Tuesday 15 October 2013

వారంలో గరం గరం రాజకీయ వడ(దెబ్బ)లు   

15-10-13
**ఈ రోజెంత ఆహ్లాదంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉందో!!
అవును అచ్చోసే అక్షర కాలుష్యం నుండి ఒక్కరోజు విరామం..
(ఇవ్వాళ వార్తా పత్రికలు లేవు కదా... ఇలా వారంలో ఒక్క రోజైనా ఉంటే బాగు కదా!!)
మొన్న శనివారం భండారువారికి ఉత్తమ పాత్రికేయ పురస్కార సభలో జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. "ఇదివరలో దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు ఈ మోనోపలి ఏమిటి? ఇంకా చానళ్ళు రావలని అనుకునే వాణ్ణి. ఇప్పుడైతే  చానళ్ళన్నీ మూతపడాలని కోరుకుంటున్నాను(రు). వార్తా కాలుష్యం రాజకీయనాయకులు కూడా ఏవగించుకునే లా... ఎంతగా పెరిగిందో అర్ధమవుతున్నది..

14-10-13

**ప్రమాణాలు పరమాణువులై..ప్రణామాలు అందుకోలేక పోతున్నాయ్.. పరిణామలు ఎలా ఉంటాయో.. అంతా ప్రమాద భూయిష్టమైన వాతావ"రణం" లో ప్రపంచం......
12-10-13

**I AM HAPPY TO INFORM MY FRIENDS THAT DR B R AMBEDKAR OPEN UNIVERSITY(HYDERABAD) AUTHORITIES HAVE NOMINATED ME AS A TRANSLATOR FOR TRANSLATING THE MASS COMMUNICATION AND PUBLIC RELATIONS COURSE, AT UG LEVEL [B A, B COm, B Sc] (WRITING FOR MEDIA FROM ENGLISH TO TELUGU).
GURU KATAAKSHAM AND VIJAYA DASAMI GIFT TO ME.

HIGH REGARDS TO SRI DASU KESAVA RAO, WHO AT THE END OF HIS 28 YEARS IN THE COUNTRY'S LEADING ENGLISH DAILY, "THE HINDU" , REACHED THE PINNACLE OF HIS CAREER AS CHIEF OF BUREAU, AND DEPUTY EDITOR, FOR ENCOURAGING AND GUIDING ME IN RIGHT DIRECTION IN THE PROFESSION FROM THE BEGINNING. I AM BLESSED. (status)
-----
**PARAMA GURU KATAAKSHAM. TRIPLE PROSTRATIONS DEVA. I AM BLESSED.
DR B R AMBEDKAR OPEN UNIVERSITY(HYDERABAD) AUTHORITIES HAVE NOMINATED ME AS A TRANSLATOR FOR TRANSLATING THE MASS COMMUNICATION AND PUBLIC RELATIONS COURSE, AT UG LEVEL [B A, B COm, B Sc] (WRITING FOR MEDIA FROM ENGLISH TO TELUGU). ALL GURU GRACE. AT THY HOLIEST FEET. _/\_(sridharamritam)
----------------------------------------------------
**నదులన్నిటికీ కాలువలు ముందుగానే తవ్వి ఉంచారు.. సముద్రంలో కలవడానికి.. ఇంకిపోయే జలాలు, కలాలు మరో వనరు వెతుక్కోవాలి కదా.. ఇది కొత్తేముంది. బెల్లం ఉన్న చోటకు చీమలు సాధారణమే! సలహాదారులు సామాన్యులా!

**కతుకుడు రాజకీయాలు మనుషుల బతుకులనే కాదు పండగ బతుకమ్మలనూ మార్చే(డ్చే)సినాయ్.

**కిరణ్‌కుమార్ ప్రతిపక్షంలో విప్. అధికార పక్షంలో చీఫ్ విప్, తరువాత స్పీకర్, మూడేళ్ళు ముఖ్య మంత్రి.. ఆ మాత్రం తెలీదా. రాజ్యాంగం లోని 3 ఆర్టికిల్ అసలు చదవలేదా, చదివినా అర్ధం కాలేదా? తీర్మానాన్ని ఓటింగ్‌లో ఓడిస్తామనడం కేవలం ప్రజలను మభ్య పెట్టడమే. ఉద్యమం పేరిట అందరూ ఊళ్ళు పంచుకున్నారు.

**ఆశ్చర్యమేమిటంటే.. సిబ్బంది సంస్థ సమస్యల పరిష్కారకోసం సమ్మె జరిగితే 23 జిల్లాల్లో కాకుందా 13 జిల్లాలకే ఎందుకు పరిమితమైంది. సమ్మె రాజకీయ మని, రాష్ట్ర విభజన నేపథ్యమని తెలిసి 60 రోజులు యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకుంది. ఒక కన్నైనా కనబడుతున్నదని ఉపేక్షించిందా? రవాణా మంత్రి నిన్నటివరకు ఎందుకు చర్చలు జరపలెదు? సమ్మె నష్టం 200 కోట్ల రూపాయలనష్టం ఎవరు భరిస్తారు? 175 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, 13 జిల్లాల ఆర్టీసి సిబ్బంది నుంచి వసూలు చెయ్యండి. నిజమైన న్యాయవాదులుంటే రాష్త్ర ఉన్నత న్యాయ స్థానం లో పిల్ వేయండి.  

**నిన్నటితో ఉద్యమ హోరు ఆగింది చానళ్ళలో . ఈ రోజూ ఉప్పెన హోరు మొదలైంది.. పాపం 24 గంటల బాధ..వర్షం ఎలా కురుస్తుంది? తుపానేమిటి? అల్ప పీడనమేమిటి.. ఇలాంటి కథలు పొద్దుణ్ణించి..టీవీ పెడితే రోజూ మనకు ఎన్ని పీడలో..మనం తాడిత పీడితులం.. సమ్మె రాజకీయం అయిపోయింది. ఇక నేటినుంచి సహాయ పునరావాస కార్యక్రమాలపై తిట్ల దండకాలు. బుల్లి తెరపై ఇక వైఫల్య కథనాలు కో కొల్లలు.

** నిజాల్ని ఇజాలు (జర్నల్-ఇజం)పాతరేస్తున్నాయి. అందుకు తార్కాణం తెలుగు చానళ్ళు, పత్రికలు. ఒక విషయానికి ఎంతగా మసిపూయవచ్చో (వక్రీకరించవచ్చో)రోజూ చేసి చూపుతున్నాయి.

**సమైక్య రాష్ట్రం గా ఉంచుతామని కేంద్రం హామీ ఇచ్చిందా ఉద్యోగులు చల్లబడ్డారు. అసెంబ్లీకి తీర్మానం వోటింగుకు పెదతామని సోనియా వాగ్దానం చేసిందా? ప్రజాప్రతినిధులు తోక ముడిచారు. 73 రోజులు ప్రజలు పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు చదువులు అన్నీ వొదిలేశారు. రోడ్లెక్కారు. 60 రోజులు ఆర్టీసి బస్సులు బంద్ 200 కోట్లు నష్టం. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేశారు, జీతాలు ఇవ్వాళకాకపోతే రేపు వస్తాయి. లంచాలు నిత్య కల్యాణం పచ్చతోరణం. అశొక్ బాబు అనే మరో తురుం ఖాన్ ను సీమాంధ్రకు ప్రసాదించింది "ఉద్యమం". తెలుగు చానళ్ళు బాగా సొమ్ము చేసుకున్నాయి. ఇప్పుడైనా అర్ధమైందా? ఎప్పుడైనా గెలిచేది క్షుద్ర రాజకీయం. ఒడేది ప్రజలు.

**క్షుద్ర రాజకీయ వ్యాధిగ్రస్థ నాయకులకు అవసాన దశప్రాప్తిరస్తు. ఇది ప్రజల శాపం.

**ప్రజల శాపం యమ పాశం. వీళ్ళు ఉత్తమ మార్కండేయులు కారు. ఉత్త మూర్ఖండేయులు.. అన్ని దారులూ మూసుకుపోయాయి నాసికా రంధ్రాలు సహా! ఊపిరాడక ఇక మరణమే..

10-10-13

**‘నందామయా గురుడ నందామయా’ఆనంద దేవికీ నందామయా..గొర్రెలు తినువాడు గోవింద కొడతాడు బర్రెలు తినువాడు వస్తాడయా...
‘శివశివమూర్తివి గణనాథా’ నీవు శివుని కుమారుడవు గణనాథ.. ఒక్క సారి మంత్రి చెయ్యి గణనాథ. నిన్ను ఒదిలిపెడితె ఒట్టు పెట్టు గణనాథ..‘బ్లాక్ మార్కెట్ చెయ్యి గణనాథా నిన్ను కొట్టమంటే ఒట్టుపెట్టు గణనాథా’...
ఈ పాటలు గుర్తుందాండీ..  "పెద్దమనుషులు.." కె వి రెడ్డి గారిది ఎంత ముందు చూపు..

** ఆర్టీసి కి మూతేసి.. ప్రై"వేటు"కు రంగం సిద్ధం..  ఇక దివాకర్ ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్, కేసినేని ట్రావెల్స్, మురళికృష్ణ టావెల్స్, సింధు ట్రావెల్స్...జిల్లాలు పంచుకుంటాయి. రెండు కొత్త రాష్ట్రాల్లో వారి ప్రగతి చక్రాలే పరుగులు తీస్తాయి.

**అసెంబ్లీలో కేవలం చర్చ మాత్రమే.. ఓటింగు ఉండదు.. ఇక టింగు టింగే..అందరూ చేతులు(కాళ్ళు కూడా)ఎత్తడమే!! హస్తవాసి బాగుండలేదు. 'అనంత' రాత్రి జగన్నాధ రథంలో, పొద్దున్నే రాయపాటి బాబు దగ్గరకు జంప్. సామాజిక సమీక'రణాలు' మొదలవుతున్నాయి.

**నిప్పు రాజేసి తప్పుకున్నారు. ఇప్పుడు చెప్పు తీసుకుని కొట్టాలి ఒక్కొక్కళ్ళని..

**వెదకి, వెంటాడి తంతారు.. ప్రజలు వెంగళప్పలు కారు..
అశోకుడు చెట్లు నాటించెను - అది చరిత్ర;
'అశోక్' సమ్మె చేయించెను - ఇది వాస్తవం..

**చాకో గారు డిల్లీలో అల్టిమేటం ఇచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, విధినిర్వహణలో ఆ ప్రభుత్వం విఫల మైనప్పుడు ప్రత్యామ్నాయం రాష్ట్రపతి  పాలనేనని. అంతే కాదు, రాష్ట్రంలో శాంతి భద్రతల బాధ్యత ముఖ్యమంత్రిదేనని కూడా కుండ బద్దలు కొట్టారు. మరేదారి లేకుంటే రాష్ట్రపతి పాలనే నని తేల్చేశారు. వెంటనే విద్యుత్ సమ్మె ఆగింది. బొత్స ఆర్టీసి ఉద్యోగులతో చర్చలు మొదలెట్టారట. తుపాను నెపం తో ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మెకు విరామం ప్రకటించారట. కాకెక్కుతేగాని తెలీదు..

**వారం రోజులపాటు కన్నుపొడుచుకున్న చీకట్లు.. ఇక కళ్ళు బైర్లు కమ్మే మిరుమిట్లు.. విద్యుత్ సమ్మె ఆగిపోయింది. నాయకుని ఇష్టానుసారం ఉద్యోగులు నడుచుకున్నారు.
9-10-13

** జూనియర్ (నూతన) నేతలకు ఫ్యూచర్లో మంచి డిమాండ్. "పెర్ఫార్మెన్స్" బట్టి ప్రొమోషన్లు.. అవార్డులు, రివార్డులు..

**పదమూడు జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం పనిచెయ్యడంలేదు రెండు నెలలుగా..ఎక్కడా జీతాలు లేవు కూడా. అవునా? అయినా స్దరే.. తుపానుకు కోస్తాజిల్లాల్లో ప్రభుత్వ సిబ్బందితో సర్వం సిధ్ధంగా ఉందట. రఘువీరా గారు సెలవిచ్చారు. కంట్రోల్ రూములు తెరచారట.. ప్రజలను అప్రమత్తం చేశారట! తీరంలో ప్రమాద సూచికలు ఎగురవేశారట. కోస్తాలో కాంగ్రెస్ కోతకు గురవుతున్నది. వలస శిబిరాలు మొదలయ్యయి. అసలు మంత్రులే అదృశ్యం..(ఇవన్నీ కాంగ్రెస్ కు ముంచుకొస్తున్న తుపాను. డామేజీ పూర్తిగా అయింది. ఇక కంట్రోల్ ఏమిటో?) ఇక ఫైనల్‌గా చేతులెత్తేయడం - తెల్లజండా ఎగరేయడమే!!
[COMMENT BY Srinivasrao Bhandaru అల్లకల్లోలంగా వున్న సముద్రంలో నౌకలో ప్రయాణించేవారు అలలు యెంత తీవ్రంగా వున్నా నౌకనుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోవాలని అనుకోరు. కానీ నౌకకు చిల్లిపడిందని తెలిస్తే మాత్రం అందులో ఒక్కరూ వుండరు. సముద్రంలోకి దూకి వొడ్డుకు చేరాలని తాపత్రయ పడతారు. ఇదీ అంతే.}

**సమైక్యమంటూ రేయింబవళ్ళు డిల్లీలో మంతానాలు సాగించిన కాంగ్రెస్ ఎంపీలు అనుకున్నట్లే జగన్ బాట పట్టారు. తెర వెనుక నడిపిస్తున్నది వ్యూహరచనా ధురీణులు కదా? జగన్ కాంగ్రెస్ లో విలీనం కంటే కాంగ్రెస్ జగన్ తో మమేకమవుతున్నది. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి తో క్యూ మొదలైంది.. రాష్ట్ర మంత్రులూ సంచీలు సర్దుకుంటున్నారు..

**కలి-విడిగా...విడిగా కలిసుందాం..కలిసి విడిపోదాం: మనసులు కలసి.. మనుషులే విడిగా: నేల ఒకటే - ప్రాంతాలు వేరు: అన్నదమ్ముల్లా పంచుకుందాం: బేటాలు, టాటాలు, మాటలు, పాటలు, కోటాలు, ఇవన్నీ బీటలకే చిహ్నం.. మొత్తానికి తేలవలసింది "పదవుల వాటాలు" మాత్రమే. పిల్లి పోరు-పిల్లిపోరు చివరకు పిట్ట తీర్చిందట..

8-10-13
**చంచల్‌గూడా జైలు గోడలు కూడా అన్యాయం చెయ్యద్దు.. సమన్యాయం చెయ్యమని ఘోషిస్తున్నాయట..చానల్ కెమేరాలు రోడ్లు ఖాళీ చేశాయి..బోసిపోయి ప్రజలంతా ఏదో వెలితిగా ఫీలవుతున్నారు.

**జ్ఞానముందనుకున్న ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ దీకూడా జగన్నాటకంలో ముఖ్యపాత్రే కదా.. చీలిన కాంగ్రెస్ తో ఆయనకూడా సమైక్యమే..రాజకీయ గురువు అడుగుజాడల్లో ఆయన..ఆయన వెంట వందిమాగధ బృందం.. చూస్తుండండి..నిరంతరాయ నాటకం.
.
**పాపం విద్యుత్ సిబ్బంది నాయకుని మాట వినలేదుట..స్వర్ణాంధకారం మరికొన్నిరోజులు.. రాజుకంటే మొండివాడు బలవంతుడే ..

**రజనీకాంత్ .... నేను ఒక్క సారి చెబితే వందసార్లు చెప్పినట్టు-
చంద్రబాబు .. నేను వందసార్లు చెప్పినా ఒక్కసారి కూడా అర్థం కాదు-
బాబుకు దీటుగా కెకె ను బరిలోకి దించితే సరి..గడ్డం జుట్టు రెండూ పీక్కుని పరార్!! (ఇద్దరికీ గెడ్డాలు, జుట్టు ఒకే రీతిలో ఉంటాయి)..

No comments:

Post a Comment