Monday, 8 April 2013

  ఎప్పుడైనా...ఎక్కడైనా, ఏ రాష్ట్రానికైనా మనకు పట్టిన  


         ఇంతటి దుర్గతి..  అధోగతి పట్టిందా? 


ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, అసలు ఎప్పుడైనా...ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా మనకు పట్టినంతటి దుర్గతి.. కాదు కాదు, అధోగతి పట్టిందా? ఇందరు మంత్రులు, రాజకీయ తాబేదారులు, అధికారులు నెలలు, ఏళ్ళ తరబడి జైళ్లలో మగ్గుతున్నారంటే కారణం అవినీతి కదా. ఒక కేంద్ర ప్రభుత్వ నేర దర్యాప్తు సంస్థ, దేసంలొ అత్యున్నత న్యాయస్థానం (అక్కడ, ఇక్కద) పాలకపక్షంలొని బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారిని ఘోర అవినీతికి బాధ్యులు చేసి ఆరోపణలు గుప్పించి కటకటాల వెనుకకు నెట్టడం ఎంత సిగ్గు మాలిన తనం.ఆరుగురు మంత్రులను సుప్రీం కోర్టు నోటీసులిస్తే తలేత్తుకుని ఎలా తిరుగుతున్నారో? వెంటనే రాజీనామా చేయకుండా తమ నేరాలను మాఫీ చేసుకునే ప్రయత్నాలకు పదును పెట్టుకుంటూ ఆ మంత్రి పదవుల్లో ఎలా కొనసాగుతున్నారు.
ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు నేరస్థులుగా ముద్రపదద్దం వారిని ఎన్నుకున్న ఆ ప్రజలకెంత అవమానం. ఒక రాష్ట్ర డిజిపి పై అదే స్థాయి మరో ఐ పి సి అధికారి అవినీతి ఆరోపణలు చేయడం, ఆ నేరారోపణ చేసిన అధికారి ఫోర్జరీ నేరారోపణను న్యాయస్థానంలో ఎదుర్కుంటుండడం ఈ రాష్ట్రానికే ఎంత అవమానకరం. డిజిపి నియామకమే అసంబద్ధమని కోర్టు పేర్కోనడం పాలనా వ్యవస్థకు, ప్రభుత్వానికి సిగ్గు పోయినట్లు లేదా? సి బి ఐ అదొక సీరియల్ కథమాదిరి అయిదు చార్జిషీట్లు దాఖలుచేసి సాక్షాత్తు హోం మంత్రినే నిందితురాలుగా చెప్పడం ఈ ప్రభుత్వానికి తల తీసినత్లు, ప్రాణం పోయినట్లనిపించడం లేదా! ఐదో చార్జిషీట్లో జగన్, విజయ సాయి రెడ్డి, పునితా దాల్మియా, సబిత, శ్రీలక్ష్మి, రాజగోపాల్, దివాకర్ రెడ్డి, సంజయ్ మిశ్రా, నీల్ కమల్, జయదీప్, రఘురాం సిమెంట్స్, ఈశ్వరి సిమెంట్స్, దాల్మియా లను నిందితులుగా చేర్చింది. వీరు గాక ఇప్పటికే మంత్రులు పార్థసారధి, పొన్నాల, గీతారెడ్డి, కన్నా లక్ష్మినారయణ వేర్వేరు ఆరోపనలు ఎదుర్కోంటూ ఇంకా పదవుల్లొ సాగడం మన ప్రజా స్వామ్య విలువలను పాతరేయడం కాదా?

ఒక ముఖ్యమంత్రి నేరుగా బంధు ప్రీతికి, ఆశ్రితజన పక్షపాతానికి పాల్పడ్డాడని నేరుగా ఆరోపించడం ఈ రాష్ట్రానికి వన్నె చేకూరుస్తుందా? అసలు కీలక వ్యక్తులు, సూత్రధారులు, పాత్రధారులు ఇంకా చట్టం పరిధిలోకి రాకుండా తప్పించుకుంటునే ఉన్నారు. దీనికి తోడు మరో నిష్ట దౌర్భాగ్యం ఏమిటంటే, పత్రికా యజమానులు, వివిధ స్థాయిల్లోని సిబ్బంది అనేక నేరారోపణలపై జైళ్ళకు వెళ్ళారు. మరి కొందరు బయట ఉన్నారు. 62 పజీల అయిదో చార్జిషీట్లో 13 మందిని నిందితులుగా, 42 మందిని సాక్షులుగా పేర్కొన్నది.

66 సంవత్సరాల స్వతంత్ర భారతావనికి ఈ ఘట్టం చెరగని మచ్చగా మిగిలింది. నిజంగా, మరింత నిఖార్సుగా సి.బి.ఐ. దర్యాప్తు జరిగితే మరెందరు కటకటాలవెనుకకు పోతారో? ఎన్ని జైళ్ళు నిండుతాయో? ఈ కేసులు ఎప్పటికి నిగ్గుతేలి నేరస్థులకు ఎప్పుడు ఎంత శిక్ష పడుతుందో.. ఆ భగవంతునికే ఎరుక..అదను కోసం గోడ దూకేందుకు మరిన్ని పిల్లులు క్యూలో ఉన్నయిట. ఈ చారిత్రాత్మక వాస్తవాలు బయటకు రాకుందా కొన్ని పత్రికలు, కొందరు పాత్రికేయులు మసిపూసేందుకు సిద్ధమవుతుందగా వైరివర్గంలో పత్రికలు, పాత్రికేయులు కొత్త కథనాలతొ వంటకాలు వడ్డించి రంగులు పులిమి ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అయోమయంలో పడవేసేందుకు ఎత్తులు, పైఎత్తులకు రెడీ అవుతున్నాయి.

ఏళ్ళకిందటే ఈ అవినీతి భాగోతానికి పునాదులు వేసి, ఇప్పుడు సుద్దపూసల్లా బయటకూర్చుని ప్రజలకు టోపీ పెట్టి, తాము బయటపడి చేతులు కడుక్కునేందుకు పాత పాలకులు ఆడుతున్న నాటకాలనూ ప్రజలు గమనిస్తునే ఉన్నారు. ప్రజలు అమాయకులు, వెర్రి గొర్రెలనుకుంటె సమయం చూసి కొర్రు కాల్చి సరైన వాతలు పెట్టి రోగాలు కుదురుస్తారు.

No comments:

Post a Comment