Thursday 20 June 2013



   పొత్తూరి గారు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని              భగవంతునికి ప్రార్ధన.




పెద్దలు, ప్రముఖ పాత్రికేయులు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ పూర్వ అధ్యక్షులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం కొంత కోలుకుని ఆస్పత్రినుంచి ఇంటికి చేరుకున్న సందర్భంలో, పొత్తూరి గారి అడుగుజాడలను ఆదర్శనీయంగా భావిస్తున్న అభిమాన, అనుభవజ్ఞ పాత్రికేయులు శ్రీయుతులు జి ఎస్ వరదాచారి, కె లక్ష్మణరావు, టి ఉడయవర్లు, భండారు శ్రీనివాసరావు, సమాచార పౌర సంబంధ శాఖ సంచాలకులు సుభాష్ గౌడ్, నేను గురువారం[20-06-2013] వారి ఇంటికి వెళ్ళి వారిని సందర్శించి వారు త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశాం.  వయోధిక పాత్రికేయ బృందం చొరవతో ప్రభుత్వం జారీ చేసిన "ఆరోగ్య శ్రీ కార్డు"ను పొత్తూరి గారికి అందజేస్తున్న సమాచార పౌర సంబంధ శాఖ సంచాలకులు సుభాష్ గౌడ్. పొత్తూరి గారు సంపూర్ణ ఆరోగ్యవంతులై వారి కలం నుంచి జాలువారే అక్షరామృత ధారలు తెలుగు నేల ఆస్వాదించాలని అక్షరాభిమాన హృదయాలతో అందరం భగవంతుని ప్రార్ధిద్దాం. 


Saturday 15 June 2013

శ్రీ శ్రీ... ఒక జ్ఞాపకం.. 

ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు. ప్రగతి వారపత్రిక లో ప్రశ్నలు, జవాబులు (ప్రజ) అనే శీర్షిక ను నిర్వహించారు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేష లతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.శ్రీరంగం శ్రీనివాస రావు - 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించారు. ( శ్రీశ్రీ తన అనంతం పుస్తకంలో పుట్టిన రోజు గురించి వివరణ ఇచ్చారు. తను ఏప్రిల్లో పుట్టానని, తండ్రి పాఠశాలలో అవసరం నిమిత్తం 2-1-1910 అని రాయించారని పేర్కొన్నారు.







శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాధమిక విద్యాభ్యాసం విశాఖపట్నం లో చేసాడు. 1925 లో ఎస్సెస్సెల్సీ పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయం లో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసారు శ్రీశ్రీ హేతువాది, నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. ఆయన సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త,. ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ.. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది.
 
1935 లో విశాఖ లోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా, 1938 లో మద్రాసు ఆంధ్ర ప్రభలో సబ్‌ ఎడిటరు గా, ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది. "మహాప్రస్థానం" ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది. 1947 లో మద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసారు.
 
పిల్లలు లేని కారణం చేత 1949 లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు. 1956 లో సరోజను రెండవ వివాహం చేసుకున్నారు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు. 1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించారు. హనుమాన్‌ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన అరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపారు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించారు. 

శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించారు. ఆయన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురితమైంది. . అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని అలవోకగా రాసి పారేసేవారు. ఆయన రాసిన వందలు, వేలు సినిమా పాటల్లో అజరామరమై నేటికీ ప్రతి తెలుగునోటా వింబడుతూ చిరంజీవత్వాన్ని పొందిన ప్రముఖ సినిమా పాటలు : మనసున మనసై (డాక్టర్ చక్రవర్తి). హలో హలో ఓ అమ్మాయి (ఇద్దరు మిత్రులు), నా హృదయంలో నిదురించే చెలి (ఆరాధన), తెలుగువీర లేవరా (అల్లూరి సీతారామరాజు), పాడవోయి భారతీయుడా (వెలుగు నీడలు)...ఇవి గాక మరో ముప్పైకి పైగా విశేష రచనలు సాగించారు. ఆయన అందుకున్న అవార్డులు, రివార్డులు లెక్కలేనన్ని.. ఇంత నాస్తికవాది అయిన శ్రీశ్రీ, పరమ ఆస్తికుడు, సాంప్రదాయా ఆచార వ్యవహారితుడైన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనరాయణ ఎన్నో విషయాల్లో విబేధించుకున్నా, వ్యతిరేకించుకున్నా ఒకరికొకరు ప్రాణప్రదం. 

వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పని చేసారు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది. కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్, విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

Friday 14 June 2013

శ్రీమద్భాగవత ప్రాశస్త్యం..





లోకంలో మహాభాగవతానికి ఉన్న ప్రసిద్ధి సామాన్యమైనది కాదు. "ఈ మహా గ్రంధం ఆసేతుశీతాచల వ్యాప్త పండిత మండలీ కంఠస్థగిత విపుల మణిహారమై, నానా మత ప్రస్థాన సిద్ధాంతావిరుద్ధ ప్రమాణ తర్క సాధనోపాలంభ పూర్వక దుర్విగాహ భక్తి స్వరూప నిరూపణ ఫల వ్యాచి ఖ్యాసువులకు ఆలవాలమై, గీర్వాణ వాణీ తరుణారుణ చరణారవింద మరందాస్వాదలోల హృన్మత్త మిళింద చక్రవర్తులచే బహుభాషలలోనికి అనూదితమై, మోక్షాభిలాషుల మనస్సులలో భద్రముద్రాంకితమై, నిజానికి పురాణమంటే ఇదేనన్నంత అవిరళమైన ప్రచారాన్ని గడించింది. ..

ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహించిన ఈ ఉద్గ్రంధం భారతదేశంలోని సారస్వతేయుల మహాప్రతిభకు ప్రధమోదాహరణమై శాశ్వతంగా నిలిచి ఉంటుంది.  పరీక్షన్మహారాజు ( పాండవ మధ్యముడైన అర్జునుని మనుమడు) ఒక బ్రాహ్మణునిచే శాపగ్రస్తుడై ఏడు దినములలోపు మరణిస్తాడని తెలిసి తన రాజ్య విధులన్నీ పక్కనబెట్టి ప్రతీ జీవి యొక్క అంతిమ లక్ష్యాన్ని తెలియగోరాడు. అదే సమయంలోనే తను సంపాదించిన అపార జ్ఞాన సంపదను ఎవరికి భోదించాలో తెలియక, ఒక మంచి శిష్యుని కోసం వెతుకుతున్న శుకుడు అనే ముని రాజుకు తారసపడి ఆ రాజుకు భోదించడానికి అంగీకరిస్తాడు. ఈ సంభాషణ ఎడతెరిపిలేకుండా ఏడు రోజులపాటు కొనసాగింది. ఈ వారం రోజుల సమయంలో రాజుకు నిద్రాహారాలు లేవు. ఒక జీవి యొక్క అంతిమ లక్ష్యం, నిత్య సత్యమైన భగవంతుడు శ్రీకృష్ణుడు గురించి తెలుసుకోవడమేనని వివరిస్తాడు.

ఇది భగవంతుని కధ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కధగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాధ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంధంలో పేర్కొన్నారు.  ఋషుల కోరికపై సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న ఈ భాగవత కధను వారికి చెప్పినట్లుగాను, దానిని వేద వ్యాసుడు గ్రంధస్తం చేసినట్లుగాను ఈ కధ చెప్పబడింది. భాగవతంలో వివిధ భాగాలను "స్కంధాలు" అంటారు. వివిధ స్కంధాలలో భగవంతుని అవతార కార్యాల వర్ణనలు, భక్తుల గాధలు, పెక్కు తత్వ బోధలు, ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మికమైన సంవాదాలు పొందుపరచబడినాయి.

శ్రీమద్భాగవతమును శ్రీ వేదవ్యాసుల వారు వేల సంవత్సరముల క్రితము సంస్కృతమున రచించినారు. దీనిని వారు భాగవత పురాణమని మనకు అందించినారు. శ్రీ కృష్ణ భగవానులు తమ శరీరమును విడిచిన తరువాత, యావత్ భారతీయులకు వారి లీలలను గాథలను స్మరింపచేసి, మానవుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో తోడ్పడిన పవిత్ర గ్రంథములలో శ్రీమద్బాగవతము ప్రప్రథము అనుట అతిశయోక్తియే కాదు.

భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని ౨౧ (21) అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము. ఇది మొత్తము ద్వాదశ (12)స్కంధములుగా విభజించబడినది. భగవంతుని దివ్య స్వరూపం భాగవతంలో ఒకచోట ఇలా వర్ణించబడింది. తేజోమయాలైన ఆయన కన్నులు సమస్త సృష్టికి మూల స్థానాలు. సూర్యాది సకల గ్రహనక్షత్రాలు ఆయన కనుగ్రుడ్లు. అన్ని దిశలా వినగలిగిన ఆయన చెవులు సకల వేదనాదాలకు నిలయాలు. ఆయన శ్రవణం ఆకాశానికి, శబ్దానికి ఆదిస్థానం. భాగవతంలో విష్ణువు యొక్క 25 అవతారాల లీలలు వర్ణించారు.  పరమ భాగవతోత్తముడు అయిన బమ్మెర పోతన మహాకవి శ్రీ కృష్ణ ద్వైపాయన విరచిత శ్రీమద్బాగవతమును తెలుగున రచించినారు. తెలుగు భాషలో రచింపబడిన గ్రంథాలలో శ్రీ మదాంధ్ర భాగవతము అతి ప్రాముఖ్యము మరియు అనిర్వచనీయ భక్తి రస సమ్మిలితము.

పరమ భాగవతోత్తముడు అయిన బమ్మెర పోతన మహాకవి శ్రీ కృష్ణ ద్వైపాయన విరచిత శ్రీమద్బాగవతమును తెలుగున రచించినారు. తెలుగు భాషలో రచింపబడిన గ్రంథాలలో శ్రీ మదాంధ్ర భాగవతము అతి ప్రాముఖ్యము మరియు అనిర్వచనీయ భక్తి రస సమ్మిలితము.  15వ శతాబ్ధిలో బమ్మెర పోతన, అతని శిష్యుడు వెలిగందల నారయ, ఇంకా గంగన, ఏర్చూరి సింగన కలిసి ఆంధ్రీకరించిన భాగవతానికి తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉంది. పోతన రచనా శైలి, భక్తి భావం, పద్యాలలోని మాధుర్యం తెలుగునాట బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. దీనిలో ఎన్నో పద్యాలు నిత్య వ్యవహారంలో ఉదాహరింపబడుతున్నాయి.

ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఒక ప్రచురణ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఒక ప్రచురణ సాధారణంగా అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తెలుగులో భాగవతానికి, సంబంధిత పురాణాలకు సంబంధించిన పెక్కు రచనలు సంప్రదాయ సాహితయంలోను, ఆధునిక సాహిత్యంలోను, జానపద సాహిత్యంలోను ప్రముఖ స్థానం వహిస్తున్నాయి.  ఈ లోపలి కాలములొ అనేక భాషలలో సామాన్య జనులకు కూడ అర్థం అయ్యేలా ఎందరో మహానుభావులు రచనలు, కీర్తనములు రచించారు. వారిలో శ్రీ మీరా బాయి, శ్రీ సూర్ దాసు, శ్రీ భక్త జయదేవ, శ్రీ లీలాశుకులు కొందరు. దేశమునకు చెందిన ఆర్ష సాంప్రదాయీకుడు.

Thursday 13 June 2013




                   ఇదీ మన అసెంబ్లీ తీరు..


నడవని శాసన సభసమావేశాలపై పద్నాలుగు టీవీల్లో నిరంతరాయంగా సోది భాగోతం. మధ్య మధ్యలో లాబీఇంగ్ (పైరవీ) విలేఖర మేధావుల విశ్లేషణలు. ప్రజాస్వామ్యం-పాత్రికేయం జంటగా గంగలో కలసిపోయాయి. పాత్రికేయులు ఎమ్మెల్యేలు (పార్టీలకు అతీతంగా) గుంపులు గుంపులుగా గూడుపుఠానీలు. ముఖ్య విలే-ఖరులు ముఖ్యమంత్రి చేంబర్ వద్ద గుమిగూడి మంత్రులు, ఎమ్మెల్యేలతో పిచ్చాపాటీ. సభ్యులు సభలోపల ఉండరు. విలేఖరులు గ్యాలరీలో ఉండరు. 

దేశంలో ఏరాష్త్ర అసెంబ్లీలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో "త్రిశంకు స్వర్గం". సభ్యులు చర్చించేది, వాదించేది, నిలదీసేది, విమర్శించేది సభలో కాదు.బయటకొచ్చి మీడియాతో. అందుకే అందరినీ వెలివేసినట్లు అసెంబ్లీ భవనం వెనుక సభకుమించి ప్రభుత్వం ప్రత్యేకంగా మీడియా పాఇంట్ ఏర్పాటుచేసింది. పాతికపైబడి చానల్ కెమేరాలు, వాటి కెమేరా ఆపరేటర్లు, వాటి విలేఖరులు, మరో పాతికమంది పత్రికా ఫొటో గ్రాఫర్లు. వార్తలు రాసుకునే మరో ముప్పైమందికి పైగా పాత్రికా విలేఖరులు. వీరిక్ తోడు ప్రభుత్వ సమాచార సేకరణ యంత్రాంగ సిబ్బంది(స్పెషల్ బ్రాంచ్, స్టేట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సిబ్బంది)..ఆ పక్కనే చానళ్ళ ఓబి వాహనాలు, అంతే దాదాపు 250 మంది పైగా రనగొణ ధ్వని..మరి మధ్యలొ వీరందరికీ కాలక్షేపానికి, నోరు తడుపుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి.. అసెంబ్లీ కాన్‌టీన్ బ్రాంచ్ ఉపాహార పదార్ధాలతో ఘుమఘుమలాడే వాసనలు. మరి ఇందరు వీర విలేఖరులు ఒక్క చోట చేరితే గుప్పు గుప్పున మేఘాలు సృష్టించే పొగలు కక్కుతుంటారు. శాసన సభసమావేశాల కాలంలో అనునిత్యం ఉదయం 8 గంటలనుంచి కనబడే హడావుడి దృశ్యం ఇది.







ప్రశ్నోత్తరాలతో మొదలై, లిఖిత సమాధానాలు, జీరో అవర్ ప్రస్తావనలు, వాయిదా తీర్మానాలు, స్వల్పకాలిక చర్చలు, అర్ధగంట చర్చలు, సావధాన తీర్మానాలు, 304 నిబంధనకింద ప్రధాన చర్చలు, బిల్లులు, వార్షిక అర్ధిక జమాఖర్చులు, దిమాండ్లు ఇత్యాది అనంత అంశాలను ఉదయం 9 గంటలకు ప్రారంభమై 5 గంటలసేపు చర్చలు జరగాలి. ప్రభుత్వంలో లోపాలు విపక్షాలు ఎత్తిచూపాలి, ప్రభుత్వం పాలనా విధానాన్ని వివరించి తాను చేస్తున్న ప్రజ సేవ ఏమిటి చెప్పాలి. గత మూడేళ్ళుగా సభ రభసే. ప్రజాస్వామ్యం పరిహాసానికి గురవుతునే ఉన్నది. అధికార పక్షం, విపక్షం ఎవరికీ శ్రధ్ధలేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, దుమ్మెత్తిపోసుకోవడాలు..అవినీతి పురాణాలు వల్లె వేయడాలతోనే పుణ్యకాలం గడిచిపోతున్నది.
కానీ జీతభత్యాలు, పైరవీలు, ఇతర వ్యవహారాలు చక్కబెట్టుకోవడంలో మాత్రం రాజకీయాలకు అతీతంగా సభ్యులు ఐక్యత ప్రదర్శిస్తారు. ఈనెల 10 న సమావేశాలు మొదలైతే ఒక్క రోజు కూడా అయిదు నిమిషాలు సభాకార్యక్రమాలు జరగకుండా వాయిదాలతో ముగుస్తున్నది. విపక్షాలన్నీ వాయిదా తీర్మానం నోటీసులు ఇవ్వడం సభాపతి వాటిని తిరస్కరించడం, సభ్యులు పోడియం చుట్టుముట్టడం, నినాదాలతో(అరుపులు, కేకలు) దద్దరిల్లడం.. నిత్యకృత్యం. మూడు సార్లు సభను స్పీకర్ అర్ధగంట అంటూ వాయిదా వేస్తారు చివరకు మరుసటి రోజుకు మళ్ళీ వాయిదా.. మరిన్ని విశేషాలు రేపు..




Monday 10 June 2013

                  భారతీయ జన సంఘ్ నుంచి 
              భారతీయ జనతా పార్టీ నేటి వరకు  
                   62 సంవత్సరాల ప్రస్థానం..    


జనసంఘ్ అని పిలువబడే భారతీయ జనసంఘ్ పార్టీ 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ చే ఢిల్లీలో స్థాపించబడింది. 1977లో ఈ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయబడింది. 1977లో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో భారతీయ

  జనసంఘ్ పార్టీకి చెందిన ప్రముఖులైన అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి నాయకులు ప్రముఖ పదవులు నిర్వహించారు. 1980లో జనతా పార్టీ నుండి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నాయకులు భారతీయ జనతా పార్టీ స్థాపించారు. ప్రస్తుతం భాజపా భారతదేశంలో ప్రముఖ జాతీయ రాజకీయ పార్టీలలో ఒకటి.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావనలపై ఆధారపడిన పార్టీ కావడంతో ఈ పార్టీ హిందూ జాతీయవాద లక్షణాలను కలిగిఉంది. ఈ పార్టీలో ప్రముఖ స్థానాలను కలిగిన నాయకులు కూడా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలే. 1964లో ఏర్పడిన విశ్వ హిందూ పరిషత్తు ఈ పార్టీకి సన్నిహితంగా ఉంది. జవహర్ లాల్ నెహ్రూ కాలంలో ఆయన సోషలిస్టు భావనలకు విసుగు చెందిన పలు భారతీయ జాతీయ కాంగ్రెస్ నేతలు ఈ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో ఈ పార్టీ ఉనికి నిలుపుకుంది.
రాష్ట్రాలలో ఈ పార్టీ ఉనికి నిలుపుకుంది.

శ్యాంప్రసాద్ ముఖర్జీ :

1901, జూన్ 6న జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ప్రముఖుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ మరియు హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వశించాడు. హిందూ మహాసభ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన తొలి నేతగా స్థానం పొందినాడు. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన అశుతోష్ ముఖర్జీ కుమారుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కోల్‌కత లోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ప్రారంభంలో కాంగ్రెస్ వాదిగానే రాజకీయ జీవితం ఆరంభించినాడు. స్వాతంత్ర్యానికి పూర్వం జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని మద్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1949లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకొని అక్టోబర్ 21, 1951న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడిగా మే 23, 1953న మరణించేవరకు కొనసాగినాడు.

అటల్ బిహారీ వాజపేయి

1924లో గ్వాలియర్ లో జన్మించిన వాజపేయి 1968 నుండి 1973 వరకు జనసంఘ్ అద్యక్ష పదవిని చేపట్టినాడు. 1977లో మురార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ మత్రివ్త శాఖను నిర్వహించాడు. 1980లో జనతాపార్టీ నుంచి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నేతలుేర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజపేయి వ్యవస్థాపక అద్యక్షుడిగా వ్యవహరించాడు. కేంద్రంలో 3 సార్లు ఏర్పడిన భాజపా ప్రభుత్వానికి కూడా వాజపేయే ప్రధానమంత్రిగా పనిచేశాడు.

లాల్ కృష్ణ అద్వానీ

1927లో కరాచిలో జన్మించిన అద్వానీ చిన్న తనంలోనే ఆర్.ఎస్.ఎస్. పట్ల ఆకర్షితుడైనాడు. మహాత్మా గాంధీ హత్యానంతరం అనేక ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలలో పాటు అద్వానీ కూడా అరెస్టు అయ్యాడు. ఆ తరువాత శ్యాంప్రసాద్ నేతృత్వంలోని జనసంఘ పట్ల ఆకర్షితుడై ఆ పార్టీలో చేరి పలు పదవులు చేపట్టినాడు. 1977లో జనసంఘ్ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయబడటంతో ఎన్నికలలో విజయం సాధించిన జనతా ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖను నిర్వహించినాడు. జనతా పార్టీ విచ్ఛిన్నం అనతరం 1980లో బయటకు వచ్చి జనసంఘ్ నేతలు భారతీయ జనతా పార్టీని స్థాపించడంతో అద్వానీ కూడా భాజపాలో వ్యవస్థాపక నేతగా చేరి పార్టీలో మంచి గుర్తింపు పొందినారు. 1989 తరువాత భారతీయ జనతా పార్టీ  ఎదుగుదలకు కృషిచేసి పార్టీ అద్యక్ష పదవిని పొందడంతో పాటు కేంద్రంలో ఏర్పడిన అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వత్రించినాడు.

జనసంఘ్ అధ్యక్ష మహోదయులు.. 

శ్యాం ప్రసాద్ ముఖర్జీ, పండిట్ మౌళిచంద్ర శర్మ, పండిట్ ప్రేనాథ్ డోగ్రా, పీతాంబరదాస్, ఎ రామారావు, అచార్య డిఫి ఘోష్, బచ్‌రాజ్ వ్యాస్, బలరాజ్ మథోక్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్‌బిహారి వాజ్‌పేయీ, ఎల్‌కె అద్వాని.  

1980లో ప్రారంభించిన ఈ పార్టీ దేశములోని హిందూ అధికసంఖ్యాక వర్గం యొక్క మత సాంఘిక, సాంస్కృతిక విలువల పరిరక్షణను ధ్యేయంగా చెప్పుకుంటుంది. సాంప్రదాయ సాంఘిక నియమాలు మరియు ధృడమైన జాతీయరక్షణ దీని భావజాలాలు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధానపాత్ర పోషిస్తున్న సంఘ్ పరివార్ కుటుంబానికి చెందిన వివిధ రకాల హిందూ జాతీయవాద సంస్థలు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల స్థాయిలో గట్టి పునాదిని ఇస్తున్నాయి. స్థాపన నుండే, భాజపా భారత జాతీయ కాంగ్రేసు యొక్క ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్నది. భారతీయ రాజకీయరంగంలో నాలుగు దశాబ్దాలపాటు ఆధిపత్యము వహించిన కాంగ్రేసు పార్టీ యొక్క వామపక్ష ధోరణులను తిప్పివేసేందుకు భాజపా ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. అయితే భాజపా భావజాల యుద్ధ నినాదము మాత్రం హిందుత్వమే. 
అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ లచే 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ స్థాపించబడినది. అటల్ బిహారీ వాజపేతి భాజపా తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1984లో, ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలోకాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించగా, భాజపా 543 నియోజకవర్గాలలొ కేవలం రెండింటిని గెలుపొందింది. లాల్‌కృష్ణ అద్వానీ రథయాత్ర ఫలితంగా 1989 లోక్‌సభ ఎన్నికలలో 88 సీట్లను గెలుచుకొని జనతాదళ్‌కు మద్దతునిచ్చి వీ.పీ.సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి కారణం అయింది. అయోధ్యలో రామజన్మభూమి మందిరాన్ని కట్టాలనే ప్రయత్నంతొ రథయాత్రలో ఉన్న అద్వానీని బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్టు చేసిన సందర్భాన అక్టోబరు 23, 1990న భాజపా తన మద్దతును వెనక్కితీసుకోగా తదుపరి నెలలో జనతాదళ్ ప్రభుత్యం పడిపోయింది.
1991 లోక్‌సభ ఎన్నికలలో మండల్, మందిర్ ప్రధానాంశాలుగా జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తన స్థానాలను 120కి పెంచుకొని ప్రధాన ప్రతిపక్షం గా మారింది. కాంగ్రెస్ మైనార్టీ ప్రభుత్వం గా పాలన కొసాగించింది. 1996 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతి పెద్ద రాజకీయ పక్షం గా అవతరించింది. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అటల్ బిహారో వాజ్‌పేయి ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించగా బి.జే.పి. ప్రభుత్వం లోక్‌సభ విశ్వాసం పొందుటలో విఫలమైంది. తత్పలితంగా వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజులకే పతనమైంది. 13 రోజులు అధికారంలో ఉన్నప్పుడు భాజపాకు కేవలం మూడే మూడు మిత్రపక్షాలు (శివసేన, సమతాపార్టీ, హర్యానా వికాస్ పార్టీ) ఉండేవి.

మొదటి భాజపా ప్రభుత్వం
1998 లో లోక్‌సభ ఎన్నికలను మళ్ళీ నిర్వహించగా భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అత్యధిక స్థానాలు లభించాయి. ఈ పర్యాయం భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో కల్సి జాతీయ ప్రజాతంత్ర కూటమి (NDA) ను స్థాపించంది. NDA కు లోక్‌సభలో బలం ఉన్నందున అటల్ బిహారీ వాజపేయి ప్రధాన మంత్రి గా కొనసాగినారు. కాని 1999 మే మాసములో ఆల్ ఇండియా అన్నా డి.యం.కే అధినేత్రి జయలలిత భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్.డి.ఏ. ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొనగా మళ్ళీ ఎన్నికలు అనివార్యమయ్యాయి. లోక్‌సభలో విశ్వాస సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో విశ్వాసం కోల్పోయింది.

రెండో సారి పూర్తికాలం అధికారంలో.
విజయాలు, వెలుగులు 

1999 అక్టోబర్ లో భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని ఎన్.డి.ఏ. కూటమి 303 లోక్‌సభ స్థానాలను గెల్చింది. భారతీయ జనతా పార్టీకి ఇదివరకెన్నడు లభించనంత 183 స్థానాలు లభించాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ముచ్చటగా మూడో పర్యాయం ప్రధాన మంత్రి పీఠాన్ని అధిరోహించారు. అద్వానీకి ఉప ప్రధాన మంత్రి హోదా లభించింది. ఈ సారి ఎన్.డి.ఏ. సంకీర్ణ ప్రభుత్వం పూర్తి 5 సంవత్సరాల కాలం అధికారంలో కొనసాగింది. భాజపా ప్రభుత్వం ప్రసార భారతి బిల్లుకు మద్దతు ఇచ్చి మీడియా ఛానళ్ళకు మరింత స్వయంప్రతిపత్తి కల్పించింది. ఈ బిల్లుకు భాజపా మద్దతు ఉన్ననేషనల్ ఫ్రంట్ హయంలోనే రూపుదిద్దాల్సి ఉన్నా అప్పటినుంచి వాయిదా పడుతూ వస్తోంది. 1998 లో రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో 5 అణుపరీక్షలు జరిపి భారతదేశానికి అనధికార అణు హోదా ప్రతిపత్తిని కల్పించింది. అంతేకాకుండా కార్గిల్ పోరాటంలో పాకిస్తాన్ పై పైచేయి సంపాదించింది. మంచుపర్వతాలలో కూడా శక్తివంచన లేకుండా పోరాడే శక్తి భారత్ కు ఉందని నిరూపించింది. ఇవన్నీ వాజ్ పేయి ప్రభుత్వానికి కలిసివచ్చిన సంఘటనలే.
భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (NDA) 2002 లో టెర్రరిస్ట్ నిరోధక చట్టాన్ని కూడా జారీచేసింది. ఈ చట్టం వల్ల ఇంటలిజెన్స్ కు మరింత అధికారం కల్పించినట్లయింది. 2001 డిసెంబర్ 13 న పార్లమెంటు పై టెర్రరిస్టుల దాడి కూడా ఈ చట్టం చేయడానికి దోహదపడింది. ఇక ఆర్థిక రంగాన్ని పరిశీలిస్తే వాజ్‌పేయి నేతృత్వంలోని ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ప్రభుత్వ కార్పోరేషన్లను ప్రైవేటీకరించం, ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) నిబంధనల ప్రకారము సరళీకరణ, దేశంలో విదేశీ పెట్టుబడుల, ప్రత్యేక ఆర్థిక మండలుల (Special Economic Zones) ఏర్పాటు మొదలగు ఆర్థికపరమైన మార్పులు చేశారు. ప్రభుత్వం ఇన్పర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమల ఏర్పాటుకు కూడా తగిన శ్రద్ధ తీసుకుంది. మద్య తరగతి వర్గాల కోసం పన్నులు తగ్గించబడ్డాయి. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు పెరిగాయి. దానితో బాటు విదేశీ వ్యాపారం కూడా వృద్ధి చెందింది. 2004 లో ప్రభుత్వం సాప్టా (దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, South Asia Free Trade Agreement) పై పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల దక్షిణాసియా లోని 160 కోట్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. దేశంలో రవాణా సౌకర్యాలలో కూడా భాజపా నేతృత్వంలోని ఎన్.డి.ఏ.ప్రభుత్వం దృష్టి సారించింది. స్వర్ణ చతుర్భుజి పథకం కింద దేశం లోని నాలుగు మూలలా ఉన్న 4 ప్రధాన నగరాలైన ముంబాయి, ఢిల్లీ, చెన్నై, కోల్‌కత లను నాలుగు లేన్ల రహదారి ద్వారా కల్పే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది.
అప్పటి ప్రధాని హోదాలొ వున్న వాజపేయి పాకిస్తాన్ తో స్నేహసంబంధాలకై స్వయంగా ఒంటిచేత్తో మూడు నిర్ణయాలు తీసుకున్నారు. 1999 లో ఢిల్లీ - లాహోర్ బస్సును ప్రారంభం చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రితో లాహోర్ డిక్లరేషన్ పై సంతకం చేశారు. 2001 లో కార్గిల్ సంక్షోభం తర్వాత పాకిస్తాన్ అధినేతపర్వేజ్ ముషారఫ్ ను భారత్ పిలిపించి చర్చలు జరిపినారు, కాని ఆ చర్చలు విఫలమయ్యాయి. టెర్రరిస్టుల దాడి తర్వాత రెండున్నర సంవత్సరాలు భారత్-పాక్ సంబంధాలు క్షీణించిపోయాయి. అటువంటి ఆ సమయంలో ఆగస్టు 2004 వాజ్‌పేయి పార్లమెంటులో ప్రసంగిస్తూ "పాకిస్తాన్ తో స్నేహసంబంధాలకైనా జీవితంలోనే చివరి గొప్ప ప్రయత్నం చేస్తా"నని ప్రకటించి ప్రపంచ దేశాఅధినేతలను ఆకట్టుకున్నారు.

తప్పిదాలు, తలనొప్పులు...

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో పార్టీ విమర్శల పాలైంది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి అల్లర్ల సమయంలో హిందువుల గుంపులను ఆపలేడని, ముస్లింలను రక్షించుటలో పోలీసులను ఉపయోగించలేడనే విమర్శలున్నాయి. సుమారు 1000 మంది ఈ సంఘటనలో మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయిననూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్నిని తప్పుపట్టడాన్ని ప్రయత్నించగా పార్టీలోని అతివాదులు దాన్ని అడ్డుకున్నారు. అలాంటి పరిస్థితితో పార్టీ దెబ్బతింటుందని హెచ్చరించారు. కాని ఆ సంఘటన తర్వాత పార్టీకి మద్దతిస్తున్న పక్షాలు కొన్ని దూరం జరిగాయి.

భాజాపా మరియు దాని కూటమి 2004 భారత సార్వత్రిక ఎన్నికలు లో దిగ్బ్రాంతికరమైన ఓటమి చవిచూసి ప్రభుత్వ ఎర్పాటుకు తగిన మద్దతు కూడగట్టలేక పొయింది. దరిమిలా, వాజపేయి తన ప్రధానమంత్రి పదవిని కాంగ్రెస్‌ మరియు దాని ఐక్య ప్రగతిశీల కూటమికి చెందిన డా. మన్మోహన్‌ సింగ్‌ కోల్పోవాల్సి వచ్చింది.
ఓటమి అనివార్యం అని తెలిసిన పిదప, భాజపా కు చెందిన సుష్మా స్వరాజ్ మరియు ఎల్‌.కె. అద్వానీ వంటి ‌పలువురు నాయకులు జన్మతః భారతీయురాలు కాని మరియు ఇతరత్రా కారణాలైనటువంటి భారతీయ భాషలలొ ప్రావీణ్యం లేకపోవటం, "ఇందిరా గాంధీ కోడలు అయిన నాడే తాను హృదయంలొ భారతీయురాలైనానని" చెబుతూ రాజీవ్ గాంధీ ని పెళ్ళాడిన తరువాత భారతదేశంలో 15సంవత్సరాలు(దరిదాపు) వుండి కూడా భారతదేశ పౌరసత్వం తీసుకోకపొవటం వంటి ఇతరత్రా కారణాల దృష్ట్యా సోనియా గాంధి ప్రధానమంత్రి కాకూడదని పలు ఆందోళనలు జరిపారు.
ప్రజలలో వాజపేయి కున్న పేరు, ఆర్థికరంగ పురోగతి మరియు పాకిస్తాన్ తో శాంతి వంటి పలు అంశాలవలన భాజపా గెలుస్తుందనుకొన్న ఓటర్లకు మరియు రాజకీయ విశ్లేషకులకు దాని పరాజయం శరాఘాతం అయ్యింది. గెలుపు నల్లేరుమీద నడక అవుతుందనుకున్న కార్యకర్తలు పనిచేయక పోవటం, సంస్థాగతంగా ప్రచారం సరిగా నిర్వహించి ఓటర్లను ప్రభావితం చేయకపోవడం, భాజపా ప్రచారం కేవలం దూరదర్శిని మరియు ఆకాశవాణిలకు పరిమితమవటం వల్లనే ఘోర పరాజయం పాలయ్యామనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది. మరియు భావసారూప్యత గల సాంఘిక మతతత్వ సంస్థలైనటువంటి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ మరియు విశ్వ హిందూ పరిషత్ సంస్థలు రామ మందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి మొదలగు భాజపా సిద్ధాంతపర ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చని కారణంగా సరైన సహకారాలు అందించక పొవటం, అలాగే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు తమ గెలుపుకు ఆయా సంస్థల సహాయసహకారాలు అవసరం లేదనే ధృక్పదంతో వుండటం వంటి విషయాలు పరాజయానికి దోహదం చేశాయని కొందరి నమ్మకం. కాని ఓటమికి ఆర్ధిక అభివృద్ది ఫలాలు అందని వర్గాలు ఒక కారణం కాగా, ఇంకొక కారణం బలం లేని పార్టీలతో జతకట్టడం అని స్వతంత్ర విష్లేషకులు తేల్చారు. పైగా "భారత్ వెలిగిపొతోంది" అనే నినాదం ప్రయోజనం చేకూర్చకపోగా, బెడిసి కొట్టింది.
జాతీయ ప్రజాతంత్ర కూటమి అంతర్గత సమస్యలు మరియు భాజపా యువ, ద్వితీయ శ్రేణి నాయకత్వాల కుమ్ములాటల మధ్య లాల్‌ క్రిష్ణ అద్వానీ ని పార్టీ అధినేతగా నిర్ణయించి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్.డి.ఎకి సారద్యం వహించవలసిందిగా కోరింది. వాజ్‌పేయిని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకొన్నా, అది నామమాత్ర లేదా గౌరవార్థస్థానమే, కానీ భవిష్యత్తులో ఆయన ప్రాబల్యం తగ్గుతుందనటానికి ఒక సూచన కూడా. పైగా వాజ్‌పేయి తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన పిదప ఎన్నికలలో పోటీచేయబోనని ప్రకటించాడు.
జూన్ 2005లో పాకిస్థాన్ సందర్శన సందర్భంగా మహమ్మద్ అలీ జిన్నా "లౌకికవాది" అని చేసిన అద్వానీ వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్ట్టించాయి. తన పార్టీ అధినాయకత్వానికి యెసరు తెచ్చాయి. పాకిస్థాన్ పర్యటనలో తనపై వున్న 'అతివాది' అన్న ముద్ర చెరిపేసుకొవటానికి అద్వాని ప్రయత్నించాడు, పర్యవసానంగా తన పార్టీలోని హిందూ జాతీయవాదుల నుండి తీవ్ర వ్యతిరేకత, విమర్శల నెదుర్కున్నారు, పలు పార్టి శ్రేణులు రాజీనామా కోరడంతో కొన్ని వారాలు సంయమనం కోల్పోయారు. చివరకు రాజీనామా చేసి, ఉపసంహరించుకొని, తాను చేసిన వ్యాఖ్యలపై ప్రజలకు వివరణ ఇచ్చుకున్నారు. డిసెంబర్ 31, 2005న అద్వాని అధికారికంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు, ఆ తరువాత రాజ్‌నాథ్ సింగ్ భాజపా అధ్యక్షునిగా ఎన్నికైయ్యారు. మళ్ళీ నితిన్‌గడ్కరి అధ్యక్షపీఠం అలంకరిచారు. పదవీకాలం పూర్తయి మరోసారి రాజనాథ్‌సింగ్ కు కిరీటం లభించింది. అద్వాని రాజీనామాతో ఆయన శకం ముగిసింది..  

బిజెపి అధ్యక్ష పరంపర:  అటల్ బిహారీ వాజ్‌పేయి- 1980-1986; లాల్ కృష్ణ అద్వానీ - 1986-1991, మురళీ మనోహర్ జోషి - 1991-1993, లాల్ కృష్ణ అద్వానీ - 1993-1998, కుషభావ్ థాక్రే - 1998-2000, బంగారు లక్ష్మణ్ - 2000-2001, జానా కృష్ణమూర్తి - 2001-2002, వెంకయ్య నాయుడు - 2002-2004, లాల్ కృష్ణ అద్వానీ - 2004-2005, రాజ్ నాథ్ సింగ్ - జనవరి 2005 -డిసెంబరు 2009, నితిన్ గడ్కరి - డిసెంబరు 19, 2009 నుండి..నితిన్ గడ్కరి రెండు పర్యాయాలు, రాజనాథ్ సింగ్ రెండు పర్యాయాలు అధ్యక్ష పీఠం అధిరోహించారు.  












                                అద్వాని అలిగారు- పార్టీ వీడారు.
                                   పదవి ఏమీనా చేయిస్తుంది..

భారతీయ జనతా పార్టీ కూడా పరిపూర్ణమైన రాజకీయ పార్టీగా ఎదిగిందని లాల్ కృష్ణ అద్వాని రుజువు చేశారు. స్వాంత్ర్యం తొలిరోజులనుంచి దేశంలో దీటైన ప్రతిపక్షంగా వెలిగిన భారతీయ జనసంఘ్ ఎలియాస్ భారతీయ జనతాపార్టీ నేదు కాంగ్రెస్ వర్గ లక్షణాలు పుణికిపుచ్చుకుని రెండు వర్గాలుగా చీలిపోయింది. అధికారం రుచి మరిగిన వ్యక్తుల లక్షణాలు బహిర్గతమయ్యాయి. నేటి బిజెపి నాటి శ్యాంప్రసాద్ ముఖర్జీ పార్టీ విలువలు విసర్జించిందని అద్వాని వ్బాధపడ్డారు. దేశంలో బిజెపి లో తనకు దీతైన నాయకుడు లేదన్నా అద్వాని కలలు కల్లలై నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో బిజెపి ద్వారా దేశానికి గొప్ప నాయకుడు (ప్రధానిగా) ఎదుగుదలను సహించలేని శక్తులు నేడు పార్టీని బజారుకెక్కిస్తున్నాయి. పర్టెలో విలువలు మృగ్యమవుతున్నాయని అద్వాని వ్యథ చెందారు. వెంటనే పార్టీలో అన్ని పదవులకు రాజీనామాచేసి వైరాగ్యం ప్రదర్శించారు. దేశంలో మరుగున పడుతున్న ఒక రాజకీయ శక్తికి దీటైన నాయకత్వం లభించిందని సంతోషించవలసిన అద్వాని వంటి పెద్ద నాయకుడు అలగడం ఆయన స్వార్ధ చింతనను బహిర్గతం చేసింది. 

శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీందయాళ్ ఉపాధ్యాయ హిత వాదులు, అటల్ బిహారీ వాజ్‌పేయీ, మురళిమనోహర్ జోషి మితవాదులు, అద్వాని, ప్రమోద మహాజన్ తీవ్రవాదులు. ఇప్పుడు వారిని తలదన్నే ఉగ్రవాది మోడీ.




అవినీతి కాంగ్రెస్ పరువు గంగలోకలసి దేశంలోని ప్రస్తుత కలుషిత, అవినీతి, బంధుప్రీతి రాజకీయ వాతావరణంలో ఒక పెనుమార్పు మోడీ వల్లనే సాధ్యమవుతుందన్న విశ్వాసం సర్వత్రా యువత, విద్యాధిక, మధ్యతరగతి వర్గాల్లో, మోడీ నాయకత్వం కింద పార్టీకి మద్దతు పెరుగుతున్న తరుణంలో అద్వాని చర్య పర్టీనిఉ నవ్వులపాల్జేస్తున్నది. దేశం ముఖ్యమా.. వ్యక్తిస్వార్ధం ఎక్కువా తేల్చుకోవాలి. మోదీ పేరు తెరపైకి రాగానే కాంగ్రెస్, యు పి ఎ కూటమి వెన్నులో వణుకు మొదలైంది. ఇంతకంతే మంచి తరూనం బిజెపి కి రాదు. దేశం సుభిక్షంగా, అభివృధ్ధి దిశలో ఎదగాలంటే మోడీ నాయకత్వం అత్యవసరం. అద్వాని మనసు మార్చుకోవాలి. నాయకత్వం, ప్రధాని పదవికై పాకులాడకుండా మోడీ ని బలోపేతం చెయ్యాలి.

Thursday 6 June 2013

                  సంక్షిప్తగా మహాభారతం... 

  
మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం చేయించేటప్పుడు జనమేజయ మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత నైమిశారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగం చేస్తున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు.మహాభారతాన్ని చెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు (పర్వములు) కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరు తీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది.

మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది:
ఆది పర్వము: 1-19 ఉపపర్వాలు - పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం.
సభా పర్వము: 20-28 ఉపపర్వాలు - కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత.
వన పర్వము (లేక) అరణ్య పర్వము: 29-44 ఉపపర్వాలు - అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం.
విరాట పర్వము: 45-48 ఉపపర్వాలు - విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం.
ఉద్యోగ పర్వము: 49-59 ఉపపర్వాలు - కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు.
భీష్మ పర్వము: 60-64 ఉపపర్వాలు - భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం.
ద్రోణ పర్వము 65-72 ఉపపర్వాలు - ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
కర్ణ పర్వము: 73 వ ఉపపర్వము - కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం.
శల్య పర్వము: 74-77 ఉపపర్వాలు - శల్యుడు సారథిగా సాగిన యుద్ధం.
సౌప్తిక పర్వము: 78-80 ఉపపర్వాలు - నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం.
స్త్రీ పర్వము: 81-85 ఉపపర్వాలు - గాంధారి మొదలగు స్త్రీలు, మరణించినవారికై రోదించడం.
శాంతి పర్వము: 86-88 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు.
అనుశాసనిక పర్వము: 89-90 ఉపపర్వాలు - భీష్ముని చివరి ఉపదేశాలు (అనుశాసనాలు)
అశ్వమేధ పర్వము: 91-92 ఉపపర్వాలు - యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం.
ఆశ్రమవాస పర్వము: 93-95 ఉపపర్వాలు - ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం.
మౌసల పర్వము: 96వ ఉపపర్వం - యదువంశంలో ముసలం, అంతఃకలహాలు.
మహాప్రస్ధానిక పర్వము: 97వ ఉపపర్వం - పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం.
స్వర్గారోహణ పర్వము:98వ ఉపపర్వం - పాండవులు స్వర్గాన్ని చేరడం.
"యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - "ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది.

ఇందులో లేనిది మరెక్కడా లేదు" అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. పంచమ వేదంగా వర్ణించబడే ఈ మహాభారతాన్ని కవులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణాలు కలిగిన గ్రంధరాజమని, పౌరాణికులు అష్టాదశపురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు నీతి శాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు. వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు ఆగకుండా చెప్తుంటే నినాయకుడు తన దంతమును విరిచి ఘంటముగా చేసికొని మహాభారతకథను లిఖించాడు. 18 పర్వములతో, లక్ష శ్లోకములతో (74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో) ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటిగా అలరారుచున్నది. సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, కవిత్రయము గా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు తెలుగు లోకి అనువదించారు.

              రామాయణం సంక్షిప్త స్వరూపం..      





సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి వెందిన కధ. దీనిని "సీతాయాశ్చరితం మహత్" అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది.రామావతారము త్రేతాయుగములోని విష్ణు అవతారము. 
తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది.బాల కాండము (77 సర్గలు):
కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణము
అయోధ్యా కాండము (119 సర్గలు): కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంరంభం
అరణ్య కాండము (75 సర్గలు):
వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణము
కిష్కింధ కాండ (67 సర్గలు):
రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభము
సుందర కాండ (68 సర్గలు):
హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట
యుధ్ధ కాండ (131 సర్గలు):
సాగరమునకు వారధి నిర్మించుట, యద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
ఉత్తర కాండ:
సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి -
కథా ప్రారంభము, రాముని జననము, బాల్యము, విశ్వామిత్రునితో ప్రయాణము, యాగపరిరక్షణ, సీతా స్వయంవరము, సీతారామ కల్యాణముఅయోధ్యా కాండము (119 సర్గలు): కైకేయి కోరిక, దశరథుని దుఃఖము, సీతారామ లక్ష్మణుల వనవాస వ్రతారంరంభంఅరణ్య కాండము (75 సర్గలు):వనవాస కాలము, మునిజన సందర్శనము, రాక్షస సంహారము, శూర్పణఖ భంగము, సీతాపహరణముకిష్కింధ కాండ (67 సర్గలు):రాముని దుఃఖము, హనుమంతుడు రామునకు సుగ్రీవునకు స్నేహము గూర్చుట, వాలి వధ, సీతాన్వేషణ ఆరంభముసుందర కాండ (68 సర్గలు):హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుటయుధ్ధ కాండ (131 సర్గలు):సాగరమునకు వారధి నిర్మించుట, యద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకముఉత్తర కాండ:సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి -

                     భక్తకోటికి నిత్యదేవుడు సత్యసాయి

               స్మారక తపాలా బిళ్ళ(పోస్టల్ స్టాంప్)   

 

 సత్యసాయి

భక్తులు ఆర్తిగా పిలుచుకునే మధుర నామం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ప్రేమ, శాంతి, దయ, ధర్మం,
అహింస భావనలే మానవ జాతికి ముక్తి మార్గమని ఉద్బోదించి,తాను స్వయంగా ఆచరించి మానవ జన్మ సార్ధకం చేసిన సాక్షాత్ భగవానుడు. ఆయన భోధనలు మానవాళికి మార్గదర్శనాలు. ఆయన తత్వం ప్రేమ తత్వం. ఆయన మార్గం దైవ మార్గం. మన కోసం మన మధ్యే ఇప్పటికీ నడయాడుతున్న దైవ స్వరూపం. ప్రపంచమంతా ఒక్కటయ్యే మధుర క్షణం మనందరి కోసం వేచి ఉందని, మనుషులంతా దానికోసం కలిసి కట్టుగా పాటుపడాలనీ ఆయన ఉపదేశించారు.   సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో బాబా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధనలు అందరికీ అర్ధమయ్యేలాగా, ఉదాహరణలతో కూడి ఉంటాయి. తాను సకల దేవతా స్వరూపుడనైన అవతారమని బాబా చెప్పారు అంతే గాకుండా అందరిలోనూ దేవుడున్నాడనీ, అయితే ఆ సంగతి తనకు తెలిసినట్లు ఇతరులకు తెలియడంలేదనీ, అదే ముఖ్యమైన తేడా అనీ చెప్పారు. ఈ బోధన అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంది. మానవులు కామ క్రోధాది వికారాలకు దూరంగా ఉండాలని కూడా బోధించారు.

తపాలా బిళ్ళ (పోస్టల్ స్టాంప్) 

ఇంతటి మహనీయునికి, భగవత్ స్వరూపునికి కేంద్ర ప్రభుత్వం  సముచిత గౌరవం  కల్పించి భక్తులకు పరమానందం కలిగించేందుకు శ్రీ సత్యసాయి తపాల బిళ్ళను ముద్రించాలని తాజాగా నిర్ణయించిది. ఇది ముదావహమే. నిత్యం కొలిచే  భక్తులకు సాయిని స్తాంపు రూపంలో తేవడం మరొక విధంగా బాధాకరంగా తయారయింది.  సాక్షాత్తు భగవత్ స్వరూపుని స్తాంప్ రూపంగ తెస్తే కవర్లపై అతికించే ఆ స్తంపులపి నిర్దాక్షిణ్యంగా తపాలా ముద్రలు వేసి ముఖ వచస్సును, గౌరవాన్ని కించపరచదం జరుగు తుందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుచేత భక్తుల మనోభీష్టాన్ని గుర్తించి  కేవలం "సాయి" ప్రత్యేక బిళ్ళను, లేదా ఫస్ట్ డే కవర్లను మాత్రమే విడుదల చేయాలని పలువురు అభ్యర్ధిస్తున్నారు.  ప్రభుత్వం భక్తకోటి సెంటిమెంటును గౌరవించి  కేవల ప్రత్యేక స్టాంపును, ఫస్ట్ డే కవర్లను మాత్రమే విడుదల  చేయాలని పరమ గురువులు శ్రీ శ్రీ శ్రీ వి వి శ్రీధరన్, శ్రీ శ్రీ శ్రీ  విశ్వయోగి విశ్వంజీ మహరాజు, కుర్తాళం పీఠాధిపతి స్వామి సిద్ధేశ్వరానంద భారతి, స్వామి  పరిపూర్ణానంద తదితర పీఠాధిపతులు  సలహా ఇస్తున్నారు.

ప్రత్యక్ష దైవం 

సత్యసాయి బాబా బోధనలు సకల మత సమైక్యతను వెల్లడిస్తాయి. అవి అధికంగా హిందూ మతం సంప్రదాయాలను, విశ్వాసాలను ప్రతిబింబిస్తాయని కొందరి అభిప్రాయం. తాను అందరిలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, వేదాధ్యయనాన్ని సంరక్షించడానికీ అవతరించానని ప్రవచించారు. ఆయన తన బొధనలలో మరొక ముఖ్యాంశం - తల్లిదండ్రుల పట్ల భక్తి. మాతృమూర్తులే సమాజాన్ని తీర్చి దిద్దుతారని, స్త్రీలను గౌరవించడం జాతీయ కర్తవ్యమని..
ప్రపంచ వ్యాప్తంగా సాయి భక్తులు భజనలకు, ఆయన బోధనలకు, సమాజ సేవకు, వ్యక్తిత్వ వికాస ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. వాటిలో భక్తి ముఖ్యమైన అంశం. ఆయన ప్రచారాన్ని ప్రోత్సహించరు. సాయి సత్సంగాలలో అన్ని దేవతల, గురువుల భజనలు సాగుతుంటాయి.
సత్యసాయిబాబా మంచి వక్త. తెలుగులో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, బోధనలు అందరికీ అర్ధమయ్యేలాగా, ఉదాహరణలతో కూడి ఉంటాయి. తాను సకల దేవతా స్వరూప అవతారమని బాబా చెప్పారు. అంతే గాకుండా అందరిలోనూ దేవుడున్నాడనీ, అయితే ఆ సంగతి తనకు తెలిసినట్లు ఇతరులకు తెలియదనీ, అదే ముఖ్యమైన తేడా అనీ చెప్పారు.. ఈ బోధన అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంది. మానవులు కామ క్రోధాది వికారాలకు దూరంగా ఉండాలని కూడా బోధించారు. సత్యసాయి బాబా బోధనలు సకల మత సమైక్యతను తెలియజేస్తాయి.సాయిబాబా బోధనలు నాలుగు ముఖ్య విషయాల ద్వారా అవగతం చేసుకోవచ్చు. ఒకటే కులం - మానవత; ఒకటే మతం - ప్రేమ; ఒకే భాష -హృదయం; ఒకే దేవుడు - అంతటా ఉన్నవాడు. సత్య సాయి బాబా అధ్వర్యంలో ప్రత్యక్షంగా, ఆయన సేవా సంస్థల అధ్వర్యంలో అసంఖ్యాకంగా  విద్యా, సేవా, దాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 166 దేశాలలో 10,000 సత్యసాయి సేవా సంస్థలున్నాయి. సాయిబాబా బోధనలు నాలుగు ముఖ్య విషయాల ద్వారా అవగతం చేసుకోవచ్చు. ఒకటే కులం - మానవత; ఒకటే మతం - ప్రేమ; ఒకే భాష -హృదయం; ఒకే దేవుడు - అంతటా ఉన్నవాడు.
సత్య సాయి బాబా అధ్వర్యంలో ప్రత్యక్షంగా, ఆయన సేవా సంస్థల అధ్వర్యంలో అసంఖ్యాకంగా  విద్యా, సేవా, దాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 166 దేశాలలో 10,000 సత్యసాయి సేవా సంస్థలున్నాయి.
ఉన్నత విద్య : ప్రశాంతి నిలయంలోని సత్యసాయి ఉన్నతవిద్యా సంస్థ (శ్రి శథ్య శై ఈన్స్తితుతె ఒఫ్ హిఘెర్ ళేర్నింగ్) ప్రస్తుతం దీని పేరు, శ్రీ సత్య సాయి విశ్వవిద్యాలయం.)దేశం మొత్తంలో జాతీయ విద్యాప్రమాణ తులనా మండలి ద్వారా "ఆ++" రేటింగ్ పొందిన ఒకే ఒక సంస్థ. ఇదే కాకుండా ఒక సంగీత విద్యాలయం, అనంతపూర్‌లో ఒక (మహిళా) ఉన్నత విద్యాలయం ఉన్నాయి.
వైద్యం : పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ (శ్రి శథ్య శై ఈన్స్తితుతె ఒఫ్ హిఘెర్ ంఎదిచల్ శ్చిఎంచెస్) 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను 1991 నవంబరు 22న  అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు ప్రారంభించారు. బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇనస్టిట్టూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్ని హంగులూ గల 333 పడకల ఆసుపత్రి. ఇది 2001 జనవరి 19న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రాంభించారు. ఇవన్నీ పేదవారికి ఉచితంగా వైద్య సదుపాయాలందిస్తున్నాయి. ఏప్రిల్ 2012 నాటికి  3,75,000 మందికి బెంగళూరులో ఉచిత చికిత్స లభించింది.  అలాగే బెంగళూరు వైట్‌ఫీల్డ్ల్‌లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ లక్షలాదిమందికి ఉచిత వైద్యం అందించింది. ఇంకా ఎన్నో వైద్యశాలలు గ్రామీణ పేదవారికి వైద్య సదుపాయాలు ఉచితంగా కలుగజేస్తున్నాయి.
త్రాగు నీరు: అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టులు లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నాయి. చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల అధ్వర్యంలో 200కోట్ల రూపాయల పైన ఖర్చుతొ నిర్మించిన ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్టులు త్రాగునీరు సరఫరా చేస్తున్నాయి గోదావరి నదినుండి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు నీరు సరఫరా చేసే ప్రాజెక్టు, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోనూ, మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లాలోను పెద్ద ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి. మరికొన్ని వివిధ స్థాయిల్లో ఉన్నాయి, ఇంకొన్ని ప్రతిపాదన స్థాయి దాటాయి.
విద్య : ప్రపంచంలో అన్ని దేశాలలోనూ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్య ((Educare, Education in Human Values) నేర్పే విద్యాలయాలను స్థాపించాలని వారి ఆశయం. ఇప్పటికి 33 దేశాలలో పాఠశాలలు ప్రాంభించారు.
సాయి సమితులు: దేశ దేశాలలో సాయి సమితులున్నాయి. సత్యసాయి సమితివారి చిహ్నం ఐదు దళాల పద్మం. ఈ ఐదు దళాలు ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం, అహింసలకు చిహ్నాలు.
ప్రచురణలు : సత్యసాయి పబ్లికేషన్స్ ట్రస్ట్ వారు 'సనాతన సారధి' అనే మాస పత్రికతో బాటు 40 భాషలలో వెయ్యికి పైగా పుస్తకాలు ప్రచురించారు. వివిధ దేశాలలో వారి శాఖలున్నాయి. 2001లో "సాయి గ్లోబల్ హార్మొనీ అనే రేడియో స్టేషన్ ప్రాంభమైంది.
సత్యసాయి సంస్థలకు పెద్దమొత్తాలలో విదేశాలనుండి విరాళాలు లభిస్తున్నాయి. మహిమలు:  బాబా మహిమల గురించి విస్తృతమైన నమ్మకాలుభక్తుల మనస్సులలో నాటుకుని ఉన్నాయి ఉన్నాయి. పుస్తకాలలోనూ, పత్రికా రచనలలోనూ, ఇంటర్వ్యూలలోనూ బాబా అనుచరులు బాబా మహిమల గురించీ, వ్యాధి నివారణ శక్తిని గురించీ తరచు ప్రస్తావించారు. భక్తుల అనారోగ్యాన్ని బాబా గ్రహించినట్లుగా పేర్కొన్నారు. అను నిత్యం బాబా విభూతిని, కొన్ని మార్లు ఉంగరాలు, హారాలు, వాచీల వంటి చిన్న వస్తువులనూ "సృష్టించి" భక్తులకు పంచిపెట్టడం భక్తకోతి ప్రత్యక్ష్మగా వీక్షించి తన్మయులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తుల ఇళ్ళలో బాబా పటాలు, పూజా మందిరాలు, విగ్రహాలు, పీఠాలనుండి విభూతి, కుంకుమ, పసుపు, పవిత్ర తీర్ధజలం, శివలింగాలు, చిన్న సైజు (ఇత్తడి, బంగారం) దేవతా మూర్తులు, ప్రసాదాలు (తినుబండారాలు), విలువైన మణులు, దారాలు వంటివి లభించిన ఉదంతాలు ఉన్నయి. కిర్లియన్ ఫొటోగ్రఫీ ద్వారా కాంతి పుంజాలను పరిశీలించి, విశ్లేషించడంలో నిపుణుడైనఫ్రాంక్ బారొవస్కీ బాబా కాంతిపుంజాన్ని పరిశీలించి; "అంతకుముందు తాను పరిశీలించిన ఎవరి కాంతిపుంజాలూ బాబా కాంతి పుంజాలలా లేవు. బాబా సామాన్యమైన వ్యక్తి కాదు. దివ్యపురుషుడై ఉండాలి. బాబా కాంతిపుంజం చాలా విశాలమై దిగంతాలకు వ్యాపిస్తున్నది. ఇంతకు ముందెన్నడూ చూడని బంగారు, వెండి (రంగు) ఛాయలు అందులో కనిపిస్తున్నాయి". అని అభిప్రాయం వ్యక్తం చేసారు.

అవతార పరిసమాప్తి: 

ప్రపంచ వ్య్యప్తంగా కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ సత్యసాయిబాబా, 2004 ఏప్రిల్ 24 ఆదివారం ఉదయం (ఉత్తరాయణం వసంత రుతువు చైత్రబహుళ సప్తమి ఉత్తరాషాడ నక్షత్రంలో) 7.40 నిమిషాలకు  ఈ పాంచభౌతిక దేహాన్ని విడనాడారు. ఈ విషయాన్ని అధికారికంగా ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ప్రకటించారు. మార్చ్ నెల 28న సిమ్స్ వైద్యసాలలో చేరిన బాబా 28 రోజుల అనంతరం 24వ తేది ఉదయాన అనంత విశ్వంలోకి ప్రయాణమయ్యారు బాబా . సత్య సాయి బాబా జన్మనామం  సత్యనారాయణరాజు . 1926 నవంబరు 23న పుట్టపర్తిలో జన్మించారు. 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన మతగురువు ఇతనిని 'గురువు' అనీ, 'వేదాంతి' అనీ, 'భగవంతుని అవతారం' అనీ పలువురు విశ్వసిస్తారు. సత్యసాయి మహిమల పట్ల చాలామందికి అపారమైన విశ్వాసం ఉంది.  సత్యసాయి సంస్థ వారి సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సత్యసాయి బాబాను ఆరాధించేవారి సంఖ్య  కోటికి మించి ఉన్నారని అంచనా.. కొందరు భక్తులు ఈ సంఖ్యను "5 కోట్లుగా   చెబుతారు. సాక్షాత్తు భగవంతుని అవతారమనీ, షిరిడీ సాయిబాబాయే మరల సత్య సాయిబాబాగా అవతరించాడనీ విశ్వాసం కలవారు అంటారు.

తపాలా బిళ్ళ (పోస్టల్ స్టాంప్)

ఇంతటి మహనీయునికి, భగవత్ స్వరూపునికి కేంద్ర ప్రభుత్వం  సముచిత గౌరవం  కల్పించి భక్తులకు పరమానందం కలిగించేందుకు శ్రీ సత్యసాయి తపాల బిళ్ళను ముద్రించాలని తాజాగా నిర్ణయించిది. ఇది ముదావహమే. నిత్యం కొలిచే  భక్తులకు సాయిని స్తాంపు రూపంలో తేవడం మరొక విధంగా బాధాకరంగా తయారయింది.  సాక్షాత్తు భగవత్ స్వరూపుని స్తాంప్ రూపంగ తెస్తే కవర్లపై అతికించే ఆ స్తంపులపి నిర్దాక్షిణ్యంగా తపాలా ముద్రలు వేసి ముఖ వచస్సును, గౌరవాన్ని కించపరచదం జరుగు తుందని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుచేత భక్తుల మనోభీష్టాన్ని గుర్తించి  కేవలం "సాయి" ప్రత్యేక బిళ్ళను, లేదా ఫస్ట్ డే కవర్లను మాత్రమే విడుదల చేయాలని పలువురు అభ్యర్ధిస్తున్నారు.  ప్రభుత్వం భక్తకోటి సెంటిమెంటును గౌరవించి  కేవల ప్రత్యేక స్టాంపును, ఫస్ట్ డే కవర్లను మాత్రమే విడుదల  చేయాలని పరమ గురువులు శ్రీ శ్రీ శ్రీ వి వి శ్రీధరన్, శ్రీ శ్రీ శ్రీ  విశ్వయోగి విశ్వంజీ మహరాజు, కుర్తాళం పీఠాధిపతి స్వామి సిద్ధేశ్వరానంద భారతి, స్వామి  పరిపూర్ణానంద తదితర పీఠాధిపతులు  సలహా ఇస్తున్నారు.