Sunday 31 March 2013



Friday 29 March 2013



దశాబ్ద కాలంలో ప్రచురితమైన నా వ్యాసాల సంఖ్య468 కి  చేరింది.


దశాబ్ద కాలంలో వార, పక్ష, మాసపత్రికలలు, ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రచురితమైన, ప్రసారమైన 

నా వ్యాసాల సంఖ్య దీనితో 468 కి  చేరింది....

"ప్రజాతంత్ర" రాజకీయ వారపత్రిక తాజా సంచిక(2013,మార్చ్ 4-10) లో ప్రచురితమైన రెండు వ్యాసాలు - "రాష్ట్రంలో మటుమాయమైన బిజెపి" ;"ఆకాశంలో సగం, అవనిలో సగం" నా 467, 468 వ వ్యాసాలు. కేవలం ప్రజాతంత్రలో ప్రచురితమైన వ్యాసాలను పరిగణలోకి తీసుకుంటే వీటితో కలిపి ఆ సంఖ్య 114 కు చేరుకున్నది.

1978 నుంచి 2013 వరకు ఈనాడు, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ/ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఎన్ఎస్ఎస్, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, వార్త, ఆంధ్రప్రభ (ఆంధ్రప్రభలో మూడు విడతలుగా), తాజాగా బాధ్యతలు స్వీకరించిన "క్షత్రియప్రభ"[మాసపత్రిక] పది సంస్థల్లో 35 సంవత్సరాల ఈ పాత్రికేయ వృత్తి కాలాన్ని, కలాన్ని రెండు భాగాలుగా విభజించి... పునఃసమీక్షించుకుని, ఆత్మావలోకనం చేసుకుంటే వృత్తి జీవితంలో ఎత్తులకు ఎదగలేకపోయినా కాలానికి ఎదురీది, కలాన్ని బలంగా ఝళిపించగలిగానన్న సంతృప్తి మాత్రం మిగిలిగింది. ఎదురుదెబ్బలు తగిలినా వృత్తి మారలేదు.. ప్రవృత్తీ మారలేదు.

మొదటి 22 సంవత్సరాలు గంగాప్రవాహమే. ఆ తరువాత వేగానికి కళ్లెం పడిందికాని దేనికీ రాజీపడలేదు, రాజీనామాలకూ వెరవలేదు. 1978 నుంచి 2000 వరకు ప్రయాణం ఒక విధం.. ఆ తరువాత మరో విధం. 2000 నుంచి 2013 వరకు అంతా ఎగుడు దిగుడుల ప్రయాణమైనప్పటికీ, అడుగు ఆగకుండా నిరాఘాటంగా, నిరాటంకంగా సాగుతునే ఉంది. 22 సంవత్సరాల అనుభవపాఠాలు గత 13 సంవత్సరాలుగా ఆలోచనల ఆరోహణకే ఉపకరించాయి కాని మెట్టు దిగజార్చలేదు. వివిధ దినపత్రికలు, వార్తాసంస్థల్లో పని చేస్తునే వృత్తిరంగంలో మరింత విస్తరించగలిగే సువర్ణావకాశాలు అందివచ్చాయి.

2003 నుంచి ఈ ఏడాది మార్చ్ ఆఖరు వరకు వేర్వేరు దినపత్రికల్లో రోజువారీ వార్తా లేఖనంతోపాటు వివిధ వార, పక్ష, మాస పత్రికలు సహా ఆకాశవాణి, దూరదర్శన్.. ఇతర తెలుగు చానళ్లకు వార్తలు, వ్యాఖ్యలు, వ్యాసాలు.. పుష్కలంగా అందించ గలిగానన్న కించిత్తు గర్వం మిగిలింది. గత దశాబ్ద కాలాన్ని పునరావలోకనం చేసుకుంటే, దిన పత్రికలు కాకుండా "వెలుగుబాట", "ఫోకస్", "ప్రజాతంత్ర", "ఈవారం" వారపత్రికలు, మరికొన్ని పక్షపత్రికలు, "యోజన"(కేంద్రప్రభుత్వ) మాసపత్రికల్లో నాలుగు వందలకు పైగా వ్యాసాలు ప్రచురితం కావడం పాత్రికేయుడిగా నాకు ఒకింత గర్వం మిగిల్చింది.

ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రత్యేక వార్తావాహినులు, శాసనసభ సమావేశాల సమీక్షలు, వార్తావ్యాఖ్యలు సుమారు వంద ప్రసారమయ్యాయి. ఇవిగాక అంధ్రప్రభ, వార్త దినపత్రికలలో(2007-2011) వార్తా లేఖలు, ప్రత్యేకవ్యాసాలు మరో పాతికపైగా ముద్రితమయ్యాయి. అచ్చురూపంలో పదేళ్ళుగా వచ్చిన 400 వరకు (clippings) వ్యాసాలను భద్రపరచుకో గలిగాను. 1978-2000 వరకు ప్రచురితమైన ప్రత్యేక వ్యాసాలు అసంఖ్యాఖంగా ఉన్నా వాటిని భద్రపరచుకునేందుకు సాధ్యపడలేదు.

"వెలుగుబాట" వార పత్రికలో(2003-05) 58, "ప్రజాతంత్రలో"(2003-2013) 114, యోజనలో(2002-2003) 9, "ఈవారం" వారపత్రికలో(2008- 2010) 162 [91సంపాదకీయాలు, 71 వ్యాసాలు], "ఫోకస్"లో 6, ఆంధ్రప్రభలో [పశ్చిమబెంగాల్ పర్యటన-2007] 5, వార్తలో (2009-11-హబుల్) 12 ప్రత్యేక వ్యాసాలు అచ్చయ్యాయి. వీటిలో 85 'ఈవారం' సంపాదకీయాలకు గత సంవత్సరం "అక్షరధార" పేరిట ఒక పుస్తక రూపం ఇవ్వగలిగిన భాగ్యం కలిగింది. ఈ సంకలన పుస్తకానికి అష్టదిగ్గజాల్లాంటి ఎనిమిదిమంది "ఎడిటర్లు" మంచి మాటల దీవెనలు అందజేయడం నిజంగా నాకు లభించిన పెద్ద పురస్కారమే ! ! ఈ రంగంలో ఎందరో దిగ్దంతలు, నిష్ణాతులు, కాకలు తీరిన కలం యోధులు ఉన్నారు. వారితో ఏపాటి పోలికా లేదు. వారి సరసన పేరు చెప్పుకునే అర్హతా లేదు. కొందరు మహనీయుల వద్ద పనిచేసే అదృష్టం మాత్రం లభించింది. భగవదనుగ్రహం, గురు కృప, పెద్దల ఆశీస్సులు, మిత్రుల ప్రోద్బలం, ఆప్తుల ప్రోత్సాహంతోఈ కలం కొన (వరకూ) సాగుతునే ఉండాలాన్నదే నా ఏకైక ఆకాంక్ష..

Monday 25 March 2013


తెలుగునాట పత్రికలు, చానళ్ళ దర్శకత్వంలో పార్టీలు..  


        పార్టీల ప్రమేయంతో ప్రసారమాధ్యమాలు  




గతంలో రాజకీయపార్టీలకు ఆయా సిద్ధాంతలపై వార్తా పత్రికలుండేవి.  గాంధి హరిజన్, యంగ్ ఇండియ,నెహ్రూ నేషనల్ హెరాల్డ్ మాదిరే కమ్యూనిస్టులకు ఇంగ్లీషు, ప్రాంతీయ భాషల్లో,సొషలిస్టు పార్టీకి, జనసంఘ్ కు.. అలా పేపర్లుండేవి. మనకు కూడా ప్రకకాశం పంతులు గారు, కందుకూరి వీరేశలింగం.. ఇలా స్వాతంత్ర్యం, సిధ్ధాంతం లక్ష్యంగా, ఒక నిర్దిష్ట కార్యక్రమంతో పత్రికలుందేవి. మన విషయానికొస్తే వివేకవర్ధని, చింతామణి, ఆంధ్ర మహిళ, ఆకాశవాణి, శారద, జనవినోదిని, ప్రజామత, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రమిత్ర, ఆనందవాణి, స్వరాజ్య, యువజన, ఆంధ్రప్రభ, ఆంధ్రజనత, గోల్కొండ పత్రిక, విశాలాంధ్ర,ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి... ఇవన్నీ నిఖార్సైన వార్తాపత్రికలు, సమాచార సమాహారాలు. 

తెలుగునాట ఈనాడుతో కొత్త శకం మొదలైంది.వ్యక్తులకు మాద్దతుగా కాక ప్రజాప్రయోజనం వాటి ఉద్దేశం. 1983 వరకు కొన్నిపత్రికలు అధికార కాంగ్రెస్ కు నిఖార్సైన విపక్ష్మ ఆత్ర పోషించాయి. 1982లో ఎన్‌టీఆర్ తెలుగుదేశం ప్రారంభంతో పకా సిధ్ధాంతం లేకున్నా ఈనాడు రామారావుకు దన్నుగానిలిచింది. కొంతకాలానికి ఒక వర్గాన్ని కొమ్ముకాయడం స్పష్టంగా కనిపించింది. ఆ దశలో ఉదయం ఆవిర్భవించింది. కాంగ్రెస్ వ్యతిరేకతతొపాటు, ఈనాడుకు వ్యతిరేకంగా, పొటీగా నిలిచింది. అది మరొక సామాజిక వర్గాన్ని భుజానవేసుకుంది. అప్పుడే దిశ, దశ లేని సమయం అంటూ మరొకటి వచ్చింది. ఉదయానికి తీవ్రవాద మద్దతు పత్రికగా ముద్ర పడింది. సమయం కూడాతొడై ఆరెండూ బ్లాక్ మెయిల్ టాగ్ తగిలించుకున్నాయి.

1984లో ఈనాడు ఎన్‌టి ఆర్‌ను ఎత్తుకున్నది. ఉదయం ఎన్‌టి ఆర్ ను వ్యతిరేకించింది. 1995లో అదే ఈనాడు ఎన్‌టి ఆర్‌ను పదేసి బాబును నెత్తిన పెట్టుకున్నది. ఆంధ్రజోతిలో 1989 తరువాత మార్పు వచ్చింది.టిడిఫి కి కొమ్ముకాయడం మొదలైంది. వెన్నుపోటు సంఘటన సమయంలో పత్రికలు విలువల వలువలు విప్పేశాయి. ఆంధ్రప్రభకూడా ఆదారిలోనే నడిచింది. కొన్నాళ్ళ పాటు విజేత అనే పత్రిక నడిచి యజమాని క్రిమినచర్యలవలన కేసులు నడిచి మూతపడింది.అంతకు ఎన్నేళ్ళొ ముందుగానే ఉదయం మూసుకుంది. కొత్త పత్రిక వార్త వచ్చింది. దానికి దారి, దిక్కు లేదు. ముందే 2004 ఎన్నికలప్పటికి పత్రికలు వ్యక్తుల చేతులలోకి మారాయి. ఆంధ్రభూమి మినహా మిగిలిన పత్రికలు రాజశేఖర రెడ్డిని తార్గెత్ చేశాYఇ. చాతుర్యంతో ఆయన బమ్మిని తిమ్మిని చేశారు.

2009 నాటికి వై ఎస్ ఆర్ సొంత దుకాణం సాక్షి పేపర్, సొంత టీవేఏ పెట్టించారు. అంతకుముందే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ మనిషి సుర్య్ప్రకాసరవుతో సూర్య ను ప్రోత్సహించారు. ఎలక్ట్రానిక్ యుగం మొదలై. వ్యక్తులు చానళ్ళు పెట్ట్దం ప్రారంభించారు. ఆంధ్రజ్యోతి పునః ప్రారంభం తరువాత బాబుకు అండగా నిలిచింది. ఆంధ్రప్రభ దిక్కూదివానం లేకుండా పొయింది.ఎడిటర్ల కాలం నశించి సంపాదకులు దూసుకువచ్చారు. రాజకీయాల ఎత్తుగడల మార్గంలోనే,వై ఎస్ ఆర్ మేధస్సుతో సాక్షి కొత్తతరహాలో పావులుకదిపి ప్రత్యర్ధి పత్రికలను మట్టి కరిపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వి ఎస్ ఆర్ మృతితో పత్రికల స్వరూపం పూర్తిగా మారిపోయింది. సాక్షి పత్రిక, చానల్ జగన్ సొంత బాకా, ఈనాడు-ఈటీవి, ఏబి ఎన్-అంధ్రజ్యోతి బాబుకు భజన మొదలెట్టాయి. సూర్య అకస్మాత్తుగా బాబువైపు మొగు కాసింది. ఇంతలో నమస్తేతెలంగాణ దూసుకువచ్చింది.

2013 కు పత్రికలు-చానళ్ళు వర్గాలుగా, పార్టీలుగా విడిపోయాయి. ఎన్నికలే లక్ష్యంగా అడుగులు కదులుతున్నాయి. ఉదయం పునః ప్రారంభానికి ఊగిసలాడుతున్నది. అనేక చానళ్ళకు నేరుగా రాజకీయనాయకులే యజమానులు. ఇప్పటికే తెలుగునేలపై చిన్నా పెద్దా 21 చానళ్ళు వచ్చాయి. తాజాగా పి సి సి అధ్యక్షుడు బొత్స జీ 24 ను కొనేశారు. ఎన్ టీవి, టివి5, వి6, సివీఅర్. చనళ్ళలొ రాజకెయ నేతల పెట్టుబడులున్నయి. సిఎం కిరణ్ పాత కృష్ణాపత్రికను సన్నిహితుల పేరిట తీసుకున్నారని గుప్పుమంది. అలాగే కిరణ్ ఐ-చానల్ కూడ హస్తగతం చేసుకున్నారు.సిపిఎం టి10 చానల్ ను మొదలెట్టింది. ఇంకా చానళ్ళు వస్తున్నాయి. పత్రికలు కూడ పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. వార్తా ప్రపంచం పరమ కాలుష్యంగా తయారై వాస్తవాలకు మసిపూస్తున్నారు. ప్రాంతం కులం, వర్గం,పార్టీలుగా చీలిపొయాయి. హైదరాబాద్ కే పరిమితమైన ఏఐ ఎం ఐ ఎం కూడ ఎప్పుడో సొంత పేపర్ ఇత్తెమాద్ పెట్టుకుంది. ఇన్నిన్ని చానళ్ళు, పత్రికలు, పార్టీలు వ్యక్తులచేతుల్లోకి వెళ్ళి ప్రాజాస్వామ్య స్ఫూర్తిని ఖూని చేస్తున్నాయి.నిజాలు నిలువునా పాతరవుతున్నాయి. కొద్దిరోజుల్లో మరిన్ని రసవత్తర ఘట్టాలకు తెరలేవనుంది.

Sunday 24 March 2013



    అందరికీ అభి(నం)వందనలు 

25-13-2013

7AM

ఈనాటి ఈ బంధాలు, అనుబంధాలకు, అనురాగం, ఆప్యాయతలకు ఊపిరి, ప్రాణం "అచ్చంగాతెలుగు" బృందం. తెలుగు మధురాతి మధురం. ఆ తియ్యదనాన్ని రుచి చూపించి భాషపై మరింత ఆసక్తి రేపి, నడకను పరుగులు తీయించింది చెల్లెలు చి.ల.సౌ. భావరాజు పద్మిని. బంధుత్వం చెల్లెలైనా నాపట్ల ఆమెది మాతృహృదయం. ఆమె మాటకు ఆమె కుటుంబానికి నేను కట్టుబడిఉంటాను.

ఆమె ద్వారా ఎందరో మహనీయులు, దైవసమానులు, గురుదేవుల పరిచయ భాగ్యం కలిగింది. సహచర్యం లభించింది. ఆ పరిచయ బీజాలు పాతుకుపోయి వట వృక్షమైంది. సంబంధాలు శాఖోపశాఖలుగా విస్తరించి రాష్త్రం దేశం ఎల్లలు దాటి ఎందరో ఆప్తులయ్యరు. పెద్దలు, మేధావుల ఆశీర్వచనాలు అందుకోవడం పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఈరోజు నా జీవితంలో ఒక మధురమైన రోజు. ఇన్నేళ్ళ జీవితంలో, ఎన్నో పుట్టిన రోజులు జరుపుకున్నా..ఇంతమంది ఆత్మీయులు, ఆప్తులు, సహృదయుల శుభాకాంక్షలు అందుకోవడం ఇదే ప్రథమం. నిజంగా జన్మ ధన్యం. గురువర్యుల దీవనలు మరింత మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని మరింత పెంచాయి. నేను, నా భార్య శ్యామల, కుమార్తె మేఖల అందరి ప్రేమానురాగాలకూ బధ్ధులం.
పుట్టుకతో జన్మ సార్ధక్యం సాధించినట్లు కాదు. మనవలన ఎవరికైనా ఈషణ్మాత్రం ప్రయోజనం చేకూరినా, మనోధైర్యం లభించినా, నలుగురికి ఆత్మీయత పంచిపెట్టగలిగితే కొంతమేరకైనా జన్మ నిరర్ధకం కానట్లు భావించవచ్చు. కేవలం డబ్బు సంపాదన తృప్తి, పరిపూర్ణతనివ్వదు. పదిమంది ఆప్యాయత, అనురాగం, ఆదరణ, ఆశీస్సులు పొందితే ఆ హృదయానందం, మానసికోల్లాసం, అనుభూతి అనిర్వచనీయం. హృదయం నవనీతమైతే మాట మంచిగా వస్తుంది. మాట మంచిదైతే మనసులుకలతోపాటు మనుషులు కలుస్తారు. ముఖ పరిచయాలతో సంబంధం లేకుండానే ఒకసారి కలసిన మనసులు శాశ్వతంగా పెనవేసుకుపోతాయి.
వయసు తారతమ్యం ఎవరికీ ఆటంకం కాలేదు. 17 సంవత్సరాల వయసు మొదలు 71 సంవత్సరాల వరకూ స్త్రీ, పురుష భేదంలేకుండా నాకు ఎందరో సన్నిహితులైనారు. అందరూఏదో ఒక బంధుత్వం పెంచుకున్నవారే. తాతయ్య, పెదనాన్న, బాబాయి, మామయ్య, అన్నయ్య.. అందరూ ఏదో ఒక బాంధవ్యంతో పిలిచేవారే. ఒక్కరోజు కొందరితొనైనా సంభాషించకపోతే అదేదో వెలితి భావన ఏర్పడతం మొదలైంది. చాట్ బాక్స్ లో, సెల్ ఫోన్‌లో, ఇ-మెయిల్, ద్వారా నాకు చెల్లెల్లు, తమ్ముళ్ళు, హితైషులు, ఉన్నందుకు గర్వపడుతున్నాను.ఒక్కరి పేరు చెప్పి మరొకరి పేరు చెప్పకపోతే నేను అన్నింటా అనర్హుదనఔతాను.
వ్యక్తిగత మిత్రులు, వృత్తిమిత్రులు, బాల్య స్నేహితులు ఒక భాగం. అంతర్జాల మిత్రత్వం ఏడాదిన్నరలో నాకు దాదాపు 200 మందికి పైగా ఆప్తులను బహూకరించింది. గడచిన 24 గంటలుగా శుభాకాంక్షల అమృత వర్షధార కురిపిస్తునే ఉన్నారు. ఎన్నెన్ని శుభాకాంక్షలు, ఎన్నెన్ని పుష్పగుచ్ఛాలు, ఎన్నెన్ని ప్రార్ధనలు, ఎన్నెన్ని కవితలు, ఎన్నెన్ని హితవాక్యాలు.. అభిమాన పలకరింపులు.. ఈరోజు నా బంధుగణంలో(కుటుంబం) ఏఒక్కరికీ నా పుట్టినరోజు గుర్తులేదు. ఈ పుట్టిన రోజు శుభాకాంక్షలు, దీవెనలు అందజేసినవారికి నా కుటుంబం తరఫున హృదయపూర్వక కృతజ్ఞ్తలు

Thursday 21 March 2013

        ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు :


                             [This is the intellectual property of Sri Vinjamuri Venkata Apparao ]

ఓం భూర్భువస్సువః 
తత్సవితుః వరేణియం 
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్

ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు. ఇంతటి మహోన్నతమైన మంత్రములో 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి దాగి ఉంటుందని పురాణ వచనం. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ 24మంది దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు సిద్ధిస్తాయి. ఈ 24 అక్షరాలలో ఉన్న దేవతామూర్తుల పేర్లను తెలుసుకుందామా...

1. తత్ - గణేశ్వరుడు
2. స - నృసింహ భగవానుడు
3. వి - విష్ణుదేవుడు
4. తుః - శివదేవుడు
5. వ - కృష్ణ భగవానుడు
6. దే - రాథా దేవి
7. ణ్యం - లక్ష్మీదేవి
8. భ - అగ్నిదేవుడు
9. ర్గః - ఇంద్రదేవుడు
10. దే - సరస్వతి
11. వ - దుర్గాదేవి
12. స్య - హనుమంతుడు
13. ధీ - పృధ్వీదేవి
14. మ - సూర్యదేవుడు
15. హి - శ్రీరాముడు
16. ధి - సీతామాత
17. యో - చంద్రదేవుడు
18. యో - యమదేవుడు
19. నః - బ్రహ్మదేవుడు
20. ప్ర - వరుణదేవుడు
21. చో - నారాయణుడు
22. ద - హయగ్రీవ భగవానుడు
23. యా - హంసదేవత
24. త్ - తులసీదేవి

మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి, సుఖసంతోషాలు వనగూరుతాయి. ప్రపంచ మానవాళి గాయత్రీ మంత్రాన్ని జపించి తరిస్తోంది.--
 Vinjamuri Venkata Apparao 

Tuesday 19 March 2013




                    నందమూరి తారక రామారావు నినాదం





నందమూరి తారక రామారావు వలన తెలుగు ఆత్మగౌరవ నినాదంతో పాటు ముఖ్యంగా మూడు పాటలు నేల నాలుగు చెరగులా ప్రతిధ్వనించాయి. 1) మా తెలుగు తల్లికీ మల్లెపూదండ... 2) చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.. 3) సారే జహాసె అచ్ఛా...మళ్ళీ ఆ పాటలు మరుగున పడ్డాయి. 

తెలుగు ప్రజల నోట్లో ఎప్పుడూ నానిన మరో పదం.. "చైతన్య రథం". ఆ ప్రభావమే ఈ నాటి రథయాత్రలు, బస్సు యాత్రలు. ప్రజలలోకి వెళ్ళి ఊరూరా గుండె తలుపులను తట్టి రాజకీయాలలో పెనుమార్పులు తెచ్చింది ఎన్ టి రామారావు. ఆ మార్గాన్ని అనుసరించింది ఇందిరా గాంధి. వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా నిలవడమే గాక ఆ చైతన్య చక్రాలను ఆర్నెల్ల పాటు అనుసరించడం ఒక గొప్ప అనుభవం. ఇందిర పర్యటనల్లో...వై ఎస్సార్ యాత్రల్లో కూడా అడుగులు వేసే అరుదైన అవకాశం కలగడం పాత్రికేయ వృత్తి ప్రసాదమే.. 

ఈ దేశంలో పాద యాత్రకు ఆద్యుడు ఆదిశంకరాచార్యుడు. రాజకీయా పాద యత్రకు శ్రీకారం చుట్టింది మాజీప్రధాని చంద్రశేఖర్. లబ్దిపొందింది రాజశేఖరరెడ్డి.


                               చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!


                             గతమెంతో ఘనకీర్తి కలవోడా!!




వేములపల్లి శ్రీకృష్ణ ఎవరో తెలుసా..? వామపక్ష రాజకీయ వాసనలున్న కొందరికైతే ఆయన కమ్యూనిస్టు గా తెలుసు. మరికొందరికి ప్రజాప్రతినిధిగా ఎరుక. బాపట్ల, మంగళగిరి నియోజక వర్గాలనుండి రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. బహుకొద్దిమందికి ఆయన ఒక పాత్రికేయునిగా గుర్తు. విశాలంధ్ర ఎడిటర్‌గా రాష్ట్రంలో పాతకాలం పత్రికా పాఠకులకు తెలిసుండచ్చు. ఆయన గొప్ప కవి అని చాలామందికి తెలీక పోవచ్చు. 

అందులోనూ ఆయన రాసిన ఒక గేయం దశాబ్దాలపాటు తెలుగునేల నాలుగు దిక్కులా పిక్కటిల్లింది. అన్ని భావాలు, అన్ని వాదాలు కలగలిపి సువిశాలాంధ్ర గలం వినిపించారు. తెలుగు పటిమను, ధైర్య సాహసాలను, పాండిత్య ప్రతిభను, తెలుగు సంస్కృతీ వెలుగుజిలుగులను వేనోళ్ళ కొనియాడారు. ప్రస్తుత అస్తవ్యస్త వ్యవస్థ వాతావరణంలో ఈ పాకు ఎంతో విలువ ఉంది. 50 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా శ్రీకృష్ణ గేయం గుర్తుండకపోవచ్చు. గతంలో వినిపించిన దేశభక్తిపూరిత గేయాలలో ఇది ప్రముఖంగా ఉండేది. శ్రీకృష్ణ  ఎలా ఉండేవారో పాత కమ్యూనిస్టు తరానికి; తలపండి, చేయితిరిగిన పాత్రికేయ మిత్రులకు మాత్రమే స్ఫురణకు వస్తారు.  

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!! అనే  ఆయన పిలుపునకు యువత పౌరుషంతో పరుగులెత్తింది ఆ రొజుల్లో. ఆ దేదీప్య  దివ్య గీతిక ఇప్పుడు రాష్ట్రంలో  కంచుకాగడా పెట్టివెతికినా ఎక్కడా కాగితాల్లో (పాఠ్యపుస్తకాల్లో) కలాల్లో, గళాల్లో కనిపించదు, వినిపించదు. ఒక్క సారి ఆ గీతాన్ని మననం చేసుకుందామా!! 

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి కలవోడా!

సాటిలేని జాతి-ఓటమెరుగని కోట
నివురుగప్పి నేడు-నిదురపోతుండాది
జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి కలవోడా!!||చెయ్యెత్తి||

వీర రక్తపుధార-వారబోసిన సీమ
పలనాడు నీదెరా-వెలనాడు నీదెరా
బాలచంద్రుడు చూడ ఎవడోయి!
తాండ్రపాపయ్య కూడనీవోడూ||చెయ్యెత్తి|| 

కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల 
మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే 
వీరవనితల గన్న తల్లేరా!
ధీరమాతల జన్మ భూమేరా! ||చెయ్యెత్తి||

నాగార్జునుడి కొండ,అమరావతీస్థూపం
భావాల పుట్టలో-జీవకళ పొదిగావు
అల్పుడను కావంచు తెల్పావు నీవు
శిల్పినని చాటావు దేశదేశాలలో! ||చెయ్యెత్తి||

దేశమంతే వట్టి మట్టి కాదన్నాడు
మనుషులన్నమాట మరువబోకన్నాడు
అమరకవి గురజాడ నీవాడురా
ప్రజలకవితను చాటిచూపాడురా! ||చెయ్యెత్తి||

రాయలేలిన సీమ-రతనాల సీమరా
దాయగట్టె పరులు-దారి తీస్తుండారు
నోరెత్తి యడగరా దానోడా
వారసుడ నీవెరా తెలుగోడా! ||చెయ్యెత్తి||

కల్లోల గౌతమీ-వెల్లువల కృష్ణమ్మ
తుంగభద్రాతల్లి-పొంగిపొరలిన చాలు
ధాన్యరాశులే పండు దేశానా!
కూడుగుడ్డకు కొదవలేదన్నా!||చెయ్యెత్తి||

ముక్కోటి బలగమోయ్-ఒక్కటిగ మనముంటే
ఇరుగుపొరుగులోన -వూరు పేరుంటాది
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా!
సవతిబిడ్డల పోరు మనకేలా! ||చెయ్యెత్తి||

పెనుగాలి వీచింది-అణగారి పోయింది
నట్టనడి సంద్రాన-నావ నిలుచుండాది
చుక్కాని బట్తరా తెలుగోడా! 
నావ దరిచేర్చరా మొనగాడా!!

!! చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా||

Wednesday 13 March 2013




                          పదవే పదికాలాలపాటు పదిలం:





-------------------------------
నిన్నటి వ్యంగ్య రచన "పదవీ గీత -- నేతల రాత"లో మొదటి అంశం :
'నాయకా! పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. అశాశ్వతమయిన ఈ పదవిని గురించి వ్యామోహము వీడి, శాశ్వతమయిన డబ్బును అక్రమ మార్గములో ఆర్జించుము.' 

దానిపై నా స్పందన ఇదిగో:

పదవి అశాశ్వతము కాదు. అది వున్నంతకాలమే సంపదకు ఆస్కారం. భద్రత. ఈ విషయ పరిజ్ఞానం తెలుసుకునే ఆధికారం చేయి దాటకుండా, భార్య, కుమారుడు, కుమార్తె, బావ మరదులు, అల్లుళ్ళు, అన్న దమ్ములు, అక్క చెల్లెళ్ళూ, మనవళ్ళూ, అంగరక్షకులు, కారు డ్రైవర్లు..ఇలా వారసత్వ రాజకీయాల పాదులు పటిష్ట పాచుకుంటున్నారు. పదవి ప్రాణప్రదం. మనిషి ప్రాణం పోయినా శవాలను పదిల పరచుకున్న వాళ్ళు కొందరైతే, మరి కొందరు ఆత్మలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. మరి కొందరు ప్రజల ప్రాణాలను పెట్టుబడిగా పెట్టి నాయకులుగా స్థిరపడిపోయారు. జిల్లాలను ఎంచుకుని పంచుకున్నారు. సుపరిపాలనలో ప్రజా అస్తులను ప్రైవేటుపరం చేసి లాభపడిన రాజకీయ వ్యాపారులు తయారుకాగా, దేవుని పాలనలో ప్రజలకు గజాల స్థలాలు ఎరజూపి ఎకరాల్లో "ఘనులు" పాతుకుపోయారు. అవినీతి ఆస్తులు రెమ్మలు, కొమ్మలుగా విస్తరించి వటవృక్షాలయ్యాయి. పరిధులు, సరి హద్దులు లేకుండా నేల, నింగి, నీళ్ళు కూడా అస్తులు కూడబెట్టడానికి వనరులయ్యాయి. దేవుడు,దయ్యం; కొండా,కోనా కూడా ఆర్జన మార్గాలయ్యాయి. ఒక నేత అవినీతి విత్తనం నాటి మొక్కగా చహేస్తే.. మరో నేత దాన్ని విత్తపు చెట్టుగా పెంచితే, వారసులు వటవృక్షంగా పెంచి పోషించేందుకు సిధ్ధమయ్యారు. ఈ మహాప్రక్రియకు విరామామం లేకుండా యాత్రా స్పెషల్స్ నడుస్తున్నాయి. కాళ్ళరుగు తున్నాయి. కన్నీళ్ళు కురుస్తున్నాయి. పదవిని నిలబెట్టుకునేందుకు ప్రచార సాధనాల పటటోపాల కొసం వాటాల క్రయ విక్రయాలు జరిగాయి. ఒక నేత అధిపతులను తనవైపు తిప్పుకుంటే, మరో నేత క్షేత్రస్థాయిలో పాగావేసి, అవసరాలు-అవస్థలు గుర్తించి పైసలు వెదజల్లి గుప్పిట పెట్టుకుంటున్నారు. పాత నేత పర్మిషన్లు, లైసెన్సులు మంజూరు చేసి వ్యక్తులను అధీన పరచుకుంటే, కొత్త నేత వ్యవస్థనే కూకటి వేళ్లతో పెకలించే ప్రయత్నాలకు ఒడిగట్టారు

Monday 11 March 2013



                    రాష్ట్రంలో మటు మాయమైన బి.జె.పి.!! 



                                                    

రాష్ట్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పటిష్ఠంగా ఉన్న రోజుల్లో జనసంఘ్ కు అంకిత భావం గల కార్యకర్తల మద్దత్ ఉండేది, జనసంఘ్ అధికారంకోసం కాకుందా విలువలకోసం నిలిచింది.ఒంటరిగానే పోరాడింది. విద్యావంతులు. సౌమ్య ధోరణికల మధ్యతరగతి అభిమానులను సంపాదించుకున్నది. 1967లో జనసంఘ్ తరఫున ముగ్గురు అభ్యర్ధులు శాసనసభకు ఎన్నికయ్యారు. 1972, 1978 ఎన్నికల్లో అ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 1983 ఎన్.టి.ఆర్. ప్రభంజనంలో బి.జె.పి మళ్ళీ మూడు గెల్చుకుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ్ ఉద్యమ పేరిట టి.డి.ఫి కి మద్దతు ఇచ్చి మిత్ర పక్షమై ఎనిమిది సీట్లు దక్కించుకుంది. 85 ఎన్నికల్లో ఆర్ రవీంద్రనాథ్ రెడ్డి, ఏ నరేంద్ర,ఎన్ ఇంద్రసేన్ రెడ్డి, బద్దమ్ బాల్ రెడ్డి, ఆర్ శ్రీనివాస్ రెడ్డి, వి రాములు, వి జైపాల, సిహెచ్ విద్యాసాగర రావు శాసనసభలో ఆశీనులయ్యారు. 

1989లో ఆ సంఖ్య 5 కి దిగజారింది. 1994లో మళ్ళీ మూడేసుకుంది. 1999లో టి.డి.పి తో చేతులుకలిపి శాసనసభలో 12 కి ఎగబాకింది. ఆ సభలో కె హరిబాబు, ఎం ఏ వేమా, కోట శ్రీనివాస రావు, ఎం.ఎస్. పార్థసారధి, దాక్టర్ కె లక్ష్మణ్, ఎన్ ఇంద్రసేన రెడ్డి, ప్రేంసింఘ్ రాథోర్, జి రామకృష్ణారెడ్డి, టి వి రమణాఎడ్డి, ఎం. ధర్మారావు, కె సత్యనరాయణ, ఆర్ రవీంద్రనాథ్ రెడ్డి ఎన్నికై ప్రభంజనం సృష్టించారు. 2004, 2009 ఎన్నికల్లో రెండేసి స్థానాలకే పరిమితమైంది. టి.డి.పీ కి దూరమై 2004, 2009 ఎన్నికల్లో రెండుకే పరిమితమైంది. గత ఏదాది తెలంగాణా ఉద్యమ పుణ్యాన మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలఓ పిల్లి పోరు పిల్లి పోరు పిట్ట తీర్చినట్లుగా అక్కడ బి.జె.పి గెలుపు సాధించింది. జాతీయస్థాయిలో 1980 లో బి.జె.పి. ఏర్పాటువరకు జనసంఘ్ గా ఉన్నా కేంద్రంలో అధికారంకోసం కాంగ్రెస్ తో తలపదలేదు.

విలువల ప్రాతిపదికపై బి జె పి 1984 ఎన్నికల్లో దేశం మొత్తం లో రెందేసీట్లు గెల్చుకోగా, అందులో ఒకటి హనుమకొండ కావడం విసేషం.అ దే పార్టీ 1989 ఎన్నికల్లో 88 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. 1991 జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం గా ఎదిగింది. 1996 లో వాజ్‌పేయీ నేతృత్వంలో 13 రోజులపాటు కేంద్రంలొ ప్రభుత్వం నడిపే సత్తా సాధించింది. మళ్ళీరెండు పర్యాయాలు, 1998, మార్చ్ 13 నుంచి 1999 అక్టొబరు 13 వరకు, తిరిగి 13 అక్టొబరు 99 నుంచి 2004 మే 13 వరకు రెండు దఫాలుగా బి జే పి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది.

రాష్ట్రం నుంచి బండారు దత్తాత్రేయ వరుసగా సికిందరాబాద్ నుంచి మూడు పర్యాయాలు లోక్ సభకు ఎన్నికై మూడు సార్లు మంత్రిగా శాఖలు నిర్వహించారు. 1999 లో రాష్త్రం నుంచి ఏడుగురు బి జె పి ఎమ్‌పీలుగా ఎన్నికై నలుగురు కేంద్రమంత్రులయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో బి,జె,పి జాతకం తల్లకిందులైంది.ఆ పార్టీ రెంటికీ చెడ్డా రేవడ మాదిరి తయారైంది. పార్లమెంటులో నేడు బిజెపి ఒక్క సీటు కూడా దక్కించుకోలేని స్థితికి చేరుకుంది. ఒక నాదు మేధావుల పార్టీగా పేరొందిన బిజెపిని నేడు నిస్సత్తువ ఆవరించింది. ఈ పరిస్థితికి కారకులెవరు? బి.జె.పి జవసత్వాలు వస్తాయా? మోడీ నామ స్మరణమిణహా రాహుల్ నుంచి దేశాన్ని రక్షించు కునేందుకు తరుణోపాయమ ఉందని ఆ పార్టీ నేతలు ఊహిస్తున్నారా? ఇందులో వెంకయ్య నాయుడు బాధ్యత ఎంతవరకు నిర్వహిస్తారు? రాష్ట్రంలో బి.జె.పి. నాయకులు ఏమిచేస్తున్నారు? ఏమి చెయ్యాలనుకుంటున్నారు?

Sunday 10 March 2013


                                1967 నుంచీ రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు... 







ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు స్వాతంత్ర్యానాతరం వ్యక్తులచుట్టూ పరిభ్రమించి విలువలు, నైతికత కోల్పోయి కీలుబొమ్మ రాజకీయాలు మొదలయ్యాయి. డబ్బు, మతం, కులం, ప్రాంతీయత, అవినీతి వేళ్ళూనుకుని పతనావస్థకు చేరుకున్నాయి. ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో కూర్చున్న వారి పేర్లు వింటే.. వారు ఆశీనులైన స్థానాలు ఎలాంటివారికి ఆశ్రయమిచ్చాయో అని బాధ మిగులుతుంది.. 

మన రాష్ట్ర రాజకీయ(ఎన్నికల) చరిత్రను పునరావలోకనం చేసుకుంటే ఒకప్పటి దీతైన, ఘాతైన ప్రతిప్క్షం ఉందే పార్టీలు ఎలా జావకారి చివరకు"తోక" పార్టీలుగా మారాయో అర్ధమవుతుంది. హైదరాబాద్(1952), అంధ్ర(153) రెండవ ఆంధ్రా అసెంబ్లీలో (1955)విపక్షాల అసంఖ్య అధికార కాంగ్రెస్ పార్టీకి చెరువలోనే ఉందేది. హైదరాబాద్ అసెంబ్లీలో మొత్తం 176 స్థానాలకు గాను కాంగ్రెస్ కు93దక్కాయి.పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్; రైతులు,కార్మికుల పార్టీలకు 52 మంది సభ్యులు ఎన్నికయ్యారు. సోషలిస్ట్లు 11 మంది,ఎస్ సి ఫెడరేషన్ పార్టీలకు 16 మంది సభ్యులున్నారు.ఇండిపెండెంట్ల హవా ఈ రాష్త్రంలో 1984 వరకు నడిచింది. ఉమ్మడిమద్రాసు రాష్ట్రంలోభ్హగమైన ఆంధ్ర అసెంబ్లీలొ 140 స్థానాలుండగా కాంగ్రెస్ కు కేవలం 40 మాత్రమేదక్కాయి. కృషికార్ లోక్ పార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలకు కలిపి 35 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి 40, కమ్యూనిస్తు పార్తీఇ 41 మంది సభ్యులుండేవారు, కమ్యూనిస్టు పార్టీకి 41. ఇండిపెండెంట్లకు 17 బలం ఉండేది. 

1955 ఎన్నికలనాటికి కాంగ్రెస్ సంఖ్య 119 కి పెరగగా, కృషికార్ లోక్ పార్టీ(22), ప్రజా సోషలిస్ట్ పార్టీ(13)కమ్యూనిస్టు పార్టీ(15) విపరీతంగా బలహీన పడ్డాయి. కాంగ్రెస్ బలం 119 కి పెరగడం ఆశ్చర్యం కలిగించింది. అదే సమయంలో(1957) తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 68 స్థానాలుండగా పి డి ఏఫ్ కు 22 దక్కాయి. ఇండిపెండెంట్లు 12 మంది గెలిచారు. 1962 నుంచి రాష్ట్ర చిత్తరువు మారిపోయింది. పార్టీల సిద్ధాంత ప్రాతిపదికపై గౌరవం ఉందేది, కులాలు ఇంకా ప్రాబల్యంలోకి రాలేదు. 62 ఎన్నికల్లో కమ్యూనిస్టులు 50, స్వతంత్ర పార్టీ 19, ఇండిపెండెంట్లు 46 మంది గెలుచుకోగా దిగ్దంతలైన వ్యక్తులు, సచ్ఛీలురు, విద్యావంతులు, నైతిక విలువలున్నా వారు ఈ జాబితాలొ నిలిచారు. 

1967 ఎన్నికల నాతికి అవినీతి, కుల ప్రాబల్యం, బంధుప్రీతి, ఆశ్రితజనపక్షపాతం వేళ్ళూనుకుని 1967 ఎన్నికల్లో విపక్షాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కమ్యూనిస్టుల చీలికతో సి.పి.ఐ 11, సి.పి.ఎం 9 స్థానాలకు దిగజారాయి. ఆంధ్ర ప్రాంతంలో స్వతంత్ర పార్టీ మాత్రం 29 స్థానాలు నిలబెట్టుకుంది. ఇండిపెండెంట్లు అత్యధికంగా 68 మంది ఎన్నికై చరిత్ర సృష్టించారు. భారతీయ జనసంఘ్ రాజకీయాలలో కాలు పెట్టి 3 అసెంబ్లీ సీట్లలో ఖాతా తెరచింది. రిపబ్లికన్, ఎస్.ఎస్.పి నామాత్రంగా 2,1 బలంతో ఉనికి నిలుపుకున్నాయి. 1972 ఎన్నికలలో లో రాష్ట్రంలో ప్రతిపక్షమంటూ లేకుండా తుడిచిపెట్టుకుపొయింది. ఇండిపెండెంట్లు 56 మంది గెలుపొంది ప్రధాన ప్రతిపక్షమయ్యారు. సి.పి.ఐ, సి.పి.ఎం; స్వంత్ర కలిపి 10 మించి గెలవలేకపోయాయి.

1976 ఎమర్జన్సీ ప్రభావం 1978 ఎన్నికలపై ధారాళంగా పడింది. దేశంలో ప్రచండ జనతా గాల్పులు వీచగా, మన రాష్ట్రంలో మాత్రం 1978 ఎన్నికల్లో ఇందిరా గాంధికి ప్రజలు మద్దతుగానిలిచారు. జనతానుంచి 60 మంది గెలవగా, జాతీయ కాంగ్రెస్(ఆర్) కేవలం 30 మంది బతికి బట్టకట్టారు. వై.ఎస్. ఆర్ అప్పుడు ఇందిరకు వ్యతిరేక వర్గంలో ఉన్నారు. ఎన్నికల అనంతరం ఆర్ కాంగ్రెస్ ఇందిరలో విలీనమైంది. ఇందిర ప్రభంజనంలో పెత్తనం అంతా అధిష్ఠానం చేతుల్లోకి వెళ్ళి రాష్ట్రాలు ఉనికి కోల్పోయాయి.1983 ఎన్నికలు జాతీయ, రాష్ట్ర రాజకేఎయాలను గొప్ప మలుపు తిప్పి, పెనుమార్పులు తెచ్చాయి. 
(మిగతా వివరాలు మరో పర్యాయం)

Thursday 7 March 2013


                               మహా భారతం కాదు.. మనది అవినీతి భారతం!!





పువ్వు పుట్టగానే పరిమళిస్తుందో లేదో తెలీదు కాని మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదిలోనే మనం స్కాం భారత్ ను ఆవిష్కరిచుకున్నాం. 1947 ఆగస్టులో స్వతంత్రం వస్తే 1948 లో జవహరిలాల్ నెహ్రూ జీపుల కొనుగోలు కుంభకోణంతో అవినీతి భారతానికి శ్రీకారం చుట్టారన్న ఆరోపణలు మొదలయ్యాయి. ఆరోజుల్లో దుర్వినియోగమైన ప్రజాధనం 80 లక్షల రూపాయలట. నెహ్రూ ప్రధానిగా కొనసాగిన 17 సంవత్సరాల సమయంలో అంటే 1964 మే 27 వరకు ఆరుకుంభకోణాలు దిగ్విజయంగా జరిగాయి.1951 లో సైకిళ్ళ దిగుమతి, 1956లో బనారస్ హిందూ యూనివర్సిటీ నిధుల దుర్వినియోగం, 1958లో ముంద్రా ఒప్పందం.1960లో తేజ ఋణ కుంభకోణం ఆరోజుల్లో చాలా ఖరీదైనవిగా చరిత్రకెక్కాయి. 

1964లో ప్రతాప్ సింగ్ ఖైరాన్ మెడకు బిగిసిన కుభకోణం ఉచ్చు పెద్ద వివాదం లేపింది. నెహ్రూ మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న యేడాదిన్నర కాలంలో కళింగ ట్యూబుల అవకతవకలు దుమారం లేపాయి. ఇందిర రెండు విడతల్లో 15 సంవత్సరాలపాటు ప్రధాని పదవిలో ఉండగా నాలుగు భారీ కుంభకోణాలు నమోదై దేశాన్ని ఊపివేశాయి. 1971లో డిల్లీ ఎస్ బి ఐ శాఖలో ఇందిరాగాంధి స్వరంతొ అందుకున్న ఆదేశాలమేరకు బాంకి చీఫ్ కాషియర్ మళోత్రా నగర్వాలా అనే వ్యక్తికి 60 లక్షల రూపాయల బాంక్ నగదును అందజేసిన సంఘటన ప్రభుత్వాన్ని కుదిపివేసింది. ఆ కేసు దర్యాప్తు అధికారి, నగర్వాల్, ఉద్యోగం పోగొట్టుకున్న చీఫ్ కాషియర్ మళోత్రా విచిత్ర పరిస్థితుల్లో మరణించడంతో కేసు మూలన పడింది.

ఇందిరా హయాంలోనే 1974లో చోటుచేసుకున్న మారుతీ కార్ల కుంభకోణంతొ భారత్ వణకిపోయింది.ఆ అతరువాత 1976 లో కువో నూనె కొనుగోలు వ్యవహారంలో దేసం 2.2కోట్ల సొమ్ము నష్టపోయిందని గగ్గోలు పెట్టారు. 1981లో ఏ ఆర్ అంతులే మహారాష్త్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు జరిగిన సిమెంటు కుంభకొణం(రు.30కోట్లు) దేశవిదేశాల్లో బహుళ ప్రచారం పొందింది. ఆ కేసులొ అంతులే ముఖ్య మంత్రి పదవినే కోల్పోయారు.

ఆ తరువాత 1987లో జరిగినట్లు ఆరోపణలు మొదలై నేటికీ రావణకాష్టంలా సాగుతున్నది బోఫోర్స్‌కుంభకోణం. అందులో నేరుగా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధి పాత్రపై తలెత్తిన అనుమానాలు నేటికీ నివృత్తికాలేదు. రెండేళ్ళ అనంతరం జరిగిన సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు పరిష్కారం కాకుండానే మరుగున పడింది. ఆ మరుసటి ఏడాదే వి పి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1990లో జరిగిన అయిర్ బస్సు కొనుగోళ్ళ వ్యవహార ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చింది. 

ఇక నాటినుంచి స్కాములభారతం దినదిన ప్రవృధ్ధమానమై నిన్న కాగ్ కొర్రు కాల్చి వాతపెట్టిన వ్యవసాయ ఋణమాఫియా తో కలిపి మొత్తం 142 కుంభకోణాలు భారతదేశాన్ని ముంచి వేశాయి. కుంభకోణాల విషయంలో తరతమ బేధాలు లేకుంబ్డా అన్ని పార్తేఏలు, అన్ని రాష్ట్రాలు తలా ఒక చెయ్యి వేసి అల పైకి ఎగబాకి స్కాం భారతాన్ని ఆవిష్కరించాయి. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన బ్రహ్మచారి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయీని కూడ కుంభకోణాల మసి వదలలేదు. అంతకు ముందు పివి నరసింహారావు ప్రధాని హయంలో 5 వేల కోట్ల రూపాయల మేరకు జరిగిన హర్షద్ మెహతా సెక్యూరిటీల కుంభకోణం తలమానికంగా నిలిచింది. 1994లో చక్కెర దిగుమతిలో భారీ అవకతవకలు జరిగిందని బయటకొచ్చింది. ఇక 1995 నుంచి నేటివరకు జాతీయ స్థాయిలోనే కాక రాష్ట్రాల స్థాయిలో జరిగిన భారీ కుంభకోణాలు దేశపరువును మంట కలిపాయి. 

అందుబాటులో వున్న గణాంకాల మేరకు. 1995, 96, 97 సంవత్సరాల్లో వరుసగా 12 భారీ కుంభకోణాలు (ఏటా నాలుగు)దేశంలో నమోదయ్యాయి. దేవగౌడ, ఐకె గుజ్రాల్ కూడా దేశాన్ని కుంభకోణాలనుంచి తప్పించలేక పోయారు. అయితే 2000 నుంచి 2004 వరకూ (వాజ్‌పేయీ) 10 సంఘటనల్లో అవకతవకలు జరిగిన విషయం రచ్చకెక్కింది.ఇక 2004 లో కేంద్రంలో యు పి ఏ ప్రభుత్వంలోకి వచ్చిన నాటినుంచి నేతివరకు ఇంతింతై, వటుడింతై నభో వీధిని నిలిచినట్లు..70 కుంభకోణాలతొ భారత్ వెలిగిపోతోంది. నేను సైతం కుంభకోణాగ్నికి సమిధనొక్కటి ధారపోస్తానన్నట్లు.. అన్నిరాష్ట్రాలు పాపంలొ పాలు పంచుకున్నాయి. 

కాంగ్రెసేతర ప్రభుత్వాలు తక్కువేమీ తినలేదు.బాగానే చేతివాటం ప్రదర్శించాయి. ఈ ఏడాది వెలుగు చూసిన అగస్టా హెలికాప్టర్ల ముడుపుల కుంభకోణం. తాజా వ్యవసాయ ఋణమాఫీలో అక్రమాలు ఇక ఎన్నాఎళ్ళు ప్రతిపక్షాలకు ఆయుధాలు కానున్నాయో. అక్షరక్రమంలో కంటే, అభివృద్ధిలోకంటే మనది మహా భారాతం కాదు అవినీతి భారతంగా పేరు పొందింది. వాములు తినే స్వాములకు పచ్చిగడ్డి ఫలహారమా!! అది పాత నానుడి. మనపాలకులు స్కాముల స్వాములు. గుడి, గుడి లింగమే కాదు ధ్వజస్తంభంకూడా మటుమాయం చేసే జాదూ రత్నలు.. అంధ్రప్రదేశ్ సంగతి వేరే ప్రస్తావించనక్కరలేదుగా!!

Sunday 3 March 2013



                                                                SCANDALOUS INDIA 

                                                              From INDIRA  to SONIA



                                                             


We can not even remember the number of scandals taken place during the last 25 years in the country.. We can simply categorise them as "Scandals from Indira Gandhi - Sonia Gandhi. A few scandals just for recollection .

The major one which rocked the Nation in 1971 was SBI Rs. 60 lakh case.

[Shri Ved Parkash Malhotra who was the Chief Cashier, State Bank of India, New Delhi, on 24th May 1971 and whose credulousness in taking out the astronomical sum of sixty lakhs of rupees and in handing over the same to an unknown person hit the headlines in the Press, supplied ammunition to the critics of the Government and rocked the public. Malhotra says that the times were abnormal, he was working under great pressure and he was a victim of a clever ruse.

The voice of Nagarwala has come back to haunt public memory 30 years after it fooled a chief cashier at State Bank of India to part with Rs 60 lakh.

Rustom Suhrab Nagarwala, an ex-army captain and intelligence officer, for reasons still unknown, called the bank's Parliament Street branch on May 24, 1971. On the other end of the line was chief cashier Ved Prakash Malhotra, who heard the "voice of Prime Minister Indira Gandhi" instructing him to withdraw Rs 60 lakh and hand it over to a "Bangladeshi". Times were tense, with India on the threshold of a war with Bangladesh. Malhotra did not cross-check before following the voice's instructions. Alarm bells rang for Malhotra when he learnt of the impersonation at the PM's residence, where he had gone to get a receipt for the sum withdrawn.

Nagarwala was nabbed for "mimicking the voice" of the PM and the money was recovered on the same day after intelligence officials swung into a manhunt on the advice of the PM's principal secretary P Haskar.

The incident became a political scandal with Opposition claiming Gandhi's hand behind the fraud. The case took a mysterious angle with the death of its investigating officer, D K Kashyap, in a car crash. Nagarwala died in prison the same year, reportedly of a heart attack. Malhotra too commtted suicide.]

few more examples:
------------------------
Pondichery licence scanadal wherein it was alleged that the then Union Commerce Minister Lailth Narayan Mishra was part of it.

Maruti land scandal; Bofors; Saint Kitts; Harshad Mehta, telecom scandal (PV regime)

People are well acquainted with the series of scandals seen the light during UPA regime.

                                  

                              

        

         రాజ భరణాల రద్దు, బాంకుల జాతీయకరణ :ఇందిర మాయాజాలం... 


ఇందిరా గాంధి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొన్నేళ్లకే ఎరవేసి తిమింగలాలను పట్టి బుట్టలో వేసుకుని ఆ తిమింగలాలకు దశలవారీగా దేశాన్ని అప్పగించారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ అనే బిస్కట్లు జనాలకు విసిరి జాతి సంపద మొత్తాన్ని కొందరు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. అంతకుముందు చెల్లిస్తున్న భరణాల మొత్తం కంటే ఆ రాజకుటుబాలకు జరిగిన దీర్ఘకాలిక లాభం మొత్తంతో మరో 50 సంవత్సరాలు భరణం చెల్లించవచ్చు; అదే మాదిరి బాంకుల జాతీయకరణతో రైతు, చిన్నతరహా వ్యాపారవర్గాలను శాశ్వత ఋణగ్రస్థులుగా మార్చారు. రైతులను భూమినుంచి దూరంచేశారు.


 పారిశ్రామిక వేత్తలకు బాంకుల ద్వారా వేలకోట్ల రూపాయల ఋణం ఇప్పించగా వారు ఎగవేసి ప్రజా సంపదను కొల్లగొట్టి విదేశీ బాంకుల్లో దాచుకున్నారు. రైతు తన ఉత్పత్తులకు గిట్టుబాటు, కనీస మద్దతు ధరలు లభించక నష్టపోయి చివరకు కూలీలుగామారు. ఆ కుటుంబ పాలనతో దేశం ఈగతికి చేరుకుంది. మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి "ఇందిర పాలన" ప్రవెశపెట్టి భూములనే మాయం చేసే మంత్రాంగం అమలు చేశారు. నెహ్రూ ప్రజాస్వామ్యాన్ని సామ్యవాదంగా మారిస్తే, ఇందిర ధనస్వామ్యం ప్రవేశ పెట్టారు. తొమ్మిదేళ్ళ పాలనలో చంద్రబాబు అవినీతి బీజం నాటి మొక్క స్థితికి తెస్తే, ఆరేళ్ళ్ వ్యవధిలో వైఎస్సార్ ఆ మొక్కను వటవృక్షం చేసారు. అవినీతికి బాబు కిటికీలు తెరిస్తే వైఎస్సార్ ద్వారబంధాలు ఊడబెరికారు. ప్రజాస్వామ్య సౌధాన్ని బాబు నేలమట్టం చేస్తే వైఎస్సార్ పునాదులు సహితం పెకలించి వ్యవస్థనే కుప్పకూల్చారు. "ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే" అని ఆనాడు గీతాచార్యుడు చెప్పినట్లు ఒక శక్తి ఉద్భవించి దేశరాజకీయాలనే గొప్ప మలుపు తిప్పుతుంది. 2014 ఎన్నికల తరువాత దాని ఫలితం అందరూ చూస్తాం.