Thursday 14 February 2013


తల్లీ! పద్మినీ మీ కుటుంబానికి ఆ సీతారాములు, పవనసుతుని ఆశీస్సులు

మనసంతా ఆనంద తరంగాలపై ఓలలాడుతున్న శుభ తరుణాన ఒక  విషయం. ఈ రోజు మా కుటుంబం లోని ముగ్గురి హృదయల్లో మూల విరాట్టు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పద్మిని. "పద్మిని, మా నందిరాజు కుటుంబ పెద్దాడపడుచు". మా అందరి కంటి వెలుగు. వయసున  చిన్నదైనా ఆమె మా అందరికీ నిజంగా ఒక మార్గదర్శకురాలు. కష్ట సుఖాల్లోనే కాదు... మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్నివిధాలుగా పద్మిని మాకు కొండంత అండ..  మాకు జగద్గురు  ప్రసాదించిన గొప్పవరం ఆమె. సద్గురు దర్శన భాగ్యం కూడా మాకు పద్మిని కల్పించిన మహదవకాశమే.  ఎందరో పెద్దల సహచర్యం కూడా ప్రాప్తించింది.  

నాకు ఇందరు చెల్లెళ్ళు ఉండడం ఎంతో గర్వకారణం. అన్నయ్యంటే చెల్లెళ్లకి ఎంత ప్రేమో! ఆప్యాయంగా పలకరించి, ఆత్మీయతను పంచి ఇచ్చే ఇంతమంది ఆడపడుచులు తోడు నీడగా ఉన్నారని  నా భార్యకు ఎంత సంతోషమో.. ఇంతమంది మేనత్తలున్నారని మా అమ్మాయికి అంత ఆనందం. ఇంతమంది ఆత్మీయులను, ఆప్తులను మాకు చేరువ చేసింది మా ఇంటి పెద్దాడపడుచు పద్మిని.  సతీష్ పద్మిని దంపతులు, చిరంజీవులు అనూష, సమీరకు ఎల్లవేళల భగవత్ కటాక్షం, సద్గురు దీవెనలు ప్రసరించాలని, సర్వ విజయాలు చేకూరాలని మా ముగ్గురి మనఃపూర్వక ఆకాంక్ష.



1 comment:


  1. Padmini Bhavaraju మీరు ఇలా మాటి మాటికి పొగుడుతుంటే, నేను హనుమంతుడిలా ఉబ్బిపోతున్నాను. ఎవరిని , ఎక్కడ ఎలా కలపాలో అంతా భగవత్సంకల్పం. ఆయన చేతి బొమ్మలం...ఆయన ఆడించినట్లు ఆడాలిగా. ఒక్కటి మాత్రం త్రికరణ శుద్ధిగా చెప్పగలను . ఒక చేత్తో తీసుకుంటే , మరో చేత్తో ఇస్తాడు ఆ దయామయుడు. నిజమయిన ప్రేమ లోని తియ్యదనం భగవత్ ప్రేమకు నోచుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మీ అభిమానానికి ధన్యవాదాలు అన్నయ్యా.
    26 minutes ago · Like

    ReplyDelete