Tuesday, 18 February 2014

         తెలంగాణ గుండెలు ఇక హాయిగా నిద్రిస్తాయి.

                 ప్రజ్వరిల్లిన తెలంగాణ తేజం.. తీపి తెలం"గానం.." 

                   అంతా సవ్యం.. సుఖం, శుభం..కల నిజమాయెగా.. కోరిక తీరెగా..  


18-2-14
*సోనియా, మన్మోహన్, విపక్షాలు, అధికార పక్ష సభ్యులు  పెదవి కదపకుందానే తెలంగాణ బిల్లు పూర్తయింది. "సోనియా ప్రసంగిస్తారు "అని బాకా ఊదిన చానల్ వార్తలు ..అంతా ట్రాష్.. మొదటినుంచీ అన్నీ ఇంతే!  
*మూజువాణి వోటుతో టి బిల్లుకు లోక్ సభ అమోదం..అనుకున్నట్లే.. అంకం పూర్తయింది. ఇన్నాళ్ళూ ఒకటే  ఊదరగొట్టిన తెలుగు చానళ్ళు, పత్రికలు భవిష్యత్తులో ఏమి చెయ్యాలి చెప్మా??
*ఆయనెవరో మంత్రట..ఏరాసుట.. అందునా న్యాయ మంత్రట.. ఎప్పుడో రాజీనామాచేసాడట. ఇప్పుడు ఆమోదించాలట. గతంలో రాజీనామా చేసి పదవుల్లో సాగుతున్న వాళ్ళనుంచి జీఎతభత్యాలు, అలవెన్సులు, అమ్య్యామ్యాలు, డిల్లీకి విమానాల్లో కాలికి బలపం కట్టుకు తిరిగిన ఖర్చులు, ఏపి భవన్ ఖర్చులు, సెక్యూరిటీ .. మొత్తం చెవులు మెలేసి వసూలు చేయ్యాలి.. ప్రజారాజ్యంపార్టీతరఫున ఎన్నికై, జెండామర్చి కాంగ్రెస్ లో చేరి, హైదరాబాద్లో కాలేజీలు పెట్టి కోత్లు సంపాదిచిన అవంతి శ్రీనివాస్ కూద అరాజీనామనట. మంత్రి డొక్కా కూడా రాజీనామానట.. ఈ తెగిన గాలిపటాలు ఏకొమ్మలకు చిక్కుకుంటాయో! వేచి చూద్దాం..
*సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాలట. ఇది మరో నాటకం. రాష్ట్రం విడిపోదని, పోనీయమని బీరాలు పలికి, అవసరమైతే ప్రాణాలు ఇస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి, ఆర్నెల్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన నేతలు అస్త్ర సన్యాసం. ఇక రాజకీయ సన్యాసమే మిగులు..ప్రజలూ వారికి దండ కమండలాలు, కాషాయ దుస్తులూ సిద్ధం చేయండి..
*ఇవ్వాళ్టితో ఈ రాష్ట్రానికి నాలుగేళ్ళ శని విరగడైందనుకుందాం. మనం ఆశాజీవులం. అందరం కలకాలం బాగుందాం. సంఖ్యా శాస్త్రమే (మిడతంభొట్లు జోస్యం) నిజమవుతున్నదన్న మాట-- తీన్ తేరా :: ఆఠ్ అఠారా::

17-2-148
*ఆ వార్తే నిజమైతే రాష్ట్రంలో జర్నలిస్టులందరూ సామూహిక ఆత్మ హత్య చేసుకోవచ్చు. కొన్నేళ్ళపాటు అతి సాధారణ రోజువారీ విలేఖరత్వం (అర్ధం ఏమిటని గింజుకోవద్దు) వెలగబెట్టి రాజకీయం పుణ్యమా అని ప్రభుత్వ ఉద్యోగిగా అవతారమెత్తి, ఆ తరువాత దాదాపు పాతికేళ్ళకు పైగా ప్రభుత్వ ఊడిగం చేసిన ఒక మహా విశ్వాసపాత్రునికి ముఖ్యమంత్రి పోతూ పోతూ "ప్రెస్ అకాడెమీ" కి పట్టాభిషిక్తుని చేశారట! ఔనా, కలయా వైష్ణవ మాయా? అది నిజమేనా? ఇప్పటికే "ఆకాశంబున నుండి శంభుని శిరంబు, అందుండి హిమాద్రి, శుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి... వివేక భ్రష్ట సంపాతకుల్" అయింది ఆ అకాడెమీ....
*Never,never in the history of Indian democracy this uncertain political atmosphere prevailed. MPs, ministers, chief whip, whips, mla s from one region opposed the CM tooth and nail. PCC President and ministers of his region turned against him. Virtually there is no govt in the state. Cabinet itself is against CM. Wonderful state, AP.
*What would happen if T bill is defeated/ passed in Lok Sabha?


15-2-14
డిల్లీ రామ్ లీలా మైదాన్ లో సమైక్య ఆందోళన ధర్నాకు రాష్ట్రంలో అయిదు నగరాల నుంచి ప్రత్యేక రైళ్ళలో మహిళలు సహా ఎన్జీఓలు, ఉద్యమకారులు బయలు దేరారు. ఒక్కొక్కరైలుకూ వెయ్యి మంది చొప్పున కనీసం అయిదువేల మంది వెళ్ళి ఉండాలి. ఈ రైళ్ళకు అయ్యే ఖర్చు ఎవరు భరించారు? తలకు కనీసం నాలుగు రోజులకు వసతి, భోజన, ఉపాహార, ఇతరాలకు కనీస ఖర్చు 2000 రూపాయలకు తక్కువ ఉండదు. అందరూ మధ్యతరగతి వర్గ ప్రజలే. సాధారణ ఉద్యోగులే. స్పాన్సర్లు ఎవరు? అంతమందికి వసతి ఎవరు కల్పించారు? కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోలనకు సమాయత్తమైతే ప్రభుత్వం రైళ్ళు ఎలా అనుమతించారు? ఉద్యోగులు విధులకౌ గైర్హాజరవుతుంటే ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలోకి తొక్కినట్లేనా? వారి పై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోరు? అంతే ఈ నాటకం మొత్తం కేంద్ర దర్శకత్వంలో ముఖ్యమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో నడుస్తున్నట్లే కదా..
రాజకీయమా వర్థిల్లు.. !!
*సభకు తాళం వేసి పోతూ పోతూ.. మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ల్యాప్ టాప్‌లూ, ప్రింటర్ల పేరిట ముచ్చటగా సుమారు మరో మూడుకోట్లు మింగేస్తున్నారు. పేపర్‌లెస్  అసెంబ్లీ పేరిట స్పీకర్ సభ్యుల ఇప్పటికే రెండు సార్లు కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్ పిసీలు, ఐ-ఫోన్లు..బహుమతులిచ్చేశారు. సభ జరగడమే గగనమయిన తరువాత వాటితో పని ఏమిటి. మన అసెంబ్లీ పేపర్‌లెస్ కాదు.. మెంబెర్‌లెస్ గా.. మానర్స్ లెస్ గా తయారయింది.. ఇప్పటికి రెండు సార్లు కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు ఇచ్చినా అవి ఎప్పుడో నజరానాలుగా చేతులు మారాయి. పాతవి ఏమయ్యాయి, ఇవి ఎందుకిచ్చారు?  మీడియా కూడా నోరు మెదపలేదు. సెల్ ఫోనే ఆపరేట్ చెయ్యడం రాని సభ్యులున్న మన అసెంబ్లీకి ఇవి అవసరమా? ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడవు? ప్రజాధనం ఇలా డ్రైనేజీ పాలవుతున్నా అడిగే నాధుడే కరవయ్యాడు. ఒక్కొక్కరికీ దాదాపు 85 వేల రూపాయలు.. కృష్ణార్పణం..  వాళ్ళు జీత భత్యాల బిల్లులు ఎటువంటి చర్చ లేకుండ గుంభనంగా ఏకగ్రీవ అమోదం పొందుతాయి, ప్రజల విషయమైతే....ఏళ్ళతరబడి పెండింగు..

 
14-2-14
*దశాబ్దపు కాలంగా వేచిచూస్తున్న అంతటి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు లోక్‌సభలో ప్రవేశపెడుతుంటే యుపిఎ అధ్యక్షురాలు సోనియా గాంధి, ప్రధాని మన్మోహన్ సింగ్ సభకు హాజరు కాకుండా గృహాలకే పరిమితం కావడ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ ప్రతిష్ఠకే తలవంపులు. ఇది స్క్రిప్ట్ లో భాగం కాదా? 24 గంటలు దాటినా ప్రధాని, సోనియా, రాహుల్ .. ఎవరూ ఎందుకు స్పందించలేదు?
*ఈ దేశంలో ప్రభుత్వం పట్టపగలు బహిరంగ వేలం వేసి మనుషులను(స్పోర్ట్స్‌మెన్) అమ్ముతుంది. ఇదే దేశంలో ఆ ప్రభుత్వాలను నడిపే మనుషులు(పొలిటిషియన్స్) ఏకంగా దేశాన్నే అమ్మేస్తారు.
*కొత్త తిట్టు...పెప్పెర్ స్ప్రే ముఖమూ.. నువ్వూనూ..  
13-2-14
"ఆత్మరక్షణ కోసం నేనెప్పుడూ పెప్పర్ స్ప్రే దగ్గరుంచుకుంటాను"- లగడపాటి.
పదేళ్ళుగా ఒక ప్రజాప్రతినిధి, అందునా రాజకీయరాజధాని విజయవాడ వంటి కేంద్రం నుంచి రెండు పర్యాయాలు లొక్ సభకు ఎన్నికైన అధికార పార్టీ సభ్యుడు ఆ మాటలు అనడం ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటు అనిపిస్తున్నది. 1952 నుంచి విజయవాడ ప్రజల ప్రతినిధులుగా హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, కొమర్రాజు అచ్చెమాంబ, డాక్టర్ కె ఎల్ రావు(3), గోడె మురహరి, చెన్నుపాటి విద్య(2),వడ్డె శోభనాద్రీశ్వర రావు(2), పర్వతనేని ఉపేంద్ర(2) గద్దె రామ్మోహన్ లోక్ సభకు ఎన్నికయారు. వారిలో ఏ ఒక్కరూ ఏనాడూ తమకు ప్రాణహాని ఉన్నదని ఏనాడూ అన్న పాపాన పోలేదు.
రెండుపర్యాయాలుగా ఎంపీగా ఉన్న వ్యక్తి లగడపాటికి భద్రతా సిబ్బంది ఎప్పుడూ వెంట ఉంతారు. అందునా వివాదాల్లో ఎక్కువ చిక్కుకుని పీకలమీదకు తెచ్చుకోవడం ఈయనకు అలవాటే. అందు చేత భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తంగాఉంటారు. ఒక వ్యక్తి తనకు ప్రాణ భయమున్నదని పేర్కోనడం ఆయనపట్ల ఎంత ప్రజా వ్యతిరేకత ఉన్నదో అర్ధమవుతుంది. గన్ మెన్ వెంట ఉన్నా ఆయన ఆత్మరక్షణకు అప్రమత్తంగా ఉంటానని చెప్పుకోవడం పోలీసు శాఖకు అవమానం.
ప్రధాని, స్పీకర్, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు కొలువుతీరిన లోక్ సభలో ఆత్మరక్షణకు పెప్పర్ స్ప్రే తెచ్చుకున్నానని లగడపాటి చెప్పడం పార్లమెంటు వ్యవస్థను, భద్రతా వ్యవహారాన్ని కించపరచడమే. ప్రధానిని అవమానించినట్లే! ఈ లెక్కన ఆత్మరక్షన కోసమిక అసెంబ్లీలో, పార్లమెంటులో సభ్యులు నేరుగా పిస్టళ్ళను, జాగిలాలలను తీసుకెళ్ళే రోజులు వచ్చాయన్నమాట. సామాజిక వర్గ ప్రసారమాధ్యమాల మద్దతు వారికెటూ ఉంటుంది అది వేరే విషయం. ఇదీ మన పరిస్థితి. నవ్వు కుందామా? రోదిద్దామా? నేటి దుస్సంఘటనకు..  

*నిన్న లోక్ సభలో స్వయానా మంత్రులే వెల్ లోకి దూసుకు పోయి నినాదాలు చేస్తూ.. రైల్వే బడ్జెట్ ను అడ్దుకుని అర్ధంతరంగా మంత్రి చేత నోరు మూయిస్తే, రాజ్య సభలో చైర్మన్ మైకులు విరగ గొడితే కాంగ్రెస్ అధినాయకత్వం కళ్ళు మూసుకుందా? ఎందుకు చర్య తీసుకోలేదు.. ఆల్ డ్రామా!

*ఎంపీలు, మంత్రులు కూడా వెల్ లోకి వెళ్ళడం పార్లమెంటు చరిత్రకు మచ్చ.ఈ రాష్ట్రం ఎటుపోతోంది? నాయకుల ఆవేదన.. తేరిపార చూడండి..కడప గడప మార్గం పడుతున్నట్లుంది. (అనుకున్నట్లుగానే)!  

*పార్లమెంటు చరిత్రలో నేడు దుర్దినం- -- దిగ్విజయ్: ఆ తద్దినం  పెట్టిస్తున్న ఘనత కాంగ్రెస్ పెద్దలదే!!దహన సంస్కారాలు మొదలయ్యాయి.

* Heads rolling down. So far 18 LS members were suspended .
*"ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ ఎంపీల చేత   సీమాంధ్ర ఎంపీలపై దాడి చేయించారు "- ఉండవల్లి. ఎవరు చేయించారు? మీ సోనియా గాంధీ చేయించారా? అంటే సమైక్య రాష్ట్రానికి సోనియా సహా ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా వ్యతిరేకమన్న మాట. ఒహో కాంగ్రెస్ మిమ్ములను వెలివేసిందన్నమాట!   -- మిరియప్పొడిని లోనికి అనుమతించిన స్పీకర్ పై చర్యలు తీసుకోవాలని ఉండవల్లి అడగలేదేమిటి? ఈ ఆలోచన ఎందుకు రాలేదబ్బా!  ప్రాంప్టింగ్ వినబడలేదేమో.. పాపం.  

*పార్లమెంటు బయట ఇప్పుడే ఉండవల్లి పాఠం వల్లె వేశాడు. పక్కనే...శాలువ కప్పుకుని హిస్ మాస్టర్స్ వాయిస్..

*"కాంగ్రెస్ వల్లనే మేమీ స్థితికి ఎదిగాం. కాంగ్రెస్ లోనే మరణిస్తా" మని నిన్నటివరకూ బీరాలు పలికిన వాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ ను పట్టపగలు నట్టనడి చట్టసభల్లో అధినేత్రి కళ్ళెదుటే నిలువునా ఖూని చేశారు. ఒక్కొక్కళ్ళదీ ఒక్కో ఆయుధం..అంతే తేడా!!    

*తెలంగాణ బిల్లు విషయంలో కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకుంటుందా? బిజెపిని హత్య చేస్తుందా?

*మిరియప్పోడిని ఇతరులపై జల్లి  దిమ్మ తిరిగి బైర్లు కమ్మి చివరకు ఆస్పత్రిపాలైంది లగడపాటి..  దీన్నే మొగుడినికొట్టి మొగసాలె కెక్కినట్లు.. అనడం..

*545 మంది సభ్యులున్న లోక్ సభను,250 మంది సభ్యులున్న రాజ్య సభను కేవల వేళ్లపై లెక్కించదగిన సంఖ్యలో ఉన్న వ్యక్తులు అడ్డుకుని సభాగౌరవాన్ని, పరువుప్రతిష్ఠలను మంటగలిపితే అందరూ మునుల్లా కూర్చున్నారు లేదా, ఘాటు వాసనకు వెరచి పారిపోయారు. ఇదీ మన ప్రజాస్వామ్యం. సభ్యులు ప్లకార్డులవంటి భారీ వస్తువులను లోనికి తెస్తుంతే భద్రాతా సిబ్బంది నిస్సహాయులుగా మిగిలిపోయారు. మిరియప్పోడే కాడు మారణాయుధాలు బాహాటంగాతెచ్చినా కిమ్మన లేని దిస్థితి. పాలనా సామర్థ్యం నవ్వులపాలైంది. మైకులు, కంప్యూటర్లు ధ్వంసం చేయడం, పదునైన పరికరాలతో ఆత్మహత్యలకు పాల్పడడం.. అవమానకరం.  గతంలో బిజెపి వాళ్ళు నోట్ల సంచీ  తెలేదా!!నిఘా విభాగం నిద్దరోయింది. 125 కోట్లమంది భారత ప్రజలకు దిశా దశా నిర్దేశించే నాయకులు వీళ్ళా!!  

*2003 లో సోనియాగాంధి మొత్తం 35 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలతో తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు, 2004, 2009 ఎన్నికల ప్రణలికల్లో ప్రత్యేక తెలంగాణ అంశం ప్రస్తావించినప్పుడు, రాష్ట్రపతి ప్రసంగంలో, యుపీఎ ఉమ్మడి కార్యక్రమంలో పేర్కొన్నప్పుడు, కేంద్రం ప్రణబ్ కమిటీ నియమించినప్పుడు, అసెంబ్లీలో స్వయంగా రాజశేఖర రెడ్డి రోశయ్య కమిటీని ప్రకటించినప్పుడు, శ్రీకృష్ణ కమిటీ ఏడాదిపటు విచారణలు నిర్వహించినప్పుడు..2004లో తెరాసతో పొత్తును ఈ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదు.. ఈ నాయకులు తీవ్రంగా ఎందుకు ఖండించలేదు? ఆర్నెల్లకిందట కోర్ కమిటీ, సి డబ్ల్యుసి, మంత్రివర్గ ఉపసంఘం కరాఖండిగా తెలంగానను ప్రకటించినప్పుడే ఈ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు. మొన్నటికి మొన్న సిఎం ఎ.ఐ.సి.సి సమావేశాలకు వెళ్ళి తాడోపేడో ఎందుకు తేల్చుకోలేదు.. తెలంగాణ అయినా, సమైక్యమైనా... ఏదైనా స్వార్థ రాజకీయమే.. పరువుప్రతిష్ఠలు మాత్రం మంటగలిశాయి.. ప్రజలు విరోధులయ్యారు. నాయకులు కుమ్మక్కయ్యారు..

*అద్భుతం.. మహాద్భుతం.. అనుకున్నట్లే సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ వ్యూహాన్ని తూచ తప్పక అమలుపరిచారు. భళా. వ్యూహకర్తా! బహుముఖ ప్రజ్ఞాశాలీ....

*పార్లమెంటులోకి ఇవ్వాళ మిరియప్పొడి తెచ్చిన వాడు రేపు మిషన్ గన్ తేడని నమ్మకమేమిటి? ఎన్డీఎ హయాంలో పార్లమెంట్ పై ఉగ్ర దాడి సంగతి తెలీదు కాని ఎంపీలే ఉగ్రవాదులను మించి పార్లమెంటులోనే దాడి చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం గా పేరొందిన భారత్ ను ఆమె వారసులే దారుణ "మానభంగం" చేసారు. ప్రజలు సిగ్గుచచ్చి పోయారు.. వీళ్ళా మన ఎంపీలు.. థూ!


12-2-14
*Hope, never in the history of post independent indian parliament, ruling party members including cabinet ministers stalled the House entering into well, raising slogans and throwing torn budget copies. most dishraceful and helpless cong party.

*OUR PARLIAMENT MEMBERS BETRAYED PEOPLE, PARTY AND DEMOCRACY BY ENACTING A HIGH DRAMA IN BOTH THE HOUSES OF PARLIAMENT

*విపి సింగ్ వినడు.. మన్మోహన్ మాట్లాడడు.
పార్లమెంటు స్థాయిలోనే ఇన్ని నాటకాలాడిన సీమాంధ్ర నాయకుల అసలు రూపం బయటపడిందిగా. పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం నుంచి అన్నీ అక్రమాలే, వక్రీకరణలే! శాసనసభలో సంఖ్యా బలం పెట్టుకుని ఆధిపత్యం చెలాయించడమే 1990 వరకు వాళ్ళు చేసిన అన్యాయం. 2000 లో సోనియాకు తెలంగాన తీర్మానం పంపడమే వైఎస్సార్ 'రాజకీయం'. ఇప్పుడూ ప్రత్యేక ఆంధ్రలో ఒక వర్గం రాజకీయంగా, మరొవర్గం ఆర్ధికంగా బాగుపడుతాయి. సంపద కేంద్రీకృత అభివృద్ధి అరిష్ఠానికి మూల హేతువు. భౌగోళికంగా విడిపోయినా నష్టం లేదు. ఇప్పటికైనా విద్యావంతులు విజ్ఞత ప్రదర్శించాలి.

11-2-14
*ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్, రాజశేఖరరెడ్డి పుణ్యమా అని వార్డు సభ్యులు, కార్పోరేటర్ కు ఠికానా లేనివాళ్ళు తెలుగుదేశంలో, కాంగ్రెస్ లో ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులయ్యారు. పదేళ్ళు తల్లి పాలు తాగి ఒళ్ళు చేసి ఇవ్వాళ రొమ్ము గుద్దుతున్నారు. దేశ ద్రోహులకంటే మాతృద్రోహులు యమ డేంజర్.. పదవులు అనుభవించి భవిష్యత్ అగమ్యగోచరమై పార్టీలు ఫిరాయించే వాళ్ళేపార్టీ అయినా సరే, అమ్మ రొమ్ము గుద్దినట్లే! నీతి విలువలు ఒదిలేసి అలా ...

*డిల్లీలో గెంటించుకొచ్చిన ఈ ఊసరవెల్లి ఎంపీలను జనాలు ఇక "జంబలకరి పంబ" ఆడించాలి. (సెకండ్ సీన్‌లో మంత్రులొస్తారు) ఇన్నెల్లు మాయమాటలతో గడిపి ఇవ్వాళ గడప దగ్గరకొచ్చారు. నీళ్ళు సిద్ధంచేసి, నులక మంచం అడ్డుపెట్టి, పసుపు కుంకుమ ముద్దలెట్టి, గాజులివ్వండి ప్రజలారా నియోజకవర్గాల్లో!

*ఆరుగురు ఏంపీలపై కాంగ్రెస్ వేటు.. నూరు తప్పులకు కదా శిశుపాలునికి శిరచ్ఛేదం .. ఇదీ అంతే.. లెక్క మొదలైంది.. ఇక డొక్కలు చిరుగుతాయి.. తిరగబడుతున్న తలలు తెగిపడుతున్నాయ్.. ఇవ్వాళ్టికి ఆరు.


10-2-14
*What I have said yesterday.. has come in print today. Karan interviews Kiran. Answer varies from question..( repeating posting for reference)

*ఒక కరణ్(కరణ్ థాపర్) మరొక కిరణ్(కిరణ్ రెడ్డి) తో అరగంట భేటీ.. లాల్చి వేసుకున్నాయన ఇంగ్లీషు వినే సరికి కోటేసుకున్నాయనకు ముచ్చెమటలు పోశాయ్. సిఎన్ఎన్-ఐబిఎన్ లో.. చంద్రబాబును మించిన వొకాబులరీ..మా కిరణ్ ది. ఆయన పార్లమెంటు అధికారం అడిగితే .. ఈయన అసెంబ్లీ తీర్మానం గురించి చెబుతాడు.

"The Hans India" carried a detailed item on Karan & Kiran.. (news item for ready reference)
*నేను జోతిష్యుడను కాను. రాజకీయ రాగ ద్వేషాలకు అతీతంగా కేవలం అంచనా మాత్రమే. [అంచనాలు ఎప్పుడూ నిజరూపం దాలుస్తాయనుకోవడం అవివేకం..] అయితే అనుభవం, హేతుబద్ధంగా ఉంతే అలోచనలు కార్యరూపంలోకి వస్తాయి అని చెప్పడమే. అంతే కాని, "నేను మొన్ననే చెప్పాను - అది నేడు జరిగింది" అని ఒళ్ళంతా నెత్తురొచ్చేలా బరుక్కోవడం కాదు టివి విశ్లేషకుల్లా...
అందుకు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే! ఈ నెల 7వ తేదీ కిరన్ రాజీనామ పై నా అంచనా:

*తీన్ తేరా ఆఠ్ అఠారా అంటున్నారు సంఖ్యా శాస్త్రవేత్తలు. ఇవ్వాళ్టితో అస్మదీయుల ఎన్నిక పూర్తయింది. ఇక (వోట్ ఆన్ అకౌంట్) జమా-ఖర్చుల లెక్క చూస్కోవాలిగా.. 13/18 ఖాయం చేస్తారేమో రాజీనామా ముహుర్తం!(7-2-14)!! అదే ఇవ్వాళ ఈనాడు పత్రికలో మొదటి పేజీ వార్త. (రెండూ నిజమవుతాయని కాదు. హేతుబద్ధత మాత్రమే)(10-2-14)

*Where is the sanctity for the budget when T ministers abstained from Cabinet meeting? Technically the Budget proposals might have been approved as the quorum was there, but morally unwise when representatives from one region abstained. T ministers should have attended cabinet meet and noted their descent.

*ఫ్లాష్:ఫ్లాష్:--- తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర:
ఫాలో అప్:ఫాలో అప్---- రాజీనామాలు..
రాజీనామాలకేమోకాని సీమాంధ్ర రాజకీయ ఆత్మహత్యలకు ముహుర్తం ఖరారైంది.
స్వయంగా టిజి అనే ఒక మాటలమాంత్రికుడు ఇనదాకే ప్రకటించేసాడు. తాను రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాడట. తోడు లేనిది రాచ పీనుగ పోదు కదా. కిరణ్ కూడా కాంగ్రెస్ కు టాటా బై బై ట. అది సరే మరి మంత్రి పదవికి రాజీనామా చేయడా? మరో మూడ్నెల్ల ముచ్చట తీర్చుకోవచ్చు ఇలాగే.. సరే.. ఇంకా ఎందుకాలస్యం.. ఆ మంచిపనేదే ఇప్పుదే చేస్తే సరిపోలా? షావుకారు గారిది మంచి బోణీ ... .

*ఇక మా ఎర్నలిస్టులు, జర్నలిస్టులందరూ (గొట్టమ్స్ సహా) రేపటినుంచి జై కెసీఅర్! రోజులు మారాయి..

*మా అంధ్రా అక్టోపస్ ఎక్కడ ఏమిచేస్తున్నది? బాలెక్కడ, బ్యాటెక్కడ? స్టంపులేవీ? ఫోరా, సిక్సరా, క్యాచా, క్లీన్ బౌల్డా, రన్ ఔటా, హిట్‌వికెట్టా,.. అసలు బ్యాట్స్ మాన్ ఏడీ.. అది సరే ఇంతకూ రాజకీయ సన్యాసం ముహుర్తం ఎప్పుడు? ఇక జోతిషం దుకాణం డిల్లీలోనా, బెజవాడలోనా? ఇద్దరూ రానీయకపోతే 'లరాగో' గతి ఏమిటి....? ఇంతకూ లెటర్ హెడ్..... మహాసభ ఏమైందీ?

*ఇక జెండా మార్పిళ్ళు, కండువా మార్పిళ్ళు వేగం.. నాలుగు స్తంభాలాట: కాంగ్రెస్-వైకాపా-టిడిపి-బిజెపి..నేతానుగ్రహం కోసం ప్రతి పీతా ప్రదక్షిణం.. గెలుపు సంగతి దేవుడెరుగు..ఇక టిక్కెట్ల ఇక్కట్లు మొదలు. ఎంత పంపుకొట్టినా ఆక్కడ కూడా సమన్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం జరుగుతాయనే నమ్మకం కలగడం లేదు..భవిష్యత్తయినా ఆశాజనకమా కాదా? అనుమానమే..! నేనెప్పుడో చెప్పాను "ఆత్మలు" ఎప్పుడూ సేఫ్ అని. అవునా?

*ఆర్నెల్లుగా ఆంధ్రా ప్రజలను సమైక్యమంటూ అబద్ధాలతో మభ్యపెట్టి రాజీడ్రామాలాడిన అన్నిపార్టీల నాయకులకు ప్రజలు ఎలా బుద్ధి చెబుతారో? రాష్ట్రం విడిపోకుండా ప్రాణాలు అర్పిస్తామన్న నేతలు ఇప్పుడేమి చేస్తారు? కొందరేమో ఊళ్ళు పట్టుకుని.. మరికొందరేమో రాష్ట్రాలు పట్టుకుని తిరిగారు.


9-2-14
*కులాసానా? ఆ. అంతా లాసే!!
----------------------------------
* లోక్ సభలో టి బిల్లును సమర్ధంగా ఎదుర్కొంటాం- సబ్బం; మరి రాజ్య సభలో అంత అసమర్ధులున్నారా.. మీలో
* మూడునెలల కిందట వరకు జగన్ ను తూర్పారపట్టిన తూర్పు నాయకుడు ధర్మాన మూడ్ మార్చుకుని బిచాణా మొత్తం వైకాపాలోకి.. అన్యధా శరణం నాస్తి..
జగన్ కోసం ఏమైనా చేస్తా అని ఒకప్పుడన్న సబ్బం ఇప్పుడు చెడుగుడు.. కాలమహిమ!
* రాజధానిలో బోన్సాయ్ చెట్ల ప్రదర్శన- ఒక వార్త.; ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నదంతా బోన్సాయ్ నాయకులే కదా!!
* అనేకచోట్ల కాంగ్రెస్ సమైక్య రన్ లు.. అవును వారి నాయకుడే కి"రన్" కదా! ఇక అందరిదీ మారథాన్ రన్.. పరుగో పరుగు..
* ద్రౌపదికి నిండు సభలో పరాభవం- కౌరవ ప్రభువులు కూలి పోయారు.; హస్తినలో మహిళామంత్రులకు ఘోర అవమానం- రాష్ట్ర ప్రభుత్వ పతనం?
* కిరణ్ తరఫున చుండ్రు శ్రీహరి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్-ఒక వార్త.; కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ ..
* చిరుకు సమైక్య సెగ..విభజన పొగ నుంచి విముక్తి అనుకుంటే ఇదొక కొత్త కష్టం పాపం..[ప్రజలకు ద్దొరమయితే ఇక చుట్టూ పోలీసులే!]
* టిడిపి హయాంలో పగోలో బియ్యాం బస్తాలను ధాన్యం బస్తాలుగా మర్చిన మంత్రి(మాంత్రికుడు) ఘనుడు ఇప్పుడెక్కడ అడ్రసు కనబడడం లేదే! మళ్ళీ జంప్ జిలానీ-ట!!
* కేంద్ర నిధులను రాష్ట్రాలు దుర్వినియొగం చేస్తున్నాయట.; రాహుల్ గాంధికి ఇవ్వాళ కటక్ లో తెలిసింది.. కట కటా..ఎన్ని కష్టాలొచ్చాయి?
* ఈసారి దక్షిణాదిన కూడా ఘనంగా జనం, మోడీ ప్రభంజనం..

*రాజ్యసభ సభ్యత్వం కోసం 1996 నుంచి 2008 వరకు ప్రయత్నించా, ఫలించకపోయినా నిరాశ నిస్పృహలకు లోనవలేదు-- కెవిపి అన్నారు(సాక్షి). రాజ్య సభ టికెట్ కోసం 1990 నుంచి గజని మహ్మద్ మాదిరి ప్రయత్నిస్తూ వచ్చా. 2008 వరకు ఆ ప్రయత్నం ఫలించకపోయినా ఏనాడూ పార్టీని ఏమీ అనలేదు. ఈ సారి టిక్కెట్ ఇప్పించడంలో సిఎం, పిసిసి అధ్యక్షుడు మనస్ఫూర్తిగా పని చేశారు-- కెవిపి అన్నారు(ఈనాడు).
*ఒకే వార్త రెండు పేపర్లలో రెండు తేదీలు .. జనాలు ఏది ప్రామాణికంగా తీసుకోవాలి? (నా వార్త-నా ఇష్టం)

*పార్టీ మార్పిడులు ప్రోత్సహించి ప్రజల చేత ఛీ కొట్టించుకోకుండా.. ఈ పర్యాయం పరువు, ప్రతిష్ట, మానాభిమానాలు..ఉనికిని కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత..భారతీయ జనతా పార్టీది.

*ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బతికి బట్ట కట్టిందంటే, ఇందరు నాయకులను ప్రసాదించిందంటే, కాసు, పివి, అంజయ్య ఆ స్థాయికి ఎదగ గలిగారంటే, తన చేతులమీదగా 'బి ' ఫారాలు ఇవ్వడం వల్లనే-ట. 1983 నుంచి గాంధిభవన్ కళకళ కు తానే అభివృద్ధి చేశార-ట. బొత్స, ఆనం(రాం), కన్నా, రఘువీర, వట్టి.. వంటి వారి ఎదుగుదలలో ఆయన పాత్ర చాలా ఉంద-ట. శ్రీధర్ బాబు, విహెచ్, చిన్నారెడ్డి, పొన్నాల, దానం, పొన్నం వారిని మంత్రులుగా మంత్రులుగా, ఎంపీలుగా చేయడంలో తన కృషి చాలా ఉంద-ట... ఇంత కష్ట పడ్డా తనకు రెండొ సారి రాజ్య సభ టిక్కెట్టు రాకుండా కొన్ని సక్తులు అడ్డు పడ్డాయన్నారు. కిరణ్ కుమార్ గురించి ఏదో చెప్పబోతూ ఆగిపోయి.." ఈ సమయంలో వ్యతిరేకత భావాలెందుకు? అన్నీ మంచే మాట్లాడతాను..అని కూడా అన్నారు. "వైఎస్ చివరి కోరిక ప్రకారం రాహుల్ గాంధి ప్రధాని అయ్యేలా సహకరిస్తానని అన్నారు.
"నాకు గాంధి భవనే దేవాలయం. కాంగ్రెస్ లోనే చివరవరకు ఉండి మరణిస్తా" కెవిపి భావోద్వేగంతో మాట్లాడారు.(చూడుడు సాక్షి- పేజీ 5). ఇప్పటికైనా అర్ధమైందా రాష్ట్ర కాంగ్రెస్‌ను వెనుకనుంచి నడిపిస్తున్న దెవరో? అందుకేనేమో పలువురు నేతలు ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఆయనను "అదృశ్య శక్తి" అని అభివర్ణిస్తారు.. ఆరాధిస్తారు. కెవిపి గారంటే మీడియా సహా అందరికీ(పార్టీ, ప్రాంతం తేడాలు లేకుండా..) ఇష్టమే.. మరిప్పుడు నాయకులేమంటారో?

*రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గజనీ.. ఘోరీల మయం..అది నేననలేదు. స్వయంగా కె వి పి అన్నారు. తాను 1990 నుంచి 2008 వరకు రాజ్యసభ టిక్కెట్టుకోసం గజనీ లా పోరాడారట..విజయం సాధించారట.(చూడుడు-ఈనాడు: పేజీ 5) ఏ శివాజి తోనో, రాణా ప్రతాప్‌తోనో ఎందుకు పోల్చుకోరు.. 1857 నుంచి స్వాతంత్ర్యంకోసం ఎందరు ఎన్ని పోరాటాలు చేశారు? ఈ దేశంకోసం ప్రాణాలర్పించిన భారతీయ త్యాగధనుల పేర్లు గుర్తుకు రావా మనకు? అవును విదేశీ నాయకత్వంలో స్వదేశీ అలోచనలు మనకు పుట్టవు..

-----------------------------------------------
7-2-14
*సరే. కాంగ్రెస్ కున్న రెండు రాజ్య సభ సీట్లు ఒకే ఆయనకు ఇచ్చారుగా!!! నీవే నా "తోడు" -నిను వీడని "నీడ" నేను(కెవిపి ఎక్కడుంటే - ఖాన్ అక్కడ..)

*తీన్ తేరా ఆఠ్ అఠారా అంటున్నారు సంఖ్యా శాస్త్రవేత్తలు. ఇవ్వాళ్టితో అస్మదీయుల ఎన్నిక పూర్తయింది. ఇక (వోట్ ఆన్ అకౌంట్) జమా-ఖర్చుల లెక్క చూస్కోవాలిగా.. 13/18 ఖాయం చేస్తారేమో రాజీdramaనామా ముహుర్తం!
*అయిపోయింది. ఆ ముచ్చటా తీరింది. సుప్రీం కోర్టు విభజన పిటిషన్ కు చేట కొట్టింది. కాదు పొమ్మంది. ఇక అంతర్జాతీయ కోర్టు ఒకటే దిక్కు. ఇదంతా మీడియా హైప్.. కందకు లేని దురద - కత్తిపీటకు అని వినే ఉంటారు..
*కాపీ చేసే వాళ్ళని కాపీఇష్టులు అంటారు. పేస్ట్ చేసే వాళ్ళను పేస్టర్లంటారు. గూగుల్ కాపీ-పేస్ట్ గాళ్ళు ఈ మధ్య అవేవో పేపర్లంటూ పెట్టి ఎడిటర్లవుతున్నారు. అదీ పాఠకుల బాధ
6-2-14

*It is the prime responsibility of people of Andhra Pradesh to see that all sitting MLAs are defeated in next elections irrespective of parties and places.

*Veteran Journalist Maddali Satyanarayana Sarma (96), popularly known as M.S.Sarma passed away at his residence in Jubilee Hills Journalists Colony at 8:15 p.m.last night. He was suffering from cancer of intestine for some time. He started his journalistic career in 1936 and served Prajamitra, Prajabandhu, Telugu Meezan daily. He later joined Andhra Patrika and worked there for about three decades. He was also Patrika's editor when retired. Sarma played key role in the journalists unions both at Madras and Andhra. He was bestowed with many awards including the Pratibha Puraskarm for Journalism by the P.S.Telugu University. He was active even at the ripe age and made it a habit to write a post card to any paper or channel if he noticed a factual mistake in its news or comment. (Dr GS Varadachary)

5-2-14
* మార్గదర్శిపై మాటల పోరాట యోధుడు ఉండవల్లి ఆరాటం ఏమైందిటపాపం.. ప్రాంప్టర్ అదృశ్యమయ్యేసరికి మాట పడిపోయినట్లయింది..

*లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !!
అని నేరుగా ప్రధాని కాళ్ళమీదపడి ప్రార్ధిస్తే పుణ్యం పురుషార్ధమైనా దక్కేది. పరువైనా మిగిలేది.. జైరాం రమేష్ కాళ్ళమీద కాకుండా. ఛీ..  వీరా ప్రజాప్రతినిధులు..ఆత్మగౌరవం గురించి మాట్లాడేది?  

4-2-14
*అక్షరాల నిజం..ఫేస్ బుక్ మరో ప్రపంచానికి రహదారులు చూపింది..ఊహలకు నిచ్చెనలు వేసింది..

*తెలంగాణ బిల్లు విషయంలో ప్రత్యామ్నాయాలు రెండే రెండు.: తప్పు బిల్లు పంపినందుకు మన్మోహన్ రాజీనామా...లేదా బిల్లును తప్పన్నందుకు కిరణ్ రాజీనామా??
అక్కడేమో బిల్లు మేజా(టేబిల్) ఐటెమ్..ఇక్కడేమో బిల్లు మూ(గ)జువాణి!!  

*రాజకీయ నాయకులను తలదన్నే మాదిరి జర్నలిస్టుల్లో ఎన్ని గ్రూపులో.. మేథావులం (అనుకునే) మనం కూడా "కలసి ఉంటే కలదు సుఖం" అనే నానుడి మర్చిపోతున్నాం..ఎన్ని యూనియన్లు, ఎన్ని ఫెడరేషన్లు, ఎన్ని అసోసియేషన్లు, ఎన్ని ఫోరమ్‌లూ.. పుట్టగొడుగులనకూడదా!!

*మాతృ గర్భం-- భూగర్భం: రెండూ సుసంపన్న నిక్షిప్త సంక్షిప్త స్థానమే.

No comments:

Post a Comment