Friday 25 October 2013

          ఈ వారం [గరం మసాలా] మాటల ఈటెలు..
                                                 -----------------------------------------

25-10-13

**చిత్తం మెత్తనైతే చిత్తరువులన్నీ మొత్తం ఉత్తమమే.. కుంచె మంచిది కదా! ఎవరినీ ముంచదు. 'మధురా'నురాగాల మన(సు)ముఖ చిత్రాలు బహుసుందరం.. మీ మది బృందావనం .. నందనవనం. మీ శ్రమైక జీవన సౌందార్యారాధన (పరి)శ్రమకు మరో సారి వందనం.

**రాజకీయాలన్నా, అంతకు మించి సోషలిజమన్నా..రామ్ మనోహర్ లోహియా, మధులిమాయే, మధు దండావతే, జార్జ్ ఫెర్నాండెజ్, బద్రివిశాల్ పిత్తి, సంజీవదేవ్, స్నేహలతారెడ్డి వంటి ఉద్దండుల పట్ల ఆసక్తి కలగడానికి సోమయ్యగారే దిక్సూచి. కళాశాల విద్యార్ధిదశలోనే(1965-68) లిమాయే, జార్జ్, పిత్తి వంటి కొందరు సోషలిస్టు నాయకులతో ప్రత్యక్ష పరిచయం, లేఖాబాంధవ్య  భాగ్యం అరుణక్క, సోమయ్య (బావయ్య)గార్ల ఫలమే. సామాజిక అలోచనలు, రాజకీయాల పట్ల, రచనా వ్యాసంగం పట్ల ఉత్సుకత పెరగడానికి వారే మార్గదర్శకులు. 1967 ఎన్నికల్లో సోమయ్యగారు తాడికొండ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎస్.ఎస్.పి.(సంయుక్త సోషలిస్ట్ పార్టీ) అభ్యర్ధిగా పోటీ చేసినప్పుడు ప్రచారంలో పాల్గొనడమే కాక ఎన్నికల ఏజెంటుగా కూడా పనిచేసే అవకాశం నాకు లభించింది...అప్పుడెలాగో ఇప్పటికీ ఆ అనురాగ మూర్తులిరువురిదీ సైద్ధాంతిక నిబద్ధ నిరాడంబర జీవనమే. వారితో నాది ఐదు దశాబ్దాల ఆప్యాయతాబంధం.

**ప్రజలను పట్టించుకోనివాళ్ళు, వాళ్ళ ప్రాణాలను కాపాడలేని వాళ్ళు, ప్రాంతాల ప్రయోజనాలను ఎలా పరిరక్షిస్తారు? అందరిదీ పదవీకాంక్ష, స్వార్ధమే!! గల్లీలు మునిగిపోతుంటే నేతలు డిల్లీలో దాగుడుమూతలు.. నాయకులకు ప్రజలే కీలెరిగి వాత పెట్టాలి..

**మళ్ళీ తీన్ తేరా, ఆఠ్ అఠారా! ఈ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు పదమూడు కలసిరాదని తెలిసినా..అంతే..
13 మంది ఎంపీలు ఘనంగా రాజీనామాలు చేస్తే స్పీకర్ "కుదరదు ఫోండి" అని ముఖం మీద గిరాటేశారు.
ఈ సారి మరొక బృందం నేరుగా రాష్ట్రపతి వద్దకు (రాష్ట్ర భేరానికి) రాయబేరానికి వెళ్ళారు. లెక్క చూసుకోలేదో, ఇది ఎట్లాగూ తేలని యెవ్వారమనుకున్నారేమో! మళ్ళీ 13 మంది రాష్ట్రపతిభవన్ లో ఎడమకాళ్ళు పెట్టారు. ఆరుగురు మంత్రులు, ఏడుగురు ఎంపీలు..వెరసి 13. ఈ 13 కి వెన్నుగా ఎమ్మెల్యేలు కూడ వెళ్ళారు ఈ సారి. (రాష్ట్రపతి భవన్ ను చూసినట్లుంటుంది కూడా..) అదేమి చిత్రమో వాళ్ళు కూడ పదముగ్గురే!
మంత్రులు:శైలజానాథ్, టిజి వెంకటేశ్, గంటా శ్రీనివాసరావు, తోట నరసింహం, అహ్మదుల్లా, పితాని.
ఎంపీలు: కెవిపి, లగడపాటి, రాయపాటి, మాగుంట, అనంత, కనుమూరి, సాయిప్రతాప్.
ఎమ్మెల్యేలు: కె కన్నబాబు, కె సుధాకర్,వంగా గీత, ఉగ్రనరసింహ, బిఎన్ విజయకుమార్, ఎన్ శేషారెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, సిహెచ్ వెంకట్రామయ్య, కెవి నాగేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు, ఈలి నాని, కొత్తపల్లి సుబ్బారాయుడు..(వీళ్ళకుతోడుగా [ఆటలో అరటిపండ్లు] ఎక్‌స్ట్రాలు ఆ నలుగురు.. ఎమ్మెల్సీలు)
మరో ముఖ్య విషయం..భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన అభాగ్యులు కూడా 13 మంది. మృతుల కుటుంబాలకు మనమైనా సంతాపం తెలుపుదాం. (ప్రజాప్రతినిధులు పాపం బిజీ కదా!)

**ప్రతి దానికి ఒక లెక్కుంటుంది.. లేకుంటే తిక్కెక్కుతుంది..
మరో ఆచ్చెర్ర్యం ఏమిటో గమనించారా? సమైక్య్యాంధ్ర కోరుతున్న సీమాంధ్రలో మిగిలినవి 13 జిల్లాలు. మళ్ళీ మరోసారి తీన్ తేరా..అదే వాళ్ళ మల్ల గుల్లాలు. గ్రహ అనుగ్రహాలు తెలిసిన గోదారి ఘనాపాటి కదా ఉండవల్లి.. అందుకేనేమో ఖమ్మం జిల్లాను అటువైపు తరలించాలట..కొత్త మాట మొదలెట్టాడు. అప్పుడు కూడా పవర్‌ఫుల్ ఇక్కడ మిగిలే నవగ్రహాలని(తొమ్మిది జిల్లాలు) ఆయన లెక్కేసుకోలేదు.. పాపం పెద్దమ్మ ఆ(వ)(గ్ర)హిస్తే ఏ గ్రహం అనుగ్రహం చూపదు..ఇక గృహమే కదా స్వర్గ"సీమ"!!

24-10-13
**"సూర్య" అనే ఈ పత్రిక ఒక్కటి చాలు.. పత్రికా ప్రపంచాన్ని భ్రష్టు పట్టించేందుకు. సమాజాన్ని నాశనం చేసేందుకు..పత్రిక పుట్టుక నుంచి నేటి వరకు నడచిన అధ్యాయాలు గమనిస్తే ఎన్ని అపభ్రంశపు అడుగులో...

23-10-13
** రాజకీయ జోక్యాల వలన పోలీసింగ్ రాష్ట్రంలో నిర్వీర్యమై అయిదేళ్ళయింది. నగ్జలైటలతో ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు "అన్నలకు" మన పోలీసు ప్రబుద్ధులు వినతిపత్రాలిచ్చారు గుర్తుందా అందరికీ. ఇక మనం ఈ పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుకోవడం గొంగట్లో తింటున్నామని గుర్తుంచుకోవాలి. అధికారానికి ఖాకీలు దాసోహమంటున్నంతకాలం ఇంతే! జంటనగరాల్లో నేరస్తులను ఎటూ అదుపుచేయలేరు.. కనీసం ఆటొడ్రైవర్లను కూడా నియంత్రించలేని పరిస్థితి. వసూళ్ళలో మునిగిపోతున్నారు మరి.

**కారాగారాల్లో ఉండవలసినవాళ్ళు సచివాలయాలకు ఎగబడుతున్నారు.. పాపులు పాలకులు కావాలని ఆత్రుత, కంత్రీలు మంత్రిపదవులకు గాలం వేస్తున్నారు.

21-10-13
**కాపీ(నం)హక్కు దారులు ఎక్కాల బుక్కులు అచ్చేయించుకుని అవార్డులకోసం వెంపర్లాడుతున్నారు తెలుసా మీకు. రాతగాళ్ళు, కూతగాళ్ళు (కలాలు, గొట్టాలు)భావచౌర్యం సొంతం చేసుకుని చిల్లి గవ్వకు చెల్లని సత్తు ముఖాలు సమాజంలో మేధావులుగా చెలామణి అవుతున్నారు....

**నా వార్తలు నా ఇష్టం - అంటే ఇదే!! (My news.. my views.. my will..)See a blatant distortion of news. All print media carried the news item stating that CM had stated that he would stop the "division cyclone" with the help of people. What he really said was different even according to "The Hans India" which carried a distorted version..Hans carries the rejoinder on its first page (22-10-13).

**కొత్త కులాలు అందలం ఎక్కుతాయో లేదో తెలీదుకాని మన పాత కలాలు, గొట్టాలు తమ ప్రవృత్తిని తాకట్టు పెట్టుకోవడమే కాకుండా బానిసలై వృత్తిని పణంగాపెట్టి గెలిపించడానికి నానా యాతన పడుతున్నారు. ప్రేమ ప్రాంతం మీద, కులం మీద కాకపోవచ్చు .. పైసా మే పరమాత్మా హైన్!

**
**పొరబాటున బాబు సి ఎం అయితే మొదత సాష్టాంగ పాద ప్రణామం చేసేది కలంకుల కార్లే..


20-10-13
**అశోకుడి ఉద్యమ ప్యాకేజ్ విలువ అక్షరాల "కోటి" రూపాయలట..తిలాపాపం తలా పిడికెడు..ప్రసార సాధనాలవెప్పుడూ స్తోత్రపాఠాలు లేదా తిట్ల పురాణం..కొత్తేముంది.. ప్యాకేజీ ప్రభావం..

**కమ్యూనిజమంటే కాదుకానీ కొందరు కమ్యూనిస్టులంటే నిజంగా నాకు గిట్టదు. కాని కేర్ ఆస్పత్రిలో నిన్న రాత్రి కన్ను మూసిన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణ మూర్తి(వైఆర్కే)కు నేను అభిమానిని. ఆయన ఒక ప్రజావైద్యుడు. ఒక శ్నేహ శీలి. కుండబద్దలుకొట్టినట్లు చెప్పే వాదాలను ఆయన మెచ్చకున్నా మనసారా అహ్వానిస్తారు. ఆయన ఒక సైధ్ధాంతిక ఉపన్యాసకుడే కాదు. ఒక ఉత్తమ శ్రోత. నిగర్వి. ఒక కమ్యూనిస్టునాయకుడిగ-ఒక పాత్రికేయుడిగా మా ఇరువురికి 15 సంవత్సరాలకు పైబడి మంచి స్నేహబంధం...రాజ్యసభకు అర్హుడైన నిజమైన మేధావి. రాష్ట్రానికి ఖమ్మం జిల్లా ప్రసాదించిన అరుదైన విశిష్ట వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన మరణం మిత్రకోటికి బాధాకరం. మా ఇరువురి పేర్లు ఒకటి కావడం కాకతాళీయమైన అనుబంధం.. ఒక మంచి వ్యక్తి శాశ్వతంగా అదృశ్యమైపోయారు. ఆయన మంచితనం అజరామరం..

**మనం పాదాక్రాంతమై, దెయ్యాలైన కఠిన శిలలకు మొక్కుతున్నంతకాలం తప్పకుండా మనది డెమొనాక్రసీనే.. ఏమాత్రం అనుమానంలేదు. శిరసు వంచడం మినహా బానిసబతుకులకు మరో మార్గం లేదు. కమండలం ఇప్పించనంతకాలకాలం దండాధారులదే కమాండ్..

18-10-13

**గళం మూగవోయింది, కలం ఇంకిపోయింది, రాత ఆగిపోయింది.. ఊపిరి నిలిచిపోయింది..రావూరి వెళ్ళిపోయారు....చలం దగ్గరకు పాకుడురాళ్ళ మీదుగా  నడుచుకుంటూ.... 'జ్ఞానపీఠ్' విజేతకు అక్షరాంజలి.. అశృతర్పణం..

**తీన్ తేరా ఆఠ్ అఠారా.. అంటారు.. అంటే ఇక అంతే సంగతి అని అనుకుంటా..
మన సీ(చీ)మ ఎంపీల పని అంతే. ఫట్..పదముగ్గురు ఎంపీల రాజీనామ స్పీకర్ తిరస్కరణ..ఇక మిగిలింది ప్రజా తిరస్కరణ.. డ్రాజీనామా బాగుంది..
తేరీ మన్‌కే తెలంగాణా.. మేరీ మన్‌కే సమైక్యాంధ్ర.. బోల్ సోనియా బోల్ సమైక్యం హొగాకే నహీ...
నహీ... కబీ నహి...
**రాజీనామాలు సాధించలేనివాళ్ళు ఇక సమైక్యాన్ని ఏం సాధిస్తారు..
**నవ సమా(జ)ధి నిర్మాతలు మన నేతలు.. రానున్న ఎన్నికల గుర్తు : సమాధి
**కొందరు కారణ జన్ములు..వారు సాకారులు. మరి కొందరు అకా"రణ" జన్ములు.. వారు నిరాకారులు.. మరింత వికారులు..
17-10-13
**ఆంధ్రా "అశోకుడు" చెట్లు పీకించెను, రోడ్లు తవ్వించెను, చెరువులు పూడ్పించెను, స్కూళ్ళు మూయించెను, బస్సులను ఆపెను, కార్యాలయములకు తాళము వేయించెను, ప్రజలను కష్టముల పాల్జేసెను, యుద్ధము మాన్పించెను(సమ్మె ఉపసంహరించుకొనెను..). ముఖ్యమంత్రి నుంచి హామీ కూడా పొందెను.. రాష్ట్రపతిపాలన హెచ్చరిక ప్రభావమా?

**మూడురాష్ట్రాల ఏర్పాటప్పుడు అక్కడ ఎన్జీవోలు సమ్మెలు చేయలేదే, మంత్రులు ముఖ్యమంత్రులను  తూర్పారబట్టలేదే.. ఎంపీలు రాజీనామా డ్రామాలాడలేదే, రాష్ట్ర మంత్రులు సచివాలయాలు వదలి డిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయలేదే, చానళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేయలేదే.. 

Tuesday 15 October 2013

వారంలో గరం గరం రాజకీయ వడ(దెబ్బ)లు   

15-10-13
**ఈ రోజెంత ఆహ్లాదంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉందో!!
అవును అచ్చోసే అక్షర కాలుష్యం నుండి ఒక్కరోజు విరామం..
(ఇవ్వాళ వార్తా పత్రికలు లేవు కదా... ఇలా వారంలో ఒక్క రోజైనా ఉంటే బాగు కదా!!)
మొన్న శనివారం భండారువారికి ఉత్తమ పాత్రికేయ పురస్కార సభలో జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. "ఇదివరలో దూరదర్శన్ ఒక్కటే ఉన్నప్పుడు ఈ మోనోపలి ఏమిటి? ఇంకా చానళ్ళు రావలని అనుకునే వాణ్ణి. ఇప్పుడైతే  చానళ్ళన్నీ మూతపడాలని కోరుకుంటున్నాను(రు). వార్తా కాలుష్యం రాజకీయనాయకులు కూడా ఏవగించుకునే లా... ఎంతగా పెరిగిందో అర్ధమవుతున్నది..

14-10-13

**ప్రమాణాలు పరమాణువులై..ప్రణామాలు అందుకోలేక పోతున్నాయ్.. పరిణామలు ఎలా ఉంటాయో.. అంతా ప్రమాద భూయిష్టమైన వాతావ"రణం" లో ప్రపంచం......
12-10-13

**I AM HAPPY TO INFORM MY FRIENDS THAT DR B R AMBEDKAR OPEN UNIVERSITY(HYDERABAD) AUTHORITIES HAVE NOMINATED ME AS A TRANSLATOR FOR TRANSLATING THE MASS COMMUNICATION AND PUBLIC RELATIONS COURSE, AT UG LEVEL [B A, B COm, B Sc] (WRITING FOR MEDIA FROM ENGLISH TO TELUGU).
GURU KATAAKSHAM AND VIJAYA DASAMI GIFT TO ME.

HIGH REGARDS TO SRI DASU KESAVA RAO, WHO AT THE END OF HIS 28 YEARS IN THE COUNTRY'S LEADING ENGLISH DAILY, "THE HINDU" , REACHED THE PINNACLE OF HIS CAREER AS CHIEF OF BUREAU, AND DEPUTY EDITOR, FOR ENCOURAGING AND GUIDING ME IN RIGHT DIRECTION IN THE PROFESSION FROM THE BEGINNING. I AM BLESSED. (status)
-----
**PARAMA GURU KATAAKSHAM. TRIPLE PROSTRATIONS DEVA. I AM BLESSED.
DR B R AMBEDKAR OPEN UNIVERSITY(HYDERABAD) AUTHORITIES HAVE NOMINATED ME AS A TRANSLATOR FOR TRANSLATING THE MASS COMMUNICATION AND PUBLIC RELATIONS COURSE, AT UG LEVEL [B A, B COm, B Sc] (WRITING FOR MEDIA FROM ENGLISH TO TELUGU). ALL GURU GRACE. AT THY HOLIEST FEET. _/\_(sridharamritam)
----------------------------------------------------
**నదులన్నిటికీ కాలువలు ముందుగానే తవ్వి ఉంచారు.. సముద్రంలో కలవడానికి.. ఇంకిపోయే జలాలు, కలాలు మరో వనరు వెతుక్కోవాలి కదా.. ఇది కొత్తేముంది. బెల్లం ఉన్న చోటకు చీమలు సాధారణమే! సలహాదారులు సామాన్యులా!

**కతుకుడు రాజకీయాలు మనుషుల బతుకులనే కాదు పండగ బతుకమ్మలనూ మార్చే(డ్చే)సినాయ్.

**కిరణ్‌కుమార్ ప్రతిపక్షంలో విప్. అధికార పక్షంలో చీఫ్ విప్, తరువాత స్పీకర్, మూడేళ్ళు ముఖ్య మంత్రి.. ఆ మాత్రం తెలీదా. రాజ్యాంగం లోని 3 ఆర్టికిల్ అసలు చదవలేదా, చదివినా అర్ధం కాలేదా? తీర్మానాన్ని ఓటింగ్‌లో ఓడిస్తామనడం కేవలం ప్రజలను మభ్య పెట్టడమే. ఉద్యమం పేరిట అందరూ ఊళ్ళు పంచుకున్నారు.

**ఆశ్చర్యమేమిటంటే.. సిబ్బంది సంస్థ సమస్యల పరిష్కారకోసం సమ్మె జరిగితే 23 జిల్లాల్లో కాకుందా 13 జిల్లాలకే ఎందుకు పరిమితమైంది. సమ్మె రాజకీయ మని, రాష్ట్ర విభజన నేపథ్యమని తెలిసి 60 రోజులు యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు కళ్ళు మూసుకుంది. ఒక కన్నైనా కనబడుతున్నదని ఉపేక్షించిందా? రవాణా మంత్రి నిన్నటివరకు ఎందుకు చర్చలు జరపలెదు? సమ్మె నష్టం 200 కోట్ల రూపాయలనష్టం ఎవరు భరిస్తారు? 175 మంది సీమాంధ్ర ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, 13 జిల్లాల ఆర్టీసి సిబ్బంది నుంచి వసూలు చెయ్యండి. నిజమైన న్యాయవాదులుంటే రాష్త్ర ఉన్నత న్యాయ స్థానం లో పిల్ వేయండి.  

**నిన్నటితో ఉద్యమ హోరు ఆగింది చానళ్ళలో . ఈ రోజూ ఉప్పెన హోరు మొదలైంది.. పాపం 24 గంటల బాధ..వర్షం ఎలా కురుస్తుంది? తుపానేమిటి? అల్ప పీడనమేమిటి.. ఇలాంటి కథలు పొద్దుణ్ణించి..టీవీ పెడితే రోజూ మనకు ఎన్ని పీడలో..మనం తాడిత పీడితులం.. సమ్మె రాజకీయం అయిపోయింది. ఇక నేటినుంచి సహాయ పునరావాస కార్యక్రమాలపై తిట్ల దండకాలు. బుల్లి తెరపై ఇక వైఫల్య కథనాలు కో కొల్లలు.

** నిజాల్ని ఇజాలు (జర్నల్-ఇజం)పాతరేస్తున్నాయి. అందుకు తార్కాణం తెలుగు చానళ్ళు, పత్రికలు. ఒక విషయానికి ఎంతగా మసిపూయవచ్చో (వక్రీకరించవచ్చో)రోజూ చేసి చూపుతున్నాయి.

**సమైక్య రాష్ట్రం గా ఉంచుతామని కేంద్రం హామీ ఇచ్చిందా ఉద్యోగులు చల్లబడ్డారు. అసెంబ్లీకి తీర్మానం వోటింగుకు పెదతామని సోనియా వాగ్దానం చేసిందా? ప్రజాప్రతినిధులు తోక ముడిచారు. 73 రోజులు ప్రజలు పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు చదువులు అన్నీ వొదిలేశారు. రోడ్లెక్కారు. 60 రోజులు ఆర్టీసి బస్సులు బంద్ 200 కోట్లు నష్టం. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేశారు, జీతాలు ఇవ్వాళకాకపోతే రేపు వస్తాయి. లంచాలు నిత్య కల్యాణం పచ్చతోరణం. అశొక్ బాబు అనే మరో తురుం ఖాన్ ను సీమాంధ్రకు ప్రసాదించింది "ఉద్యమం". తెలుగు చానళ్ళు బాగా సొమ్ము చేసుకున్నాయి. ఇప్పుడైనా అర్ధమైందా? ఎప్పుడైనా గెలిచేది క్షుద్ర రాజకీయం. ఒడేది ప్రజలు.

**క్షుద్ర రాజకీయ వ్యాధిగ్రస్థ నాయకులకు అవసాన దశప్రాప్తిరస్తు. ఇది ప్రజల శాపం.

**ప్రజల శాపం యమ పాశం. వీళ్ళు ఉత్తమ మార్కండేయులు కారు. ఉత్త మూర్ఖండేయులు.. అన్ని దారులూ మూసుకుపోయాయి నాసికా రంధ్రాలు సహా! ఊపిరాడక ఇక మరణమే..

10-10-13

**‘నందామయా గురుడ నందామయా’ఆనంద దేవికీ నందామయా..గొర్రెలు తినువాడు గోవింద కొడతాడు బర్రెలు తినువాడు వస్తాడయా...
‘శివశివమూర్తివి గణనాథా’ నీవు శివుని కుమారుడవు గణనాథ.. ఒక్క సారి మంత్రి చెయ్యి గణనాథ. నిన్ను ఒదిలిపెడితె ఒట్టు పెట్టు గణనాథ..‘బ్లాక్ మార్కెట్ చెయ్యి గణనాథా నిన్ను కొట్టమంటే ఒట్టుపెట్టు గణనాథా’...
ఈ పాటలు గుర్తుందాండీ..  "పెద్దమనుషులు.." కె వి రెడ్డి గారిది ఎంత ముందు చూపు..

** ఆర్టీసి కి మూతేసి.. ప్రై"వేటు"కు రంగం సిద్ధం..  ఇక దివాకర్ ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్, కేసినేని ట్రావెల్స్, మురళికృష్ణ టావెల్స్, సింధు ట్రావెల్స్...జిల్లాలు పంచుకుంటాయి. రెండు కొత్త రాష్ట్రాల్లో వారి ప్రగతి చక్రాలే పరుగులు తీస్తాయి.

**అసెంబ్లీలో కేవలం చర్చ మాత్రమే.. ఓటింగు ఉండదు.. ఇక టింగు టింగే..అందరూ చేతులు(కాళ్ళు కూడా)ఎత్తడమే!! హస్తవాసి బాగుండలేదు. 'అనంత' రాత్రి జగన్నాధ రథంలో, పొద్దున్నే రాయపాటి బాబు దగ్గరకు జంప్. సామాజిక సమీక'రణాలు' మొదలవుతున్నాయి.

**నిప్పు రాజేసి తప్పుకున్నారు. ఇప్పుడు చెప్పు తీసుకుని కొట్టాలి ఒక్కొక్కళ్ళని..

**వెదకి, వెంటాడి తంతారు.. ప్రజలు వెంగళప్పలు కారు..
అశోకుడు చెట్లు నాటించెను - అది చరిత్ర;
'అశోక్' సమ్మె చేయించెను - ఇది వాస్తవం..

**చాకో గారు డిల్లీలో అల్టిమేటం ఇచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు, విధినిర్వహణలో ఆ ప్రభుత్వం విఫల మైనప్పుడు ప్రత్యామ్నాయం రాష్ట్రపతి  పాలనేనని. అంతే కాదు, రాష్ట్రంలో శాంతి భద్రతల బాధ్యత ముఖ్యమంత్రిదేనని కూడా కుండ బద్దలు కొట్టారు. మరేదారి లేకుంటే రాష్ట్రపతి పాలనే నని తేల్చేశారు. వెంటనే విద్యుత్ సమ్మె ఆగింది. బొత్స ఆర్టీసి ఉద్యోగులతో చర్చలు మొదలెట్టారట. తుపాను నెపం తో ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మెకు విరామం ప్రకటించారట. కాకెక్కుతేగాని తెలీదు..

**వారం రోజులపాటు కన్నుపొడుచుకున్న చీకట్లు.. ఇక కళ్ళు బైర్లు కమ్మే మిరుమిట్లు.. విద్యుత్ సమ్మె ఆగిపోయింది. నాయకుని ఇష్టానుసారం ఉద్యోగులు నడుచుకున్నారు.
9-10-13

** జూనియర్ (నూతన) నేతలకు ఫ్యూచర్లో మంచి డిమాండ్. "పెర్ఫార్మెన్స్" బట్టి ప్రొమోషన్లు.. అవార్డులు, రివార్డులు..

**పదమూడు జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం పనిచెయ్యడంలేదు రెండు నెలలుగా..ఎక్కడా జీతాలు లేవు కూడా. అవునా? అయినా స్దరే.. తుపానుకు కోస్తాజిల్లాల్లో ప్రభుత్వ సిబ్బందితో సర్వం సిధ్ధంగా ఉందట. రఘువీరా గారు సెలవిచ్చారు. కంట్రోల్ రూములు తెరచారట.. ప్రజలను అప్రమత్తం చేశారట! తీరంలో ప్రమాద సూచికలు ఎగురవేశారట. కోస్తాలో కాంగ్రెస్ కోతకు గురవుతున్నది. వలస శిబిరాలు మొదలయ్యయి. అసలు మంత్రులే అదృశ్యం..(ఇవన్నీ కాంగ్రెస్ కు ముంచుకొస్తున్న తుపాను. డామేజీ పూర్తిగా అయింది. ఇక కంట్రోల్ ఏమిటో?) ఇక ఫైనల్‌గా చేతులెత్తేయడం - తెల్లజండా ఎగరేయడమే!!
[COMMENT BY Srinivasrao Bhandaru అల్లకల్లోలంగా వున్న సముద్రంలో నౌకలో ప్రయాణించేవారు అలలు యెంత తీవ్రంగా వున్నా నౌకనుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోవాలని అనుకోరు. కానీ నౌకకు చిల్లిపడిందని తెలిస్తే మాత్రం అందులో ఒక్కరూ వుండరు. సముద్రంలోకి దూకి వొడ్డుకు చేరాలని తాపత్రయ పడతారు. ఇదీ అంతే.}

**సమైక్యమంటూ రేయింబవళ్ళు డిల్లీలో మంతానాలు సాగించిన కాంగ్రెస్ ఎంపీలు అనుకున్నట్లే జగన్ బాట పట్టారు. తెర వెనుక నడిపిస్తున్నది వ్యూహరచనా ధురీణులు కదా? జగన్ కాంగ్రెస్ లో విలీనం కంటే కాంగ్రెస్ జగన్ తో మమేకమవుతున్నది. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి తో క్యూ మొదలైంది.. రాష్ట్ర మంత్రులూ సంచీలు సర్దుకుంటున్నారు..

**కలి-విడిగా...విడిగా కలిసుందాం..కలిసి విడిపోదాం: మనసులు కలసి.. మనుషులే విడిగా: నేల ఒకటే - ప్రాంతాలు వేరు: అన్నదమ్ముల్లా పంచుకుందాం: బేటాలు, టాటాలు, మాటలు, పాటలు, కోటాలు, ఇవన్నీ బీటలకే చిహ్నం.. మొత్తానికి తేలవలసింది "పదవుల వాటాలు" మాత్రమే. పిల్లి పోరు-పిల్లిపోరు చివరకు పిట్ట తీర్చిందట..

8-10-13
**చంచల్‌గూడా జైలు గోడలు కూడా అన్యాయం చెయ్యద్దు.. సమన్యాయం చెయ్యమని ఘోషిస్తున్నాయట..చానల్ కెమేరాలు రోడ్లు ఖాళీ చేశాయి..బోసిపోయి ప్రజలంతా ఏదో వెలితిగా ఫీలవుతున్నారు.

**జ్ఞానముందనుకున్న ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ దీకూడా జగన్నాటకంలో ముఖ్యపాత్రే కదా.. చీలిన కాంగ్రెస్ తో ఆయనకూడా సమైక్యమే..రాజకీయ గురువు అడుగుజాడల్లో ఆయన..ఆయన వెంట వందిమాగధ బృందం.. చూస్తుండండి..నిరంతరాయ నాటకం.
.
**పాపం విద్యుత్ సిబ్బంది నాయకుని మాట వినలేదుట..స్వర్ణాంధకారం మరికొన్నిరోజులు.. రాజుకంటే మొండివాడు బలవంతుడే ..

**రజనీకాంత్ .... నేను ఒక్క సారి చెబితే వందసార్లు చెప్పినట్టు-
చంద్రబాబు .. నేను వందసార్లు చెప్పినా ఒక్కసారి కూడా అర్థం కాదు-
బాబుకు దీటుగా కెకె ను బరిలోకి దించితే సరి..గడ్డం జుట్టు రెండూ పీక్కుని పరార్!! (ఇద్దరికీ గెడ్డాలు, జుట్టు ఒకే రీతిలో ఉంటాయి)..

Wednesday 9 October 2013

                              
                               మంత్రపుష్పం
  

                       [ఈ రోజు నుంచి మంత్ర పుష్పం శ్లోకం తాత్పర్య సహితంగా అందిస్తున్నాను.]
 
1-9-13
మంత్ర పుష్పం..
------------------
ఓమ్ 

ధాతా పురస్తా ద్యముదాజహార
శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్త్రః
త్వమేవం విద్వా నమృత ఇహ భవతి
నాన్యః పాంథా అయనాయ విద్యతే!

తా: పూర్వము పరమ పురుషుడు ఈ మంత్ర పుష్పమును నిర్మింపగా, సకల ప్రాణికోటిని రక్షించేందుకు  ఇంద్రుడు దీనిని నలు దిక్కులా వ్యాప్తి చేసెను. ఆ పరమాత్మను ధ్యానించడం వలన అమృతత్వం లభిస్తుంది. ఇది మినహా మోక్షప్రాప్తికి వేరు మార్గం లేదు.
  
శ్లో(1): సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్
      విశ్వం నారాయణం దేవం అక్షరం పరమ్ పదమ్!
తా: వేయి శిరస్సులు కలిగి అనేక నేత్రములతో ప్రపంచమునకు సుఖము చేకూర్చు వాడూ, సర్వ వ్యాపకుడు, సమస్త ప్రాణికోటికీ ఆధారమైనవాడు, శాశ్వతుడూ, శుభకరుడూ, మోక్షస్థానమైన వాడూ అయిన నారాయణునకు  నమస్కరించెదను.  
2-9-13
మంత్రపుష్పమ్

శ్లో(2):విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ హరిమ్,
     విశ్వ మే వేదం పురుషస్త ద్విశ్వ ముపజీవతి.
 (3):పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివమచ్యుతం
    నారాయణం మహాయజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్.
తా: విశ్వానికి అతీతుడు, విశ్వమే తానైనవాడు, నిత్యుడూ, సర్వవ్యాపకుడూ, విశ్వానికి జీవనాధారమైనవాడూ, విశ్వపతి, విశ్వానికి ఈశ్వరుడూ, శాశ్వతుడూ, మంగళకరుడూ, నాశనము లేనివాడూ, తెలిసికొనదహిన పరమాత్ముడు, విశ్వాత్ముడూ, విశ్వపరాయణుడూ,అయిన నారాయణునికి నమస్కారము.    
3-9-13
మంత్రపుష్పమ్
శ్లో(4):నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః
     నారాయణపరం బ్రహ్మ తత్వం నారాయణః పరః
     నారాయణ  పరోధ్యాతా ధ్యానం నారాయణః పరః!
తా: నారాయణుడే పరం జ్యోతి, పరమాత్మస్వరూపుడు,అతడే బ్రహ్మ, పరతత్వము, ధ్యానం చేసేవాడూ, ధ్యానమూ కూడ ఆ నారాయణుడే..  
4-9-13
మంత్రపుష్పమ్
శ్లో(5): యచ్చకించి జ్జగత్సర్వం దృశ్యతే శూయతేపి వా,
     అంత ర్బహి శ్చ త త్సర్వం వ్యాప్య నారాయన స్థితః
     అనంతమవ్యయం కవిగ్ం సముద్రేంతంవిశ్వసంభువమ్! 
తా: బ్రహ్మాండంలో ఈ స్వలపమైన జగత్తు మహాకాసంలో వేరుగా తోచు ఘటాకాశం వలే కనిపిస్తుంది. ఉనికిని పొందుతుంది.దానికి బయటా, లోపలా, అంతా నారాయణుడే వ్యాపించి ఉన్నాడు. అనంతుడు, వినాశములేనివాడు అయిన ఈ దేవుడు సంసార సాగరం నుండి విముక్తిని ప్రసాదిస్తూ ప్రపంచమునకు సుఖం కలిగిస్తాడు. 
5-9-13
మంత్రపుష్పమ్
శ్లో(6): పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయం చాప్యధోముఖమ్!
తా: కంఠమునకు కిందిభాగంలో, నాభికి పై భాగంలో ద్వాదశాంగుళ ప్రమాణం గలిగి, అథోముఖంగా, ముకుళించి ఉన్న పద్మాన్ని పోలిన హృదయం నెలకొని ఉంది.
6-9-13
మంత్రపుష్పమ్
శ్లో(7,8,9): అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యా ముపరి తిష్ఠతి,
         జ్వాలామాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్,

         సంతతగ్ం శిలాభి స్తు లంబత్యాకోశసన్నిభమ్,
         తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ త్సర్వం ప్రతిష్టితమ్,

         తస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖః,
         సోగ్రభుగ్విభజంతిష్ఠ న్నాహార మజరః కవిః,
         తిర్యగూర్ధ్వమధశ్శాయీ  రశ్మయ స్తస్య సంతతా.
తా: ఆ హృదయ కమలాన్ని ఆశ్రయించి, జ్వాలాసమూహంతో వెలుగుతూ, జీవులకు పొరధాన స్థానమై, అనేక నాడీ సమూహాలకు ఆలంబనయై, అరవిరిసిన పద్మాన్ని బోలిన హృదయాగ్రభాగంలో సూక్ష్మమైన కమలం ఒకటున్నది. దాన్లో సర్వం ప్రతిష్ఠితమై ఉన్నది.  దాని మధ్యలో అంతటా జ్వాలలు వ్యాపించు గొప్ప అగ్నిదేవుడున్నాడు. ఆ అగ్నియే జఠరాగ్ని. 

7-9-13
మంత్రపుష్పమ్

శ్లో(10):సంతాపయతి స్వం దేహ మాపాదతలమస్తకః,
      తస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః.

తా: భుజించిన అన్నాన్ని ఆ అగ్ని సముచిత భాగాలుగా విభజించి పైకి, కిందికి, అడ్డముగాను ఉన్నది. ఆ అగ్నికిరణాలు ఆపాదమస్తకం వ్యాపించి ఉన్నవి. ఈ న్యాసముచే యోగధ్యానులు చేసేవారు మహా తేజోవంతులవుతారు.

8-9-13
మంత్రపుష్పమ్

శ్లో(11):నీలతోయద మధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా,
      నీవార శూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా.

తా: ఈ జఠరాగ్ని నడుమ సూక్ష్మమైన  అగ్నిశిఖ ఊర్ధ్వముగా పైకెగయుచున్నది. అది నీల మేఘం మధ్య మెరపువలె ప్రకాశించుచున్నది. నివ్వరి ధాన్యపు ముల్లువలె సూక్ష్మమై పచ్చని వన్నె కలిగి అది అణువుతో సమానమై ఉన్నది. 
9-9-13
మంత్రపుష్పమ్

శ్లో(12): తస్యా శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః,
స బ్రహ్మ స శివ స్స హరి స్సేంద్రస్సో క్షరం పరమస్స్వరాట్! 

తా: ఆ అగ్నిశిఖ మధ్యలో పరమాత్మ ఉంటాడు. బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు ఆ పరమాత్మయే. నాశరహితుడు, మూలకారణము, స్వయంప్రకాశము గలవాడు ఆ పరమాత్మయే!

10-9-13

మంత్రపుష్పమ్

శ్లో(13): యోపాం పుష్పం వేద, పుష్పవాన్, ప్రజావాన్ పశుమాన్ భవతి,
       చన్ద్రమా వా ఆపాం పుష్పం, పుష్పవా ప్రజావాన్, పశుమాన్ భవతి, య ఏవం వేద. 

తా: ఉదకమున భగవంతుడు, ఆ భగవంతునిలో ఉదకమూ పరస్పరం ఆశ్రయాలై ఉన్నట్లు తెలుసుకున్నవారికి పుష్పాలు, సంతానం, పశువులు లబించుచున్నవి. ఆ ఉదక స్థాన వివరణమెరిగిన వారు ముక్తులవుదురు. 

11-9-13
మంత్రపుష్పమ్

శ్లో(14):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
      అగ్నిర్వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి,
      యోగ్నేరాయతనం వేద, ఆయతనావాన్ భవతి, 
      ఆపోవా అగ్నే రాయతనం, ఆయతనవాన్ భవతి,
      య ఏవం వేద.
తా: అగ్నిలో ఉదకం, ఉదకంలో అగ్ని పరస్పర ఆశ్రయాలు, ఈస్థితిని తెలిసిన వారు ముక్తులవుదురు. 

24-9-13

మంత్రపుష్పమ్

శ్లో(15):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
      వాయుర్వా అపా మాయతనం, ఆయతనవాన్ భవతి,
      యో వాయో రాయతనం వేద, ఆయతనావాన్ భవతి, 
      ఆపోవై వాయో రాయతనం, ఆయతనవాన్ భవతి,
      య ఏవం వేద.
తా: వాయువు ఉదకమునకు స్థానము. వాయువునకు జలాలు స్థానం. పరస్పర ఆశ్రయాలైన వీటిస్థానాలు గ్రహించిన వారు ముక్తి పొందుతారు.  
  
25-9-13
మంత్రపుష్పమ్

శ్లో(16):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
ఆసోవై తపన్న పామాయతనం, ఆయతనవాన్ భవతి,
యోముష్యతపత రాయతనం వేద, ఆయతనావాన్ భవతి, 
ఆపోవా అముష్యతపత ఆయతనం, ఆయతనవాన్ భవతి,
య ఏవం వేద.
తా:తపింపజేస్తున్న ఈ సూర్యుడే జలస్థానమునకు అధినేత. జలస్థానమే ఆదిత్య స్థానం. వీటి పరస్పర అభేధ స్థితిని ఎరిగినవారు ముక్తులగుదురు.

26-9-13
మంత్రపుష్పమ్

శ్లో(17):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
     చన్ద్రమా వా ఆపా మాయతనం, ఆయతనవాన్ భవతి,
     యశ్చ్ణన్ద్రమస ఆయతనం, ఆయతనవాన్ భవతి,
     ఆపోవై చన్ద్రమస ఆయతనం, ఆయతనవాన్ భవతి,
     య ఏవం వేద.
తా:జనులందరికీ సంతోషం కలిగించే చంద్రుడే జలస్థానపతి.జలాలే చంద్రునికి స్థానం. ఎ విషయం గ్రహించినవారు ముక్తి పొందుదురు.. 

27-9-13
మంత్రపుష్పమ్

శ్లో(18):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
     నక్షత్రాణివా  వా ఆపా మాయతనం, ఆయతనవాన్ భవతి,
     యోనక్షత్రాణామాయతనం, ఆయతనవాన్ భవతి,
     ఆపోవైనక్షత్రాణా మాయతనం, ఆయతనవాన్ భవతి,
     య ఏవం వేద. 
తా:  జలాలకు నక్షత్రాలే స్థానం. ఆ నక్షత్రాల స్థితిని తెలుసుకుని జలమే స్థ్గానమని గ్రహించినవారు ముక్తులవుతారు..  

28-9-13
మంత్రపుష్పమ్

శ్లో(19):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
     పర్జన్యో వా ఆపామాయతనం, ఆయతనవాన్ భవతి,
     యః పర్జన్యస్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి, 
     ఆపో వై పర్జన్యస్యాయతనం, ఆయతనవాన్ భవతి,
     య ఏవం వేద. 
తా:  ఉదకస్థానమునక్ మేఘుదే అధినేత. మేఘములకు జలమే స్థానం ఈ విషయం తెలుసుకున్నవారు ముక్తులవుతారు.  

03-10-13
మంత్రపుష్పమ్

శ్లో(20&21):యోపా మాయతనం వేద, ఆయతనవాన్ భవతి,
సంవత్సరో వా ఆపామాయతనం, ఆయతనవాన్ భవతి,
యః సంవత్సరస్యాయతనం వేద, ఆయతనవాన్ భవతి, 
ఆపో వై సంవత్సరస్యాయతనం, ఆయతనవాన్ భవతి,
య ఏవం వేద. 
యో ప్సు నావం ప్రతిష్ఠి తాం వేద, ప్రత్యేవ తిష్ఠతి. 
తా: సంవత్సరమే ఉదకమునకు స్థానం, ఉదకమే సంవత్సరమునకు స్థానం. నీటికున్న అభేదమును తెలుసుకున్నవాడు ముక్తుడవుతాడు. కాబట్టి ఇవి ఏవిధంగా అన్యోన్య ఆశ్రయంగా వున్నాయో తెలుసుకోవాలి. అల గ్రహించిన వారే ముక్తులు. పదవకు-నీటికి ఎలా అన్యోన్యాశ్రయం వుందో అలాగే ఇదికూడా తెలుసుకోవాలి.

04-10-2013
మంత్రపుష్పం 

శ్లో(22):కిం తద్విష్ణోర్బల మాహుః, కాదీప్తిః కింపరాయణం,
      ఏకో యాదారయ ద్దేవః, రేతసీ రోదసీ ఉభే.   
తా: ఐహికము, ఆముష్మికము అనే రెంటికి స్వయంప్రకాశమూర్తి ఐన భగవంతుడు ఒక్కడే లోకాన్ని ఎలా ధరించాడు? ఆ విష్ణువు బలమేమిటి? ఆయన ప్రకాసం ఎలాంటిది? అతని పరంధామం ఏది? 
శ్లో(23):వాతాద్విష్ణో ర్బల మాహుః, అక్ష్రాద్దీప్తిః రుచ్యతే,
      త్రిపదా ద్దారయ ద్దేవః, యద్విష్ణో రేక ముత్తమమ్.  
తా: ప్రాణాయామాదులచేత విష్ణువునకు బలం లభించింది. నాశనం లేనివాడవడం చేత ప్రకాశం కలిగింది. త్రిపదావిభూతి వలన లోక ధారణ చేయగలిగాడు. ఆయనకు విష్ణులోకం ఒక్కతే పరమపద స్థానం.

5-10-13
మంత్ర పుష్పం..

శ్లో(24):రాజాధిరాజాయ ప్రహస్య సాహినే, నమోవయం వై
శ్రవణాయకుర్మహే, సమే కామాన్, కామకామాయ
మహ్యం, కామేశ్వరో వై శ్రవణో దదాతు, కుబేర
య వై శ్రవణాయ, మహారాజాయ నమః.
తా: రాజులందరికీ రాజైన ఆ భగవంతునికి నమస్కారం. కామములకు ప్రభువైన ఆ దేవదేవుడు కోర్కెలన్నింటినీ సపహలెకృతం చేస్తున్నాడు. స్తోత్రాలు వినదంలో ఆసక్తి గలవాడు, బ్రహ్మాండానికి అధినేత ఐన శ్రీమన్నారాయణునకు వందనం.

6-10-13
మంత్రపుష్పం

శ్లో(25-26):ఓం తద్బ్రహ్మ,ఓం తద్వాయు, ఓం తదాత్మా,
           ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురో నమః

           అన్తశ్చరతి భూతేషు, గుహాయాం విశ్వమూర్తిషు, త్వం
           యజ్ఞ స్త్వం వషట్కార స్త్వ మిన్ద్రస్తగ్ం రుద్రస్త్వం 
           విష్ణుస్త్వం బ్రహ్మ త్వం ప్రజాపతిః.
తా: ఓం అనే ప్రణవమే బ్రహ్మ స్వరూపం. అదే వాయువు, అదే ఆత్మ, అదే సత్యం, సర్వకారణ స్వరూపం. ఇలా పలికి దానికి నమస్కరిస్తున్నారు. ఆ ప్రణవస్వరూపుడు సకల భూతముల హృదయాల్లోనూ నెలకొని ఉంటాడు. పర్వత గుహలో సంచరిస్తున్నాడు. విస్వమంతా వ్యాపించి ఉంటాడు.  ఓ దేవా! నువ్వు యజ్ఞానివి, నువ్వే వషట్కారమవు, ఇంద్రుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ స్వరూపుడూ నువ్వే. ప్రజలను పాలించేవాడవూ నువ్వే!
7-10-13
మంత్రపుష్పం

శ్లో(27):త్వం తదాప ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్!

(28):ఈశానస్సర్వవిద్యానా మీశ్వర స్సర్వభూతానాం బ్రహమాదిపతిర్
బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం!
తా: ఓ దేవా, స్వయంప్రకాశాత్మవైన నువ్వే అపోజ్యోతివి. అమృతస్వరూపుడవు. రస స్వరూపుడవు. బ్రహ్మ రూపుడవు. భూర్భువస్సువర్లోకాలలో ప్రణవస్వరూపుడవు నీవే! 

తా:నువ్వు సర్వ విద్యలకు అధిపతివి. సమస్తభూతాధిపతివి. బ్రహ్మలోకానికి, బ్రహ్మానికి అధినేతవు. బ్రహ్మస్వరూపుడవు. శివుడవు, ఓంకార స్వరూపుడవు, మాకు ఎల్లప్పుడూ శుభములను ప్రసాదించవలెనని ప్రార్ధిస్తున్నాను.

8-10-13
మంత్రపుష్పం

శ్లో(29):తద్విష్ణో పరమం పదగ్‌ం సదా పశ్యన్తి సూరయః
    దివీవ చక్షు రాతతమ్!
తా: తతవ్వేత్తలు పరమపదమైన విష్ణులోకాన్ని అంతరిక్షంలోని నాటకదీపమువలె జ్ఞాన దృష్టిచేత ఎల్లప్పుడూ చూస్తూఉన్నారు.
శ్లో(30):తద్విప్రాసో విపన్వవో జాగృదాం సస్సమిన్దతే విష్ణోర్య
      త్పరమం పదమ్!
తా:పరమపదమైన భగవంతుని మోక్షస్థానాన్ని శ్రద్ధాళువులు పొందుతారు. 
9-10-13
మంత్రపుష్పం 
(తాత్పర్య సహిత మంత్రపుష్పం నేటితో సమాప్తం:)
-----------------------------------------------------------          
పక్షం దినాల్లో పూర్తికావలసిన ఈ ప్రక్రియ మధ్యలో అనివార్య కారణాల వలన ఆలశ్యమైందని విన్నపం  
                                                                  *** 
శ్లో(31): ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళమ్,
       ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమోనమః.

తా:ఋతస్వరూపుడు, సత్యస్వరూపుడూ, పరముడూ, బ్రహ్మస్వరూపుడు, విశ్వాకారుడూ, విశ్వనేత్రుడు, జగత్తుకు సుఖం ప్రసాదించువాడూ, పింగళవర్ణుడూ, ఊర్ద్వరేతస్కుడూ, ఐన భగవంతునికి ప్రణామములు.
శ్లో(32):నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి,
      తన్నోవిష్ణుః ప్రచోదయాత్. 
తా: శ్రీమన్నారాయణుడు, సర్వవ్యాపి అయిన వాసుదేవుడు, మహా విష్ణువు మా బుద్ధిని అపరోక్షానుభవ లాభసిద్ధియందు ప్రేరేపించును గాక.(ఇది నారాయణ గాయత్రి మంత్రం. ఇక్కడ ఇతర దేవతా గాయత్రి మంత్రములను సందర్భానుసారంగా చెప్పుకొనవచ్చును.)  
శ్లో(33): ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి  సాగరం,
       సర్వ దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి!
తా: ఆకాశం నుండి పడిన నీరు సముద్రాన్ని చేరుతున్నట్లు ఏ దేవునికి నమస్కరించినా ఆ నమస్కార కేశవునికే చెందుతోంది.

(తాత్పర్య సహిత మంత్రపుష్పం నేటితో సమాప్తం:)
-----------------------------------------------------------        
పక్షం దినాల్లో పూర్తికావలసిన ఈ ప్రక్రియ మధ్యలో అనివార్య కారణాల వలన ఆలశ్యమైందని విన్నపం
-----------------------------------------------------------------------------------------------


Tuesday 8 October 2013

వాడి వాడి వార్తలు- వేడి వేడి వాతలు(వ్యాఖ్యలు) 


**అధికారం తలకెక్కితే పర్యవసానం అంధకారమే ... కరెంట్-షాక్ అబ్సార్బర్స్ కోసం వెదకులాట..

**సాక్షాత్తు వారం కిందట వరకు రెండేళ్ళకు పైగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిగా(డిజిపి) పనిచేసిన వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రిపై ఆరోపణాస్త్రాలు సంధించారు. ఇంతకంటే ఈ రాష్ట్రానికి పట్టే అధోగతి ఇంకేముంటుంది? ప్రజాస్వామ్యం, ప్రభుత్వ గౌరవం,ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు నిలబడాలంటే వెంటనే ఇద్దరిపై సుప్రీం కోర్టు న్యామూర్తిచే దర్యాప్తు చేయించి నిజాలు నిగ్గు తేల్చాలి. దోషులెవరైతే వారిని శిక్షించాలి. దేశానికే మార్గదర్శకంకావాలి.

**టీవీ వార్త: జగన్ కు, బాబుకు డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించారు..బిపి, సుగర్ లెవెల్స్ పడిఫొతున్నాయి-
జన వ్యాఖ్య: నిజమే అన్ని లెవెల్స్ పడిపోతే కదా నాయకులయ్యేది.
వార్త: నీరసించిపోయారు, తలనెప్పి వస్తోంది-
వ్యాఖ్య: అధికారం లేక నీరసించిపోతున్నారు, దీక్షలతో తలనొప్పే కదా!!

**MODATA SWARNAAMDHRA VINNAM. TARUVAATA HARITAAMDHRA VINNAM. IPPUDU PRATYAKSHAMGA AMDHAANDRA ANUBHAVISTUMNAM. AAMDHRA ENTA PUNYAM CHESUKUMDO KADAA?

**I WONDER. HOW MANY TIMES POLITICIANS TAKEUP FAST UNTILL DEATH.

**Responding to cm's appeal, power Employees agreed to restore electricity in six dts. Is it not evident that the aggitatipn is govt sponsored?

**I do not know whether govt(cm) is ruling the state or SAMAIKYS JAC IS RULING?

**స్వదేశీ హస్తంలో విదేశీ ప్రమేయం ఇలానే ఉంటుంది లేండి..

**పుట్టి బుద్ధెరిగిన తరువాత పొట్టిశ్రీరాములు మినహా దీక్షల్లో మరణించిన వాళ్ళు ఒక్కరూ కనబడలేదు. దీక్షల వలన అల్లర్లలో మరణాలు జరిగాయి. పెద్దలు మీరే చెప్పాలి. ఘుమ ఘుమ లాడే వంటావార్పుకు ఇంటిల్లిపాదీ విస్తళ్ళేసుకుని పంక్తికి సిద్ధమవుతున్నారు..

** రాజకీయాలు మాస్ హిస్టీరియా అని (వి)నాయకుల అపోహ. తిరగ"బడితె" పూజ తప్పదని తెలిసుకుంటున్నారు.

**ఆంధ్రలో సాగుతున్నది సామాన్య అంధకారం కాదు. అది రాజకీయ అధికార మదాంధకారం. ప్రజలు సమిధలవుతున్నారు. ప్రజాప్రతినిధులు పదవులు పట్టుకు వేలాడుతున్నారు. ఉద్యోగులకు రెందునెలలుగా జీతాలు లేవు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతినెలా జీతభత్యాలు అందుకుంటున్నారు. జనాలకు బస్సులు, రైళ్ళు లేవు కాని మంత్రులు, ప్రజాప్రతినిధులు వారానికి రెండేసి మార్లు విమానాల్లో డిల్లీకి వెళుతున్నారు. ఏపీభవన్లో ఉచితంగా, రాయితీలపై బస, వసతులు అనుభవిస్తున్నారు. భక్తులకు తిరుమలేశుదు, సిమ్హాచలం అప్పన్న, అన్నవరం సత్తెన్న, శ్రీశైలం మల్లన్న, బెజవాడ కనకదుర్గ దర్శన భాగ్యం లేదు. నేతలు మాత్రం జనపథ్ లో అమ్మ దర్శనం చేసుకుని సుప్రభాత భజనతో మొదలై పవ్వళింపు సేవవరకూ నిత్య భజనలో మునిగి తరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కటిక చీకట్లు..నాయకులకౌ కార్పొరేట్ ఆస్పత్రుల్లో మిరుమిట్లు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాల్లో ధగధగాయమాన వెలుగులు.. నేతల ఆస్తులకు రక్షణ..ప్రజలకు లాఠీ దెబ్బలు, కేసులు..ఆంధ్ర లో నిత్యాగ్నిహోత్ర జ్వాలలు.

**జండా పై కపిరాజు ... రెపరెపలాడుతున్నది. ఢిల్లీ కోటకు  బీటలు వారుతున్నాయి..కాళ్ళు వణకుతున్నాయి,  చేతికి వాతలు మిగులుతాయి. రంగు పడుద్ది. అది ఖాయం!

**Congress met with all head on collision accidents..No scope for recovery..Purely fatal ....

**అమ్మ బొమ్మకు ఇన్నేళ్ళు చెక్క భజనచేసి, యువరాజును నెత్తినెక్కించుకున్న న మంత్రులు, ఎంపీలు ఇక కాంగ్రెస్ లో ఉండలేరట..రాజీనామా చేసి ప్రజల్లోకి వెళతారట? మీరంతా మూకుమ్మడిగా పార్టీ మారడానికి ఏనాడొ సిధ్ధమయ్యారని చంటిపిల్లలకు కూడా రెండేళ్ళ కిందటే తెలుసు. ఈ రాజీనామాల ఏడుపేదో రెండునెల్లకిందటే ఏడిస్తే సరిపోయేదిగా!! 2009 నుంచీ అంతా నాటకం.. ఈ నాటకానికి సూత్రధారి, తెరచాటు సమన్వయకర్త ఎవరో అందరికీ తెలుసు.. సి బి ఐ మేనేజ్‌మెంట్ కూడా ఆయన చలవే! 2014తో ఆయన పదవీ కాలం కూడా పూర్తవుతుంది. ఇప్పుడు అసలు నాటకం మొదలు.

**రేపటినుంచి ముఖాలపై ముసుగులేసుకోవలసింది, వేలాడేసుకోవలసింది, సిగ్గుతో తలలు వంచుకోవలసింది ఎవరో తెలుసా. పొద్దు పొద్దున్నే పాచి ముఖాలతో టీవీల్లో ప్రత్యక్షమవుతూ కథలు వినిపిస్తుంటారే.. వాళ్ళు. వాళ్ళను విశ్లేషకులు, విదూషకులు, రాయని భాస్కరులు, వాచాలకులు అంటారు.

**తెలంగాణా తేచ్చేదీ, ఇచ్చేదీ, లేకుంటే చచ్చేదీ కాంగ్రెస్సే అని పాపం మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి ఏముహుర్తాన అన్నారోకానీ, ఇచ్చిన తరువాతకూడా చచ్చింది కాంగ్రెస్సే!! వచ్చింది గొర్రె- చచ్చింది బర్రె!

**STAR BATS MAN AND HIS TEAM LOST THE T GAME. BETTER FOR HENCHMEN AND BENCHMEN TO RETIRE FORTHWITH. CONGRESS ONCE AGAIM CHEATED PEOPLE PF AP.

**MEDIA HAS TOTALLY FAILED IN ASSESSING THE NOD OF UNION CABINET ON TELANGANA NOTE.

**అనర్హత వేటు బారి నుంచి కాపాడే వివాదాస్పద ఆర్డినెన్సు యువరాజు ప్రమేయంతో అటకెక్కింది. అదే మాదిరి తెలంగాణా ప్రక్రియ ఆపే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని రాహుల్ కన్నెర్ర జేస్తే తెలంగాణా నిలివిపోతుంది. సిడబ్ల్యుసి తీర్మానమైనా, కోర్ కమిటీ నిర్ణయమైనా, యుపీఎ అమోదమైనా, మంత్రివర్గ ముద్ర అయినా, ప్రధాని ఆజ్ఞ సరే యువరాజు ముందు బలాదూరే.. సీమాంధ్ర నాయకులారా రాజీనామాలెందుకు? రాహుల్ కు మొక్కి ప్రసన్నం చేసుకోండి. ఓ పనైపోతుంది. రాష్ట్రపతి సైతం అడుగు ముందుకెయ్యరు. గ్యారంటీ..

**ఈ 66 ఏళ్ళ స్వతంత్ర ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కోర్ కమిటీ కంటే, కేంద్ర క్యాబినెట్ కంటే, ప్రధానికంటే కూడా ఒక సాధారణ ఎం పి శక్తిమంతుడన్నమాట. ఆర్డినెన్స్ కోసం సాక్షాత్తు రాష్త్రపతి వద్దకు వెళ్ళిన తీర్మానం ముసాయిదా యు టర్న్ తీసుకున్నది. ఈది స్వతంత్ర భారతమా.. కుటుంబ బానిసత్వ రాజ్యమా!! ఆ తల్లి ఇప్పుడుకూడా నోరు విప్పలేదు..

**అమెరికా వెళ్ళినా మన్మోహన్ వంటి వ్యక్తికూడా విమానంలో కూడా మోడీ గురించి పలవరింతలే.. మోడీకి వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలట.. ఆకాశం నుంచే పిలుపునిచ్చారు. ఆ మాత్రం భయం ఉందన్నమాట. అది మోడీ శక్తి.

**ఆనాడు చంద్రబాబు అంగీకరించనందు వల్లనే తెలంగాణ  ఇవ్వలేక పోయామని బిజెపి నేత ఎల్ కె అద్వాని గతంలో అన్నారు. ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజలు తెలంగాణా వొద్దంటున్నారు. అద్వాని ఇప్పుడేమంటారో?  

**Today is Mohandas Karamchand Gandhi's 144 birth anniversary. He was assasinated 65 years back. Today anchors in Telugu channels, below 35 years age have been talking much about Gandhiji. Really astonishing.

**కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరంకు తెర వెనుక ఆర్ధిక సహాయదారులు, రాజకీయ సలహాదారులు  ఎవరబ్బా!!!

**మంత్రి డొక్కా కూడా సి.ఎం. కు ఎదురు తిరిగాడంటే రసవత్తర రాజకీయం అర్ధమవుతున్నదనుకుంటా మిత్రులందరికీ...

**ఆర్డినెన్స్ ను కేంద్రం ఉపసంహరించుకుంది. సెభాష్, (అ)ప్రస్తుత ప్రధాని మన్మోహన్‌పై భావి ఫ్రధాన  మంత్రి రాహుల్ గాంధి నెగ్గాడు.

**అమెరికాలో షట్‌డౌన్ వలన 8.5 లక్షల మంది ఉద్యోగులకు అక్టోబరు ఒకటిన  జీతాలు అందలేదట. ఆంధ్రాలొ రెండు నెలలుగా ఉద్యోగులకు  జీతాలు లేవు. అయినా నిక్షేపంగా అదురు బెదురు లెకుందా సమ్మెలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఎలా గడుస్తున్నాయో? కోట్ల రూపాయల్లో ఉద్యమానికి సొమ్ము ఎలా వస్తున్నది మరి? గుప్త(రహస్య) ఫైనాన్షియర్ ఎవరు?

**కేంద్రంలొ మన్మోహన్ మీద, రాష్ట్రంలో కిరణ్ మీద కాంగ్రెస్  కు మోజు తీరింది. అందుకే ఈ కొత్త నాటకాలు. ఇద్దరూ ఇద్దరే. ఎవరూ రాజీనామా చెయ్యరు.  

**చివరకు మంత్రి డొక్కా కూడా సి ఎం కు వ్యతిరేకమైపోయాడు. జగన్ కాంగ్రెస్స్ లోకి దూకే 8 మంది మంత్రుల బ్యాచ్‌లొ ఈయనొకడు

Thursday 3 October 2013



గరం గరం  పకోడీలు.. 
 
**రాజకీయాల్లో ఉచ్ఛనీచాలుండవు. పొగిడిన నోళ్ళతో తెగనాడుతారు. శాపనార్ధాలు పెట్టిన గళాలే సంకీర్తనలు గానం చేస్తాయి. నిన్నటి వరకు "పాపాల పుట్ట జగన్" అన్న మొయిలీ, దిగ్విజయ్, చాకో.. ప్లటు మార్చేశారు. రేపు సోనియా కూడా జగన్ను ఆలింగనం చేసుకుంటారు. ఎదురుగా కుంభకోనాల ఊబి, ఒక వైపు మోడీ, మరోవైపు తెలంగాణ, ఇంకోవైపు జగన్..కాంగ్రెస్ కు అష్టదిగ్బంధనం, అంత్యకాలం. అదే అవసరం వారిని కాళ్ళా వేళ్ళా పడేటట్లు చేస్తున్నది...
**చిలకమర్తి వారు సాక్షాత్తు మధుర మీనాక్షి హస్తభూషణులు(మీనాక్షి చేతిన చిలుక ఉంటుంది కాదా!)ఆయన ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. తొలుత ఆయన "స్రవంతి" పత్రికలో సహాయ ఎడిటర్‌గా రంగప్రవేశం చేశారు. 1916లో వారు "మనోరమ", "సరస్వతి" పత్రికలను లను స్థాపించి గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించారు. అది సాహితీ సేవ. వారి స్వీర రచన "గయోపాఖ్యానం"లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అర్జునుని వేషం కట్టేవారట.. అందుకే వారిని మహనీయులు, మహాపురుషులు అని అన్నారు. వారి సేవలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం "కళాప్రపూర్ణ" బిరుదుతో గౌరవించి ధన్యతనొందింది.**నవ్వడానికి, నవ్వించడానికి ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి - ఎవరైనా నవ్వించ గలిగే నేస్తం ఉంటే వారి సాంగత్యంలో క్షణాలు, నిముషాలు, గంటలు, రోజులు.. గడపండి. కుటుంబంతో, మిత్రులతో కలిసి కడుపు చెక్కలు అయ్యేలా నవ్వండి! నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవదం ఒక రోగం...**జగన్ కు బెయిల్ ఇవ్వక పోతే---- కాంగ్రెస్-టిడిపి కుమ్మక్కు రాజకీయం; - వై ఎస్ ఆర్ సి పి జగన్ కు బయిల్ ఇస్తే
---- కాంగ్రెస్-వై ఎస్ ఆర్ సి పి కుమ్మక్కు రాజకీయ; - టిడిపి. జగన్ కు బెయిల్ రాదు -- ఒక వర్గం మీడియా,దేవుని దయ వలన జగన్ కు బెయిల్ -- మరోవర్గం మీడియా, జైలులోకి జగన్ - ఒక మీడియా,జనంలోకి జగన్ - వేరొక మీడియా, ఎవరి అజెండా వారిది. కానీ మోచేతి కింద నీళ్ళు తాగే వర్గం ఎప్పుడూ ఉంటుంది.ఏ ఎండకాగొడుగు..అదే ఊసరవెల్లి కలం, గళం, కులం:**ఒక రామోజీ రావు కోసం, మరొక జగన్మోహన్ రెడ్డి కోసం, వేరొక వెంకట్రామిరెడ్డి కోసం, ఇంకొక సూర్య ప్రకాశరావుకోసం, మరో వేమూరి కోసం పత్రికాస్వేచ్చ అంటూ రోడ్డెక్కే జర్నలిస్టు సంఘాలు, సుమారు 135 సంవత్సరాల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన ఒక జాతీయ (కాదు అంతర్జాతీయ) ఖ్యాతి నొందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హైదరాబాద్ కేంద్రం రెసిడెంట్ ఎడిటర్, బ్యూరో చీఫ్ మోఓ డు దశాబ్దాల పాత్రికేయ అనుభవంకలిగి, సౌమ్య్త్డుగా, వివాద రహితుడుగా సాగుతున్న శ్రీ నగెష్ కుమార్ పోల్లీసు కేసు వలన కు జరగరాని అవమానం జరిగితే నోళ్ళు ఎందుకు పెగలలేదు? రోడ్లపైకి ఎందుకు రాలేదు. ఆయనకు నైతిక బలం చేకూర్చేందుకు పాత్రికేయులు ఎందుకు న్యాయ పరమైన చర్యలు ప్రారంభించలేదు? సంఘీభావం గా కనీసం ఒక్క నిరసన ప్రదర్శన లేదు, విధుల బహిష్కరణ లేదు. రోజు సమ్మె కూడా చేయలేక పోయారు? ఆయనపై కేసు వ్య్క్తిగతంగా కాదు. మహామహులుగా భుజకీర్తులు తొడుక్కున్న సంపాదకులు, ఒక్కరూ పెదవివిప్పలేదు. ఒక పాత్రికేయునిగా నమోదయింది. వ్యక్తిగత నేరాలపై జైలుకెళ్ళిన వాళ్ళకోసం రోజూ డ్భోజనాల చ్యరేజీలు తీసుకుని యూటీలేసుకుని మరీ తిరుగుతారు మన 'ఎర్నలిస్టులు'. ఇదీ తెలుగు నేలపై జర్నలిజం దౌర్భాగ్యం..Like · · Share
**రాజకీయ నాయకులను మించి ప్రాంతాలుగా జర్నలిస్టులుకూడా చీలిపోయారు. కలాలు ఒరిగిపోయాయి. పాళీలు విరిగియాయి. కలలు చెదిరిపోయాయి. విలువలు వలువలు విప్పేశాయి.**మంత్రివర్గాన్ని బర్త్‌రఫ్ చేయ్యాలని అనేక పర్యాయాలు విపక్షాలు గవర్నరును కోరినప్పుడు, ప్రధానిని తొలగించాల్;అని రాష్ట్రపతిని అడిగినప్పుడు కూడా అనేక పర్యాయాలు వారు సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా కాదుపొమ్మని కసురుకోరు. ఊడపీకుతామని హామీ ఇవ్వరు. "కొంగు ముడివేసుకుని ఎమ్మెల్యే దంపతులు, మంత్రుల సతీమణులు సమైక్య రాష్ట్రం కోరుకున్నారని తెలుగు పత్రికలు కథనాలు అల్లినాయి. శిలాక్షరాలు చెక్కినాయి".**నేను ఈరోజు దిన పత్రికలో ఒక వార్త చదివాను:సంబంధిత ఫొటొ చూశాను. కొత్తా దేవుడండి..కొంగొత్తా దేవుడండీ!! రాష్ట్రంలో ఉన్నవి చాలవన్నట్లు.. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం అనే కొత్త కలం బృందం ఆవిర్భవించింది. కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక సీనియర్ జర్నలిస్టు కూడా మేధావి స్థాయి నేతగా ఎదిగాడు. "
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో నెలకొన్న అశాంతి, ఉద్యమాలు, ఆందోళనలను చల్లార్చేందుకు కెంద్రం తక్షణం అన్ని రాజకీయ పార్టీలతో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జెపిసి) ఏర్పాటుచెయ్యాలని డిమాండ్ చేసింది. జెపిసిలో అన్ని రాజకీయ పక్షాలు తమ వైఖరిని లిఖితపూర్వకంగా ప్రకతించాలని , నెల రోజుల్లో అమోదయొగ్యమైన పరిష్కారాని సూచించాలని పేర్కొంది. ఆదివారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాలతోపాటు, తెలంగాణ లోని నాలుగు జిల్లాల పాత్రికేయులు పాల్గొన్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు....."(చూడుడు "ఈనాడు" ఆరోపేజీ కుడివైపు కింద). రాష్ట్రం నేడీ దౌర్భాగ్య పరిస్థితులకు చేరుకోవడానికి నిప్పు పెట్టి ఆజ్యం పోసింది ఈ ఘనులే కదా!! ఈ కొత్తదేవుళ్ళను వెనుకనుంచి నడిపిస్తున్న నిర్వాహకులెవరు? ఈ ఎపిజీఫ్ ఎవరి సృష్టి? ఆ సమావేశం ఎందుకంత గోదమీదపిల్లిలా వ్యవహరించింది? రెండు ప్రాంతాల ప్రజల ఉద్యమాన్ని ఎపిజీఫ్ గౌరవించిందట. ఎంత ఔదార్యం. రాష్ట్ర ప్రజల జన్మ ధన్యమైంది. ఈ సమస్య నుంచి వారిని రక్షించేందుకు సాక్షాతు దేవతలే దిగి వచ్చారు.**వృక్షో రక్షతి రక్షితః..యాచకో యాచకః. శత్రు. మాయరోగ మదేమొ కాని జర్నలిస్టుకు జర్నలిస్టుకు పొసగదు..**ఏడాది నలిగిన తరువాత పెళ్ళి చూపులు. తరువాత ఏడాదికి నిశ్చయ తాంబూలం.. మరో ఏడాది గదిచిన పిమ్మట ముహూర్త సమాలోచన.. ఇంకో ఏడాదికి ముహూర్తం..రెండేళ్ళ తరువాత పెళ్ళి, ఆ తరువాత ఏడాదికి కాపురం. అయినా అప్పటికీ మూడు నిద్రల ముచ్చట తీరలేదు.తాళి లేని, బాజాలు మోగని, పురోహితుడు రాని పెళ్ళి..ఇక ఆపెళ్ళిలో త్రిల్ ఏముంటుండి? అసలు పెళ్ళయినట్లా లేదా? జవాబులేని ప్రశ్న..తెలంగాణా ప్రకటన అయినా, జర్నలిస్టుల అవార్డుల బహుకరణ అయినా అంతే.. ఎండమావులే!!!
గరం గరం  పకోడీలు..


**రాజకీయాల్లో ఉచ్ఛనీచాలుండవు. పొగిడిన నోళ్ళతో తెగనాడుతారు. శాపనార్ధాలు పెట్టిన గళాలే సంకీర్తనలు గానం చేస్తాయి. నిన్నటి వరకు "పాపాల పుట్ట జగన్" అన్న మొయిలీ, దిగ్విజయ్, చాకో.. ప్లటు మార్చేశారు. రేపు సోనియా కూడా జగన్ను ఆలింగనం చేసుకుంటారు. ఎదురుగా కుంభకోనాల ఊబి, ఒక వైపు మోడీ, మరోవైపు తెలంగాణ, ఇంకోవైపు జగన్..కాంగ్రెస్ కు అష్టదిగ్బంధనం, అంత్యకాలం. అదే అవసరం వారిని కాళ్ళా వేళ్ళా పడేటట్లు చేస్తున్నది...

**చిలకమర్తి వారు సాక్షాత్తు మధుర మీనాక్షి హస్తభూషణులు(మీనాక్షి చేతిన చిలుక ఉంటుంది కాదా!)ఆయన ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. తొలుత ఆయన "స్రవంతి" పత్రికలో సహాయ ఎడిటర్‌గా రంగప్రవేశం చేశారు. 1916లో వారు "మనోరమ", "సరస్వతి" పత్రికలను లను స్థాపించి గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించారు. అది సాహితీ సేవ. వారి స్వీర రచన "గయోపాఖ్యానం"లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అర్జునుని వేషం కట్టేవారట.. అందుకే వారిని మహనీయులు, మహాపురుషులు అని అన్నారు. వారి సేవలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం "కళాప్రపూర్ణ" బిరుదుతో గౌరవించి ధన్యతనొందింది.
**నవ్వడానికి, నవ్వించడానికి ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి - ఎవరైనా నవ్వించ గలిగే నేస్తం ఉంటే వారి సాంగత్యంలో క్షణాలు, నిముషాలు, గంటలు, రోజులు.. గడపండి. కుటుంబంతో, మిత్రులతో కలిసి కడుపు చెక్కలు అయ్యేలా నవ్వండి! నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవదం ఒక రోగం..ట.

**జగన్ కు బెయిల్ ఇవ్వక పోతే---- కాంగ్రెస్-టిడిపి కుమ్మక్కు రాజకీయం; - వై ఎస్ ఆర్ సి పి
జగన్ కు బయిల్ ఇస్తే---- కాంగ్రెస్-వై ఎస్ ఆర్ సి పి కుమ్మక్కు రాజకీయ; - టిడిపి.
జగన్ కు బెయిల్ రాదు -- ఒక వర్గం మీడియా,
దేవుని దయ వలన జగన్ కు బెయిల్ -- మరోవర్గం మీడియా,
జైలులోకి జగన్ - ఒక మీడియా,
జనంలోకి జగన్ - వేరొక మీడియా,
ఎవరి అజెండా వారిది.
కానీ మోచేతి కింద నీళ్ళు తాగే వర్గం ఎప్పుడూ ఉంటుంది.ఏ ఎండకాగొడుగు..
అదే ఊసరవెల్లి కలం, గళం, కులం:

**ఒక రామోజీ రావు కోసం, మరొక జగన్మోహన్ రెడ్డి కోసం, వేరొక వెంకట్రామిరెడ్డి కోసం, ఇంకొక సూర్య ప్రకాశరావుకోసం, మరో వేమూరి కోసం పత్రికాస్వేచ్చ అంటూ రోడ్డెక్కే జర్నలిస్టు సంఘాలు, సుమారు 135 సంవత్సరాల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన ఒక జాతీయ (కాదు అంతర్జాతీయ) ఖ్యాతి నొందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హైదరాబాద్ కేంద్రం రెసిడెంట్ ఎడిటర్, బ్యూరో చీఫ్ మోఓ డు దశాబ్దాల పాత్రికేయ అనుభవంకలిగి, సౌమ్య్త్డుగా, వివాద రహితుడుగా సాగుతున్న శ్రీ నగెష్ కుమార్ పోల్లీసు కేసు వలన కు జరగరాని అవమానం జరిగితే నోళ్ళు ఎందుకు పెగలలేదు? రోడ్లపైకి ఎందుకు రాలేదు. ఆయనకు నైతిక బలం చేకూర్చేందుకు పాత్రికేయులు ఎందుకు న్యాయ పరమైన చర్యలు ప్రారంభించలేదు? సంఘీభావం గా కనీసం ఒక్క నిరసన ప్రదర్శన లేదు, విధుల బహిష్కరణ లేదు. రోజు సమ్మె కూడా చేయలేక పోయారు? ఆయనపై కేసు వ్య్క్తిగతంగా కాదు. మహామహులుగా భుజకీర్తులు తొడుక్కున్న సంపాదకులు, ఒక్కరూ పెదవివిప్పలేదు. ఒక పాత్రికేయునిగా నమోదయింది. వ్యక్తిగత నేరాలపై జైలుకెళ్ళిన వాళ్ళకోసం రోజూ డ్భోజనాల చ్యరేజీలు తీసుకుని యూటీలేసుకుని మరీ తిరుగుతారు మన 'ఎర్నలిస్టులు'. ఇదీ తెలుగు నేలపై జర్నలిజం దౌర్భాగ్యం..
Like ·  · Share
**రాజకీయ నాయకులను మించి ప్రాంతాలుగా జర్నలిస్టులుకూడా చీలిపోయారు. కలాలు ఒరిగిపోయాయి. పాళీలు విరిగియాయి. కలలు చెదిరిపోయాయి. విలువలు వలువలు విప్పేశాయి.

**మంత్రివర్గాన్ని బర్త్‌రఫ్ చేయ్యాలని అనేక పర్యాయాలు విపక్షాలు గవర్నరును కోరినప్పుడు, ప్రధానిని తొలగించాల్;అని రాష్ట్రపతిని అడిగినప్పుడు కూడా అనేక పర్యాయాలు వారు సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా కాదుపొమ్మని కసురుకోరు. ఊడపీకుతామని హామీ ఇవ్వరు. "కొంగు ముడివేసుకుని ఎమ్మెల్యే దంపతులు, మంత్రుల సతీమణులు సమైక్య రాష్ట్రం కోరుకున్నారని తెలుగు పత్రికలు కథనాలు అల్లినాయి. శిలాక్షరాలు చెక్కినాయి".

**నేను ఈరోజు దిన పత్రికలో ఒక వార్త చదివాను:సంబంధిత ఫొటొ చూశాను. కొత్తా దేవుడండి..కొంగొత్తా దేవుడండీ!! రాష్ట్రంలో ఉన్నవి చాలవన్నట్లు.. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం అనే కొత్త కలం బృందం ఆవిర్భవించింది. కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక సీనియర్ జర్నలిస్టు కూడా మేధావి స్థాయి నేతగా ఎదిగాడు.
"రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో నెలకొన్న అశాంతి, ఉద్యమాలు, ఆందోళనలను చల్లార్చేందుకు కెంద్రం తక్షణం అన్ని రాజకీయ పార్టీలతో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జెపిసి) ఏర్పాటుచెయ్యాలని డిమాండ్ చేసింది. జెపిసిలో అన్ని రాజకీయ పక్షాలు తమ వైఖరిని లిఖితపూర్వకంగా ప్రకతించాలని , నెల రోజుల్లో అమోదయొగ్యమైన పరిష్కారాని సూచించాలని పేర్కొంది. ఆదివారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాలతోపాటు, తెలంగాణ లోని నాలుగు జిల్లాల పాత్రికేయులు పాల్గొన్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు....."(చూడుడు "ఈనాడు" ఆరోపేజీ కుడివైపు కింద).
రాష్ట్రం నేడీ దౌర్భాగ్య పరిస్థితులకు చేరుకోవడానికి నిప్పు పెట్టి ఆజ్యం పోసింది ఈ ఘనులే కదా!!
ఈ కొత్తదేవుళ్ళను వెనుకనుంచి నడిపిస్తున్న నిర్వాహకులెవరు? ఈ ఎపిజీఫ్ ఎవరి సృష్టి? ఆ సమావేశం ఎందుకంత గోదమీదపిల్లిలా వ్యవహరించింది? రెండు ప్రాంతాల ప్రజల ఉద్యమాన్ని ఎపిజీఫ్ గౌరవించిందట. ఎంత ఔదార్యం. రాష్ట్ర ప్రజల జన్మ ధన్యమైంది. ఈ సమస్య నుంచి వారిని రక్షించేందుకు సాక్షాతు దేవతలే దిగి వచ్చారు.

**వృక్షో రక్షతి రక్షితః..
యాచకో యాచకః. శత్రు.
మాయరోగ మదేమొ కాని జర్నలిస్టుకు జర్నలిస్టుకు పొసగదు..

**ఏడాది నలిగిన తరువాత పెళ్ళి చూపులు. తరువాత ఏడాదికి నిశ్చయ తాంబూలం.. మరో ఏడాది గదిచిన పిమ్మట ముహూర్త సమాలోచన.. ఇంకో ఏడాదికి ముహూర్తం..రెండేళ్ళ తరువాత పెళ్ళి, ఆ తరువాత ఏడాదికి కాపురం. అయినా అప్పటికీ మూడు నిద్రల ముచ్చట తీరలేదు.
తాళి లేని, బాజాలు మోగని, పురోహితుడు రాని పెళ్ళి..ఇక ఆపెళ్ళిలో త్రిల్ ఏముంటుండి? అసలు పెళ్ళయినట్లా లేదా? జవాబులేని ప్రశ్న..
తెలంగాణా ప్రకటన అయినా, జర్నలిస్టుల అవార్డుల బహుకరణ అయినా అంతే.. ఎండమావులే!!!