Wednesday, 5 March 2014

                 రాష్ట్రపతి పాలనకు "దాదా" ఆమోదం.. 

                                     

                           చురకలు, చమక్కులు మామూలే!!28-2-2014
**రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. శుక్రవారం ఉదయం ప్రధాని నివాసంలో సమావేశమై చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. మరి కొద్ది సేపట్లో అధికారిక ప్రకటన విడుదల కానుంది. కేబినేట్ తీసుకున్న ఈ నిర్ణయంతో 41 సంవత్సరాల తరువాత రెండోసారి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. 1973‌లో తొలిసారి జై ఆంధ్ర ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా, ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాకపోవడం దరిమిలా కేంద్ర కేబినేట్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం గవర్నర్‌‌ పాలనా పగ్గాలు చేపడతారు. క్యాబినెట్ నిర్ణయం దస్త్రం కొద్దిసేపట్లో రాష్ట్రపతి అమోదముద్ర కోసం రాష్ట్రపతి భవన్ కు చేరుతుంది.  

24-2-14
* నేనెప్పుడూ ఈ అవకాశవాద పొత్తులు సమర్ధించను. అధికారం పరమావధి అయితే ఇలాగే ఉంటాయి రాజకీయాలు. కమ్యూనిస్టులు కొంత కాలం కింద వరకు సొంతహ్మగా పోటీ చేసేవారు. గెలుపోతములు ప్రధానం కాదు. సిద్ధాంత నిబద్ధత విశ్వసనీయత పెంచుతుంది.అందుకే దఏసంలో కొంత కమ్య్యూనిస్టులకు గౌరవం ఉండేది. బిజెపి (భారతీయ జన సంఘ్)  కూడా అదే మార్గం. అయిత రాష్ట్రంలో టిడిపి ఆవిర్భావం కమ్యూనిస్టులు, బిజెపిల ఉనికిని ఊడ్చిపెట్టింది. ఇప్పటికైనా ఏపార్టీ అయినా పొత్తులు లేకుండా పోటీ చేసి సత్త చాటుకున్నప్పుడే సుస్థిర, ప్రజా ప్రభుత్వాలకు ఆస్కారం లేకుంతే కప్పల తక్కెళ్ళే..  

23-2-14
*తెలంగాణ సాధించిన రాజకీయ పార్టీలకు సంయుక్త అభినందనలు. కలసికట్టుగా తెలంగాణ ఆవిర్భావానికి పరస్పరం సహకరించుకున్న టీఆరెస్,బిజెపి, కాంగ్రెస్ నేతలారా. నాదొక సూచన.. లేదా మనవి.
తెలంగాణ సాధనలో ఒకరికొకరు పార్లమెంటులో అండగా నిల్చుని ఈ ప్రాంత ప్రజల దీర్ఘకాల స్వప్నాన్ని సాకారం చేసినట్లుగానే.. ఈ ప్రాంత ప్రజల సర్వతోముఖాభివృద్ధికి పార్టీ పరిధులు, వ్యక్తిగత కాంక్షలు అధిగమించి రేపటి ఎన్నికల్లో స్నేహ బృందంగా ఏర్పడి రాజకీయాలకు అతీతంగా ఒక అవగాహనకు వచ్చి పోటీలు మానుకుని, పార్లమెంటు, శాసన సభ స్థానాల విషయంలో ఒప్పందం కుదుర్చుకోండి..
రాష్ట్రంలో ముగ్గురూ సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడి, విబేధాలు, విమర్శలు మానుకుని ప్రజా సంక్షేమం, ప్రగతి సాధించండి. ద్వేషాలు, కార్పణ్యాలకు స్వస్తి చెప్పండి. జాతీయ రాజకీయాలలో కూడా ఒక కొత్త వొరవొడి సృష్టించండి. కనీసం ఒక అయిదేళ్ళు ఈ విధానం అవలంబిస్తే ప్రజలు సంతోషిస్తారు. తెలంగాణను అన్ని రంగాలలో ముందుంచండి. ప్రజా హితవు కోసం రాజకీయాలలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఘన కీర్తి సాధించండి.. జాతికి మార్గదర్శకులు కండి.. కనీసం ఒక్క అయిదేళ్ళు. అలోచించండి.

*హైదరాబాద్ నగరాన్ని 60 ఏళ్ళుగా ఇటుక ఇటుక పేర్చి అభివృద్ధిచేసి ఈ రోజు కోల్పోవడం వలన సీమాంధ్ర ఆర్ధికంగా ఎంతో నష్టపోయిందని విలవిల లాడుతున్న శోకపరితప్త హృదయాలకు నాది ఒకటి సూటి ప్రశ్న..
వందల సంవత్సరాలుగా రాష్ట్ర, దేశ, విదేశీ యాత్రికుల, భక్తులకు కొంగుబంగారమై కలియుగ వైకుంఠంగా అలరారుతూ, ఏడాదిలో కోట్ల రూపాయల హుండి ఆదాయం వస్తున్న పుణ్య జంట క్షేత్రాలు తిరుపతి-తిరుమల సహా కాణిపాకం వినాయకుడు, శ్రీకాళహస్తి - శ్రీశైలం, మల్లిఖార్జున స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం అప్పన్న, అన్నవరం సత్యనారాయణ, మంగళగిరి పానకాల స్వామి, విశాఖ కనకమహాలక్ష్మి, అరసవెల్లి సూర్యనారాయణుడు, తూర్పు గోదావరి జిల్లాలోని శని దేవాలయం, అనేక ఇతర ప్రముఖ ఆలయాలు సీమలోనే ఉన్నాయి కదండీ..అవి రాష్ట్ర వ్యాప్త, దేశవ్యాప్త భక్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందినవే కదండీ..అందునా భగవంతుడు అందరి వాడూ కదండీ!! మరి ఇతర పర్యాటక కేన్రాల మాట ఏమిటి? వాటి గురించి ఎటువంటి ప్రస్తావన తెచ్చి ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు కదా?
ఈ ప్రశ్న ఎవరినీ బాధించడానికి, సూటిపోటి మాటకో కాదు.. కేవలం ఆలోచింప జేయడానికి మాత్రమే..
22-2-14
*నాకు తెలియక .. మిమ్ములను కొన్ని ప్రశ్నలడుగుతా? మీకు తెలిస్తే జవాబు చెప్పండి:
-----------------------------------------------------------------------------------------------------
మన నియోజక వర్గ ఎమ్మెల్యేకు ఏడాదిలో అసెంబ్లీ జరిగే 60 రోజులు మినహా హైదరాబాద్ లో పనేమిటి? ఏడాదికి నెలరోజులు కూడా మన ఊళ్ళో ఉండడు.
అయిదేళ్ళు ఎమ్మెల్యే అయితే... కారు చౌకకు హైదరాబాద్ లో స్థలం, ఇల్లెందుకు? హైదరాబాద్ లో క్వార్టర్లు, కరెంటు, ఫోన్లు, ఆస్పత్రుల్లో పెద్ద రోగాలకు ఆపరేషన్లు, రైళ్ళు, బస్సులు, విమానాల్లో ఫ్రీ ఎందుకు? మనం గెలిపించిన ఊరొస్తే అలవెన్సులెందుకు? చికిత్స కోసం అమెరికాకెందుకు? కాంట్రాక్ట్ లెందుకు? ఇవి గాక ప్రజాసేవ చేసేవాడికి నెలకు లక్ష రూపాయల భత్యమెందుకు? ఏడాది ఎమ్మెల్యే(ఎమ్మెల్సీ) వెలగట్టినా జీవితాంతం నెలకు 10 వేల రూపాయలు పెన్షనెందుకు? మనం ఇల్లడిగితే సవాలక్ష నిబంధనలు.. మందులు, డాక్టర్లుండని పెద్దాస్పత్రి మినహా దిక్కుండదు.. 30 సంవత్సారాలు ప్రభుత్వ ఊడిగం చేస్తే 10 వేల పెన్షన్ దాటదు. వీళ్ళా మన ప్రజా సేవకులు, ప్రతినిధులు. దగ్గరకొస్తే కాలరు పుచ్చుకు నిలదీయండి.
21-2-14
*ఇదీ నేటి నీతి మాట!!~
--------------------------
*మనకు మాత్రం ఉట్రవొడియంగా అందరూ ఉచిత సేవలందించాలి..మనం మాత్రం ప్రతి దానికీ పైసా పైసా వసూలు చేస్తాం.. అదేమంటే నా కష్టం దోచుకుంటారా? అని ముక్కు చీదుతాం!!
*పెప్పర్ ఘాటు నసాళానికి అంటింది. మన ఎంపీలకు కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగి..ఇంకా తేరుకోలేదు పాపం..
*ఊసరవెల్లులు రాజకీయ నాయకుల్లోనే కాదు..వర్తమాన పాత్రికేయుల్లోనూ ఉన్నారు. అయితే మరింత వేగంగా రగులుమార్చుకునే అద్భుత నైపుణ్యం..
*రాజ్యసభలో సమైక్య ఘోష శోష వచ్చి పడిపోయిందట.. చివరకు అందరూ నిలబెట్టి నీళ్ళు తాగించారు
*రాజకీయము, రాజ్యాంగము, లోక్ సభ,రాజ్యసభ నియమావళి మనం ఫేస్ బుక్ లో రాసుకున్నట్లు కాదు. మనం ఒక విధంగా జరగాలని కోరుకోవడంలో తప్పులేదు. కాని అందుకు వ్యతిరేకంగా జరిగితే వ్యవస్థ చిన్నాభిన్నమైనట్లు భావిస్తే ఎలా! మన చేతిలో వోటు ఆయుధం ఉంది. దాన్ని ప్రయోగించి విజయం సాధించాలి. అప్పుడూ మనం కోరుకున్నట్లే ఫలితాలుంటాయని ఆశించడమూ సరికాదు.రాకపోతే ప్రజాస్వామ్యం భ్రష్టుపట్టిందని శపించడమూ అవివేకమే!! ప్రజల్లో మనం ఒక భాగం. మనమే ప్రజలు కాదు .....
20-2-14
*భూమిని కాపాడడానికి అలనాడు విష్ణుమూర్తి వరహావతారమెత్తినట్లు, రాజకీయాలను క్షాళన చేయడానికి త్యాగ "ధనులు" అవతారాలెత్తుతున్నట్లు.. ఈ మధ్య అంతరిస్తున్న తెలుగును ఆకాశంలో నిలబెట్టి ప్రభలు వెలిగించేందుకు సరస్వతీ పుత్రులు, పుత్రికలూ నెట్ పెపర్ల లో..పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. తస్మాత్ జాగ్రతా జనులారా!
*కొత్త పదం- "తెలుగుజాతి" ట.. అర్ధం కాని విషయం.. అది భాష. జాతి కాదు. జాతీయత నేషనాలిటి.. తమిళ జాతి, ఒరియా జాతి, కన్నడ జాతి, మరాఠి జాతి, పంజాబి జాతి, బెంగాలి జాతి, గుజరాతి జాతి, కొంకణ జాతి.. ఉంటాయా.? భారత జాతి ఉంటుందా? తెలుగు ప్రజలు చీలిపోరు, భాష చీలిపోదు, ప్రాంతాల భౌగోళిక హద్దులు, ప్రభుత్వ పాలనా యంత్రాగం మాత్రమే చీలిపోతుంది.
*ఫారం హౌజ్ రాజకీయం జనాలకు అర్థమై ఉంటుంది. ఆ బక్కాయన చెప్పినట్లే జరిగింది. "ఏ పి నుంచి డిల్లీ వెళుతున్నా.. తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా"
*సోనియా, మన్మోహన్, విపక్షాలు, అధికార పక్ష సభ్యులు పెదవి కదపకుందానే తెలంగాణ బిల్లు పూర్తయింది. "సోనియా ప్రసంగిస్తారు "అని బాకా ఊదిన చానల్ వార్తలు ..అంతా ట్రాష్.. మొదటినుంచీ అన్నీ ఇంతే!
18-2-14
*ఇన్నాళ్ళూ ఒకటే ఊదరగొట్టిన తెలుగు చానళ్ళు, పత్రికలు భవిష్యత్తులో ఏమి చెయ్యాలి చెప్మా??
*సందట్లో సడేమియా.. ముఖ్యమంత్రి రాజీనామా చేయకముందే అ.సత్యారావు ఆంధ్రప్రదేశ్‌ప్రెస్ అకాడెమీ అధ్యక్షునిగా పదవీ స్వీకారం.
*పొద్దుణ్ణుంచి తెలుగు చానళ్ళు కాకిలెక్కలేసి. వోటింగు తీరు. గెలుపు-ఓటముల గణాంకాలు.. పార్టీలు విధానం మార్చుకుంటే అనే ఒక చచ్చు ప్రశ్న.. బిల్లు పాసవుతునదా? లేదా.. నరాలు తెగే ఉత్కంఠ.. అంటూ కాకమ్మ కబుర్లు..
*మూజువాణి వోటుతో టి బిల్లుకు లోక్ సభ అమోదం..అనుకున్నట్లే.. అంకం పూర్తయింది.
*
సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలట. ఇది మరో నాటకం. రాష్ట్రం విడిపోదని, పోనీయమని బీరాలు పలికి, అవసరమైతే ప్రాణాలు ఇస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి, ఆర్నెల్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన నేతలు అస్త్ర సన్యాసం. ఇక రాజకీయ సన్యాసమే మిగులు..ప్రజలూ వారికి దండ కమండలాలు, కాషాయ దుస్తులూ సిద్ధం చేయండి..

No comments:

Post a Comment