Tuesday 11 December 2012

పి వి మరణించి అప్పుడే ఎనిమిదేళ్ళు...



పి వి మరణించి అప్పుడే ఎనిమిదేళ్ళు..

ఒక మేధావి, దార్శనికుడు, భారత అనర్ఘ రత్నం, బహు భాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు,  వీటన్నిటికీ మించి భారతమాత ముద్దు బిడ్డ, తెలుగుతల్లి అనుంగు తనయుడు, రాజనీతిజ్ఞుడు, భారత మాజీ ప్రధాని, పి వి గా ప్రసిద్ధుడు అయిన పాములపర్తి వెంకట నరసింహారావు స్వర్గారోహణం చేసి ఈ నెల 23 వ తేదీతో ఎనిమిది సంవత్సరాలు  గడుస్తున్నది. ఆయనకు ఇప్పటివరకు దేశంలో, కనీసం రాష్ట్రంలోనైనా.. ఎక్కడా చెప్పుకోదగిన స్మారక చిహ్న నిర్మాణం నోచుకోలేదు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు చేసిన కీర్తి భజనలు ఆయన మరణంతో మరుగున పడ్డాయి. ఆయనను పార్టీలో కానీ, ప్రభుత్వం లో కానీ స్మరించుకునే వ్యక్తే లేకుండా పోయారు. ఎక్కడా అయన చిత్రపటం కూడా దర్శన మివ్వదు. అయన మరనణానంతరం ప్రజాతంత్ర వార పత్రిక [2004-05 డిసెంబరు 26-జనవరి 1 సంచిక 2005 జనవరి 2 8 సంచిక] రెండు  సంచికలలో  నేను రాసిన రెండు వ్యాసాలను, ఆయన వర్ధంతి సందర్భంగా  మిత్రుల కోర్కె మేరకు రెండు రోజుల్లో మరోసారి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. 

1 comment:

  1. మన హోంశాఖామాత్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆశీస్సులతో హైదరాబాద్‌ అలకాపురి(నాగోలు)లో సంకేపల్లి సుధీర్‌రెడ్డి-అధ్యక్షులు, కొఠరు రామారావు-కార్యదర్శిగా ఏర్పాటైన 'పి.వి. ప్రతిష్టాన్'వారు 25-12-2012 నాడు శ్రీమతి సబితగారు ముఖ్య అతిథిగా, శ్రీ రాపోలు ఆనందభాస్కర్‌ గారు, గౌరవ అతిధిగా, శ్రీ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విశిష్ట అతిధిగా జరిగిన సభలో మాన్యులు శ్రీ పి.వి.నరసింహారావు గారికి ఘనమైన నివాళి అర్పించి, అలకాపురి క్రాస్‌రోడ్స్‌(రాఘవేంద్ర హోటల్‌ సెంటర్‌ రింగ్‌రోడ్‌) వద్ద శ్రీ పి.వి.గారి నిలువెత్తు విగ్రహావిష్కరణ జరిపి, ఆ రహదారికి 'పివిమార్గ్‌' అని పేరుపెట్టారు. వారికి నివాళిగా ఆ సందర్భాన డా.కడిమిళ్ళ వరప్రసాద్‌ గారిచే అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు.

    ReplyDelete