Sunday, 24 March 2013    అందరికీ అభి(నం)వందనలు 

25-13-2013

7AM

ఈనాటి ఈ బంధాలు, అనుబంధాలకు, అనురాగం, ఆప్యాయతలకు ఊపిరి, ప్రాణం "అచ్చంగాతెలుగు" బృందం. తెలుగు మధురాతి మధురం. ఆ తియ్యదనాన్ని రుచి చూపించి భాషపై మరింత ఆసక్తి రేపి, నడకను పరుగులు తీయించింది చెల్లెలు చి.ల.సౌ. భావరాజు పద్మిని. బంధుత్వం చెల్లెలైనా నాపట్ల ఆమెది మాతృహృదయం. ఆమె మాటకు ఆమె కుటుంబానికి నేను కట్టుబడిఉంటాను.

ఆమె ద్వారా ఎందరో మహనీయులు, దైవసమానులు, గురుదేవుల పరిచయ భాగ్యం కలిగింది. సహచర్యం లభించింది. ఆ పరిచయ బీజాలు పాతుకుపోయి వట వృక్షమైంది. సంబంధాలు శాఖోపశాఖలుగా విస్తరించి రాష్త్రం దేశం ఎల్లలు దాటి ఎందరో ఆప్తులయ్యరు. పెద్దలు, మేధావుల ఆశీర్వచనాలు అందుకోవడం పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఈరోజు నా జీవితంలో ఒక మధురమైన రోజు. ఇన్నేళ్ళ జీవితంలో, ఎన్నో పుట్టిన రోజులు జరుపుకున్నా..ఇంతమంది ఆత్మీయులు, ఆప్తులు, సహృదయుల శుభాకాంక్షలు అందుకోవడం ఇదే ప్రథమం. నిజంగా జన్మ ధన్యం. గురువర్యుల దీవనలు మరింత మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచాయి. నేను, నా భార్య శ్యామల, కుమార్తె మేఖల అందరి ప్రేమానురాగాలకూ బధ్ధులం.
పుట్టుకతో జన్మ సార్ధక్యం సాధించినట్లు కాదు. మనవలన ఎవరికైనా ఈషణ్మాత్రం ప్రయోజనం చేకూరినా, మనోధైర్యం లభించినా, నలుగురికి ఆత్మీయత పంచిపెట్టగలిగితే కొంతమేరకైనా జన్మ నిరర్ధకం కానట్లు భావించవచ్చు. కేవలం డబ్బు సంపాదన తృప్తి, పరిపూర్ణతనివ్వదు. పదిమంది ఆప్యాయత, అనురాగం, ఆదరణ, ఆశీస్సులు పొందితే ఆ హృదయానందం, మానసికోల్లాసం, అనుభూతి అనిర్వచనీయం. హృదయం నవనీతమైతే మాట మంచిగా వస్తుంది. మాట మంచిదైతే మనసులుకలతోపాటు మనుషులు కలుస్తారు. ముఖ పరిచయాలతో సంబంధం లేకుండానే ఒకసారి కలసిన మనసులు శాశ్వతంగా పెనవేసుకుపోతాయి.
వయసు తారతమ్యం ఎవరికీ ఆటంకం కాలేదు. 17 సంవత్సరాల వయసు మొదలు 71 సంవత్సరాల వరకూ స్త్రీ, పురుష భేదంలేకుండా నాకు ఎందరో సన్నిహితులైనారు. అందరూఏదో ఒక బంధుత్వం పెంచుకున్నవారే. తాతయ్య, పెదనాన్న, బాబాయి, మామయ్య, అన్నయ్య.. అందరూ ఏదో ఒక బాంధవ్యంతో పిలిచేవారే. ఒక్కరోజు కొందరితొనైనా సంభాషించకపోతే అదేదో వెలితి భావన ఏర్పడతం మొదలైంది. చాట్ బాక్స్ లో, సెల్ ఫోన్‌లో, ఇ-మెయిల్, ద్వారా నాకు చెల్లెల్లు, తమ్ముళ్ళు, హితైషులు, ఉన్నందుకు గర్వపడుతున్నాను.ఒక్కరి పేరు చెప్పి మరొకరి పేరు చెప్పకపోతే నేను అన్నింటా అనర్హుదనఔతాను.
వ్యక్తిగత మిత్రులు, వృత్తిమిత్రులు, బాల్య స్నేహితులు ఒక భాగం. అంతర్జాల మిత్రత్వం ఏడాదిన్నరలో నాకు దాదాపు 200 మందికి పైగా ఆప్తులను బహూకరించింది. గడచిన 24 గంటలుగా శుభాకాంక్షల అమృత వర్షధార కురిపిస్తునే ఉన్నారు. ఎన్నెన్ని శుభాకాంక్షలు, ఎన్నెన్ని పుష్పగుచ్ఛాలు, ఎన్నెన్ని ప్రార్ధనలు, ఎన్నెన్ని కవితలు, ఎన్నెన్ని హితవాక్యాలు.. అభిమాన పలకరింపులు.. ఈరోజు నా బంధుగణంలో(కుటుంబం) ఏఒక్కరికీ నా పుట్టినరోజు గుర్తులేదు. ఈ పుట్టిన రోజు శుభాకాంక్షలు, దీవెనలు అందజేసినవారికి నా కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞ్తలు

No comments:

Post a Comment