Tuesday, 10 December 2013

          ఉత్తరాదిన ఊడ్చేసింది. కాంగ్రెస్ ఏడ్చేసింది. 

                            ఎన్నికల్లో తేలాయి వా(రా)తలు..  
_______________________________
9-12-13

*మంత్రిపదవి లేక నాలుగున్నరేళ్ళుగా Joker Carduku సంధి ప్రేలాపనలు తగ్గలేదు. సీక్వెన్స్ కాకపోయినా పరవాలేదనుకుని రోశయ్య, కిరణ్ కూడా రాజశేఖరరెడ్డి డిస్కార్డ్ చేసిన జోకరు ముక్కను ఎత్తుకోలేదు. పారేసిన జోకరు చుట్టూ ప్రతిరోజూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలమ వద్ద భుజకీర్తుల్లాంటి లంబు-జంబు వీర విలేఖరులు.. పాతికమందికి పైగా రెండుగంటల అకాలక్షేపం.. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. ఇంకొంచెం లెవెల్..

*Social media.. Facebook, twitter.. etc are much ahead of print and electronic media in many aspects. Opinions, comments, analysis, observations, jokes and many incidents first appear on social media. After 8 hours or next day we come across the same in print/ electronic media with some modifications. Basing on FB/Twitter many stories have been taking new shape. Social media has become very powerful and fast nowadays.

*ఏంత మొగోడైనా అంతా మూటగట్టలేడు.. రేపు మన రాష్ట్రంలో నైనా 294/42 గంపగుత్తగ ఎత్తుకుంటాడా ఎవరైనా?  
 *ఎర్రకోట వద్ద "బంగారు చీపురు" చిహ్నం ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంటుందంటారు? ఊడవడం డిల్లీ నుంచే మొదలిడదాం..
*ఉత్తరాదిన జనం వార్-షిప్.. దక్షిణాదిన వర్‌షిప్.. అదీ తేడా!!
ఇక్కడ జీరో హీరో అవుతాడు. అక్కడ హీరో జీరో అవుతాడు..

*తాము మునిగితేకానీ లోతు తెలీదు. తాను చేస్తే సంసారం.. ఎదువాడిది వ్యభిచారం.. ఇదీ మన రాజకీయం.  

*ఈ రోజు యాంటీ కరప్షన్ డే!  ఈ శుభసందర్భాన మనం "అవినీతి శ్రీ", "అవినీతి భూషణ్", "అవినీతి విభూషణ్", "అవినీతిరత్న", "అవినీతి చక్ర", అవినీతి వీర చక్ర" అవార్డుల ప్రారంభానికి శ్రీకారం చుట్టవచ్చునేమో! కాంపిటిషన్ హెవీగా ఉంటుంది. జడ్జీలే కరప్టయ్యే ప్రమాదం మెండు.. అమ్మో వద్దు లేండి. ఈ దేశం, ప్రజలు మనలను క్షమించరు. ఊరుకోరు, ఉరేస్తారు..

*దేవుళ్ళకు గుడికడతారు.. ఉన్నోళ్ళకు సమాధి కడతారు.. అర్ధ శతాబ్దం కిండతే ఉంది పరిషత్ బహుమతి పొందిన ఒక నాటకం..
"సమాధి కడుతున్నాం చందాలివ్వండి".

*ఉత్తరాదిన అవినీతిని చీల్చి చెండాడారు. మనం అవినీతికి పట్టం కట్టడానికి అంగలార్చుకుంటాం. పైసా మే పరమాత్మా..ఏడాదిలో ఏరోజొచ్చినా, ప్రతిరోజొచ్చినా ఎగబడతాం. మనం విగ్రహారాధ-కులం.

*ప్రతి అడ్డమైన వాడూ పార్తీ పెడతాదు మన దగ్గర. అడ్డమైన సంపాదనతో ఆర్జించిన సొమ్మున్న ఘనులం కదా!!

*ఎన్టీఆర్ ను దేవుడన్నారు, బాబుకు భజన చేశారు, వైఎస్సార్ కు వీర విధేయత చూపారు, రోశయ్యను ఆకాశానికెత్తారు, కిరణ్ కు కీర్తించారు... పదవి పోగానే పేడనీళ్ళు జల్లుతారు.. మీడియా అయినా, మేలగాళ్ళయినా!!

*ఏం పాపం చేసుకున్నాడో మహాత్మా గాంధి. ఇంకా ఆ కుటుంబం వెనుక తోకలా మిగిలాడు..

*కేజ్రీవాలా ప్రభంజనం, చెరిగేసింది. పీఅర్పి చిరుగాలి, చెదిరిపోయింది  nu

8-12-13
*ఒక ఘటం పగిలింది. ఒక కాష్టం కాలింది. ఒక ఘట్టం ముగిసింది..సరే!! అర్నెల్లల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మళ్ళీ ఓట్ల పం(మం)ట. రాబోయే కాలానికి కాబోయే ప్రధాన మంత్రి ఎవరో?

*మనది లోకుల సత్తా-లోకల్ సత్తా.. లోక్ సత్తా కాలేకపోయింది..అదీ తేడా!!
*మోడీ - ఆడు మగాడ్రా..బాబూ!!

*నే చెప్పానా! మన ఐరన్ లెగ్గులు డిల్లీలో కాలు పెట్టగానే కాంగ్రెస్ నుగ్గు నుగ్గు.. బొగ్గు బొగ్గు.. పాపం ముమ్మారు ముఖ్యమంత్రికి మనవాళ్ళు వెళ్ళి ముసుగేశారు... షీలా డీలా పడింది.

*"Mahatma Gandhi and Sardar Patel are said to have held the view that the INC was formed only for achieving independence and should have been disbanded in 1947."-- Their long cherished wish was fulfilled by none other than members of Nehru family after 67 years.. Hurrae...

*The Nava Telangana Party headed by former minister Devender Goud was merged with the Praja rajyam Party much earlier to 2009 general elections. Subsequent to the great defewat of PRP, Goud had become the second rated leader in TDP(joined his good ole partyTDP). PRP founded by actor turned politician Chiranjivi  merged with the Indian National Congress on 20 August 2011. All the 18 PRP MLAs joined Congress. Does any one need more description than this?

*Congress once for all wiped out.. The vote did not simply go against Congress, but against corruption. Where is YUVARAJA? the hope of the Congress? future PM of India?

*centenary party reached cemetery..pay tributes..

*Indian National Congress was founded on December 28, 1885 (127 years ago) not 1863. Founded in 1885 by members of the occultist movement Theosophical Society—Allan Octavian Hume, Dadabhai Naoroji, Dinshaw Wacha, Womesh Chandra Bonnerjee, Surendranath Banerjee, Monomohun Ghose, Mahadev Govind Ranade and William Wedderburn. Nehru family was no where...

7-12-13

* అభిమాన హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం కన్నుమూత.------నాలుగేళ్ళ కిందట వరకు ధర్మవరపు తరచూ కాంగ్రెస్ లెగిస్లేచర్ పార్టీ కార్యాలయం వస్తూ పాత్రికేయులందరితో ఎంతో ఉల్లాసంగా గడిపే వారు. వైఎస్సార్ ఉన్నంతవరకు పార్టీ ఎన్నికలప్పుడు ప్రచార (సాంస్కృతిక కార్యక్రమాలకు సారధ్యం వహించేవారు. సౌమ్యుడు. ఎప్పుడూ రాజకీయాలు ప్రస్తావించేవారు కారు. విలక్షణమైన సలక్షణ హాస్యనటుడు. చిన్నతనంలో పోయారు. ఈమధ్య నటులు కాలం చేస్తున్నారు..విచారకరం!! పన్నీరు కురిపించిన హాస్యం కన్నీరు పెడుతున్నది.

*మన్మోహన్ మౌనమోహనుడని అంటారు అందరూ పాపం. ఆయన పెదవి విప్పితే సత్యాలు ప్రవహిస్తాయి. చూడండి నిన్న ఎన్ని నిజాలు చెప్పారో! పి వి వలననే సంస్కరణలన్నారు. దేశ ఆర్ధిక ప్రగతికి, ప్రపంచంలో పోటీకి నిలబడడానికి ఆయనే మూల పురుషుడని ప్రస్తుతించారు. పివి నరసింహారావును పొగడడం సోనియాకు ఆగ్రహం కలిగిస్తుందని తెలిసీ వెనుకడుగు వేయలేదు.  మోడీని తక్కువ అంచనా వేయడం లేదన్నారు.. బిజెపి సామర్థ్యాన్ని చెప్పారు. మన్మోహన్ రాజకీయవేత్త కాదు. ఆర్థిక నిపుణుడు. ఆయన నీడన కాంగ్రెస్ పదేళ్ళు బతికి చివరకు ఆయనకు మసి, మరక అంటించింది..  

*భర్తలు పోతే అసెంబ్లీకి వచ్చే భార్యలు కొందరైతే.. తండ్రులు పోతే అసెంబ్లీకి, పార్లమెంటుకు, పదవులకు ఎగబాకే కొడుకులు కొందరు.. అదృష్ట రేఖ అలా రాసిఉంటుంది కొందరి ముఖాన..ఏం చేస్తాం!

*ఇంట తిని వాసాలు లెక్కించడమంటే అంతే మరి.. ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి. సేల్డ్ కవరోళ్ళకు కూడాబోల్డు మాటలు..

*చానళ్ళు రాజీనామాలు చేయిస్తునే ఉంటాయి.. కానీ వాళ్ళు చెయ్యిస్తునే ఉంటారు ప్రతిసారి..

6-12-2013
*

*అమ్మ పుట్టిల్లు సంగతి మేనమామ దగ్గరా? మీడియా రంగులు నేను ముందటనుంచి చెబుతున్నాను. ఆ తానులో ముక్కనే కనుక నాకు తెలుసు..కలాలకు, గళాలకు కులాల జాడ్యం. ఇది తెలుగు "సంపాదకుల" కాలం.

*రాజధాని వికేంద్రీకరణకు మంచి ఉదాహరణ.. పత్రికల విస్తరణ. గతంలో పత్రిక ప్రధాన కార్యాలయాలు కేందీకృతమై ఉన్నప్పుడు ప్రచురణ, సిబ్బంది ఎంపిక ఎంత వ్యవ ప్రయాసలుండేవి. మారుమూల ప్రాంతాలనుంచి వార్త్లలే కార్యాలయాలకు రోజుల తరువాత చేరేవి. పత్రికలు సకాలంలో పాఠకుల చేతికి వేళ్ళేవికావు. ఇవ్వాల్టి పత్రిక మరుసటిరొజు కు చేరేవి. మరి శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో నేడు జిల్లాకొక పత్రికా కార్యాలయం. ప్రతి మండలంలో కంపొయూటర్కేంద్రాలు శాఖలు, ప్రధాన కార్యాలయలతో అనుసంధానం. గతంలో దూరదర్శన్ ఒక్కటె గతి. ఇప్పుడు ఓబి వ్యాన్లతో ప్రతి జిల్లాలో టీవీ చానళ్ళు. డిల్లీలో అర్ధరాత్రి సంఘటనలు మరుక్షణంలో వీక్షకులకు.. హైదరాబాద్లో ఉన్నా, డిల్లీలో ఉన్నా అమెరికాలో ఉన్నా పిఎం, సిఎంలు వీడియో, టెలి కాన్ఫరెన్సుల్లో అధికారులు, సచివులతో సంభాషించి పాలనా నిర్ణయాలు తీసుకోవడం లేదా? మరప్పుడు వేర్వేరు  రాజధానులకు సమస్యేముంటుంది.  విజ్ఞులు అలోచించాలి. సమస్య పరిష్కారం కావాలి. కొత్త సమస్య ఉత్పన్నం కాకూడదు. అది తెలంగాణ అయినా.. సీమాంధ్ర అయినా!!

*ఎక్కడైనా మొత్తం వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ఢి సమతుల్యంలో సాగుతుంది. సచివాలయం, శాసనసభ, పోలీసు ప్రధాన కార్యాలయం, ఉన్నత న్యాయస్థానం వేర్వేరు కేంద్రాలలో నెలకొల్పితే భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కావు. ఎక్కడికక్కడ విద్యా రాజధాని, వైద్య రాజధాని, పరిశోధనా రాజధాని, పారిశ్రామిక రాజధాని, రాజకీయ రాజధాని, ఆర్ధిక రాజధాని, న్యాయసేవా రాజధాని, ఆధ్యాత్మిక రాజధాని, సాంస్కృతిక రాజధాని, పర్యాటక రాజధానులు ఏర్పడితే అందరికీ అవకాశాలు అందివస్తాయి. జనాభా వికేంద్రీకృతమై వివిధ కాలుష్యాలు, కార్పణ్యాలు, వైషమ్యాలు పెరగకుండా నివారించ వచ్చు. పాలనా సౌలభ్యం కలుగుతుంది.. సమాచార, సాంకేతిక విస్తరణ విప్లంతో ప్రపంచమే ఒక గ్రామమైనప్పుడు నిర్వహణ ఏదీ అసాధ్యం కాదు..విభేదాలు, విమర్శలు విస్మరించాలి అందరూ!! ఈ సూత్రం దేశానికీ వర్తిస్తుంది..జాతీయతా భావం ఏర్పడుతుంది..

5-12-13

*మళ్ళీ శుక్రవారం సీమాంధ్ర బందట.. దేనికి? రెండున్నర నెలలు చేయించారు ఆందోళనలు. ఫలితమేమిటి? నష్టపోయిందెవరు? ఇంకా శని వదలలేదు పాపం వాళ్ళను..

*వరల్డ్ బ్యాంక్ కావూరి కన్‌స్ట్రక్షన్ కంపనీని 11 ఏళ్ళు బ్లాక్ లిస్టులో పెట్టేసరికి.. మాటలు, అడుగులు తడబడుతున్నాయ్. విభజన అయింది. ఇక అమ్మ భజనే మిగిలింది..

*అభిమానం, ఆత్మగౌరవం ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి  పదవికి రాజీనామ చేసి పరువు నిలబెట్టుకోవాలి. ఆంధ్రుల గౌరవానికి భంగం కలిగినా ఇంకా ఇలాగే పదవిలో ఉంటారా. సి ఎం పదవి రాష్ట్ర శ్రేయస్సుకు మించినదికాదని, ఆంధ్ర రాష్ట్ర ప్రజా ప్రయోజనంకోసం అవసరమైతే పదవిని వదులుకుంటానని చెప్పినమాటలు గుర్తుంచుకోవాలి. ఉమ్మడి రాజధాని శాంతిభద్రతల పరిరక్షణ పదేళ్ళపాటు గవర్నరుకు కేంద్రం ధారాదత్తం చేసింది. అంతే సి ఎం పదవిలో, అధికారంలో కోత పెట్టింది. శాంతి భద్రతల నిర్వహణ అధికారం సిఎం చెయ్యి జారిపోయింది.
కొత్త రాజధాని 45 రోజుల్లో నిపుణుల కమిటీ తేలుస్తుందట. అంతే కొత్త రాజధాని కొసం ఒకే సీమలోని ప్రజలమధ్య చిచ్చు లేస్తుందన్నమాట. రాజధాని మాకంటేమాకని రగడ మొదలవుతుంది. మళ్ళీ జగడపాటి, రాయపాటిలు, కావూరి   తలెత్తుతారు. రాయల తెలంగాన జెసి దివాకర్కు నష్టం ఏమీ ఉందదు. ఆయన బస్సులు 29వ రాష్ట్రానికి విస్తరించినట్లే.. ఆయనది రాజకీయ రవాణా వ్యవస్థ కదా!!

*నాయకులను కాదు.. వ్యర్ధ వ్యాఖ్యల తెలుగు టీవీ విశ్లేషకులను నిందించండి. మహా మేధావులులాగా నాటకాలాడి ప్రజలను తప్పుతోవ పట్టించి పబ్బం గడుపుకున్నారు.  మేతగాళ్ళైన రాతగాళ్ళని, కూతగాళ్ళను నిలదీయండి.  

*రాయల టి ఒక నాటకం మాత్రమే.. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల విశ్వామిత్ర సృష్టికి మీడియా రంగులు పూసింది.

*కేంద్రమంత్రులు రాజీనామాలు చేస్తారా నిజంగా, ఇదికూడా ఆర్నెల్లుగా సాగుతున్న కథగా మిగులుతుందా? టిజి వెంకటేశ్ చెబుతున్నారు పాపం. కె సి ఆర్ ఉందగా తెలంగాణ రాదని. మీరు ఉండగా రాష్ట్రం విడిపోదని చెప్పలేకపోతున్నారే.  ఏరీకోతలుకోసిన కోస్తామంత్రులు. డిల్లీలోప్యాకేజీలకోసం మీటింగులు పెట్టుకున్న సీమాంధ్ర ఎంపీలు అడ్రసు గల్లంతయ్యారే! సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ తో పాటు ప్రజారాజ్యాన్ని నిమజ్జనం చేసి పర్యాట్కంలో మునిగితెలుతున్న కేంద్రమంత్రి "చిరు"నామా ఎక్కద. నిజంగా ప్రజలు, రాష్ట్రం మీద అభిమానమున్న నేతలు తక్షణం పదవులు వొదిలి ప్రజల్లోకి వెళ్ళండి. కాదంటే మళ్ళీ మూకుమ్మడిగా "గోడ" దూకి మరో జండాపట్టుకుని, అజెండా మార్చుకోండి.  పాపం తెలుగు చానళ్ళు ఎంత ప్రయత్నించినా ఒక్కరూ పదవిని వదలదంలేదు.. 25 పేజీల జిఓఎం నోట్, 6 పేజీల క్యాబినెట్ నోట్, 70 పేజీల డ్రాఫ్ట్ బిల్ల్ క్యాబినెట్నుంచి రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటున్నాయి.

*రాష్ట్రం విడిపోకపోతే, హైదరాబాద్ యుటి అయితే, టి బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లో చర్చకు రాకపోతే, అసెంబ్లీలొ బిల్లు ఓదిపోతే.. మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్ళముందు అకస్మాత్తుగా పోలీసు భద్రత ఎందుకు పెంచినట్లు. జిల్లాల్లో కవాతులు ఎందుకు నిర్వహిస్తున్నట్లు. ప్రజాప్రతినిధులు ప్రజా ప్రతిఘటన అనుమానిస్తున్నారా? లగడపాటి ఎప్పుడు సన్యాసానికి ముహుర్తం ఎప్పుడు పెట్టుకున్నారో?

*సాయంత్రం నుంచి తెలుగు చానళ్ళు గొంతులు చించుకుంటున్నాయి. దింపుడుకళ్ళెం ఆశ లా 12 జిల్లాల తెలంగాణా, యుటి పై ఒకటే రొద. డిల్లీలో చలిలో, చీకట్లో చానల్ రిపోర్టర్ల బాధలు చూస్తుంటే జాలి వేస్తున్నది.. నంగినంగిగా, మాటలు మింగుతూ, లింకులు తెగి ఎన్ని వ్యాఖ్యలు.. ఎన్నెన్ని జ్యొతిషాలో! ఇంకా పైత్యపు మాటలు తగ్గలేదు. హైదరాబాద్ యుటికి అంగీకరించకపోతే సీమ కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి, పల్లంరాజు, పురందేశ్వరి రాజీనామాలంటూ కొత్త మంట పెడుతున్నారు.

*విశ్వకవీంద్రుడు రవీంద్రుని గీతాంజలిలో విస్తృతంగా జనప్రియమైన రచన
-------------------------------------------------------------------------------------
ఎక్కడ మనస్సు నిర్భయంగావుంటుందో,
ఎక్కడమానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో,
ఎక్కడవిజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో,
ఎక్కడ ప్రపంచం ముక్కముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోవదో,
ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుంచి బాహిరిల్లుతవో,
ఎక్కడా విరామమైన అన్వేషణ,పరిపూర్ణత వైపు చేతులుచాస్తుందో,
ఎక్కడ పరిశుద్ధ జ్ఞానవాహిని మృతాంధ విశ్వాసపుటెడారిలో ఇంకిపోదో,
తలపులో పనిలో నిత్య విశాల పథాలవైపు ఎక్కడ మనస్సు పయనిస్తుందో-
ఆ స్వేచ్ఛాస్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కాంచేట్టు అనుగ్రహించు

No comments:

Post a Comment