Saturday 27 April 2013



              భలే మంచి రోజు.. పసందైన రోజు.. 
                     






ఏప్రిల్ 27,2013 శనివారం. ఈ రోజుకి ఎంత ప్రాముఖ్యత. రాష్ట్ర చరిత్రలో ఇంతటి శుభ ఘడియలు స్వాతంత్ర్యానంతరం ఎప్పుడూ వచ్చి ఉండవు. గురువారం అర్ధరాత్రి గ్రహణ విడుపుతో సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తలుపులు తెరుచుకుని జనం భగవంతుని దర్శించుకుని ఊపిరి పీల్చుకున్నారు.

24 గంటలు గడిచాయో లేదో రాష్ట్రంలో పంచగ్రహ కూటమి ఏర్పడింది. ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. విపత్తులు ఒకదాని వెంట కాకుండా ఒకేసారి నెత్తిన పడితే ఎలా? అసలే ఎండలు మండుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అగ్నిప్రమాదాలు. కర్మాగారాల్లో పేలుళ్ళు. కరెంటు కొరతకు తోడు చార్జీల వాత, పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు ఇంకిపోయి రిజర్వాయర్లలొ నీటి నిల్వలు దిగ జారాయి. ప్రభుత్వాసుపాత్రులు అనారోగ్యంతో కునారిల్లి పోయాయి. మహిళలకు రక్షణ శూన్యం. పిల్లల కిడ్నాప్ లు, దారుణ హత్యలు. నిత్యావసర సరుకుల ధరలూ ఆకాశంలో. చివరాఖరికి సినిమా టిక్కెట్ల ధరలూ చుక్కలనంటాయి.

పులిమీద పుట్రలా.. ప్రజల బాధలు వొదిలేసి.. యాత్రా స్పెషళ్ళ ప్రారంభ, ముగింపు, వార్షికోత్సవాల వేడుకల్లో నేతలు తలనిండా మునిగారు. జనం బాధలు కాదు. అన్ని పార్టీలది అధికార ఆకాంక్ష..

*మాజీ ముఖ్యమంత్రి, టిడిపి శాశ్వత అధ్యక్షుడు చంద్రబాబు మీకోసం 2817 కిమీ పాదయాత్ర ముగింపు పండుగ విశాఖలో అట్టహాసంగా.

*ముఖ్యమంత్రి కిరణ్ సహచర మంత్రులతో కరీంనగర్ వంగరలో ఇందిరమ్మ ఉత్సవం.

*ప్రారంభంకాని వైఎస్సార్ రచ్చబండకు వైఎస్సార్సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ (మాజీ)ఆడబడుచు సబితమ్మ అత్తిల్లు చేవెళ్ళనుంచి శ్రీకారం.

*తెలంగాణ ప్రాణంగా ఏర్పడ్డ టి ఆర్ ఎస్ అవిర్భావ పుష్కరోత్సవం గులాబి గుభాళింపు ఆర్మూరులో.

*తెలంగాణ సాధన కోసం జె ఎ సి నాయకత్వంలో బి జె పి ఆతిధ్యంలో డిల్లీలో సంసద్ యాత్రకు సెకిందాబాద్ నుంచి కదలిన రైలు చక్రాలు..

ఇంతకంటే రాష్ట్ర ప్రజలకు అదృష్టం ఏమైనా ఉంటుందా? జన్మలు ధన్యం

No comments:

Post a Comment