Friday 14 June 2013

శ్రీమద్భాగవత ప్రాశస్త్యం..





లోకంలో మహాభాగవతానికి ఉన్న ప్రసిద్ధి సామాన్యమైనది కాదు. "ఈ మహా గ్రంధం ఆసేతుశీతాచల వ్యాప్త పండిత మండలీ కంఠస్థగిత విపుల మణిహారమై, నానా మత ప్రస్థాన సిద్ధాంతావిరుద్ధ ప్రమాణ తర్క సాధనోపాలంభ పూర్వక దుర్విగాహ భక్తి స్వరూప నిరూపణ ఫల వ్యాచి ఖ్యాసువులకు ఆలవాలమై, గీర్వాణ వాణీ తరుణారుణ చరణారవింద మరందాస్వాదలోల హృన్మత్త మిళింద చక్రవర్తులచే బహుభాషలలోనికి అనూదితమై, మోక్షాభిలాషుల మనస్సులలో భద్రముద్రాంకితమై, నిజానికి పురాణమంటే ఇదేనన్నంత అవిరళమైన ప్రచారాన్ని గడించింది. ..

ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహించిన ఈ ఉద్గ్రంధం భారతదేశంలోని సారస్వతేయుల మహాప్రతిభకు ప్రధమోదాహరణమై శాశ్వతంగా నిలిచి ఉంటుంది.  పరీక్షన్మహారాజు ( పాండవ మధ్యముడైన అర్జునుని మనుమడు) ఒక బ్రాహ్మణునిచే శాపగ్రస్తుడై ఏడు దినములలోపు మరణిస్తాడని తెలిసి తన రాజ్య విధులన్నీ పక్కనబెట్టి ప్రతీ జీవి యొక్క అంతిమ లక్ష్యాన్ని తెలియగోరాడు. అదే సమయంలోనే తను సంపాదించిన అపార జ్ఞాన సంపదను ఎవరికి భోదించాలో తెలియక, ఒక మంచి శిష్యుని కోసం వెతుకుతున్న శుకుడు అనే ముని రాజుకు తారసపడి ఆ రాజుకు భోదించడానికి అంగీకరిస్తాడు. ఈ సంభాషణ ఎడతెరిపిలేకుండా ఏడు రోజులపాటు కొనసాగింది. ఈ వారం రోజుల సమయంలో రాజుకు నిద్రాహారాలు లేవు. ఒక జీవి యొక్క అంతిమ లక్ష్యం, నిత్య సత్యమైన భగవంతుడు శ్రీకృష్ణుడు గురించి తెలుసుకోవడమేనని వివరిస్తాడు.

ఇది భగవంతుని కధ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కధగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాధ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంధంలో పేర్కొన్నారు.  ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కధను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంధస్తం చేసినట్లుగాను ఈ కధ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను "స్కంధాలు" అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాధలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి.

శ్రీమద్భాగవతమును శ్రీ వేదవ్యాసుల వారు వేల సంవత్సరముల క్రితము సంస్కృతమున రచించినారు. దీనిని వారు భాగవత పురాణమని మనకు అందించినారు. శ్రీ కృష్ణ భగవానులు తమ శరీరమును విడిచిన తరువాత, యావత్ భారతీయులకు వారి లీలలను గాథలను స్మరింపచేసి, మానవుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో తోడ్పడిన పవిత్ర గ్రంథములలో శ్రీమద్బాగవతము ప్రప్రథము అనుట అతిశయోక్తియే కాదు.

భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని ౨౧ (21) అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము. ఇది మొత్తము ద్వాదశ (12)స్కంధములుగా విభజించబడినది. భగవంతుని దివ్య స్వరూపం భాగవతంలో ఒకచోట ఇలా వర్ణించబడింది. తేజోమయాలైన ఆయన కన్నులు సమస్త సృష్టికి మూల స్థానాలు. సూర్యాది సకల గ్రహనక్షత్రాలు ఆయన కనుగ్రుడ్లు. అన్ని దిశలా వినగలిగిన ఆయన చెవులు సకల వేదనాదాలకు నిలయాలు. ఆయన శ్రవణం ఆకాశానికి, శబ్దానికి ఆదిస్థానం. భాగవతంలో విష్ణువు యొక్క 25 అవతారాల లీలలు వర్ణించారు.  పరమ భాగవతోత్తముడు అయిన బమ్మెర పోతన మహాకవి శ్రీ కృష్ణ ద్వైపాయన విరచిత శ్రీమద్బాగవతమును తెలుగున రచించినారు. తెలుగు భాషలో రచింపబడిన గ్రంథాలలో శ్రీ మదాంధ్ర భాగవతము అతి ప్రాముఖ్యము మరియు అనిర్వచనీయ భక్తి రస సమ్మిలితము.

పరమ భాగవతోత్తముడు అయిన బమ్మెర పోతన మహాకవి శ్రీ కృష్ణ ద్వైపాయన విరచిత శ్రీమద్బాగవతమును తెలుగున రచించినారు. తెలుగు భాషలో రచింపబడిన గ్రంథాలలో శ్రీ మదాంధ్ర భాగవతము అతి ప్రాముఖ్యము మరియు అనిర్వచనీయ భక్తి రస సమ్మిలితము.  15వ శతాబ్ధిలో బమ్మెర పోతన, అతని శిష్యుడు వెలిగందల నారయ, ఇంకా గంగన, ఏర్చూరి సింగన కలిసి ఆంధ్రీకరించిన భాగవతానికి తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉంది. పోతన రచనా శైలి, భక్తి భావం, పద్యాలలోని మాధుర్యం తెలుగునాట బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. దీనిలో ఎన్నో పద్యాలు నిత్య వ్యవహారంలో ఉదాహరింపబడుతున్నాయి.

ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఒక ప్రచురణ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఒక ప్రచురణ సాధారణంగా అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తెలుగులో భాగవతానికి, సంబంధిత పురాణాలకు సంబంధించిన పెక్కు రచనలు సంప్రదాయ సాహితయంలోను, ఆధునిక సాహిత్యంలోను, జానపద సాహిత్యంలోను ప్రముఖ స్థానం వహిస్తున్నాయి.  ఈ లోపలి కాలములొ అనేక భాషలలో సామాన్య జనులకు కూడ అర్థం అయ్యేలా ఎందరో మహానుభావులు రచనలు, కీర్తనములు రచించారు. వారిలో శ్రీ మీరా బాయి, శ్రీ సూర్ దాసు, శ్రీ భక్త జయదేవ, శ్రీ లీలాశుకులు కొందరు. దేశమునకు చెందిన ఆర్ష సాంప్రదాయీకుడు.

No comments:

Post a Comment