Thursday, 7 March 2013


                               మహా భారతం కాదు.. మనది అవినీతి భారతం!!

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందో లేదో తెలీదు కాని మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదిలోనే మనం స్కాం భారత్ ను ఆవిష్కరిచుకున్నాం. 1947 ఆగస్టులో స్వతంత్రం వస్తే 1948 లో జవహరిలాల్ నెహ్రూ జీపుల కొనుగోలు కుంభకోణంతో అవినీతి భారతానికి శ్రీకారం చుట్టారన్న ఆరోపణలు మొదలయ్యాయి. ఆరోజుల్లో దుర్వినియోగమైన ప్రజాధనం 80 లక్షల రూపాయలట. నెహ్రూ ప్రధానిగా కొనసాగిన 17 సంవత్సరాల సమయంలో అంటే 1964 మే 27 వరకు ఆరుకుంభకోణాలు దిగ్విజయంగా జరిగాయి.1951 లో సైకిళ్ళ దిగుమతి, 1956లో బనారస్ హిందూ యూనివర్సిటీ నిధుల దుర్వినియోగం, 1958లో ముంద్రా ఒప్పందం.1960లో తేజ ఋణ కుంభకోణం ఆరోజుల్లో చాలా ఖరీదైనవిగా చరిత్రకెక్కాయి. 

1964లో ప్రతాప్ సింగ్ ఖైరాన్ మెడకు బిగిసిన కుభకోణం ఉచ్చు పెద్ద వివాదం లేపింది. నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న యేడాదిన్నర కాలంలో కళింగ ట్యూబుల అవకతవకలు దుమారం లేపాయి. ఇందిర రెండు విడతల్లో 15 సంవత్సరాలపాటు ప్రధాని పదవిలో ఉండగా నాలుగు భారీ కుంభకోణాలు నమోదై దేశాన్ని ఊపివేశాయి. 1971లో డిల్లీ ఎస్ బి ఐ శాఖలో ఇందిరాగాంధి స్వరంతొ అందుకున్న ఆదేశాలమేరకు బాంకి చీఫ్ కాషియర్ మళోత్రా నగర్వాలా అనే వ్యక్తికి 60 లక్షల రూపాయల బాంక్ నగదును అందజేసిన సంఘటన ప్రభుత్వాన్ని కుదిపివేసింది. ఆ కేసు దర్యాప్తు అధికారి, నగర్వాల్, ఉద్యోగం పోగొట్టుకున్న చీఫ్ కాషియర్ మళోత్రా విచిత్ర పరిస్థితుల్లో మరణించడంతో కేసు మూలన పడింది.

ఇందిరా హయాంలోనే 1974లో చోటుచేసుకున్న మారుతీ కార్ల కుంభకోణంతొ భారత్ వణకిపోయింది.ఆ అతరువాత 1976 లో కువో నూనె కొనుగోలు వ్యవహారంలో దేసం 2.2కోట్ల సొమ్ము నష్టపోయిందని గగ్గోలు పెట్టారు. 1981లో ఏ ఆర్ అంతులే మహారాష్త్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు జరిగిన సిమెంటు కుంభకొణం(రు.30కోట్లు) దేశవిదేశాల్లో బహుళ ప్రచారం పొందింది. ఆ కేసులొ అంతులే ముఖ్య మంత్రి పదవినే కోల్పోయారు.

ఆ తరువాత 1987లో జరిగినట్లు ఆరోపణలు మొదలై నేటికీ రావణకాష్టంలా సాగుతున్నది బోఫోర్స్‌కుంభకోణం. అందులో నేరుగా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి పాత్రపై తలెత్తిన అనుమానాలు నేటికీ నివృత్తికాలేదు. రెండేళ్ళ అనంతరం జరిగిన సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు పరిష్కారం కాకుండానే మరుగున పడింది. ఆ మరుసటి ఏడాదే వి పి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1990లో జరిగిన అయిర్ బస్సు కొనుగోళ్ళ వ్యవహార ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చింది. 

ఇక నాటినుంచి స్కాములభారతం దినదిన ప్రవృధ్ధమానమై నిన్న కాగ్ కొర్రు కాల్చి వాతపెట్టిన వ్యవసాయ ఋణమాఫియా తో కలిపి మొత్తం 142 కుంభకోణాలు భారతదేశాన్ని ముంచి వేశాయి. కుంభకోణాల విషయంలో తరతమ బేధాలు లేకుంబ్డా అన్ని పార్తేఏలు, అన్ని రాష్ట్రాలు తలా ఒక చెయ్యి వేసి అల పైకి ఎగబాకి స్కాం భారతాన్ని ఆవిష్కరించాయి. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన బ్రహ్మచారి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీని కూడ కుంభకోణాల మసి వదలలేదు. అంతకు ముందు పివి నరసింహారావు ప్రధాని హయంలో 5 వేల కోట్ల రూపాయల మేరకు జరిగిన హర్షద్ మెహతా సెక్యూరిటీల కుంభకోణం తలమానికంగా నిలిచింది. 1994లో చక్కెర దిగుమతిలో భారీ అవకతవకలు జరిగిందని బయటకొచ్చింది. ఇక 1995 నుంచి నేటివరకు జాతీయ స్థాయిలోనే కాక రాష్ట్రాల స్థాయిలో జరిగిన భారీ కుంభకోణాలు దేశపరువును మంట కలిపాయి. 

అందుబాటులో వున్న గణాంకాల మేరకు. 1995, 96, 97 సంవత్సరాల్లో వరుసగా 12 భారీ కుంభకోణాలు (ఏటా నాలుగు)దేశంలో నమోదయ్యాయి. దేవగౌడ, ఐకె గుజ్రాల్ కూడా దేశాన్ని కుంభకోణాలనుంచి తప్పించలేక పోయారు. అయితే 2000 నుంచి 2004 వరకూ (వాజ్‌పేయీ) 10 సంఘటనల్లో అవకతవకలు జరిగిన విషయం రచ్చకెక్కింది.ఇక 2004 లో కేంద్రంలో యు పి ఏ ప్రభుత్వంలోకి వచ్చిన నాటినుంచి నేతివరకు ఇంతింతై, వటుడింతై నభో వీధిని నిలిచినట్లు..70 కుంభకోణాలతొ భారత్ వెలిగిపోతోంది. నేను సైతం కుంభకోణాగ్నికి సమిధనొక్కటి ధారపోస్తానన్నట్లు.. అన్నిరాష్ట్రాలు పాపంలొ పాలు పంచుకున్నాయి. 

కాంగ్రెసేతర ప్రభుత్వాలు తక్కువేమీ తినలేదు.బాగానే చేతివాటం ప్రదర్శించాయి. ఈ ఏడాది వెలుగు చూసిన అగస్టా హెలికాప్టర్ల ముడుపుల కుంభకోణం. తాజా వ్యవసాయ ఋణమాఫీలో అక్రమాలు ఇక ఎన్నాఎళ్ళు ప్రతిపక్షాలకు ఆయుధాలు కానున్నాయో. అక్షరక్రమంలో కంటే, అభివృద్ధిలోకంటే మనది మహా భారాతం కాదు అవినీతి భారతంగా పేరు పొందింది. వాములు తినే స్వాములకు పచ్చిగడ్డి ఫలహారమా!! అది పాత నానుడి. మనపాలకులు స్కాముల స్వాములు. గుడి, గుడి లింగమే కాదు ధ్వజస్తంభంకూడా మటుమాయం చేసే జాదూ రత్నలు.. అంధ్రప్రదేశ్ సంగతి వేరే ప్రస్తావించనక్కరలేదుగా!!

No comments:

Post a Comment