Sunday 3 March 2013


                                  

                              

        

         రాజ భరణాల రద్దు, బాంకుల జాతీయకరణ :ఇందిర మాయాజాలం... 


ఇందిరా గాంధి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొన్నేళ్లకే ఎరవేసి తిమింగలాలను పట్టి బుట్టలో వేసుకుని ఆ తిమింగలాలకు దశలవారీగా దేశాన్ని అప్పగించారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ అనే బిస్కట్లు జనాలకు విసిరి జాతి సంపద మొత్తాన్ని కొందరు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. అంతకుముందు చెల్లిస్తున్న భరణాల మొత్తం కంటే ఆ రాజకుటుబాలకు జరిగిన దీర్ఘకాలిక లాభం మొత్తంతో మరో 50 సంవత్సరాలు భరణం చెల్లించవచ్చు; అదే మాదిరి బాంకుల జాతీయకరణతో రైతు, చిన్నతరహా వ్యాపారవర్గాలను శాశ్వత ఋణగ్రస్థులుగా మార్చారు. రైతులను భూమినుంచి దూరంచేశారు.


 పారిశ్రామిక వేత్తలకు బాంకుల ద్వారా వేలకోట్ల రూపాయల ఋణం ఇప్పించగా వారు ఎగవేసి ప్రజా సంపదను కొల్లగొట్టి విదేశీ బాంకుల్లో దాచుకున్నారు. రైతు తన ఉత్పత్తులకు గిట్టుబాటు, కనీస మద్దతు ధరలు లభించక నష్టపోయి చివరకు కూలీలుగామారు. ఆ కుటుంబ పాలనతో దేశం ఈగతికి చేరుకుంది. మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి "ఇందిర పాలన" ప్రవెశపెట్టి భూములనే మాయం చేసే మంత్రాంగం అమలు చేశారు. నెహ్రూ ప్రజాస్వామ్యాన్ని సామ్యవాదంగా మారిస్తే, ఇందిర ధనస్వామ్యం ప్రవేశ పెట్టారు. తొమ్మిదేళ్ళ పాలనలో చంద్రబాబు అవినీతి బీజం నాటి మొక్క స్థితికి తెస్తే, ఆరేళ్ళ్ వ్యవధిలో వైఎస్సార్ ఆ మొక్కను వటవృక్షం చేసారు. అవినీతికి బాబు కిటికీలు తెరిస్తే వైఎస్సార్ ద్వారబంధాలు ఊడబెరికారు. ప్రజాస్వామ్య సౌధాన్ని బాబు నేలమట్టం చేస్తే వైఎస్సార్ పునాదులు సహితం పెకలించి వ్యవస్థనే కుప్పకూల్చారు. "ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అని ఆనాడు గీతాచార్యుడు చెప్పినట్లు ఒక శక్తి ఉద్భవించి దేశరాజకీయాలనే గొప్ప మలుపు తిప్పుతుంది. 2014 ఎన్నికల తరువాత దాని ఫలితం అందరూ చూస్తాం.

No comments:

Post a Comment