Saturday 18 January 2014


                                    సూటీ పోటీ  - మాటల తూటాలు: 


18-1-14

*ఉచిత మంచినీళ్ళొద్దు, ఉచిత బియ్యం అసలే వద్దు, ఫ్రీ కరెంటు తీసెయ్యండి, సమైక్య-ప్రత్యేకాలు పక్కన పెట్టండి..హైదరాబాద్ సహా అన్ని పట్టణాల్లో ఆటోలను మీటరు రేట్లకు నడపండి. బస్ స్టాపుల్లో సిటీ బస్సులను ఆపండి, స్త్రీల సీట్లలో వారికి చోటివ్వండి, వీధిలో రెండ్రోజుల కొకమారు చెత్త తీయించండి, రోడ్లపై అమ్మాయిలు/మహిళల వేధింపు రాయుళ్లను శిక్షించండి. మందు దుకాణాలు రాత్రుళ్ళు పూర్తిగా మూసేయండి..తల్లులపై వొట్టేసి చెప్పే వాళ్ళకు  ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా తెలుగు వాళ్లందరూ  వోట్లేస్తారు..

*వైఎస్సార్ పేరును వైఎస్సార్‌సిపి మార్కెట్ చేసుకుంటున్నది; వైకాపా సభ్యులు అధికారం కోసం మాట్లాడుతున్నారు-  శాసన సభలో శైలజానాథ్!!!!
ఏదీ!! గాంధీ (?) పేరును  కాంగ్రెస్ అర్ధశతాబ్దంగా సొమ్ము చేసుకుంటున్నట్లు; పాపం ప్రజా సేవకు కాంగ్రెస్వారు ఎంత తహతహలాడుతున్నారో... కదండీ!!

*జన నేతలు, భజన నేతలు, విభజన నేతలు.. అన్ని పార్టీల్లో ఉన్నారు. ఎంత కాకపోతే ముసాయిదా బిల్లుపై 9024 సవ"రణ"లు అందుతాయి శాసనసభ స్పీకరుకు?
సోనియా, రాహుల్, జగన్, బాబు, రాఘవులు, నారాయణ, ముప్పవరపు.... అందరికీ భజనలు, అందరిలో విభజనులు..
ఎటుతిరిగీ సుజనులు, సజ్జనులే కరవయ్యారట్లయింది.. .తెలుగు సభలో!!

*ఆయన త్రిపత్నీవ్రతుడు..ఆమె ముగ్గురు భర్తల పతివ్రత..చక్కని కాంబినేషన్.. అదీ చెప్పండి మరి....
వారు శాసనకర్తలా, న్యాయమూర్తులా, పాలనాధికారులా, పాత్రికేయులా, రక్షణధికారులా?? వృత్తులు, వ్యక్తులు కాదు ప్రవృత్తులు, వ్యక్తిత్వాలు ముఖ్యం...

*టిడిపి-కాంగ్రెస్ కుమ్మక్కు : వైఎస్అర్‌సిపి/ గ్రెస్-వైఎస్ఆర్‌సిపి కుమ్మక్కు : టిడిపి/ టిడిపి-వైఎస్అర్‌సిపి కుమ్మక్కు : కాంగ్రెస్/ టీఅర్ఎస్-బిజెపి కుమ్మక్కు : కాంగ్రెస్ /
టీఅర్ఎస్-వైఎస్ఆర్‌సిపి మిలాఖత్: టిడిపి;
కాంగ్రెస్-వైఎస్ఆర్‌సిపి-టిడిపి కుమ్మక్కు: టీఅర్ఎస్;
మేము-మాప్రత్యకత : బిజెపి;
అంటే ఏమర్ధమయిందీ...అన్నీ మూడురంగుల తానులో ముక్కలే. కొత్తేముందీ!
రంగు వెలిసిందా, కలిసిందా ఫలితం ఒకటే..అది కాలం నిర్ణయిస్తుంది. .

17-1-14

*India is facing gas trouble. Rahul knows gas-tric(k)

*ఇవ్వాళ రాత్రినుంచి ఆటోలు బంద్.. 27 రాత్రి నుంచి బస్సులు బంద్.. 23 స్కూళ్ళు బంద్, కాలేజీలు బంద్.. ఇంతలో ఎన్నికల ప్రకటన వస్తుంది, తరువాత ప్రభుత్వం బంద్.. ప్రజల ఊపిరి బంద్!!.... ఇవన్నీ ఇప్పుడేదో సక్రమంగా నడిచేడుస్తున్నట్లు.

*రాజీనామా చేశానని చెప్పి నక్కి కూర్చున్న ఆ ఏడో ఎంపీ అసలు నోరెత్తరే!!  నువ్వు పేరంటానికి (AICC) రావద్దన్న ఇంటికి వెళ్ళి బయట నిల్చోవడం  ఎంగిలాకుకోసం ఎదురుచూడడం  కాదా!!
*శాసన, కార్యనిర్వాహక, న్యాయ, పాత్రికేయ వ్యవస్థలలో వ్యక్తులకు డబ్బు ఎరవేసి ఎగేసుకుపోయిన మరుక్షణం నుంచే ఆ నాలుగు అవస్థల పాలై పూర్తిగా కుళ్ళిపోయాయి. ఇది నూరు పాళ్ళు నిజం.

*మోడీ బిజెపికి మైనస్ పాయింటవ్వొచ్చుకాని.. దేశప్రధాని పదవికి మాత్రం నూరు శాతం ప్లస్సే!! కాంగ్రెస్ కు, పి ఎం పదవికి రాహుల్ పూర్తిగా మైనస్. సందేహం లేదు. నేనకుంటా  పివి, వాజ్‌పేయీలు మేదకులైన సాధకులు. తద్విరుద్ధంగా మోడీ దూకుడున్న సాధకుడు. ఇందిరలా నియంత కాకపోవచ్చుగాని నియంత్రణా శక్తిగా నిలదొక్కుకోవడం ఖాయం.  ఎవరు  అంగీకరించకున్నా ఇది నా అభిప్రాయం..      

*నాకేదో అవుతుందని కాదండీ.. పాపం ఆ సినిమాకేమవుతుందో నన్న బెంగ..  ఓకే..భరోసా ఇచ్చారుగా.. చూస్తా!!

*భేతాళుణ్ణి మోస్తున్న విక్రమార్కుడు కనబడడం లేదు.. అంతా తెరవెనుక తథికిణతోం!!~  భేతాళుడు ఏఇసిసిలో ఇరుక్కుపొయ్యాడు.. ఇకిలించాడు, సకిలించాడు  కూడా!!  

*తా వలచింది రంభ.. తా మునిగింది గంగ.. తను రాసేదే నిజం, తను చెప్పేదే వేదం.. తన నాయకుడే దైవం.. ఆ మాత్రం నమ్మకం లేకపోతే మనిషన్నవాడు బతకడం కష్టం..

*మూడేళ్ళుగా మొత్తం జగన్నాధమన్నారు.. ఇప్పుడేమో స్వరం మారి సర్వం సింగినాధం అంటున్నారు. కాల మహిమ కదా!
ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరూహించెదరు?

16-1-14

* ఒపీనియన్స్ మార్చుకోనివాడు ఎలా పొలిటీషియన్ కాదో.. రెండు నాలికల పాళీతో రాయనివాడు జర్నలిస్టూకాదు..

*తిరుమలలో దాదాపు ప్రతి విలేకరికి ఒకటికి మించి దుకాణాలు. ఉచిత నివాసాలు. ప్రెస్ క్లబ్ పేరిట ఒక కాటేజీ. దర్శనాలు, సేవా టిక్కెట్లు,వి ఐ పి పాసుల్లో, ప్రసాదాల్లో, కాటేజీల్లో కోటాలు, వాటాలు.... పునాదుల్లో పాతుకు పోయారు. రోజువారీ ఆదాయం ఎంతో ఆ వెంకన్నకే తెలియాలి. యాజమాన్యాలకు వ్యాపార ప్రకటన సేకరణ సేవలు. అక్కడ ఎందరికి అధికారిక గుర్తింపు కార్డులున్నాయో, వారిలో టిటిడి సంబంధీకులెందరో.. సమాచార శాఖ చెప్పాలి.

15-1-14

*పత్రికలు, చానళ్లలో అనునిత్యం వార్తల్లో మనకు వినిపించే, కనిపించే పదాలు..మరీ మూసలో పోసినట్లు..
చాందస మతతత్వవాది, దారుణ హత్య, ఘోరప్రమాదం, భర్త దురాగతం, బరితెగించిన భార్య, కసాయి తల్లి దండ్రులు, మృగాళ్ళు, కామాంధులు, కరుడుగట్టిన నేరస్థుడు, సభ్య సమాజం సిగ్గుతో తలవంచునేలా, అగ్నిప్రమాదంలో ఆస్తిదగ్ధం, మంటలార్పుతున్న ఫైర్ఇంజన్లు, మహిళ/యువతి/ బాలికపై హేయాతి హేయంగా అత్యాచారం, ఏసిబి వలలో తిమింగిలం, పోలీసు దాడులు, అవినీతి పంకిలం, ధ్వజమెత్తారు-మండిపడ్డారు-విరుచుకుపడ్డారు-దుమ్మెత్తారు, నడిరోడ్డుపై అసభ్యకరంగా, చలిపులి, మండుతున్న ఎండలు, రైలు ఢీకొని ఒకని మృతి...

*అసెంబ్లీ కోరితే టి బిల్లుపై రాష్ట్రపతి మరో 10 రోజులు గడువు పెంచే అవకాశం: పి టి ఐ వార్తాకథనాన్ని సాయంత్రం నుంచి అన్ని తెలుగు చానళ్ళు ఊదరగొట్టేస్తున్నయ్..
డిల్లీలో అన్ని తెలుగు పత్రికలు-చానళ్ళకు, అయిదు ప్రముఖ ఇంగ్లీషు పత్రికలకు అంతమంది చేతులు తిరిగిన, తలలు పండిన ప్రతినిధులకు ఆ సమాచారం ఎందుకు అందుబాటులోకి రాలేదో? ఉప్పందించే వారు కరవయ్యారా? కోర్ కమిటీ సమావేసం పూర్తయిన తరువాత చూడండి ఎన్ని కథనాలొస్తాయో!! విజయవాడలో కొత్త పార్టీ ఫ్లెక్సీల మీద ఇవ్వాళ ఉదయం పుంఖాను పుంఖాలుగా వచ్చినట్లు.

*పార్టీలు వేరైనా, సిద్ధాంతాల్లో వైరుధ్యాలున్నా, వ్యక్తిగత విమర్శలకు దూకుడైనా.. ప్రాంతీయంలో, రాజకీయ రగడలో, మసి ప్రచారంలో సమైక్యమే..
ఇవ్వాళ ఉదయం తెలుగు చానళ్ల విశ్లేషణ కార్యక్రమం విషయం "సాక్షి, మహాటీవి, టీవీ9" ఒకటే!
"సీమాంధ్రలో కిరణ్ కొత్తపార్టీ ఫ్లెక్సీ వార్". ఏబిఎన్‌లోనూ ఎస్సెమ్మెస్ పోల్ కూడా దానిపైనే!!
దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అనొచ్చా??

14-1-2014

**రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నది మెజారిటీ ప్రజల ఆకాంక్ష. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాజ్యాంగం పనిచెయ్యాలి-- సమైక్యవాదులు/మీడియా..
మరి... ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో గ్రామీణ ప్రజలు కోడిపందాలు ఉండాలనుకుంటున్నారు. చీట్లాట కోరుకుంటున్నారు.-- పోలీసులు, మీడియా ఎలా చట్ట విరుద్ధమంటాయి?

*రాజ్యాంగ బద్ధమైన కేంద్ర క్యాబినెట్, రూపొందించిన నిర్నయం ముసాయిదా, రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి పంపిన ముసాయిదా బిల్లును, రాజ్యాంగపై ప్రమాణం చేసిన శాసన సభ్యులు, ఎంపీలు, మంత్రులు.. మంటల్లో తగలబెట్టడం నేరంగా అనిపించడం లేదా? కనిపించడం లేదా? సర్వోన్నత న్యాయస్థానం కూడా తమకు ఈ దశలో అధికారం లేదని స్పష్టం చేసినా రాష్ట్రపతి నుంచి వచ్చిన అదేశాలను సాధారణ ప్రభుత్వ ఉద్యోగి బహిరంగంగా దగ్ధం చేయడం ఎలా సమర్ధిస్తారు?

*కోడిపందాలు ఆడాలా వద్దా, మందు ధర పెంచాలా వద్దా, సినీ నాయికలు సంసారాలు ఎవరితో చెయ్యాలి, ఏ సినిమాలో హీరో, హీరోయిన్లు ఎవరు ఉండాలి, పండగ వేళల్లో రైళ్ళు, బస్సులు వేల సంఖ్యలో రాయితీ పై జనాలను తీసుకెళ్ళాలా, రేట్లు పెంచాలా, తిరుమల లో సర్వదర్శనం-ప్రత్యేక సేవలు ఎవరి ఆదేశాలమేరకు అమలు చెయ్యాలి, ఎన్నికల్లో ఏపార్టీ ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి, ధార్మిక సంస్థలు, మఠాధిపతులు ఎలా వ్యవహరించాలి, పోలీసులు ఎవరిని ఎప్పుడు అరెస్టు చెయ్యాలి, ప్రైవేటు బస్సులను అనుమతించాలా వద్దా, ముఖ్య మంత్రిగా ఎవరుండాలి, కోర్టులు ఎప్పుడు ఎవ్చరికి బెయిలివ్వాలి, ఎవరికి ఎన్నేళ్ళు శిక్ష విధించాలి, రేపు రాజ్యసభ ఎన్నికలకు ఎవరికి అర్హతలున్నాయి, అసలు రాష్ట్రాన్ని విభజించాలా వద్దా, బిల్లుపై వోటింగ్ పెట్టాలా-కూడదా... చివరకు ప్రధాని రాహులా? మోడీనా?.... ఇటువంటి జటిల సమస్యలన్నింటికీ చిటికెలో పరిష్కారం చూపే హక్కు- నిర్ణయించే అధికారాలు ఈ దేశంలో ఎవరికున్నాయో తెలుసా??
2008 తరువాత ఆవిర్భవించిన అయిదేళ్ళ అపార అనుభవం, వయసు కల తెలుగు చానళ్ళలో సిబ్బందికి.....

*గోతులు తీసి నీతులు పూడ్చిపెట్టే పత్రికలు, ప్రసార  మాధ్యమాలకు పాత్రికేయులు సోమవారం (13-1-2014) మధ్యాహ్నం సుమారు రెండు గంటలకు పైగా ప్రెస్ క్లబ్, హైదరాబాద్ ప్రాంగణంలో నిర్వహించిన "సమాచార హక్కు చట్టం-జర్నలిస్టులు" సదస్సు వార్తను ప్రచురించేందుకు కూడా ఉత్సాహం కనబరచలేదు. కొన్నయితే అసలు పట్టించుకోలేదు.. ఎందుకంటే ఈ అంశం వారి వ్యక్తిగత, సంస్థాగత రాజకీయాలకు నచ్చని విషయం. ఆసక్తి గల అనన్య సామాన్య జన హృదయాలకోసం

12-1-14

*రవి గాంచనిచో కవి గాంచు నెయ్యెడన్!!- ఇది పాత పద్యం.. చానల్ దూరని చోట  ఫేస్‌బుక్ దూసుకుపోతుంది!!- ఇది కొత్త గద్యం.

*గుండె కొట్టుకుంటుంది..అంతా లబ్ 'డబ్బే'. గుండెకు కోతపడుతుంది, అది పగులుతుంది.. దానిది రక్తదాహం... ఎప్పుడూ రక్తం కావాలి. అది ఆగితే ఇక అంతిమసంస్కారమే!!
హృదయం విలవిల లాడుతుంది. అది ప్రేమిస్తుంది, ద్రవిస్తుంది, జాలి పడుతుంది.. దాని అనుభూతి అనిర్వచనీయం. సువిశాలం, ఎల్లలు లేవు. సంస్కారానికి ప్రతీక సహృదయం.
ఎంత తేడా! గుండెకు - హృదయానికి ??

*ఇవ్వాళ ఇంతమంది ఇన్ని మాట్లాడారు.. ఒక్కళ్ళంటే ఒక్కరు పాపం ఆ తలపాగ చికాగో స్వామిని తలుకోలేదు.. కొన్ని టీవీలు మినహా!!

11-1-14

*అన్న కేజ్రీవాల్. జనత దర్బార్ పెట్టి.. దభేల్ మన్నాడు. జనం తొక్కిడెక్కువై తట్టుకోలేక పరార్!!  బాబూ! నీకిది కొత్త ప్రయోగం లాఉంది.. నీ చిన్నప్పుడే మా ఎన్టీఆర్ (ప్రజల ముంగిట ప్రభుత్వం)ప్రజలవద్దకు పాలన, ఆయన అల్లుడు బాబేమో జన్మభూమి, ఆతర్వాత రాజన్నేమో సీఎం క్యాంప్ ఆఫీసులో వారంలో నాలుగయిదు రోజులు ప్రజా మేలా..పల్లెబాట, నగరబాట.. ఇక మాకిరణేమో రచ్చబండ..అన్నీ అయిపోయి చేతులూ, కాళ్ళూ జాయింటుగా ఎత్తేశారు. అసలు "ఆన్నలు" ఎప్పుడో ప్రజాకోర్టులు పెట్టేశారు..నీకు తెల్దేమో!! !![[సారా పాతదే, సీసా పాతదే.. గుటకేసేవాడూ పాతోడే.. ఎటొచ్చీ లేబిల్, పొద్దెరగని బిచ్చగాడు మాత్రమే కొత్త!! "పవర్" బట్టి లెన్స్‌లు మారుతుంటాయ్!!]]

*వంట గ్యాస్ (ఇండేన్)14.20 కె.జి సిలిండర్ ధర ఇవ్వాళ ఎంతో తెలుసా? అక్షరాలా రు.1327.50. మరి ఇందులో సబ్సిడీ ఎంతో తెలీదు. బ్యాంక్ అక్కౌంట్ కు క్రెడిట్ కావాలి. అది ఎంతో చిదంబరం/మన్మోహన్‌కు మాత్రమే తెలుసనుకుంటా.. ఇప్పుడే పది నిమిషాలకింద సిలిండర్ డెలివరీ ఇచ్చి ఈ బిల్లు నా ముఖాన పడేసి వెళ్ళాడు. ఏజెన్సీ బాయ్!!

10-1-14

*ఎవడి బస్సు వాడిది.. ఎవడి పార్టీ వాడిది, ఎవడి చానల్ వాడిది, ఎవడి పేపర్ వాడిది.. ఎవడి ఏడుపు వాడిది, ఎవడి కులం వాడిది..కానీ సొమ్ము దగ్గర మాత్రం అందరూ కామన్...!!
*ఒక్కొక్క తెలుగు చానల్ ది ఒక్కో మార్గం. సీమాంధ్ర చానళ్ళు అసెంబ్లీలో విభజన వ్యతిరేక చర్చలకు ప్రాముఖ్యత, కొన్నేమో అనుకూల చర్చలకు ఇంపార్టెన్స్, ఒక చానలేమొ వాకౌట్ చెసిన పార్టీని భుజాన..


Sri V V Sridhar Guruji:

**JEALOUSY IS AN ACT OF COWARDICE.... IF YOU FEEL JEALOUS, YOU START BEHAVING QUIXOTICALLY.... JEALOUSY WILL FIRST BURN YOU.... JEALOUSY IS MORE BECAUSE OF INSECURITY.... I KNOW OF A WOMAN WHO BLOCKED THE ENTRY OF A GIRL IN TO A GROUP OF WHICH SHE IS AN ADMIN... JUST OUT OF POSSESSIVENESS AND JEALOUSY.... PEOPLE WHO ARE JEALOUS CAN NEVER BE JOYOUS.... THEIR MIND WILL BE FULL OF GRIEF... THEY CANT BE PEACEFUL IN LIFE.... BETTER DROP JEALOUSY....OTHER WISE YOU WILL 'GEL' WITH SOMETHING WHICH WILL MAKE YOU 'LOUSY' AND THATS THE ROLE OF JEALOUSY....


**U CANT BLAME ANY ONE.... PEOPLE ARE JUST THE WAY THEY ARE.... THAT DOESNT MEAN THAT YOU SHOULD LISTEN TO ALL THE TRASH THEY SPEAK AND SPOIL YOUR PEACE...YOU HAVE TO GROW AND LEARN TO IGNORE.... UNLESS YOU ALLOW THEM TO SPOIL YOUR PEACE, NO ONE CAN EVER DENT IN TO YOU.... LET THEM BEHAVE THE WAY THEY WANT....THAT SHOWS THEIR IMMATURITY...HAVE A 'DONT BOTHER ATTITUDE' AND IGNORE WHAT THEY SAY...IGNORING IS NOT DISRESPECTING...YOU DONT IGNORE THE PERSON, U R JUST IGNORING THEIR WORDS, THEIR PRINCIPLES AND POLICIES BECAUSE IT AFFECTS YOUR PEACE...YOU SHOULD LEARN THE ART TO BE THERE PHYSICALLY AND NOT BE THERE MENTALLY....U HAVE PRIMARY DUTY TOWARDS YOURSELF TO BE HAPPY, SO THAT YOU CAN DO A GREAT SERVICE OF MAKING OTHERS HAPPY....LORDS MERCY AND GRACE BE WITH YOU IN ACHIEVING THIS ENDEAVOUR....

No comments:

Post a Comment