Tuesday, 16 April 2013


మరణించినవారిపై వ్యాఖ్యలు సముచితమా?
పాత్రికేయులకు తగునా!

ద హిందు (హైదరాబాద్)డిప్యూటి ఎడిటర్ దివంగత రాజేంద్రప్రసాద్ రాసిన అంగ్ల పుస్తకాలకు తెలుగు అనువాదాలు నిన్న రాష్ట్ర రాజధానిలో ఆవిష్కృతమయ్యాయి. మర్రి చెన్నారెడ్డి డిసెంబరు 2, 1996 లో చెన్నైలో మరణించారు. అంటే అయన మరణించి 16 సంవత్సరాలైంది. అదే మాదిరి రాజేంద్రప్రసాద్ జనవరి 26, 2006 న మృతిచెందారు. చెన్నారెడ్డి మరణనించిన పదేళ్ళతరువాత మృతిచెందిన రచయిత ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు ప్రస్తావించవలసి వచ్చిందో తెలియదు.అయితే చెన్నారెడ్డిని అవినీతిపరుడని డిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన విలేకరి వార్త రాశాడుట. అయితే ఆ విలేకరి నిజాయితీ ఏమిటో అర్ధం కాలేదు. 

రాజకీయ నాయకుల అవినీతి ప్రపంచానికి తెలిసిందే, కొత్తేమీ ఉండదు. అయితే ఆ అవినీతి నాయకులతో రాసుకు, పూసుకు తిరిగి, అన్ని రాజోపచారాలు అందుకుంటున్న పాత్రికేయుల నీతి, నిజాయితీ ఎవరు చెప్పాలి. విలేకరుల అవినీతి చరిత్ర ఎవరు బయట పెట్టాలి. 

"ఢిల్లీ నుంచి సండే మ్యాగజైన్ విలేకరి చెన్నారెడ్డి గారిపై వ్యాసం రాయడానికి హైదరాబాదు వచ్చారు. అతిధి గృహంలో బస, తిరగడానికి కారు, తోడుగా ఒక అధికారి ఇలా నాలుగు రోజులపాటు రాష్ట్రంలో విలాసవంతంగా తిరిగి, ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసి ఆయన గారు ఢిల్లీ వెళ్ళిపోయారు." డిల్లీ నుంచి వచ్చిన విలేకరికి ఆశించిన మూట అందలేదేమో!! మూటలు అందుకుంటున్న విలేకరులు ఊసరవెల్లులు మాదిరి రోజులో ఎలా మాటలు (రంగులు) మారుస్తున్నారో నిత్యం చూస్తునే ఉన్నారు ప్రజలు. చెన్నారెడ్డి తరువాత వచ్చిన సి ఎం లు స్ఫటిక సదృశ పరిశుద్ధులా?? 16 సంవత్సరాల కాలంగా తెలుగు నేలపై కొందరు వీర విలేకరుల చరిత్రలు తెలుసుకదా!! బాబు, వైఎస్సార్ నిజాయితీపరులా?? బాబు హయాంలో, వైఎస్సార్ హయాంలో కోట్లకు పడగలెత్తిన ఘనులు మన ఎదుటనే ఉన్నారు..

రాజేంద్రప్రసాద్ గారిపైకూడా విమర్శలు ఉన్నాయి కానీ మరణించిన వారిపై దిగజారి వ్యాఖ్యలు చేయడం సంస్కారం కాదు. ఆయన మాదిరే, ఆయనకు అత్యంత సన్నిహితుడిగా మెలగి మూడేళ్ళకిందట మరణించిన మరో గొలుసు ఆంగ్ల దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ పై గ్రంధాలే రాయచ్చు. ఆయన మృతిచెందితే ఆ సంస్థ సిబ్బందే ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళలేదు. ఆ పత్రికకు చెందిన పాత్రికేయులే ఆయన అవినీతి భారతంపై పుస్తకం ప్రచురించారు. ఆయన చలవ వలన రెండు గొప్ప పత్రికలు నిర్జీవంగా తయారయ్యాయి. ఆయన కారణంగా 50 మందికి పైగా పత్రికా సిబ్బంది ఉద్యోగాలు పోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆయన చనిపోతే ఆ కుటుంబాలు పండుగ చేసుకున్నాయి. .

2 comments:

  1. రాయవచ్చ ? రాయకుదడా ? అంటే ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది కాని నిజం అనేది ఎక్కడో ఒక చోట రికార్డ్ కావాలి

    ReplyDelete
  2. చేసిన తప్పులు మరణించడంతో మానిపోవు, తప్పుకుండా నిజాలని వెలికితీయాలి,వ్యక్తిగతంగా వ్యాఖ్యానించకూడదు.

    ReplyDelete