Monday 24 December 2012

పివి ని విస్మరించిన మన గజన నేతలు

తెలుగుతల్లి అనుంగు ముద్దుబిడ్డడు, బహుభాషా కోవిదుడు, విదేశీ, ఆర్ధిక, మానవ వనరుల వ్యవహారాల్లో విశేష ప్రజ్ఞావంతుడు మాజీ ప్రధాని ఫై వి నరసింహారావు దివంగతులై ఎనిమిదేళ్ళు పూర్తయింది. ఆయన పేరుచెప్పుకుని కాంగ్రెస్స్ పార్టీ అయిదేళ్ళు బతికింది. అయన మృతి చెందినతరువాత పార్టీ కూడా దేశంలో మృత ప్రాయమయింది. ఆయనను తలచుకుంటున్న కాంగ్రెస్స్ నాయకుడే లేదు. ఎనిమిడి వత్సరాలు గడచినా దేశంలో, రాష్ట్రంలో ఆయన మృతి చిహ్నం నోచుకోలేదు. తెలుగు వెలుగును ప్రపంచం నలుదిశల వ్యాపింపజేసిన ఆ మహనీయునికి ప్రపంచ తెలుగు మహాసభలు సైతం ఘనంగా నివాళులర్పించే ఒక్క కార్యక్రమం కూడా మూడురోజుల పండుగలో నిర్వహించక పోవడం పాలకుల నిర్లఖ్యానికి అడ్డం పడుతున్నది. ఫై వి మృతిని, ఆయన దహన సంస్కారాలను సైతం మన నాయకులు నీచ రాజకీయాలకు ఉపయోగించుకున్నారు. ఎనిమిదేళ్ళ కిందట "ప్రజా తంత్ర" వార పత్రికలో నేను రాసిన రాజకీయ వ్యాసాన్నిమిత్ర్హుల కోసం మరోసారి  గుర్తు చేస్తున్నాను..


1 comment:

  1. మన హోంశాఖామాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆశీస్సులతో హైదరాబాద్‌ అలకాపురి(నాగోలు)లో సంకేపల్లి సుధీర్‌రెడ్డి-అధ్యక్షులు, కొఠరు రామారావు-కార్యదర్శిగా ఏర్పాటైన 'పి.వి.ప్రస్థాన్‌'వారు 25-12-2012 నాడు శ్రీమతి సబితగారు ముఖ్య అతిథిగా, శ్రీ రాపోలు ఆనందభాస్కర్‌ గారు, గౌరవ అతిధిగా, శ్రీ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విశిష్ట అతిధిగా జరిగిన సభలో మాన్యులు శ్రీ పి.వి.నరసింహారావు గారికి ఘనమైన నివాళి అర్పించి, అలకాపురి క్రాస్‌రోడ్స్‌(రాఘవేంద్ర హోటల్‌ సెంటర్‌ రింగ్‌రోడ్‌) వద్ద శ్రీ పి.వి.గారి నిలువెత్తు విగ్రహావిష్కరణ జరిపి, ఆ రహదారికి 'పివిమార్గ్‌' అని పేరుపెట్టారు. వారికి నివాళిగా ఆ సందర్భాన డా.కడిమిళ్ళ వరప్రసాద్‌ గారిచే అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు.

    ReplyDelete