Thursday 9 January 2014

వ్యాఖ్యా పురాణం:  

-------------------

ఇవ్వాళ్టి నుంచి కొత్త సరుకు కదా!!ఇది నీటుగా పరమ ఘాటుగా ఉంటుంది.... 


8-1-14

*మీకు తెలుసా? పి వి గారిని ప్రధాని చేసింది సోనియానట! కాంగ్రెస్ పరిశోధనా పరమజ్ఞాని "గులాం" ఆజాదు ప్రవ-చించారు. నిజంగా ఎంత జాదూ నో.. కాదా!
మరో ముఖ్య విషయం కూడా చెప్పారు: కిరణ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రట! 
కానీ రోజువారీ వ్యవహారం చ్వూస్తుంటే పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం అలా అనుకుంటున్నట్లు లేదు..

*సింగడు అద్దంకి వెళ్లాడు వచ్చాడు - విలేఖరులు సి ఎం ప్రెస్ కాంఫరెన్స్ కు తోసుకోని వెళ్ళి చెప్పినదంతా 20 నిమిషాల్లో రాసుకొచ్చారు.
తానేమి చేస్తానో అసెంబ్లీలో చూడమని ఆయన అంటే.. అలాగే అని వచ్చారు.. చీఫ్ విప్, స్పీకర్, సి ఎం గా అనుభవమున్న తనకు నిబంధనలు, అధికారాలు బాగా తెలుసన్నారు. నిజమేకదా!!

*పార్టీని, దేశాన్ని రక్షించడానికి ఇదే చివరాఖరి ఫైనల్ ప్రయత్నం.. ఆ కుటుంబంలో ఇవ్వాళ్టితో అందరి వంతూ పూర్తయింది.. ఇక ఈ జాతికి ఆ ఇంటి పెంపుడు జంతువులే మిగిలిన ఆశాకిరణాలు..  జయహో!!
 
7-1-14

*ఎన్నికల్లో తిమ్మిని బొమ్మని చేయగల సత్తా ఉద్యోగులకే ఉందట.. అందుకూ అందరు రాజకీయ రంగులోళ్ళు ఎన్జీవోల వెంట పరుగులు..
తర్వాత నాలుగున్నరేళ్ళ పాటు చెప్పుకింద నలిపేస్తారు..
*శవాన్ని కూడా వదలకుండా ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ అంసంగా మలుచుకునే వ్యక్తి రాష్ట్రంలో ఒకరే ఒకరు. శవం ఎక్కడుంటే అక్కడప్రత్యక్షం.. గోతికాడి నక్క, గొట్టాల ముందు ఒకతే రొద:: . 
మనుషులు బతికిన్నప్పుడు, చచ్చినతరువాత కూడా మసిబూసి పరువు రచ్చకీద్చి కుటుంబానికి క్షోభ కలిగించేవి చెత్త తెలుగు గొట్టాలు.

6-1-14

*సచివాలయం సీమాంధ్ర(సాధారణ) ఉద్యోగుల సంఘం తాజ్ బంజారా లాంటి అతి చిన్న హోటల్ లో అఖిల పక్ష సమావేశం నిర్వహించిందట! దానికి తల్లి, పిల్ల, జెల్ల పార్టీల 95 మంది(ద)ఎమ్మెల్యేలు చొంగలార్చుకుంటూ వెళ్ళారట. అందులోనూ అయిదుగురు మంత్రి(?) పుంగవులు కూడా ఉన్నారట!! 
ఉద్యోగులేమిటి, తాజ్ బంజారా ఏమిటి? అఖిలపక్షమేమిటి? మంత్రులేమిటి?? 
ఎవరికున్నా లేకున్నా.. వినడానికి మనకు సిగ్గనిపిస్తున్నది కదూ!!
*నీతి గురించి, ఓటు గురించి, విలువల గురించి పొద్దస్తమానం గొంతులు చించుకునేది గజ అవినీతి గాళ్ళే. "దొంగే! దొంగ.. దొంగ... అని అందరికంటే ముందర పరిగెత్తడం" లాంటిది. 
ఉచిత పథకాలు ప్రమాద కరమట.. ఓటర్లు నాయకులను వ్యక్తిగత ప్రయోజనాలు కోరడం ప్రమాదకరమట!! కానీ!! చానళ్ళకు, పత్రికలకు మాత్రం ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వకపోతే మాత్రం పత్రికాస్వేచ్ఛకు ఉరివేయడమేనని రచ్చకెక్కుతారు... మురికి చానళ్ళు, చెత్తరాతలు లేకుంటే పాపం ప్రపంచం అడుగు ముందుకెయ్యదని వాళ్ళ తెలివి...
*అశోక్‌బాబు రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ చేశాడా? ప్రధానిగా ఎన్నికయ్యాడా? ఒక ప్రభుత్వ నాన్-గజిటెద్ ఉద్యోగుల సంఘం (ట్రేడ్ యూనియన్ కాదు)సుమారు వెయ్యిమంది లోపు ఉన్న బృందానికి జరిగిన అంతర్గత ఎన్నికలు అవి. వార్తా చానళ్ళు ఎందుకంత ప్రాముఖ్యత నిచ్చి లైవ్ కార్యక్రమాలు ప్రసారం చేశాయో అర్ధం కాలేదు. పత్రికల్లో మొదటి పేజీ వార్తనా అది? ఉద్యోగం చెయ్యకుండా ప్రభుత్వాలను, రాజకీయాలను శాసించే ప్రక్రియ లో విమానాల్లో రాష్ట్రాలు తిరగడానికి, డిల్లీలో నిరసన ప్రదర్శనలు చేపట్టడానికి నిబంధనలు ఎలా అనుమతించాయి. ఆయన జాతీయ రాజకీయ నాయకుడా? ప్రజాస్వామ్యంలో ఈ వ్యవహారాలు అభిలషణీయమా! అంత ఆసక్తి ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రత్యక్షంగా ప్రవేశించవచ్చు కేజ్రీవాల్ మాదిరి. ఈ అభిప్రాయం గతంలో కోదండరాం విషయంలో కూడా పలువురు వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు భయపడుతూ ఎందుకు అతని వెనుక నడుస్తున్నాయి? చట్టం మౌనం ఎందుకు వహిస్తున్నది?

5-1-14

*ముష్టి మాటలు మాట్లాడేందుకు నాయకులు ఇష్టపడేది "ఇష్టాగోష్ఠి".
*ఎన్నికల వేళ కుల కలం, కొత్త పార్టీల కలకలం సాధా"రణ"మే.
*కొప్పుంటేనే ఏముడైనా పెట్టొచ్చు- ఎన్నికలొస్తేనే ఏ గోడైనా దూకొచ్చు.  
*మేధోమధనంలో చర్చించాకే నిర్ణయాలు- ని"గూఢ" మేధావుల అవసరం అప్పుడేగా!! 
*అవినీతికి ఆధారాలు చూపాలి-సిఎం: ఆ రుధిర ధారలో కట్టడాలే కొట్టుకుపోయాయి, దారాలు కూడా మిగల్లేదు.
*సంకల్పదీక్ష అర్ధంకాని బ్రహ్మపదార్ధం. ఆరుగురు ఎంపీలు కూర్చున్నారు(పడుకున్నారు), ఏడో ఎంపీ కాని, కేంద్ర మంత్రికానీ పరామర్శకు రాలేదు. నిమ్మరసం దేనికిచ్చారో ఎవ్వరికైనా తెలుసుంటే చెప్పండి.   
*సంకల్పదీక్షకు సీమాంధ్ర ఉద్యోగుల హాజరు-జనాలు ఎటూరారు, ఎక్కడైనా పోరాటంలొ ముందుండే శిఖలు అవేగా!   
*చెత్త తరలింపు నిరంతర ప్రక్రియ- ము(రికి)నిసిపాలిటీ మంత్రి: నిజమే కాంగ్రెస్ లో జరుగుతున్న నిర్విరామక్రియ అది..ఎంత తీసినా అంత చెత్త పేరుకుపోతుందక్కడ. 
*గతంలో లేఖకులుండేవారు, తర్వాత విలేకరులున్నారు, ఇప్పుడు విలే"ఖరులు" ఎక్కువవుతున్నారు.
*రాజకీయుల్లో సోమలింగాలు-- పాత్రికేయుల్లో జంబులింగాలు.
*తొందరపడి కాంగ్రెస్‌ను వీడొద్దని మాజీ ప్రరాప ఎమ్మెల్యేలకు సూచన- ఇది కూడా లేకుంటే.. తల దాచుకొన మీకు తావైన లేదే!! 
*కొడుకులు తలలకే కాదు.. పార్టీలకు కొరివి పెడతారు..   


3-1-14

*సహచర పాత్రికేయులకు విన్నపం:
------------------------------------------
అవినీతి, అక్రమార్జన, ఆశ్రిత పక్షపాతం, ఆదాయానికి మించిన ఆస్తులు... అంటూ రాజకీయ నాయకులకంటే రోజూ గంటల తరబడి గొంతులు చించుకుని.. పేజీలకు పేజీలు సూక్తులు రాస్తున్న పాత్రికేయులూ(కంట్రిబ్యూటర్ నుంచి సంపాదకుని వరకు..) మనం కూడా 1996 నుంచి 2013 చివరి వరకు మన కుటుంబ ఆదాయాలు, ఆస్తులు, మనకున్న వ్యాపారాలు స్వచ్ఛందంగా ప్రకటించి సచ్ఛీలత నిరూపించుకుందామా? వాటిపై న్యాయ విచారణ కోరుకుందామా!!

1-1-2014

*బాబును ప్రశ్నిస్తే కనీసం జవాబుగా నోరైనా తెరిచాడు.. ఘన నాయకులు, గణ నాయకుల దగ్గర నోరెత్తలేని వీర శూర విలే"ఖరుల"కంటే ఎర్నలిస్టులకంటే "రాంబాబు" బెటర్ కదా? జవాబు వచ్చినా రాకున్నా ఎదురుగా నిలబడి అడిగాడు. సొమ్ముకు మరిగిన వాళ్ళు కొన్ని భవనాల ప్రహరీల దగ్గర తలలు, తోకలూపుకుంటూ బిస్కత్తులు తింటుంటారు.
*క్రికెట్ చివరి ఓవర్లో ఆట మొదలుకాకుండానే, బంతి లేకుండానే సిక్సర్ కొట్టాలనుకున్న బ్యాట్స్ మాన్ హిట్‌వికెట్.
శంకర రావు, డి.ఎల్.రవీంద్రా రెడ్డి, శ్రీధరబాబు..హ్యాట్రిక్ అనుకున్నాడు. అయితే ఇక పీకుడు మొదలయింది...
బ్యాట్‌మాన్ కు ఫోర్త్ అంపైర్ సలహాదారుడు??

No comments:

Post a Comment