Thursday 13 June 2013




                   ఇదీ మన అసెంబ్లీ తీరు..


నడవని శాసన సభసమావేశాలపై పద్నాలుగు టీవీల్లో నిరంతరాయంగా సోది భాగోతం. మధ్య మధ్యలో లాబీఇంగ్ (పైరవీ) విలేఖర మేధావుల విశ్లేషణలు. ప్రజాస్వామ్యం-పాత్రికేయం జంటగా గంగలో కలసిపోయాయి. పాత్రికేయులు ఎమ్మెల్యేలు (పార్టీలకు అతీతంగా) గుంపులు గుంపులుగా గూడుపుఠానీలు. ముఖ్య విలే-ఖరులు ముఖ్యమంత్రి చేంబర్ వద్ద గుమిగూడి మంత్రులు, ఎమ్మెల్యేలతో పిచ్చాపాటీ. సభ్యులు సభలోపల ఉండరు. విలేఖరులు గ్యాలరీలో ఉండరు. 

దేశంలో ఏరాష్త్ర అసెంబ్లీలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో "త్రిశంకు స్వర్గం". సభ్యులు చర్చించేది, వాదించేది, నిలదీసేది, విమర్శించేది సభలో కాదు.బయటకొచ్చి మీడియాతో. అందుకే అందరినీ వెలివేసినట్లు అసెంబ్లీ భవనం వెనుక సభకుమించి ప్రభుత్వం ప్రత్యేకంగా మీడియా పాఇంట్ ఏర్పాటుచేసింది. పాతికపైబడి చానల్ కెమేరాలు, వాటి కెమేరా ఆపరేటర్లు, వాటి విలేఖరులు, మరో పాతికమంది పత్రికా ఫొటో గ్రాఫర్లు. వార్తలు రాసుకునే మరో ముప్పైమందికి పైగా పాత్రికా విలేఖరులు. వీరిక్ తోడు ప్రభుత్వ సమాచార సేకరణ యంత్రాంగ సిబ్బంది(స్పెషల్ బ్రాంచ్, స్టేట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సిబ్బంది)..ఆ పక్కనే చానళ్ళ ఓబి వాహనాలు, అంతే దాదాపు 250 మంది పైగా రనగొణ ధ్వని..మరి మధ్యలొ వీరందరికీ కాలక్షేపానికి, నోరు తడుపుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి.. అసెంబ్లీ కాన్‌టీన్ బ్రాంచ్ ఉపాహార పదార్ధాలతో ఘుమఘుమలాడే వాసనలు. మరి ఇందరు వీర విలేఖరులు ఒక్క చోట చేరితే గుప్పు గుప్పున మేఘాలు సృష్టించే పొగలు కక్కుతుంటారు. శాసన సభసమావేశాల కాలంలో అనునిత్యం ఉదయం 8 గంటలనుంచి కనబడే హడావుడి దృశ్యం ఇది.







ప్రశ్నోత్తరాలతో మొదలై, లిఖిత సమాధానాలు, జీరో అవర్ ప్రస్తావనలు, వాయిదా తీర్మానాలు, స్వల్పకాలిక చర్చలు, అర్ధగంట చర్చలు, సావధాన తీర్మానాలు, 304 నిబంధనకింద ప్రధాన చర్చలు, బిల్లులు, వార్షిక అర్ధిక జమాఖర్చులు, దిమాండ్లు ఇత్యాది అనంత అంశాలను ఉదయం 9 గంటలకు ప్రారంభమై 5 గంటలసేపు చర్చలు జరగాలి. ప్రభుత్వంలో లోపాలు విపక్షాలు ఎత్తిచూపాలి, ప్రభుత్వం పాలనా విధానాన్ని వివరించి తాను చేస్తున్న ప్రజ సేవ ఏమిటి చెప్పాలి. గత మూడేళ్ళుగా సభ రభసే. ప్రజాస్వామ్యం పరిహాసానికి గురవుతునే ఉన్నది. అధికార పక్షం, విపక్షం ఎవరికీ శ్రధ్ధలేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, దుమ్మెత్తిపోసుకోవడాలు..అవినీతి పురాణాలు వల్లె వేయడాలతోనే పుణ్యకాలం గడిచిపోతున్నది.
కానీ జీతభత్యాలు, పైరవీలు, ఇతర వ్యవహారాలు చక్కబెట్టుకోవడంలో మాత్రం రాజకీయాలకు అతీతంగా సభ్యులు ఐక్యత ప్రదర్శిస్తారు. ఈనెల 10 న సమావేశాలు మొదలైతే ఒక్క రోజు కూడా అయిదు నిమిషాలు సభాకార్యక్రమాలు జరగకుండా వాయిదాలతో ముగుస్తున్నది. విపక్షాలన్నీ వాయిదా తీర్మానం నోటీసులు ఇవ్వడం సభాపతి వాటిని తిరస్కరించడం, సభ్యులు పోడియం చుట్టుముట్టడం, నినాదాలతో(అరుపులు, కేకలు) దద్దరిల్లడం.. నిత్యకృత్యం. మూడు సార్లు సభను స్పీకర్ అర్ధగంట అంటూ వాయిదా వేస్తారు చివరకు మరుసటి రోజుకు మళ్ళీ వాయిదా.. మరిన్ని విశేషాలు రేపు..




No comments:

Post a Comment