Wednesday, 13 March 2013
                          పదవే పదికాలాలపాటు పదిలం:

-------------------------------
నిన్నటి వ్యంగ్య రచన "పదవీ గీత -- నేతల రాత"లో మొదటి అంశం :
'నాయకా! పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. అశాశ్వతమయిన ఈ పదవిని గురించి వ్యామోహము వీడి, శాశ్వతమయిన డబ్బును అక్రమ మార్గములో ఆర్జించుము.' 

దానిపై నా స్పందన ఇదిగో:

పదవి అశాశ్వతము కాదు. అది వున్నంతకాలమే సంపదకు ఆస్కారం. భద్రత. ఈ విషయ పరిజ్ఞానం తెలుసుకునే ఆధికారం చేయి దాటకుండా, భార్య, కుమారుడు, కుమార్తె, బావ మరదులు, అల్లుళ్ళు, అన్న దమ్ములు, అక్క చెల్లెళ్ళూ, మనవళ్ళూ, అంగరక్షకులు, కారు డ్రైవర్లు..ఇలా వారసత్వ రాజకీయాల పాదులు పటిష్ట పాచుకుంటున్నారు. పదవి ప్రాణప్రదం. మనిషి ప్రాణం పోయినా శవాలను పదిల పరచుకున్న వాళ్ళు కొందరైతే, మరి కొందరు ఆత్మలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. మరి కొందరు ప్రజల ప్రాణాలను పెట్టుబడిగా పెట్టి నాయకులుగా స్థిరపడిపోయారు. జిల్లాలను ఎంచుకుని పంచుకున్నారు. సుపరిపాలనలో ప్రజా అస్తులను ప్రైవేటుపరం చేసి లాభపడిన రాజకీయ వ్యాపారులు తయారుకాగా, దేవుని పాలనలో ప్రజలకు గజాల స్థలాలు ఎరజూపి ఎకరాల్లో "ఘనులు" పాతుకుపోయారు. అవినీతి ఆస్తులు రెమ్మలు, కొమ్మలుగా విస్తరించి వటవృక్షాలయ్యాయి. పరిధులు, సరి హద్దులు లేకుండా నేల, నింగి, నీళ్ళు కూడా అస్తులు కూడబెట్టడానికి వనరులయ్యాయి. దేవుడు,దయ్యం; కొండా,కోనా కూడా ఆర్జన మార్గాలయ్యాయి. ఒక నేత అవినీతి విత్తనం నాటి మొక్కగా చహేస్తే.. మరో నేత దాన్ని విత్తపు చెట్టుగా పెంచితే, వారసులు వటవృక్షంగా పెంచి పోషించేందుకు సిధ్ధమయ్యారు. ఈ మహాప్రక్రియకు విరామామం లేకుండా యాత్రా స్పెషల్స్ నడుస్తున్నాయి. కాళ్ళరుగు తున్నాయి. కన్నీళ్ళు కురుస్తున్నాయి. పదవిని నిలబెట్టుకునేందుకు ప్రచార సాధనాల పటటోపాల కొసం వాటాల క్రయ విక్రయాలు జరిగాయి. ఒక నేత అధిపతులను తనవైపు తిప్పుకుంటే, మరో నేత క్షేత్రస్థాయిలో పాగావేసి, అవసరాలు-అవస్థలు గుర్తించి పైసలు వెదజల్లి గుప్పిట పెట్టుకుంటున్నారు. పాత నేత పర్మిషన్లు, లైసెన్సులు మంజూరు చేసి వ్యక్తులను అధీన పరచుకుంటే, కొత్త నేత వ్యవస్థనే కూకటి వేళ్లతో పెకలించే ప్రయత్నాలకు ఒడిగట్టారు

No comments:

Post a Comment