Sunday 23 March 2014

పాలిట్రిక్స్ లో హాటెస్ట్/లేటెస్ట్ కామెంట్స్..  



12-3-14
*రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన కార్యక్త్రమం మొదలైంది.. పాతుకు పోయిన కాంగ్రెస్ వృక్షాన్ని కూకటివేళ్ళతో పెకలించి పారేసి కొత్త మొక్క నాటే బృహత్తర బాధ్యతను సోనియా జైరాం రమేష్ కు అప్పగించినట్లనిపించింది. సీమలో పార్టీని గడ్దపలుగుతో తవ్వి పారెయ్యడానికి వీలుగా కొణిదెల వారబ్బాయికి, నీలకంఠాపురం రఘువీరారెడ్డికి పగ్గాలు ఇచ్చారట. అందుకే ప్రత్యక్ష పర్యవేక్షణకు జైరాం తో పాటు దిగ్విజయ్‌సింగ్ కూడా సాయం పడతారట్లుంది... ఇదంతా చూస్తుంటే నాకనిపిస్తున్నది ఈనికలలోపే..అందరూ తలొక దుకాణంలో సర్దుకుంటారని..
*గొట్టాల రణగొణ ధ్వనులు. వేటికవే.. బాబుకు ఈటీవి, ఏబిఎన్,ఎన్ స్టూడియో, సివీఅర్.. అప్పుడప్పుడూ మరో రెండూ.. లైవ్ టెలికాస్ట్, జగన్‌కు సరే సాక్షి, అప్పుడప్పుడూ ఎన్టీవీ, టీవీ5. కిరణ్ కు సొంత ఐ న్యూస్. టెవీ9, టీవీ5 అప్పుడప్పుడూ.. సిపిఎం చానల్ వేరే.. చూస్తుండండి.. రెండ్రోజుల పాటు చిన్నా చితకా.. అన్ని చానళ్ళూ "జనసేనలో" పవన భజనలో కొట్టుకుపోవడమే!!

*ఎప్పటికైనా సముద్రం సముద్రమే.. నది నదే! విశాఖ సముద్ర తీరాన ప్రజాగర్జనకు అనుమతి లభించకపోవడం తో 24 గంటల్లో టిడిపీ తన సభావేదికను ఇందిరాప్రియదర్శిని స్టేడియంకు మార్చుకుని వాయ వేగంతో ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. గోదావరి ఒడ్డున రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లొ జై సమైక్యాంధ్ర ఆవిర్భోత్సవసభకు అధికారులు నో.. అందంతో రోడ్డెక్కింది పాపం. ఆర్టీసి బస్టాండ్ వద్ద ఒక అచిన్న స్థలంలో మమ అనిపిస్తున్నారట! ఎలాగైనా బాబు బాబే! కిరన్ రన్..
*విలేకరి ముదిరితే ఎమ్మెల్యే అవుతాడని మా కన్నబాబు నిరూపించాడు. ఇప్పుడు మరో దశ దాటి ఊసరవెల్లి అవుతున్నాడు. ఈనాడు..మాజీప్రతినిధి కె కన్నబాబు కులసమీకరణల నేపథ్యంలో పీఆర్‌పి ఎమ్మెల్యే అవతారమెత్తి. విలీనానంతరం కాంగ్రెస్ రంగేసుకున్నాడు. కొస్తా పసుపుధాటికి ఉక్కిరిబిక్కిరవుతూ. రెండుమూడు రోజుల్లో తెలుగు తమ్ముడై ఒంటికి, ఇంటికి పసుపేసుకుంటాడట!! వినేందుకే సిగ్గవుతున్నది,. రోజూ వీళ్లను చూస్తూ కలిసి మాట్లాడడంతో మాలో సిగ్గే చచ్చిపోయింది.
*యుద్ధసేనలు సాధారణంగా...భూమార్గం, జలమార్గం, ఆకాశమార్గం..అయితే 14న వచ్చే ఎన్నిఉకల 'జనసేన పవన మార్గమట. అదీ. స్టార్ నాయకుడు కదా.. అంచేత పార్టీ పురుడు నొవో టెల్ స్టార్ హోటల్లో..నామకరణంకూడా వెనువెంటనే.. మరి పీటలమీద కూర్చుండే ఆ ధర్మపత్ని ఎవరో!! ఆయనకు అత్యాస లేదు, పోటీ కేవలం 10 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లకే పరిమితం. మరి అటువంతప్పుడు ఇంత ఆయసమెందుకట??
*అన్ని వ్యవస్థలకూ మాదిరి రాజకీయ పార్టీలకు కూడా వ్యవస్థాపకులుంటారు. అదేమాదిరి కొన్నింటికి భూస్థాపితులు కూడా ఉంటారు. కొత్తా దేవుడండీ.. కొంగొత్తా దేవుదండీ!
-------------------------------------------------------------------------------------------------------
12-3-14
ప్రభుత్వ ఉత్తర్వు అమలుకు దిక్కులేదు
**నార్ల వెంకటేశ్వరరావు జీవిత సాఫల్య అవార్డు సహా, రాష్ట్రంలో 31 మంది పాత్రికేయులకు 2008, 2009, 2010  సంవత్సరాలకు ఉత్తమ పాత్రికేయ అవార్డులు ప్రకటిస్తూ 20 నెలల కిందట, 2012 ఆగస్టు 1వ తేదీ, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు(ఘ్.ఓ ఋత్ ణొ.3541)ను అమలు చేయలేని ఈ ప్రబుద్ధుడు విడిపోయిన రాష్ట్రాన్ని కలుపుతాడట. ప్రజలను మభ్యపెడుతూ చివరినిమిషం వరకూ పదవినిపట్టుకుని వేలాడిన వ్యక్తి ప్రజాస్వామ్య విలువను గురించి ఉపన్యాసాలివ్వడం తెలుగు ప్రజల దురదృష్టం.  కేవలం 31 మందికి ప్రభుత్వ పరంగా ఇచ్చిన మాట నిలుపుకోలేని ఘనుడు మూడున్నరకోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాడట. పత్రికలన్నా, పాత్రికేయులన్నా గౌరవం లేని వ్యక్తి బినామీగా ఒక పత్రికను, చానల్‌ను నిర్వహించడం సిగ్గుచేటు. ప్రకటించిన అవార్డులు నాలుగు నెలలోగా అందజేయాలని హై కోర్టు ఉత్తర్వులను జారీ చేసినా కూడా లెక్కజేయని ఈ వ్యక్తి కొత్త రాష్ట్రం ఏర్త్పాటు పై రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును  ఆశ్రయించడం ఆయన విజ్ఞతను ప్రదర్శిస్తున్నది. దివంగత  కాంగ్రెస్ నేతలు, దివంగత  ముఖ్యమంత్రులకు నివాళులర్పించని ఈయన తెలుగుల ఆత్మగౌరవం నిలబెడతాట. రాజకీయ జన్మనిచ్చి ముఖ్యమంత్రిని చేసిన తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసి, అన్నం పెట్టిన చేతిని కాటువేసిన ఈ వ్యక్తి విలువలు, నీతులు చెబుతున్నాడు. మూడున్నర సంవత్సరాల పాలన రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసింది. ఈయన పార్టీ ఎవరికి లబ్ది చేకూర్చబోతున్నది?   నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్.
--------------------------------------------------------------------------------------------------------

11-3-14
*ఈ కొత్త పార్టీల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు? వీరి వెనుక అదృశ్య శక్తులు ఎవరు? ఎవరి అభిప్రాయం వారికి ఉండడంలో తప్పులేదు. తెలుగు చానళ్ళలా పార్టీలు పెరిగితే సర్వం కాలుష్యమే! భయంకర (మానసిక)వ్యాధులు వస్తాయి.
*ఈ మధ్య మా ఆపాత ఆంధ్రజ్యోతి పత్రికా మిత్రుడు 'సింగం' కూడా జూలు విదిలించి, కోటేసుకుని, మైకు పుచ్చుకుని.. తెలుగు చానల్లో దూరిపోయి సమైక్యాంధ్ర గర్జనలు వినిపిస్తున్నాడు. ఔరా! ఎటువంటి పరిణామాలు?
*అభిమానం ఉండొచ్చు కాని, రాజకీయాలలో ఎవరూ వీరాభిమానం తో అంతగా మమేకం కాకూడదు. విశ్వాసం అవసరం, అతి విశ్వాసమే మనకు నష్టం చేకూరుతుంది. నాయకులతో వ్యక్తిగత, ప్రత్యేక అనుబంధం ఉంటే అభ్యంతరం లేదు కానీ లేకుంటే ఎవరితోనైనా సరే కొంచెం దూరంగా ఉంటే మేలు. తరువాత పరిణామాలకు మనం నీరసించిపోతాం, వారు బాగనే ఉంటారు. ఇది 35 సంవత్సరాల వృత్తిపర అనుభవంలో గ్రహించిన సత్యం.
*పార్టీ పదవులే కాదు..పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులూ కూడా కుటుంబీకులే.. ప్రజాస్వామ్యమా వర్ధిల్లు..
*ఆలూ లేదు-చూలూ లేదు వాడెవరి పేరో జంబులింగమట! కాపురం కళ కాలు తొక్కిననాడే తెలుస్తుందట!
చుండ్రు శ్రీహరి- వ్యవస్థాపక అధ్యక్షుడు; కిరణ్‌కుమార్ రెడ్డి-అధ్యక్షుడు; ఉండవల్లి, సాయిప్రతాప్, సబ్బం, హర్ష- ఉపాధ్యక్షులు; శైలజానాథ్, పితాని- కార్యదర్శులు; తులసిరెడ్డి, గంగాధర్, శ్రీనివాస్, దొరస్వామి, రత్నబిందు -కార్యదర్శులట.. మరో ఇంపార్టెంట్ పోస్ట్... కోశాధికారి-రామ్మూర్తి:
సమైక్యాంధ్ర ప్రియ ప్రజలకు మరో పెద్ద షాకింగ్ న్యూస్! గుండెలు అరచేతబట్టుకుని.. ఊపిరి బిగబట్టండి:: సలహాదారు - పార్లమెంటులో పెప్పర్ స్ప్రే!!
*శిశు జననం తరువాత మూడురోజుల బాలారిష్ట దశ దాటి 11 రోజులకు లేదా 21 రోజుకు కాని నామకరణం చెయ్యరు సామాన్యంగా. తరువాత అన్నప్రాశన.. ఆపై అక్షరాభ్యాసం వగైరా తంతులన్నీ .. కాని తెలుగునేలపై పుట్టని పార్టీకి ఈ రోజే పెరెట్టేశారు. రేపు గోదావరి ఒడ్డున పురుడుపోసుకుంటుంది-ట.
1983 తరువాత నాదెండ్ల్ భాస్కర రావు, లక్ష్మిపార్వతి, ఎమ్‌వి భాస్కరరావు, హరికృష్ణ, విజయశాంతి, దేవెందర్‌గౌడ్, చిరంజీవి, పాల్... పార్టీలు పెట్టి పల్టీలు కొట్టారు. దుకాణాలు బంద్. అదృశ్యాలు, విలీనాలు, గల్లంతులు, నిమజ్జనాలు పూర్తయ్యయి. ఇవిగాక అనేకానేక పార్టీలు ఆవిర్భవించాయి. మఖలో పుట్టి పుబ్బలో మబ్బుల్లో కలిసిపోయాయి. ఈ కొత్త సంబరమూ చూద్దాం!!
మాజీలందరూ తాజాగా తెరమీదకు వచ్చారు. పార్టీ రంగేమిటో తెలీదు. హంగుమాత్రం ముందే ఉంది. సభ్యులతో పని లేకుండా వ్యవస్థాపక అధ్యక్షుడు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి తెరమీదకు వచ్చేశారు. అదేంటో! రాజమండ్రి సెంటిమెంటు??
*మార్కెట్ లో వో(నో)టు విలువ అందరికీ తెలుస్తున్నది సార్. బేర(బీర్) సారాలకు ఇది మంచి సీజన్..పంచాయతి నుంచి లోక్ సభ వరకు ఓటును గుత్తకు కోనేయచ్చు..భలే మంచి చౌక బేరమూ.

Like ·  · Share

10-3-14
*కేజ్రీవాల్ మరో చిరంజీవి అయ్యాడు, సొమ్ము వసూళ్లకు దేశం మీద పడ్డాడు. ఆయనతో డిన్నర్ చేస్తే 20 వేల రూపాయలట. ఆయన "ఆమ్ ఆద్మీ" నా సిగ్గు చేటు. భోజనం చేసినందుకే 20 వేల రూపాయలైతే ఇక పార్టీ టిక్కెట్టు కు ఎంత వసూలు చేస్తాడో? అందరూ వసూల్ రాజాలే! వాళ్ళు జనాలను, దేశాన్ని ఉద్ధరిస్తారట..
*మార్కెట్ లో వో(నో)టు విలువ అందరికీ తెలుస్తున్నది సార్. బేర(బీర్) సారాలకు ఇది మంచి సీజన్..పంచాయతి నుంచి లోక్ సభ వరకు ఓటును గుత్తకు కోనేయచ్చు..భలే మంచి చౌక బేరమూ..

9-3-14
*దీన్నిబట్టి నాకు అర్ధమవుతున్న విషయమేమిటంటే..  తెలుగు ప్రసార మాధ్యమాలు అంటున్నట్ల్లు, అనుకుంటున్నట్లు.. టిడిపి కంపనీ మూసివేత జరగదు. కొత్త వాటాదార్లు అమితోత్సాహం ప్రదర్శిస్తున్నారు. వ్యాపారం మళ్ళీ పుంజుకుని మార్కెట్ వాల్యూ పెంచుకుంటుందని "స్టాక్ ఎక్స్చేంజ్" నిపుణులు పేర్కొంటున్నారు. వ్యక్తిగతంగా ఎవరైన వ్యతిరేకించవచ్చు.. సమర్ధించవచ్చు.. ఎవరిష్టం వాళ్ళది. అందరి ఊహలకు భిన్నంగా ఫలితాలు ఉండొచ్చని అభిప్రాయం.

*వీటన్నిటికీ మించిన మహాపరాధం, చారిత్రాత్మక తప్పిదం, మీడియాను దేవుడనుకుని నమ్మడం. ప్రజలను నమ్మితే ఎప్పుడన్నా అధికారం అందుతుంది. పత్రికలపై ఆధారపడితే అదేదో... పట్టుకుని గోదావరి ఈదడమే!!
*ఎప్పుడూ పెదవులకు పదవుల రుచి ఇష్టం.. కాకుంటే ఇన్ని ఊసరవెల్లులు వచ్చిఉండేవా?
పిల్లి తెల్లదా.. నల్లదా అనికాదు. ఎలకను పడుతుందా ఏదా? అన్నదీ ముఖ్యం( బాబు గారి మాటల్లోనే..)నాయకులు పార్టీలు మారినప్పుదల్లా ఓటర్లు కూడా మరుతున్నారు. ఇది దేశవ్యాప్తం.  అందుకే గో.పి.లు కూడా గెలుస్తున్నాయ్!!

8-3-14

*జన్ పథ్ మార్గం.. భజనే లక్ష్యం.. జనం చెవిలో వాయులీనం!! థెరెసా, ఫూలే, మహాత్మ, అంబేడ్కర్.. మూకుమ్మడిగా సోనియాలో నిమజ్జనం....
*ఈ రాజకీయాలన్నీ కుతంత్రాలు, కుమ్ములాటలు.. మనకంటే మన శత్రువు బలవంతుడైతే, మనం బలపడబోమని నిర్ణయించుకుని, ప్రత్యర్ధిని బలహీనుడు చెయ్యడానికి పలు మార్గాలు. వోట్లుచీల్చి లాభపడడానికి దబ్బిచ్చి పార్టీలు పెట్టించడం, పోతీకి నిలబెట్టడం మామూలే.. చరిత్ర చెప్పిన సత్యమిది. పవన్ వెనుక, కిరణ్ వెనుక కూడా బలమైన వ్యక్తులున్నారు, వర్గాలు ఉన్నాయి.
*Woman in man stands first and leads
*Mother is first.. God is next.. Love mother and pray God..
*నూరుపాళ్ళు నిజం. ఇంట్లో అమ్మకు దణ్ణం పెట్టు, నాన్నకు అన్నం పెట్టు,  చెల్లి తోడబుట్టినది, కూతురు నీకు పుట్టినది. ఆ ప్రేమ ఎవరో చెబితే రాదు. ఎవరో చేప్పేరోజు వస్తే మన దౌర్భాగ్యం
*మనకు జన్మనిచ్చినవారు, జన్మంతా తోడుండే వారు ఒక్కరే. ఆమే స్త్రీ. ఆమెను అమ్మ, అక్క, చెల్లి, భార్య, కూతురు, స్నేహితురాలు....ఎప్పుడైనా.. ఏ పేరుతోనైనా పిలు. పలుకుతుంది..
*మాతృ దేవోభవ! అమ్మకు నమస్కారం.. అవనిలో, ఆకాశంలో, అవకాశంలో, అధికారంలో.. సగం. ప్రసంగాలకే పరిమితం, అనుచరణలో మాత్రం శూన్యం. సాధికారత కాదు ఇప్పటికీ పరాధీన యే!! అన్ని దినాల మాదిరే మహిళకూ ఈ సుదినం "అంకితం".
హాటెస్ట్/లేటెస్ట్ కామెంట్స్..

7-3-14
*ఈ మధ్య పార్టీలు జనాలను మిస్సవుతున్నాయి. దీనికి విరుగుడు ఏమిటా అని అలోచించారు. ఒక్క మిస్ కాల్ ఇవ్వండి చాలు. ఇక మీ పని మేము చూసుకుంటాం అని తయారవుతున్నారు. పార్టీలు ఇళ్ళకు వస్తాయని భయపడి జనం తలుపులేసుకుంటుంతే ఇక మిస్ కాలిచ్చి తద్దినం కొని తెచ్చుకుంటారా!! టెవీ చానళ్ళ మాదిరి ఎస్సెమ్మెస్ రోగం ఎక్కువవుతున్నదీ పార్టీలకు.. పార్టీలు -పత్రికలు(చానళ్ళు) కలసి ఉమ్మడి వ్యాపారం!! మొదలవుతాయ్ పెయిడ్ న్యూస్ తతంగం....
*మా కిరణ్/పవన్ కు ప్రచారానికి ఒక కేతిగాడు దొరికాడు.. చూశారా!!
6-3-14
*కనీసం ఏడాది రాష్ట్రపతి పాలన, మనకా అదృష్టం గాట్టిగా రాసిపెట్టి ఉండేమో! భగవంతుడు మనలను ఆశీర్వదించు గాక! రాష్ట్ర విభజనపై రేపు సుప్రీం స్టే ఇస్తే.. తేలే వరకు..అంతా గందరగోళం.. ఈలోగా పార్లమెంటు మూత. ప్రభుత్వాలు పడిపోతయ్..అప్పుడు గ్యారంటీగా "నరసింహ రాజ్యం".
*ఒక్క సారి కిరణ్ డైలాగుల ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లండి....
"నాది కాంగ్రెస్ రక్తం నిండిన కుటుంబం. తండ్రి అమరనాథ్ రెడ్డి అడుగు జాడలు నావి. కాంగ్రెస్ వల్లనే ఇంత స్థితికి వచ్చాను. ఇప్పుడు కాదు ఎప్పుడో ఈ పదవికి రావలసిన వాడినని దివంగత మాజీ ప్రధాని పి వి నరసింహారావు గారు అశీర్వదించారు."  పాపం పివి గారు కిరణ్ ను దీవించడం (ఎప్పుడో ఎవరికీ తెలీదు) ఆయన చేసిన తప్పుల్లో మహాపరాధం. సొంత జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే మద్దతులేదు. రాష్ట్రంలో ఒక్క మంత్రి, ఒక్క ఎంపీ ఈయన వెనకాల లేరు. ప్రధాని పదవి నుండి దిగిపోయిన తరువాత సోనియా పార్టీ టిక్కీట్టు ఇవ్వక పోయినా, ఆయన పన్నెత్తి మాట్లాడలేదు వ్యతిరేకంగా. వైఎస్సార్ అండ చూసుకుని పెట్రేగి పదవుల్లో ఉన్నప్పుడు సోనియాభజన తప్ప ఒక్క సారి పివిని స్మరించలేదు.. ఈనో మహానాయకుడు. ఈయనదో పార్టీ!!
*నిన్నటివరకు మన మిడిమేలపు మీడియా జెడి లక్ష్మ్నినారాయణ 'ఆప్' లో చేరుతున్నాడని సొల్లు కక్కింది.. తీరా జాయింట్ కమిషనరయ్యారు. ఎన్నికల టైములో ఎన్ని పార్టీలుంటే గొట్టాలకు అంత కరెన్సీ!! ఫుల్ డిమాండ్!!

No comments:

Post a Comment