విద్యార్ధి. ఇందిరా గాంధి ఎమర్జన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కుల క్రియాశీలక కార్యకర్త. ఉద్గ్రంధాల రచయిత, చేయి తిరిగిన పాత్రికేయుడు. 1990-92 పెద్దల సభ సభ్యుడు.. దేశం అనేక సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకుల్లో పడి అస్తవ్యస్తంగా తయారైనప్పుడు మౌనం వహించారు. అవినీతిపై ఎప్పుడూ ఉద్యమించిన దాఖలాలు లేవు. రాజకీయాంగా క్రియాశీలకం కాదు. సామాన్య ప్రజలకు ఎప్పుడూ చేరువలో లేరు. అప్పుడప్పుడూ వార్తలకెక్కుతుంటారు.
వీరిప్పుడు కేజ్రివాల్ వెంట నడుస్తున్నారు. ఇన్నేళ్ళు (కనీసం పదేళ్ళుగా నైనా) దేశం సంగతి ఎందుకు పట్టించుకోలేదో..సామాన్యనుని వాసనలెక్కడైనా కనిపిస్తున్నాయా ఈయనలో? ఇదీ వారసత్వపు వాసనలేగా! వీరి గురించి మరి కొంత సమాచారం:
His book, A Tale of Two Revolts: India 1857 & the American Civil War (New Delhi: Penguin India, December 2009), studies two 19th-century wars occurring in opposite parts of the world at almost the same time. His previous book, a biography of his grandfather Mahatma Gandhi, Mohandas: A True Story of a Man, His People and an Empire, received the prestigious Biennial Award from the Indian History Congress in 2007. It has since been published in several countries. In 2002 he received the Sahitya Akademi Award for his Rajaji: A Life, a biography of Chakravarti Rajagopalachari (1878-1972), his maternal grandfather and a leading figure in India’s freedom movement, who became the first Indian Governor General, 1948-50.
His Other works include Ghaffar Khan: Nonviolent Badshah of the Pakhtuns (Penguin 2004); Revenge & Reconciliation: Understanding South Asian History (Penguin, 1999); Patel: A Life, a biography of Vallabhbhai Patel (1875-1950), Deputy Prime Minister of India, 1947-50 (Navajivan, Ahmedabad, 1990); and Eight Lives: A Study of the Hindu-Muslim Encounter (SUNY, 1987). One of his earlier books, The Good Boatman: A Portrait of Gandhi, was published in 2009 in a Chinese translation in Beijing. Most recently, Rajmohan Gandhi has also penned a book titled, Punjab (Aleph Book Company 2013), which is an unprecedented historical account of undivided Punjab, from the death of Aurangzeb to the Partition.[2]
Before teaching at the University of Illinois, he served as a Research Professor with the New Delhi think-tank, Centre for Policy Research. From 1985 to 1987 he edited the daily Indian Express in Madras (now Chennai), India. In 2004 he received the International Humanitarian Award (Human Rights) from the City of Champaign, and in 1997 he was awarded an honorary doctorate of law from the University of Calgary (Canada) and an honorary doctorate of philosophy from Obirin University, Tokyo. He currently also serves as a Jury Member, Nuremberg International Human Rights Award, and Co-chair, Centre for Dialogue & Reconciliation, Gurgaon, India.

20-3-14
*ముఖ్యమంత్రి పదవి విషయం వచ్చేసరికి పాత్రికేయ మిత్రులందరూ ఒకటే ప్రశ్నల పరంపర.. ఓకే....మరి మన పత్రికల్లో, చానళ్ళలో ఎడిటర్ పోస్టుల విషయం మాత్రం నోరు పెగలదు.. మనది కాక పోతే కాశీ దాకా దేకమన్నారు...
*ఓటరు ఎప్పటినుంచో తెలివైనవాడు.. మనకు నచ్చక పోతే మూఢుడు.. నచ్చితే జ్ఞాని. ఒక సామెత ఉంది. "వెయ్యి గొడ్లు తిన్న రాబందు.. ఒక్క గాలివానకు కొట్టుకు పోతుంది." అని. తెలివి తక్కువ వాళ్ళు ఇద్దరు. వినే వాళ్ళు, తినే వాళ్ళు..
*మోదీ స్థాయి తగ్గుతున్నదా? పవన్ దూకుడు పెరుగుతున్నదా?
సుత్తి కొడవలి, ఈల కూడా కమలం చేరనున్న సైకిల్ తో సుఖ ప్రయాణం కోరుకుంటున్నాయి. ఆ నలుగురికీ పవనం కూడా అనుకూలిస్తే....
*నేనెప్పుడో చెప్పా!! ఏడుకొండలవాడితో గేమ్స్ ఆడద్దురా అని.. ఎవ్వరూ వినలా..
పాపం పండెను నేడు.. నీ భరతం పడతా చూడు!
వెయ్యికాళ్ళ మంటపం కూల్చివేతతో అంకురార్పణ..  అవి ఏడుకొండలు కాదు. రెండే అన్నప్పటినుంచి అసలు కథంతా మొదలైంది. జనాల బాటలో చిరుతలు, పులులు నడవడం మొదలెట్టాయి. ఏనుగులూ ఘీంకరించాయి. ఊళ్ళలో గుళ్ళు కూలాయి, గోపురాలు గాలికే కొట్టుకుపోయాయి. ఆయన దేవుడు.. మనిషిలా మూలగడు. మాడు పగలగొడతాడు. మనిషిని మోసం చేసేవారెవరైనా మాడి మసైపోతారు, ఎందుకంటే దేవుళ్ళు మనుషుల్లో ఉంటారు. రాక్షస సంహారం జరుగుతుంది.. అటూ ఇటూ కొద్దిరోజుల తేడా.. అంతే!! అకౌంట్ తేలాలంటే చిత్రగుప్తుడు చిట్టా పూర్తి కావాలికదా..!!
**ఏకు మేకవ్వడం అంతే ఇదే!! ఓడ మల్లన్న బోడిమల్లన్న అవుతాడన్నది నిజం. తెలంగాణాకు శుభం కార్డు డిల్లీ జనపథ్ లో గ్రూప్ ఫొటో తో పడ్డది. అయితే భాగ్యనగరంలో మళ్ళీ కథ అశుభంతో మొదలయింది.
*పధ్నాలుగు సంవత్సరాల వనవాసానంతరం తెలంగాణకు పట్టాభిషేకం.. కానీ కాంగ్రెస్ కు మరో పధ్నాలుగేళ్ళ అజ్ఞాత వాసం తప్పేట్లు లేదు..
*తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ చచ్చింది..ఇక్కడ, అక్కడ
*చివరకు జె సీ కూడా పచ్చ చొక్కా. గుడ్డలిప్పి తిరిగే సిగ్గులేని వాళ్ళను భరిస్తున్న జనాలకు ఉండాలి ఎగ్గు..
*సమైక్యవాద నాయకులందరూ సాయుజ్యం పొందారు.. టిజి, ఏరాసు పసుపునీళ్ళతో శుద్ధి. మా "శైలజునాథుడు" కూడా "చెప్పులు" విడిచాడు, అనాథుడు కాకుండా ఫాన్ గాలి కావాలట. ఎలాగైనా ఆయన గడప కడపకు దగ్గర కదా!
*మూడురంగుల్లో ఏరంగైనా మార్చుకోవచ్చు. ముందు రంగు పడడం ముఖ్యం..

19-3-2014
*ఈ రాజకీయాల్లో ఎక్కడా ఏ ఇల్లూ చల్లగా లేదు. కానీ ఎదుటిల్లు తగలబడాలని ప్రతివాడి ఆశ!! అంబలి తాగేవాడికి మీసాలెత్తేవాళ్ళు చాలా సంఖ్యలో...

*Regarding fire accident on Tirumala hills Governor, HE ESL Narasimhan informed 2 air crafts which have an expertise in chemical spraying to put off flames would arrive tonight. He had also alerted Chief of Air Force and Chief of Naval authorities and other heads of armed forces. He directed the EO TTD to coordinate. He informed that he was personally monitoring the situation and added that the fire will soon come under control. He asked the pilgrims not to get panicked.

Chief secretary Mr Mohanti Spoke to Cabinet Secretary, Secretary Defence, Secretary Forest and environment . He informed that Air Force authorities are arranging 4 helicopters and 100 Army personnel are reaching Tirumala DG Forests, DG Fire Services are reaching Tirumala tomorrow from Delhi.CS nominated EO TTD, M G Gopal as Nodal Officer. He directed Collector Chittoor to coordinate the operations.

*నిజమే, నాకూ అనిపిస్తున్నది. ఒక గెలుపు చారిత్రిక అవసరమని!!
*రచయితల్లో భావ దారిద్ర్యం..రాజకీయాల్లో సైద్ధాంతిక దారిద్ర్యం...పేదలకు నిత్య దరిద్రం..
*ఇవన్నీ పక్కన పెట్టండి నాకు వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేయండి.
అప్పుడేమో ఉత్తరాదిన కేదారా్‌నాథ్‌లో జలప్రళయం. అభం శుభం ఎరుగని యాత్రికులెందరో జలసమాధి అయ్యారు, గల్లంతయిన కొందరు నేటికీ ఆచూకి లేదు..
ఇవ్వాళ దక్షిణాదిన పవిత్ర యాత్రాస్థలం కలియుగవైకుంఠంలో అగ్నికీలలు. అన్నెపున్నెం ఎరుగని మూగ జీవాలు ఎన్ని బూడిదవుతున్నాయో... జలప్రలయం దైవ ఘటన అని.. అగ్నికీలలు దుశ్చర్య అని అంటున్నారు...అయితే అవినీతి, ఆశ్రితపక్షపాతం, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, కొట్లాది ప్రజలను అనునిత్యం మోసగిస్తూ దేశాన్నే కబళిస్తున్న నాయకులు క్షేమంగా ఉన్నారు. రోజుకో రంగుమారుస్తూ సిగ్గెరగని నేతలు బోరవిడుచుకు తిరుగుతున్నారు. దేవుడుకూడా ఇలా తయారయితే ఇక దిక్కెవ్వరు..
మంచోన్నేమో మంటబెడ్తవు
చెడ్డొంకి చెయ్యందిస్తవూ!
పిర్రలు జూస్తవు-పీటలేస్తవూ
శబ్బాష్‌రా-శంకరా!!!!
నువు తోల్‌బొమ్మల నాడిస్తవు
నడిమిట్లాపి ఏడ్పిస్తవూ!
ఏ దినమెవ్వరి ఖేల్ ఖతమైతదో..
శబ్బాష్‌రా-శంకరా!!!!
*ఏమిటో..మా కోయిలకు తొందరెక్కువ. ముందే కూసేసింది.. ఇప్పుడు గొంతు పెగలడంలా!!
"రాములమ్మ" ముందుగానే కాంగ్రెస్ కండువా కప్పేసుకుంది. కాంగ్రెస్ "కొండ"లన్నీ గులాబి జల్లుకుంటుంటే. రోజురోజుకూ పళ్ళెంలో సీ(స్వీ)ట్లన్నీ అయిపోతున్నాయి...
*ప్రశ్నించే హక్కు ఎవరికి ఉంటుందో తెలుసా.. ఏ అర్హతా లేనివాళ్ళు. జవాబు తెలియని వాళ్ళకు. మన సమాజాన్ని రేయింబవళ్ళు ప్రశ్నించేది ఇద్దరే; ఒకటి రాజకీయ నాయకులు. రెండు ప్రసార మాధ్యమాల వాళ్ళు. కాని వీళ్ళు ఒకరినొకరు ప్రశ్నించుకోరు. ఎందుకంటే ఇద్దరూ మహాతెలివైన వాళ్ళు. ఒకళ్ళనొకళ్ళు తెలిసి మసులుకుంటారు..
*రాజకీయాల్లో పత్తిత్తెవరు? జీవితంలో క్రమశిక్షణ లేనివానికి మరొకరికి నీతులు చెప్పే అధికారం లేదు. ప్రతిపార్టీ అవకాశవాదమే..కులానుకూలమే. కుటుంబాధిపత్యమే.. అధికారదాహమే..
18-3-14
*మెరిసేదంతా బంగారం కాదు..
కురిసేదంతా వర్షం కాదు..
తెల్లనివన్నీ పాలు కాదు..
పొత్తులన్నీ నిజంకాదు..
సమూహాలన్నీ ఓట్లూ కాదు..కావు కూడా!!!
*పుట్టి బుద్ధెరిగిన తరువాత ఇప్పటి దౌర్భాగ్య రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా ఉన్న దాఖలాలు లేవు. ఇందరు నాయకులు ఇన్నిసార్లు పట్టపగలు బట్టలు విప్పి సిగ్గు విడిచి పార్టీల వేదికలపై నర్తించడం..చూడాడానికి, వినడానికే కాదు ఊహించడానికి కూడా మనస్కరించడం లేదు. ఎమర్జన్సీ దినాలైన తరువాత కూడా ఈ పరిస్థితులు దాపురించలేదు. మరీ ఇంత నిస్సిగ్గా?
*కాంగ్రెస్ ఖర్మ చివరకి ఇలా కాలింది. కొండా దంపతులను పొన్నాల బుజ్జగించినా.. కాదు పొమ్మని టిఆర్ఎస్ గూటికి చేరారు.. మరీ ఘోరమేమిటంటే పాపం కేంద్రమంత్రి కావూరిని కూడ స్వయాన రాహుల్, దిగ్గి లాంటి దిగ్గజాలు "పార్టీ వదిలిపోవద్దు బాబూ..." అని ప్రాధేయ పడటం.. ఆయన కాదని ఛీత్కరించుకోవడం....
*బిజెపి పొత్తు బాబుకు లాభం..
పవన్‌తో సహజీవనం టిడిపికి చేటు.
పవన్-బాబుతో నడక బిజెపి నడిసముద్రంలో మునక..
*మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పరిధులుదాటి, అవధులు అధిగమంచి పోయింది. విశ్వమంతటినీ గుప్పిటలోకి తీసుకుంది. ఎన్నెని గ్రహాలున్నాయో.. ఏ గ్రహం ఎక్కడుందో! ఆ గ్రహంలో ఏమున్నాయో..అనీ తెలుసుకుంటున్నాం. గూగుల్ ప్రపంచాన్ని వడపోసి స్కాన్ చేసి గుండు సూది కూడా వదలడం లేదు.
కానీ.. పది రొజులైంది.. 239 మంది ప్రయాణిస్తున్న విమానం జాడ కోల్పోయి. ప్రపంచ దేశాలన్నీ అంజనం వేసి చూస్తున్నాయి లిప్తపాటు కాలాన్ని కూడా వృధాచేయకుండా.. నేటికీ ఆ రహస్యం ఛేదించలేక పోతున్నారు. ఇన్నిరోజులుగా ఎలా దాచిపెట్టారు, ఎవరు దాచిపెట్టారు. వారికి ఇన్నిరోజులుగా తిండీతిప్పలు ఎలా? పిల్లా, జెల్లా. వృద్ధుల ఆరోగ్యం ఏమిటి? ఒక్కళ్ళు ఎందుకు చెప్పలేక పోతున్నారు.
*ఒకటి మాత్రం ఖాయం. మన రెండు రాష్ట్రాల్లో కల్తీలేని నిఖార్సయిన రాజకీయ పార్టీ ఒక్కటీ లేదు. అన్నీ ఊసరవెల్లులే!
17-3-14
*2000 నుంచి 2012 వరకు నిర్విరామంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, గాంధిభవన్ బీట్లు చేసా.. రోజూ వాగుడుకాయి నాయకులు గత రెండు నెలలుగా హుష్ కాకి. తుపాకి గుండుకు దొరకడం లేదు.అడ్రస్ గల్లంతు. కారణం ఏమిటా అని విచారిస్తే.. ఆపరేషన్ కాంగ్రెస్ "దిగ్విజ"యంగా పూర్తయిందట! పార్టీ మళ్ళీ కోలుకున్నప్పుడు తిరిగి చూద్దాంలే.. ఆ బ్యాచ్ మరో పదేళ్ళు కలికం వేసి చూసినా కనపడరు. వినబడరు..
*మాజీ ముఖ్యమంత్రి అటువైపే ఉన్నారట.. కాంగ్రెస్ బస్సు అసలే జనం లేక ఖాళీగా ఉందట ఆయన్ను, ఆవెంటున్న ఆంధ్రా అక్టోపస్ ను.. కూడా ఎక్కించుకోండి. అరసవెల్లిలో తూర్పు తిరిగి నమస్కారం చేయ్యండి. పాపం ఒక పని పూర్తవుతుంది.
*ఎన్నికల్లో.. అక్కడైనా, ఇక్కడైనా....ఐతే స్వీప్.. లేకుంటే వీప్! *శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కాంగ్రెస్ బస్ యాత్ర! ఓ కార్యకర్తా.. నీ బస్సు జీవితకాలం మిస్సు..
చక్రాలూడిన బస్సుకు ఇద్దరు డ్రైవర్లు.. కలెక్షన్ కండక్టర్లెందరో!!
*బోడి గుండుకు..మోకాలికి ముడిపెట్టడడమే నేటి జర్నలిజం. అదే పవన్ - రాహుల్ పెళ్ళి ప్రస్తావనలు. కోతికి కొబ్బరి కాయ దొరికింది. అంతే వెంటనే ఒక ప్రబుద్ధుడు రెచ్చిపోయాడు.
"ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటానని చెప్పారు.నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా రాహుల్ గాంధీ గురించి వ్యాఖ్యానం చేశారు. ఈ నేపధ్యంలో రాహుల్ వ్యాఖ్యలకు ఆసక్తి ఏర్పడుతుంది. పెళ్లి గురించి మాట్లాడారు కాని బ్రహ్మచర్యం గురించి ఎలా మాట్లాడుతారులే!"
అదేం ముక్తాయింపు?
*ప్రేమ అదొక అవ్యక్తానుభూతి..ప్రేమించడమంటే బానిసలుగా తలవంచడం కాదు. అభిప్రాయాలను అస్వాదించడం..హృదయాలను అంగీకరించడం..వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే ప్రేమించగలరు. వారే ప్రేమకు అర్హులు.. అందుకే కొందరు మాత్రమే శత్రువులను కూడా ప్రేమించే శక్తిమంతులు. ..
16-3-14
*రాజకీయాలగురించి, రాజశేఖర రెడ్డి గురించి..ఆయన ప్రభుత్వ కార్యక్రమాల గురించి చాలామంది కొత్తవాళ్ళు ఇవ్వాళ మాట్లాడుతున్నారు. అప్పటికి పాత్రికేయ వృత్తిలో పుట్టని వాళ్ళు ఇవ్వాళ ఏవేవో రాజకీయాలు మట్లాడేస్తున్నారు. భండారు శ్రీనివాసరావుగారి వంటి సీనియర్ల ముందు కూడా చాలామంది ఎన్నెని కుప్పిగంతులు వేస్తున్నారో. ఇవాళ్టి వాళ్ళు చాలామంది అప్పుటికి ఇంకా పుట్టనేలేదు... ఇప్పటిమాదిరి ఆ రోజుల్లో రాజకీయ నాయకులెవ్వరికీ వీరవిధేయ కలం సైన్యం, ఆత్మాహుతి దళం లేవు.
వై ఎస్ ఆర్, చంద్రబాబు, వెంకయ్యనాయుడు అసెంబ్లీ ప్రవేశంతోనే మా అసెంబ్లీ ప్రవేశమూ జరిగింది.(వారు సభలో.. మేము గ్యాలరీలో. అంతే తేడా...) అప్పటి చెన్నారెడ్డి నుంచి నిన్నటి కిరణ్‌కుమార్ రెడ్ది వరకూ ఎందరో..తెల్సిన సీనియర్లు మౌనంగానే ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పగ్గాలు చేపట్టడానికి ముందే అనేక ఇంటర్వ్యూలు చేశాము. అనేక రాజకీయ సంక్షోభాలకు ప్రత్యక్ష సాక్షులం. అది గొప్ప కాదుకాని.. ఇవ్వాళ కలాలు పుచ్చుకుని, గళాలు విప్పుతున్నవాళ్ళు కూడా ఏవేవో మాట్లాడుతుంటే చెప్పాల్సి వస్తున్నది. 1978 నుంచి నేటివరకు దేశ రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో మారిన రంగులు అనేకం చూశాం. అందుకే ఎవరు పడితే వాళ్ళు చేసే వ్యాఖ్యలకు ప్రతిస్పందించడం లేదు..
*ప్రతివాడు రాజకీయాలలో విలువలు కాపాడేందుకు సంసిద్ధుడే..పాపం రాజకీయం..అడుగుజాడలు..
అలాగే ప్రతివారూ తెలుగును ఉద్ధరించేందుకు కంకణబద్ధులే..పాపం తెలుగు కూడా...కాపీమార్గం..
ఒకదానికి ఆదాయం.. మరోదానికి ప్రచారం..
15-3-14
*పవన్ ప్రసంగం పై వ్యక్తిగత అభిప్రాయాలు చాలా చదివా. తప్పులేదు కొందరికి నచ్చొచ్చు. కొందరికి అసలు విసుగేసి ఉండొచ్చు. పవన్ ప్రసంగంలో సారం కనిపించక పోవచ్చు. కొందరు మెచ్చక పోవచ్చు.
ఇవ్వాళ ఒక్కొక్క పత్రిక "పవన్" వార్తకిచ్చిన ప్రాధాన్యతా క్రమం గమనిస్తే.. పవన్ పట్ల వారి పోకడ అర్ధమవుతున్నది. అన్ని పత్రికలూ అందరూ మెచ్చుతున్నారా? అవి చెప్పినవే వేదాలా? అన్ని టీవీలను అందరూ పొగుడుతున్నారా..
అందరు నాయకులనూ అందరూ యుగపురుషుల మాదిరి ఆరాధిస్తున్నారా? ఎవరి ధోరణి వారిది..ఒకాయనకు రైతు లోకం, మరొకాయనకు విద్యార్థి ప్రపంచం, మరొకనికి బడుగు జీవి ప్రామాణికం. ఇంకొకరికి కార్పొరేట్ కలలు, మరి కొందరికైతే మహిళా సమస్యలు.. కొందరేమో ప్రాంతీయ అభిమానం, పలువురిది వ్యక్తి పూజ.. లోకో భిన్న రుచి. ఎవరి అజెండా వారిది. వారి వారి అలోచనలు వారికి ఉంటాయి. అయితే విచక్షణ విడిచి మనం ఏగాలికో కొట్టుకు పోకూడదని నా అభిప్రాయం. ఇదీ చాలామందికి ఇష్టం ఉండక పోవచ్చు...
8-3-14
*Mother is first.. God is next.. Love mother and pray God..
*మాతృ దేవోభవ! అమ్మకు నమస్కారం.. అవనిలో, ఆకాశంలో, అవకాశంలో, అధికారంలో.. సగం. ప్రసంగాలకే పరిమితం, అనుచరణలో మాత్రం శూన్యం. సాధికారత కాదు ఇప్పటికీ పరాధీన యే!! అన్ని దినాల మాదిరే మహిళకూ ఈ సుదినం "అంకితం".

పాలిట్రిక్స్ లో హాటెస్ట్/లేటెస్ట్ కామెంట్స్..  12-3-14
*రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కార్యక్త్రమం మొదలైంది.. పాతుకు పోయిన కాంగ్రెస్ వృక్షాన్ని కూకటివేళ్ళతో పెకలించి పారేసి కొత్త మొక్క నాటే బృహత్తర బాధ్యతను సోనియా జైరాం రమేష్ కు అప్పగించినట్లనిపించింది. సీమలో పార్టీని గడ్దపలుగుతో తవ్వి పారెయ్యడానికి వీలుగా కొణిదెల వారబ్బాయికి, నీలకంఠాపురం రఘువీరారెడ్డికి పగ్గాలు ఇచ్చారట. అందుకే ప్రత్యక్ష పర్యవేక్షణకు జైరాం తో పాటు దిగ్విజయ్‌సింగ్ కూడా సాయం పడతారట్లుంది... ఇదంతా చూస్తుంటే నాకనిపిస్తున్నది ఈనికలలోపే..అందరూ తలొక దుకాణంలో సర్దుకుంటారని..
*గొట్టాల రణగొణ ధ్వనులు. వేటికవే.. బాబుకు ఈటీవి, ఏబిఎన్,ఎన్ స్టూడియో, సివీఅర్.. అప్పుడప్పుడూ మరో రెండూ.. లైవ్ టెలికాస్ట్, జగన్‌కు సరే సాక్షి, అప్పుడప్పుడూ ఎన్టీవీ, టీవీ5. కిరణ్ కు సొంత ఐ న్యూస్. టెవీ9, టీవీ5 అప్పుడప్పుడూ.. సిపిఎం చానల్ వేరే.. చూస్తుండండి.. రెండ్రోజుల పాటు చిన్నా చితకా.. అన్ని చానళ్ళూ "జనసేనలో" పవన భజనలో కొట్టుకుపోవడమే!!

*ఎప్పటికైనా సముద్రం సముద్రమే.. నది నదే! విశాఖ సముద్ర తీరాన ప్రజాగర్జనకు అనుమతి లభించకపోవడం తో 24 గంటల్లో టిడిపీ తన సభావేదికను ఇందిరాప్రియదర్శిని స్టేడియంకు మార్చుకుని వాయ వేగంతో ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. గోదావరి ఒడ్డున రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లొ జై సమైక్యాంధ్ర ఆవిర్భోత్సవసభకు అధికారులు నో.. అందంతో రోడ్డెక్కింది పాపం. ఆర్టీసి బస్టాండ్ వద్ద ఒక అచిన్న స్థలంలో మమ అనిపిస్తున్నారట! ఎలాగైనా బాబు బాబే! కిరన్ రన్..
*విలేకరి ముదిరితే ఎమ్మెల్యే అవుతాడని మా కన్నబాబు నిరూపించాడు. ఇప్పుడు మరో దశ దాటి ఊసరవెల్లి అవుతున్నాడు. ఈనాడు..మాజీప్రతినిధి కె కన్నబాబు కులసమీకరణల నేపథ్యంలో పీఆర్‌పి ఎమ్మెల్యే అవతారమెత్తి. విలీనానంతరం కాంగ్రెస్ రంగేసుకున్నాడు. కొస్తా పసుపుధాటికి ఉక్కిరిబిక్కిరవుతూ. రెండుమూడు రోజుల్లో తెలుగు తమ్ముడై ఒంటికి, ఇంటికి పసుపేసుకుంటాడట!! వినేందుకే సిగ్గవుతున్నది,. రోజూ వీళ్లను చూస్తూ కలిసి మాట్లాడడంతో మాలో సిగ్గే చచ్చిపోయింది.
*యుద్ధసేనలు సాధారణంగా...భూమార్గం, జలమార్గం, ఆకాశమార్గం..అయితే 14న వచ్చే ఎన్నిఉకల 'జనసేన పవన మార్గమట. అదీ. స్టార్ నాయకుడు కదా.. అంచేత పార్టీ పురుడు నొవో టెల్ స్టార్ హోటల్లో..నామకరణంకూడా వెనువెంటనే.. మరి పీటలమీద కూర్చుండే ఆ ధర్మపత్ని ఎవరో!! ఆయనకు అత్యాస లేదు, పోటీ కేవలం 10 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లకే పరిమితం. మరి అటువంతప్పుడు ఇంత ఆయసమెందుకట??
*అన్ని వ్యవస్థలకూ మాదిరి రాజకీయ పార్టీలకు కూడా వ్యవస్థాపకులుంటారు. అదేమాదిరి కొన్నింటికి భూస్థాపితులు కూడా ఉంటారు. కొత్తా దేవుడండీ.. కొంగొత్తా దేవుదండీ!
-------------------------------------------------------------------------------------------------------
12-3-14
ప్రభుత్వ ఉత్తర్వు అమలుకు దిక్కులేదు
**నార్ల వెంకటేశ్వరరావు జీవిత సాఫల్య అవార్డు సహా, రాష్ట్రంలో 31 మంది పాత్రికేయులకు 2008, 2009, 2010  సంవత్సరాలకు ఉత్తమ పాత్రికేయ అవార్డులు ప్రకటిస్తూ 20 నెలల కిందట, 2012 ఆగస్టు 1వ తేదీ, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు(ఘ్.ఓ ఋత్ ణొ.3541)ను అమలు చేయలేని ఈ ప్రబుద్ధుడు విడిపోయిన రాష్ట్రాన్ని కలుపుతాడట. ప్రజలను మభ్యపెడుతూ చివరినిమిషం వరకూ పదవినిపట్టుకుని వేలాడిన వ్యక్తి ప్రజాస్వామ్య విలువను గురించి ఉపన్యాసాలివ్వడం తెలుగు ప్రజల దురదృష్టం.  కేవలం 31 మందికి ప్రభుత్వ పరంగా ఇచ్చిన మాట నిలుపుకోలేని ఘనుడు మూడున్నరకోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాడట. పత్రికలన్నా, పాత్రికేయులన్నా గౌరవం లేని వ్యక్తి బినామీగా ఒక పత్రికను, చానల్‌ను నిర్వహించడం సిగ్గుచేటు. ప్రకటించిన అవార్డులు నాలుగు నెలలోగా అందజేయాలని హై కోర్టు ఉత్తర్వులను జారీ చేసినా కూడా లెక్కజేయని ఈ వ్యక్తి కొత్త రాష్ట్రం ఏర్త్పాటు పై రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును  ఆశ్రయించడం ఆయన విజ్ఞతను ప్రదర్శిస్తున్నది. దివంగత  కాంగ్రెస్ నేతలు, దివంగత  ముఖ్యమంత్రులకు నివాళులర్పించని ఈయన తెలుగుల ఆత్మగౌరవం నిలబెడతాట. రాజకీయ జన్మనిచ్చి ముఖ్యమంత్రిని చేసిన తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసి, అన్నం పెట్టిన చేతిని కాటువేసిన ఈ వ్యక్తి విలువలు, నీతులు చెబుతున్నాడు. మూడున్నర సంవత్సరాల పాలన రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసింది. ఈయన పార్టీ ఎవరికి లబ్ది చేకూర్చబోతున్నది?   నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్.
--------------------------------------------------------------------------------------------------------

11-3-14
*ఈ కొత్త పార్టీల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? వీరి వెనుక అదృశ్య శక్తులు ఎవరు? ఎవరి అభిప్రాయం వారికి ఉండడంలో తప్పులేదు. తెలుగు చానళ్ళలా పార్టీలు పెరిగితే సర్వం కాలుష్యమే! భయంకర (మానసిక)వ్యాధులు వస్తాయి.
*ఈ మధ్య మా ఆపాత ఆంధ్రజ్యోతి పత్రికా మిత్రుడు 'సింగం' కూడా జూలు విదిలించి, కోటేసుకుని, మైకు పుచ్చుకుని.. తెలుగు చానల్లో దూరిపోయి సమైక్యాంధ్ర గర్జనలు వినిపిస్తున్నాడు. ఔరా! ఎటువంటి పరిణామాలు?
*అభిమానం ఉండొచ్చు కాని, రాజకీయాలలో ఎవరూ వీరాభిమానం తో అంతగా మమేకం కాకూడదు. విశ్వాసం అవసరం, అతి విశ్వాసమే మనకు నష్టం చేకూరుతుంది. నాయకులతో వ్యక్తిగత, ప్రత్యేక అనుబంధం ఉంటే అభ్యంతరం లేదు కానీ లేకుంటే ఎవరితోనైనా సరే కొంచెం దూరంగా ఉంటే మేలు. తరువాత పరిణామాలకు మనం నీరసించిపోతాం, వారు బాగనే ఉంటారు. ఇది 35 సంవత్సరాల వృత్తిపర అనుభవంలో గ్రహించిన సత్యం.
*పార్టీ పదవులే కాదు..పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులూ కూడా కుటుంబీకులే.. ప్రజాస్వామ్యమా వర్ధిల్లు..
*ఆలూ లేదు-చూలూ లేదు వాడెవరి పేరో జంబులింగమట! కాపురం కళ కాలు తొక్కిననాడే తెలుస్తుందట!
చుండ్రు శ్రీహరి- వ్యవస్థాపక అధ్యక్షుడు; కిరణ్‌కుమార్ రెడ్డి-అధ్యక్షుడు; ఉండవల్లి, సాయిప్రతాప్, సబ్బం, హర్ష- ఉపాధ్యక్షులు; శైలజానాథ్, పితాని- కార్యదర్శులు; తులసిరెడ్డి, గంగాధర్, శ్రీనివాస్, దొరస్వామి, రత్నబిందు -కార్యదర్శులట.. మరో ఇంపార్టెంట్ పోస్ట్... కోశాధికారి-రామ్మూర్తి:
సమైక్యాంధ్ర ప్రియ ప్రజలకు మరో పెద్ద షాకింగ్ న్యూస్! గుండెలు అరచేతబట్టుకుని.. ఊపిరి బిగబట్టండి:: సలహాదారు - పార్లమెంటులో పెప్పర్ స్ప్రే!!
*శిశు జననం తరువాత మూడురోజుల బాలారిష్ట దశ దాటి 11 రోజులకు లేదా 21 రోజుకు కాని నామకరణం చెయ్యరు సామాన్యంగా. తరువాత అన్నప్రాశన.. ఆపై అక్షరాభ్యాసం వగైరా తంతులన్నీ .. కాని తెలుగునేలపై పుట్టని పార్టీకి ఈ రోజే పెరెట్టేశారు. రేపు గోదావరి ఒడ్డున పురుడుపోసుకుంటుంది-ట.
1983 తరువాత నాదెండ్ల్ భాస్కర రావు, లక్ష్మిపార్వతి, ఎమ్‌వి భాస్కరరావు, హరికృష్ణ, విజయశాంతి, దేవెందర్‌గౌడ్, చిరంజీవి, పాల్... పార్టీలు పెట్టి పల్టీలు కొట్టారు. దుకాణాలు బంద్. అదృశ్యాలు, విలీనాలు, గల్లంతులు, నిమజ్జనాలు పూర్తయ్యయి. ఇవిగాక అనేకానేక పార్టీలు ఆవిర్భవించాయి. మఖలో పుట్టి పుబ్బలో మబ్బుల్లో కలిసిపోయాయి. ఈ కొత్త సంబరమూ చూద్దాం!!
మాజీలందరూ తాజాగా తెరమీదకు వచ్చారు. పార్టీ రంగేమిటో తెలీదు. హంగుమాత్రం ముందే ఉంది. సభ్యులతో పని లేకుండా వ్యవస్థాపక అధ్యక్షుడు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి తెరమీదకు వచ్చేశారు. అదేంటో! రాజమండ్రి సెంటిమెంటు??
*మార్కెట్ లో వో(నో)టు విలువ అందరికీ తెలుస్తున్నది సార్. బేర(బీర్) సారాలకు ఇది మంచి సీజన్..పంచాయతి నుంచి లోక్ సభ వరకు ఓటును గుత్తకు కోనేయచ్చు..భలే మంచి చౌక బేరమూ.

Like ·  · Share

10-3-14
*కేజ్రీవాల్ మరో చిరంజీవి అయ్యాడు, సొమ్ము వసూళ్లకు దేశం మీద పడ్డాడు. ఆయనతో డిన్నర్ చేస్తే 20 వేల రూపాయలట. ఆయన "ఆమ్ ఆద్మీ" నా సిగ్గు చేటు. భోజనం చేసినందుకే 20 వేల రూపాయలైతే ఇక పార్టీ టిక్కెట్టు కు ఎంత వసూలు చేస్తాడో? అందరూ వసూల్ రాజాలే! వాళ్ళు జనాలను, దేశాన్ని ఉద్ధరిస్తారట..
*మార్కెట్ లో వో(నో)టు విలువ అందరికీ తెలుస్తున్నది సార్. బేర(బీర్) సారాలకు ఇది మంచి సీజన్..పంచాయతి నుంచి లోక్ సభ వరకు ఓటును గుత్తకు కోనేయచ్చు..భలే మంచి చౌక బేరమూ..

9-3-14
*దీన్నిబట్టి నాకు అర్ధమవుతున్న విషయమేమిటంటే..  తెలుగు ప్రసార మాధ్యమాలు అంటున్నట్ల్లు, అనుకుంటున్నట్లు.. టిడిపి కంపనీ మూసివేత జరగదు. కొత్త వాటాదార్లు అమితోత్సాహం ప్రదర్శిస్తున్నారు. వ్యాపారం మళ్ళీ పుంజుకుని మార్కెట్ వాల్యూ పెంచుకుంటుందని "స్టాక్ ఎక్స్చేంజ్" నిపుణులు పేర్కొంటున్నారు. వ్యక్తిగతంగా ఎవరైన వ్యతిరేకించవచ్చు.. సమర్ధించవచ్చు.. ఎవరిష్టం వాళ్ళది. అందరి ఊహలకు భిన్నంగా ఫలితాలు ఉండొచ్చని అభిప్రాయం.

*వీటన్నిటికీ మించిన మహాపరాధం, చారిత్రాత్మక తప్పిదం, మీడియాను దేవుడనుకుని నమ్మడం. ప్రజలను నమ్మితే ఎప్పుడన్నా అధికారం అందుతుంది. పత్రికలపై ఆధారపడితే అదేదో... పట్టుకుని గోదావరి ఈదడమే!!
*ఎప్పుడూ పెదవులకు పదవుల రుచి ఇష్టం.. కాకుంటే ఇన్ని ఊసరవెల్లులు వచ్చిఉండేవా?
పిల్లి తెల్లదా.. నల్లదా అనికాదు. ఎలకను పడుతుందా ఏదా? అన్నదీ ముఖ్యం( బాబు గారి మాటల్లోనే..)నాయకులు పార్టీలు మారినప్పుదల్లా ఓటర్లు కూడా మరుతున్నారు. ఇది దేశవ్యాప్తం.  అందుకే గో.పి.లు కూడా గెలుస్తున్నాయ్!!

8-3-14

*జన్ పథ్ మార్గం.. భజనే లక్ష్యం.. జనం చెవిలో వాయులీనం!! థెరెసా, ఫూలే, మహాత్మ, అంబేడ్కర్.. మూకుమ్మడిగా సోనియాలో నిమజ్జనం....
*ఈ రాజకీయాలన్నీ కుతంత్రాలు, కుమ్ములాటలు.. మనకంటే మన శత్రువు బలవంతుడైతే, మనం బలపడబోమని నిర్ణయించుకుని, ప్రత్యర్ధిని బలహీనుడు చెయ్యడానికి పలు మార్గాలు. వోట్లుచీల్చి లాభపడడానికి దబ్బిచ్చి పార్టీలు పెట్టించడం, పోతీకి నిలబెట్టడం మామూలే.. చరిత్ర చెప్పిన సత్యమిది. పవన్ వెనుక, కిరణ్ వెనుక కూడా బలమైన వ్యక్తులున్నారు, వర్గాలు ఉన్నాయి.
*Woman in man stands first and leads
*Mother is first.. God is next.. Love mother and pray God..
*నూరుపాళ్ళు నిజం. ఇంట్లో అమ్మకు దణ్ణం పెట్టు, నాన్నకు అన్నం పెట్టు,  చెల్లి తోడబుట్టినది, కూతురు నీకు పుట్టినది. ఆ ప్రేమ ఎవరో చెబితే రాదు. ఎవరో చేప్పేరోజు వస్తే మన దౌర్భాగ్యం
*మనకు జన్మనిచ్చినవారు, జన్మంతా తోడుండే వారు ఒక్కరే. ఆమే స్త్రీ. ఆమెను అమ్మ, అక్క, చెల్లి, భార్య, కూతురు, స్నేహితురాలు....ఎప్పుడైనా.. ఏ పేరుతోనైనా పిలు. పలుకుతుంది..
*మాతృ దేవోభవ! అమ్మకు నమస్కారం.. అవనిలో, ఆకాశంలో, అవకాశంలో, అధికారంలో.. సగం. ప్రసంగాలకే పరిమితం, అనుచరణలో మాత్రం శూన్యం. సాధికారత కాదు ఇప్పటికీ పరాధీన యే!! అన్ని దినాల మాదిరే మహిళకూ ఈ సుదినం "అంకితం".
హాటెస్ట్/లేటెస్ట్ కామెంట్స్..

7-3-14
*ఈ మధ్య పార్టీలు జనాలను మిస్సవుతున్నాయి. దీనికి విరుగుడు ఏమిటా అని అలోచించారు. ఒక్క మిస్ కాల్ ఇవ్వండి చాలు. ఇక మీ పని మేము చూసుకుంటాం అని తయారవుతున్నారు. పార్టీలు ఇళ్ళకు వస్తాయని భయపడి జనం తలుపులేసుకుంటుంతే ఇక మిస్ కాలిచ్చి తద్దినం కొని తెచ్చుకుంటారా!! టెవీ చానళ్ళ మాదిరి ఎస్సెమ్మెస్ రోగం ఎక్కువవుతున్నదీ పార్టీలకు.. పార్టీలు -పత్రికలు(చానళ్ళు) కలసి ఉమ్మడి వ్యాపారం!! మొదలవుతాయ్ పెయిడ్ న్యూస్ తతంగం....
*మా కిరణ్/పవన్ కు ప్రచారానికి ఒక కేతిగాడు దొరికాడు.. చూశారా!!
6-3-14
*కనీసం ఏడాది రాష్ట్రపతి పాలన, మనకా అదృష్టం గాట్టిగా రాసిపెట్టి ఉండేమో! భగవంతుడు మనలను ఆశీర్వదించు గాక! రాష్ట్ర విభజనపై రేపు సుప్రీం స్టే ఇస్తే.. తేలే వరకు..అంతా గందరగోళం.. ఈలోగా పార్లమెంటు మూత. ప్రభుత్వాలు పడిపోతయ్..అప్పుడు గ్యారంటీగా "నరసింహ రాజ్యం".
*ఒక్క సారి కిరణ్ డైలాగుల ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లండి....
"నాది కాంగ్రెస్ రక్తం నిండిన కుటుంబం. తండ్రి అమరనాథ్ రెడ్డి అడుగు జాడలు నావి. కాంగ్రెస్ వల్లనే ఇంత స్థితికి వచ్చాను. ఇప్పుడు కాదు ఎప్పుడో ఈ పదవికి రావలసిన వాడినని దివంగత మాజీ ప్రధాని పి వి నరసింహారావు గారు అశీర్వదించారు."  పాపం పివి గారు కిరణ్ ను దీవించడం (ఎప్పుడో ఎవరికీ తెలీదు) ఆయన చేసిన తప్పుల్లో మహాపరాధం. సొంత జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే మద్దతులేదు. రాష్ట్రంలో ఒక్క మంత్రి, ఒక్క ఎంపీ ఈయన వెనకాల లేరు. ప్రధాని పదవి నుండి దిగిపోయిన తరువాత సోనియా పార్టీ టిక్కీట్టు ఇవ్వక పోయినా, ఆయన పన్నెత్తి మాట్లాడలేదు వ్యతిరేకంగా. వైఎస్సార్ అండ చూసుకుని పెట్రేగి పదవుల్లో ఉన్నప్పుడు సోనియాభజన తప్ప ఒక్క సారి పివిని స్మరించలేదు.. ఈనో మహానాయకుడు. ఈయనదో పార్టీ!!
*నిన్నటివరకు మన మిడిమేలపు మీడియా జెడి లక్ష్మ్నినారాయణ 'ఆప్' లో చేరుతున్నాడని సొల్లు కక్కింది.. తీరా జాయింట్ కమిషనరయ్యారు. ఎన్నికల టైములో ఎన్ని పార్టీలుంటే గొట్టాలకు అంత కరెన్సీ!! ఫుల్ డిమాండ్!!

Wednesday, 5 March 2014

                 రాష్ట్రపతి పాలనకు "దాదా" ఆమోదం.. 

                                     

                           చురకలు, చమక్కులు మామూలే!!28-2-2014
**రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం ఉదయం ప్రధాని నివాసంలో సమావేశమై చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. మరి కొద్ది సేపట్లో అధికారిక ప్రకటన విడుదల కానుంది. కేబినేట్ తీసుకున్న ఈ నిర్ణయంతో 41 సంవత్సరాల తరువాత రెండోసారి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. 1973‌లో తొలిసారి జై ఆంధ్ర ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా, ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోవడం దరిమిలా కేంద్ర కేబినేట్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం గవర్నర్‌‌ పాలనా పగ్గాలు చేపడతారు. క్యాబినెట్ నిర్ణయం దస్త్రం కొద్దిసేపట్లో రాష్ట్రపతి అమోదముద్ర కోసం రాష్ట్రపతి భవన్ కు చేరుతుంది.  

24-2-14
* నేనెప్పుడూ ఈ అవకాశవాద పొత్తులు సమర్ధించను. అధికారం పరమావధి అయితే ఇలాగే ఉంటాయి రాజకీయాలు. కమ్యూనిస్టులు కొంత కాలం కింద వరకు సొంతహ్మగా పోటీ చేసేవారు. గెలుపోతములు ప్రధానం కాదు. సిద్ధాంత నిబద్ధత విశ్వసనీయత పెంచుతుంది.అందుకే దఏసంలో కొంత కమ్య్యూనిస్టులకు గౌరవం ఉండేది. బిజెపి (భారతీయ జన సంఘ్)  కూడా అదే మార్గం. అయిత రాష్ట్రంలో టిడిపి ఆవిర్భావం కమ్యూనిస్టులు, బిజెపిల ఉనికిని ఊడ్చిపెట్టింది. ఇప్పటికైనా ఏపార్టీ అయినా పొత్తులు లేకుండా పోటీ చేసి సత్త చాటుకున్నప్పుడే సుస్థిర, ప్రజా ప్రభుత్వాలకు ఆస్కారం లేకుంతే కప్పల తక్కెళ్ళే..  

23-2-14
*తెలంగాణ సాధించిన రాజకీయ పార్టీలకు సంయుక్త అభినందనలు. కలసికట్టుగా తెలంగాణ ఆవిర్భావానికి పరస్పరం సహకరించుకున్న టీఆరెస్,బిజెపి, కాంగ్రెస్ నేతలారా. నాదొక సూచన.. లేదా మనవి.
తెలంగాణ సాధనలో ఒకరికొకరు పార్లమెంటులో అండగా నిల్చుని ఈ ప్రాంత ప్రజల దీర్ఘకాల స్వప్నాన్ని సాకారం చేసినట్లుగానే.. ఈ ప్రాంత ప్రజల సర్వతోముఖాభివృద్ధికి పార్టీ పరిధులు, వ్యక్తిగత కాంక్షలు అధిగమించి రేపటి ఎన్నికల్లో స్నేహ బృందంగా ఏర్పడి రాజకీయాలకు అతీతంగా ఒక అవగాహనకు వచ్చి పోటీలు మానుకుని, పార్లమెంటు, శాసన సభ స్థానాల విషయంలో ఒప్పందం కుదుర్చుకోండి..
రాష్ట్రంలో ముగ్గురూ సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడి, విబేధాలు, విమర్శలు మానుకుని ప్రజా సంక్షేమం, ప్రగతి సాధించండి. ద్వేషాలు, కార్పణ్యాలకు స్వస్తి చెప్పండి. జాతీయ రాజకీయాలలో కూడా ఒక కొత్త వొరవొడి సృష్టించండి. కనీసం ఒక అయిదేళ్ళు ఈ విధానం అవలంబిస్తే ప్రజలు సంతోషిస్తారు. తెలంగాణను అన్ని రంగాలలో ముందుంచండి. ప్రజా హితవు కోసం రాజకీయాలలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఘన కీర్తి సాధించండి.. జాతికి మార్గదర్శకులు కండి.. కనీసం ఒక్క అయిదేళ్ళు. అలోచించండి.

*హైదరాబాద్ నగరాన్ని 60 ఏళ్ళుగా ఇటుక ఇటుక పేర్చి అభివృద్ధిచేసి ఈ రోజు కోల్పోవడం వలన సీమాంధ్ర ఆర్ధికంగా ఎంతో నష్టపోయిందని విలవిల లాడుతున్న శోకపరితప్త హృదయాలకు నాది ఒకటి సూటి ప్రశ్న..
వందల సంవత్సరాలుగా రాష్ట్ర, దేశ, విదేశీ యాత్రికుల, భక్తులకు కొంగుబంగారమై కలియుగ వైకుంఠంగా అలరారుతూ, ఏడాదిలో కోట్ల రూపాయల హుండి ఆదాయం వస్తున్న పుణ్య జంట క్షేత్రాలు తిరుపతి-తిరుమల సహా కాణిపాకం వినాయకుడు, శ్రీకాళహస్తి - శ్రీశైలం, మల్లిఖార్జున స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం అప్పన్న, అన్నవరం సత్యనారాయణ, మంగళగిరి పానకాల స్వామి, విశాఖ కనకమహాలక్ష్మి, అరసవెల్లి సూర్యనారాయణుడు, తూర్పు గోదావరి జిల్లాలోని శని దేవాలయం, అనేక ఇతర ప్రముఖ ఆలయాలు సీమలోనే ఉన్నాయి కదండీ..అవి రాష్ట్ర వ్యాప్త, దేశవ్యాప్త భక్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందినవే కదండీ..అందునా భగవంతుడు అందరి వాడూ కదండీ!! మరి ఇతర పర్యాటక కేన్రాల మాట ఏమిటి? వాటి గురించి ఎటువంటి ప్రస్తావన తెచ్చి ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు కదా?
ఈ ప్రశ్న ఎవరినీ బాధించడానికి, సూటిపోటి మాటకో కాదు.. కేవలం ఆలోచింప జేయడానికి మాత్రమే..
22-2-14
*నాకు తెలియక .. మిమ్ములను కొన్ని ప్రశ్నలడుగుతా? మీకు తెలిస్తే జవాబు చెప్పండి:
-----------------------------------------------------------------------------------------------------
మన నియోజక వర్గ ఎమ్మెల్యేకు ఏడాదిలో అసెంబ్లీ జరిగే 60 రోజులు మినహా హైదరాబాద్ లో పనేమిటి? ఏడాదికి నెలరోజులు కూడా మన ఊళ్ళో ఉండడు.
అయిదేళ్ళు ఎమ్మెల్యే అయితే... కారు చౌకకు హైదరాబాద్ లో స్థలం, ఇల్లెందుకు? హైదరాబాద్ లో క్వార్టర్లు, కరెంటు, ఫోన్లు, ఆస్పత్రుల్లో పెద్ద రోగాలకు ఆపరేషన్లు, రైళ్ళు, బస్సులు, విమానాల్లో ఫ్రీ ఎందుకు? మనం గెలిపించిన ఊరొస్తే అలవెన్సులెందుకు? చికిత్స కోసం అమెరికాకెందుకు? కాంట్రాక్ట్ లెందుకు? ఇవి గాక ప్రజాసేవ చేసేవాడికి నెలకు లక్ష రూపాయల భత్యమెందుకు? ఏడాది ఎమ్మెల్యే(ఎమ్మెల్సీ) వెలగట్టినా జీవితాంతం నెలకు 10 వేల రూపాయలు పెన్షనెందుకు? మనం ఇల్లడిగితే సవాలక్ష నిబంధనలు.. మందులు, డాక్టర్లుండని పెద్దాస్పత్రి మినహా దిక్కుండదు.. 30 సంవత్సారాలు ప్రభుత్వ ఊడిగం చేస్తే 10 వేల పెన్షన్ దాటదు. వీళ్ళా మన ప్రజా సేవకులు, ప్రతినిధులు. దగ్గరకొస్తే కాలరు పుచ్చుకు నిలదీయండి.
21-2-14
*ఇదీ నేటి నీతి మాట!!~
--------------------------
*మనకు మాత్రం ఉట్రవొడియంగా అందరూ ఉచిత సేవలందించాలి..మనం మాత్రం ప్రతి దానికీ పైసా పైసా వసూలు చేస్తాం.. అదేమంటే నా కష్టం దోచుకుంటారా? అని ముక్కు చీదుతాం!!
*పెప్పర్ ఘాటు నసాళానికి అంటింది. మన ఎంపీలకు కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగి..ఇంకా తేరుకోలేదు పాపం..
*ఊసరవెల్లులు రాజకీయ నాయకుల్లోనే కాదు..వర్తమాన పాత్రికేయుల్లోనూ ఉన్నారు. అయితే మరింత వేగంగా రగులుమార్చుకునే అద్భుత నైపుణ్యం..
*రాజ్యసభలో సమైక్య ఘోష శోష వచ్చి పడిపోయిందట.. చివరకు అందరూ నిలబెట్టి నీళ్ళు తాగించారు
*రాజకీయము, రాజ్యాంగము, లోక్ సభ,రాజ్యసభ నియమావళి మనం ఫేస్ బుక్ లో రాసుకున్నట్లు కాదు. మనం ఒక విధంగా జరగాలని కోరుకోవడంలో తప్పులేదు. కాని అందుకు వ్యతిరేకంగా జరిగితే వ్యవస్థ చిన్నాభిన్నమైనట్లు భావిస్తే ఎలా! మన చేతిలో వోటు ఆయుధం ఉంది. దాన్ని ప్రయోగించి విజయం సాధించాలి. అప్పుడూ మనం కోరుకున్నట్లే ఫలితాలుంటాయని ఆశించడమూ సరికాదు.రాకపోతే ప్రజాస్వామ్యం భ్రష్టుపట్టిందని శపించడమూ అవివేకమే!! ప్రజల్లో మనం ఒక భాగం. మనమే ప్రజలు కాదు .....
20-2-14
*భూమిని కాపాడడానికి అలనాడు విష్ణుమూర్తి వరహావతారమెత్తినట్లు, రాజకీయాలను క్షాళన చేయడానికి త్యాగ "ధనులు" అవతారాలెత్తుతున్నట్లు.. ఈ మధ్య అంతరిస్తున్న తెలుగును ఆకాశంలో నిలబెట్టి ప్రభలు వెలిగించేందుకు సరస్వతీ పుత్రులు, పుత్రికలూ నెట్ పెపర్ల లో..పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రతా జనులారా!
*కొత్త పదం- "తెలుగుజాతి" ట.. అర్ధం కాని విషయం.. అది భాష. జాతి కాదు. జాతీయత నేషనాలిటి.. తమిళ జాతి, ఒరియా జాతి, కన్నడ జాతి, మరాఠి జాతి, పంజాబి జాతి, బెంగాలి జాతి, గుజరాతి జాతి, కొంకణ జాతి.. ఉంటాయా.? భారత జాతి ఉంటుందా? తెలుగు ప్రజలు చీలిపోరు, భాష చీలిపోదు, ప్రాంతాల భౌగోళిక హద్దులు, ప్రభుత్వ పాలనా యంత్రాగం మాత్రమే చీలిపోతుంది.
*ఫారం హౌజ్ రాజకీయం జనాలకు అర్థమై ఉంటుంది. ఆ బక్కాయన చెప్పినట్లే జరిగింది. "ఏ పి నుంచి డిల్లీ వెళుతున్నా.. తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా"
*సోనియా, మన్మోహన్, విపక్షాలు, అధికార పక్ష సభ్యులు పెదవి కదపకుందానే తెలంగాణ బిల్లు పూర్తయింది. "సోనియా ప్రసంగిస్తారు "అని బాకా ఊదిన చానల్ వార్తలు ..అంతా ట్రాష్.. మొదటినుంచీ అన్నీ ఇంతే!
18-2-14
*ఇన్నాళ్ళూ ఒకటే ఊదరగొట్టిన తెలుగు చానళ్ళు, పత్రికలు భవిష్యత్తులో ఏమి చెయ్యాలి చెప్మా??
*సందట్లో సడేమియా.. ముఖ్యమంత్రి రాజీనామా చేయకముందే అ.సత్యారావు ఆంధ్రప్రదేశ్‌ప్రెస్ అకాడెమీ అధ్యక్షునిగా పదవీ స్వీకారం.
*పొద్దుణ్ణుంచి తెలుగు చానళ్ళు కాకిలెక్కలేసి. వోటింగు తీరు. గెలుపు-ఓటముల గణాంకాలు.. పార్టీలు విధానం మార్చుకుంటే అనే ఒక చచ్చు ప్రశ్న.. బిల్లు పాసవుతునదా? లేదా.. నరాలు తెగే ఉత్కంఠ.. అంటూ కాకమ్మ కబుర్లు..
*మూజువాణి వోటుతో టి బిల్లుకు లోక్ సభ అమోదం..అనుకున్నట్లే.. అంకం పూర్తయింది.
*
సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలట. ఇది మరో నాటకం. రాష్ట్రం విడిపోదని, పోనీయమని బీరాలు పలికి, అవసరమైతే ప్రాణాలు ఇస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి, ఆర్నెల్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన నేతలు అస్త్ర సన్యాసం. ఇక రాజకీయ సన్యాసమే మిగులు..ప్రజలూ వారికి దండ కమండలాలు, కాషాయ దుస్తులూ సిద్ధం చేయండి..