Monday, 11 March 2013                    రాష్ట్రంలో మటు మాయమైన బి.జె.పి.!!                                                     

రాష్ట్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పటిష్ఠంగా ఉన్న రోజుల్లో జనసంఘ్ కు అంకిత భావం గల కార్యకర్తల మద్దత్ ఉండేది, జనసంఘ్ అధికారంకోసం కాకుందా విలువలకోసం నిలిచింది.ఒంటరిగానే పోరాడింది. విద్యావంతులు. సౌమ్య ధోరణికల మధ్యతరగతి అభిమానులను సంపాదించుకున్నది. 1967లో జనసంఘ్ తరఫున ముగ్గురు అభ్యర్ధులు శాసనసభకు ఎన్నికయ్యారు. 1972, 1978 ఎన్నికల్లో అ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 1983 ఎన్.టి.ఆర్. ప్రభంజనంలో బి.జె.పి మళ్ళీ మూడు గెల్చుకుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ్ ఉద్యమ పేరిట టి.డి.ఫి కి మద్దతు ఇచ్చి మిత్ర పక్షమై ఎనిమిది సీట్లు దక్కించుకుంది. 85 ఎన్నికల్లో ఆర్ రవీంద్రనాథ్ రెడ్డి, ఏ నరేంద్ర,ఎన్ ఇంద్రసేన్ రెడ్డి, బద్దమ్ బాల్ రెడ్డి, ఆర్ శ్రీనివాస్ రెడ్డి, వి రాములు, వి జైపాల, సిహెచ్ విద్యాసాగర రావు శాసనసభలో ఆశీనులయ్యారు. 

1989లో ఆ సంఖ్య 5 కి దిగజారింది. 1994లో మళ్ళీ మూడేసుకుంది. 1999లో టి.డి.పి తో చేతులుకలిపి శాసనసభలో 12 కి ఎగబాకింది. ఆ సభలో కె హరిబాబు, ఎం ఏ వేమా, కోట శ్రీనివాస రావు, ఎం.ఎస్. పార్థసారధి, దాక్టర్ కె లక్ష్మణ్, ఎన్ ఇంద్రసేన రెడ్డి, ప్రేంసింఘ్ రాథోర్, జి రామకృష్ణారెడ్డి, టి వి రమణాఎడ్డి, ఎం. ధర్మారావు, కె సత్యనరాయణ, ఆర్ రవీంద్రనాథ్ రెడ్డి ఎన్నికై ప్రభంజనం సృష్టించారు. 2004, 2009 ఎన్నికల్లో రెండేసి స్థానాలకే పరిమితమైంది. టి.డి.పీ కి దూరమై 2004, 2009 ఎన్నికల్లో రెండుకే పరిమితమైంది. గత ఏదాది తెలంగాణా ఉద్యమ పుణ్యాన మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలఓ పిల్లి పోరు పిల్లి పోరు పిట్ట తీర్చినట్లుగా అక్కడ బి.జె.పి గెలుపు సాధించింది. జాతీయస్థాయిలో 1980 లో బి.జె.పి. ఏర్పాటువరకు జనసంఘ్ గా ఉన్నా కేంద్రంలో అధికారంకోసం కాంగ్రెస్ తో తలపదలేదు.

విలువల ప్రాతిపదికపై బి జె పి 1984 ఎన్నికల్లో దేశం మొత్తం లో రెందేసీట్లు గెల్చుకోగా, అందులో ఒకటి హనుమకొండ కావడం విసేషం.అ దే పార్టీ 1989 ఎన్నికల్లో 88 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. 1991 జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం గా ఎదిగింది. 1996 లో వాజ్‌పేయీ నేతృత్వంలో 13 రోజులపాటు కేంద్రంలొ ప్రభుత్వం నడిపే సత్తా సాధించింది. మళ్ళీరెండు పర్యాయాలు, 1998, మార్చ్ 13 నుంచి 1999 అక్టొబరు 13 వరకు, తిరిగి 13 అక్టొబరు 99 నుంచి 2004 మే 13 వరకు రెండు దఫాలుగా బి జే పి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది.

రాష్ట్రం నుంచి బండారు దత్తాత్రేయ వరుసగా సికిందరాబాద్ నుంచి మూడు పర్యాయాలు లోక్ సభకు ఎన్నికై మూడు సార్లు మంత్రిగా శాఖలు నిర్వహించారు. 1999 లో రాష్త్రం నుంచి ఏడుగురు బి జె పి ఎమ్‌పీలుగా ఎన్నికై నలుగురు కేంద్రమంత్రులయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో బి,జె,పి జాతకం తల్లకిందులైంది.ఆ పార్టీ రెంటికీ చెడ్డా రేవడ మాదిరి తయారైంది. పార్లమెంటులో నేడు బిజెపి ఒక్క సీటు కూడా దక్కించుకోలేని స్థితికి చేరుకుంది. ఒక నాదు మేధావుల పార్టీగా పేరొందిన బిజెపిని నేడు నిస్సత్తువ ఆవరించింది. ఈ పరిస్థితికి కారకులెవరు? బి.జె.పి జవసత్వాలు వస్తాయా? మోడీ నామ స్మరణమిణహా రాహుల్ నుంచి దేశాన్ని రక్షించు కునేందుకు తరుణోపాయమ ఉందని ఆ పార్టీ నేతలు ఊహిస్తున్నారా? ఇందులో వెంకయ్య నాయుడు బాధ్యత ఎంతవరకు నిర్వహిస్తారు? రాష్ట్రంలో బి.జె.పి. నాయకులు ఏమిచేస్తున్నారు? ఏమి చెయ్యాలనుకుంటున్నారు?

No comments:

Post a Comment