Monday 25 March 2013


తెలుగునాట పత్రికలు, చానళ్ళ దర్శకత్వంలో పార్టీలు..  


        పార్టీల ప్రమేయంతో ప్రసారమాధ్యమాలు  




గతంలో రాజకీయపార్టీలకు ఆయా సిద్ధాంతలపై వార్తా పత్రికలుండేవి.  గాంధి హరిజన్, యంగ్ ఇండియ,నెహ్రూ నేషనల్ హెరాల్డ్ మాదిరే కమ్యూనిస్టులకు ఇంగ్లీషు, ప్రాంతీయ భాషల్లో,సొషలిస్టు పార్టీకి, జనసంఘ్ కు.. అలా పేపర్లుండేవి. మనకు కూడా ప్రకకాశం పంతులు గారు, కందుకూరి వీరేశలింగం.. ఇలా స్వాతంత్ర్యం, సిధ్ధాంతం లక్ష్యంగా, ఒక నిర్దిష్ట కార్యక్రమంతో పత్రికలుందేవి. మన విషయానికొస్తే వివేకవర్ధని, చింతామణి, ఆంధ్ర మహిళ, ఆకాశవాణి, శారద, జనవినోదిని, ప్రజామత, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రమిత్ర, ఆనందవాణి, స్వరాజ్య, యువజన, ఆంధ్రప్రభ, ఆంధ్రజనత, గోల్కొండ పత్రిక, విశాలాంధ్ర,ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి... ఇవన్నీ నిఖార్సైన వార్తాపత్రికలు, సమాచార సమాహారాలు. 

తెలుగునాట ఈనాడుతో కొత్త శకం మొదలైంది.వ్యక్తులకు మాద్దతుగా కాక ప్రజాప్రయోజనం వాటి ఉద్దేశం. 1983 వరకు కొన్నిపత్రికలు అధికార కాంగ్రెస్ కు నిఖార్సైన విపక్ష్మ ఆత్ర పోషించాయి. 1982లో ఎన్‌టీఆర్ తెలుగుదేశం ప్రారంభంతో పకా సిధ్ధాంతం లేకున్నా ఈనాడు రామారావుకు దన్నుగానిలిచింది. కొంతకాలానికి ఒక వర్గాన్ని కొమ్ముకాయడం స్పష్టంగా కనిపించింది. ఆ దశలో ఉదయం ఆవిర్భవించింది. కాంగ్రెస్ వ్యతిరేకతతొపాటు, ఈనాడుకు వ్యతిరేకంగా, పొటీగా నిలిచింది. అది మరొక సామాజిక వర్గాన్ని భుజానవేసుకుంది. అప్పుడే దిశ, దశ లేని సమయం అంటూ మరొకటి వచ్చింది. ఉదయానికి తీవ్రవాద మద్దతు పత్రికగా ముద్ర పడింది. సమయం కూడాతొడై ఆరెండూ బ్లాక్ మెయిల్ టాగ్ తగిలించుకున్నాయి.

1984లో ఈనాడు ఎన్‌టి ఆర్‌ను ఎత్తుకున్నది. ఉదయం ఎన్‌టి ఆర్ ను వ్యతిరేకించింది. 1995లో అదే ఈనాడు ఎన్‌టి ఆర్‌ను పదేసి బాబును నెత్తిన పెట్టుకున్నది. ఆంధ్రజోతిలో 1989 తరువాత మార్పు వచ్చింది.టిడిఫి కి కొమ్ముకాయడం మొదలైంది. వెన్నుపోటు సంఘటన సమయంలో పత్రికలు విలువల వలువలు విప్పేశాయి. ఆంధ్రప్రభకూడా ఆదారిలోనే నడిచింది. కొన్నాళ్ళ పాటు విజేత అనే పత్రిక నడిచి యజమాని క్రిమినచర్యలవలన కేసులు నడిచి మూతపడింది.అంతకు ఎన్నేళ్ళొ ముందుగానే ఉదయం మూసుకుంది. కొత్త పత్రిక వార్త వచ్చింది. దానికి దారి, దిక్కు లేదు. ముందే 2004 ఎన్నికలప్పటికి పత్రికలు వ్యక్తుల చేతులలోకి మారాయి. ఆంధ్రభూమి మినహా మిగిలిన పత్రికలు రాజశేఖర రెడ్డిని తార్గెత్ చేశాYఇ. చాతుర్యంతో ఆయన బమ్మిని తిమ్మిని చేశారు.

2009 నాటికి వై ఎస్ ఆర్ సొంత దుకాణం సాక్షి పేపర్, సొంత టీవేఏ పెట్టించారు. అంతకుముందే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ మనిషి సుర్య్ప్రకాసరవుతో సూర్య ను ప్రోత్సహించారు. ఎలక్ట్రానిక్ యుగం మొదలై. వ్యక్తులు చానళ్ళు పెట్ట్దం ప్రారంభించారు. ఆంధ్రజ్యోతి పునః ప్రారంభం తరువాత బాబుకు అండగా నిలిచింది. ఆంధ్రప్రభ దిక్కూదివానం లేకుండా పొయింది.ఎడిటర్ల కాలం నశించి సంపాదకులు దూసుకువచ్చారు. రాజకీయాల ఎత్తుగడల మార్గంలోనే,వై ఎస్ ఆర్ మేధస్సుతో సాక్షి కొత్తతరహాలో పావులుకదిపి ప్రత్యర్ధి పత్రికలను మట్టి కరిపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వి ఎస్ ఆర్ మృతితో పత్రికల స్వరూపం పూర్తిగా మారిపోయింది. సాక్షి పత్రిక, చానల్ జగన్ సొంత బాకా, ఈనాడు-ఈటీవి, ఏబి ఎన్-అంధ్రజ్యోతి బాబుకు భజన మొదలెట్టాయి. సూర్య అకస్మాత్తుగా బాబువైపు మొగు కాసింది. ఇంతలో నమస్తేతెలంగాణ దూసుకువచ్చింది.

2013 కు పత్రికలు-చానళ్ళు వర్గాలుగా, పార్టీలుగా విడిపోయాయి. ఎన్నికలే లక్ష్యంగా అడుగులు కదులుతున్నాయి. ఉదయం పునః ప్రారంభానికి ఊగిసలాడుతున్నది. అనేక చానళ్ళకు నేరుగా రాజకీయనాయకులే యజమానులు. ఇప్పటికే తెలుగునేలపై చిన్నా పెద్దా 21 చానళ్ళు వచ్చాయి. తాజాగా పి సి సి అధ్యక్షుడు బొత్స జీ 24 ను కొనేశారు. ఎన్ టీవి, టివి5, వి6, సివీఅర్. చనళ్ళలొ రాజకెయ నేతల పెట్టుబడులున్నయి. సిఎం కిరణ్ పాత కృష్ణాపత్రికను సన్నిహితుల పేరిట తీసుకున్నారని గుప్పుమంది. అలాగే కిరణ్ ఐ-చానల్ కూడ హస్తగతం చేసుకున్నారు.సిపిఎం టి10 చానల్ ను మొదలెట్టింది. ఇంకా చానళ్ళు వస్తున్నాయి. పత్రికలు కూడ పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. వార్తా ప్రపంచం పరమ కాలుష్యంగా తయారై వాస్తవాలకు మసిపూస్తున్నారు. ప్రాంతం కులం, వర్గం,పార్టీలుగా చీలిపొయాయి. హైదరాబాద్ కే పరిమితమైన ఏఐ ఎం ఐ ఎం కూడ ఎప్పుడో సొంత పేపర్ ఇత్తెమాద్ పెట్టుకుంది. ఇన్నిన్ని చానళ్ళు, పత్రికలు, పార్టీలు వ్యక్తులచేతుల్లోకి వెళ్ళి ప్రాజాస్వామ్య స్ఫూర్తిని ఖూని చేస్తున్నాయి.నిజాలు నిలువునా పాతరవుతున్నాయి. కొద్దిరోజుల్లో మరిన్ని రసవత్తర ఘట్టాలకు తెరలేవనుంది.

No comments:

Post a Comment